వికీపీడియా:కొత్తవారికి సహాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్త వికీపీడియన్లకు సహాయం చేసేందుకు, వారిని ప్రోత్సహించి మరింత మెరుగైన కృషిచేస్తూ తెలుగు వికీపీడియన్లుగా పూర్తిస్థాయిలో రూపొందేందుకు ప్రస్తుత సముదాయ సభ్యులు ఈ పేజీని మార్గసూచికగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో కొత్త సభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరం కాకుండా, వారిని తెలుగు వికీపీడియాలో చేర్చినవారు కొద్దిమాత్రపు పరిచయం చేయవచ్చు. ఇక్కడ పేరును చేర్చేముందు చేర్చే సభ్యులు తాము చేర్చినవారు తెలుగు వికీపీడియాలో నిలకడగా కృషిచేస్తారని భావిస్తేనే చేర్చగలరని సూచన.

బృందం[మార్చు]

చేర్చేవారు[మార్చు]

సాయంపట్టేవారు[మార్చు]

  1. T.sujatha (చర్చ) 02:44, 13 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Ajaybanbi (చర్చ) 08:30, 13 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Kasyap (చర్చ) 08:51, 13 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  4. రవిచంద్ర (చర్చ) 09:03, 13 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  5. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ)14:15, 13 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  6. చదువరి (చర్చరచనలు)
  7. యర్రా రామారావు (చర్చ) 16:20, 13 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త కలాలు[మార్చు]

ఈ సభ్యులలో ఎవరికి మార్గదర్శకత్వం వహిస్తామో అనుభవజ్ఞులైన సభ్యులు చర్చ పేజీలో రాసి, వారి చర్చ పేజీ ద్వారానో, వాడుకరి మెయిల్ ద్వారానో సంప్రదించడం ప్రారంభించవచ్చు

  • అఖిల: స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఉద్యమాల్లో పనిచేస్తున్నవారు. తెలుగు వికీపీడియా మహిళావరణం హైదరాబాదు కార్యక్రమంలో భాగంగా చేరినవారు.
  • తేజ చదలవాడ: తెలుగు భాషాభిమాని. చరిత్ర, సాంకేతికాంశాలు, తెలుగుభాష వంటివాటిలో అభిమానం, పట్టు ఉన్నాయి. ట్విట్టర్‌లో రహ్మానుద్దీన్‌ను అనుసరిస్తూ, ఆయన ట్వీట్‌ల ద్వారా తెవికీకి దారితీశారు.
  • Rajasekharponakala: తెలుగు భాషాభిమాని, స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఉద్యమానికి సంబంధించినవారు. థాయ్‌లాండ్‌లో నివసించడం వల్ల అక్కడి జనజీవితం, ప్రదేశాలు, సంస్కృతి గురించి రాద్దామని భావిస్తున్నారు.
  • వాడుకరి:Andalu inuganti: తెలుగు భాషాభిమాని, మహిళావరణం ద్వారా తెవికీలో చేరారు. బొబ్బిలి, పిఠాపురం వంటి ఆంధ్ర సంస్థానాల గురించి రాయాలన్న ఆసక్తి ఉంది. ఆవిడకు సమయం ఉంది, తెలుగు భాషకు తెలుగు వికీపీడియా ద్వారా ఏ విధంగా సహాయం చేయవచ్చో చెప్తే చేస్తానని అంటున్నారు.
  • వాడుకరి:సువర్ణ సుసర్ల: మహిళావరణం ద్వారా తెవికీలో చేరారు. సామాజిక మాధ్యమాల్లో తెలుగులో చక్కగా రాస్తూంటారు, రాయడం పట్ల అభిరుచి ఉన్నవారు.
  • వాడుకరి:మిథున ప్రభ: మహిళావరణం ద్వారా తెవికీలో చేరారు. తెలుగు సాహిత్యలోకంలో పేరుతెచ్చుకుంటున్న రచయిత. అలానే విజ్ఞానపరమైన అంశాలు, బోధన వంటివీ తెలిసినవారు.
  • వాడుకరి:లలిత పండ్రంగి: విశాఖలో మహిళావరణం కార్యక్రమ నిర్వహణలో గట్టి కృషిచేసినవారు, కొత్తగా అక్కడే తెవికీలో ఓనమాలు దిద్దారు. ఆవిడ తెలుగులో చక్కగా రాస్తారు, తనకున్న ఖాళీ సమయాన్ని తెవికీలో వెచ్చించాలనుకుంటున్నారు. ఆమెకు ఉద్యానవనాలు పెంచడంపై, రకరకాల ఫలపుష్పాలు ఫోటోలు తీయడంపై ప్రత్యేకాసక్తి. నాణ్యమైన ఫోటోలను వికీమీడియా కామన్సులో చేర్చడం ప్రారంభించారు. ఇప్పటికే భారీఎత్తున ఉన్న ఆవిడ ఫోటో ఆర్కైవును వికీమీడియా కామన్సుకు అందించడానికి ఒప్పుదల ఉన్నవారు.
  • వాడుకరి:గాయత్రి వాడవల్లి: విశాఖ మహిళావరణం ద్వారా తెవికీలో చేరినవారు. మేనేజ్‌మెంట్ రంగ నిపుణురాలు. తెలుగు సాహిత్యం చదివినవారు, అనువాదాలు చేయడంలో అభిరుచి ఉన్నవారు.
  • వాడుకరి:TrinadhReddyT: అనపర్తి ప్రాంతానికి చెందినవారు. స్థానికాంశాలపైన, రాజకీయాలు, చరిత్ర వంటివాటిపైన రాయడం ఆసక్తి ఉంది. ఈయనను మెయిల్ ద్వారా సంప్రదిస్తే తాను తెవికీలో నేర్చుకోదలిచినట్టు చెప్పారు.
  • వాడుకరి:IM3847: వీరు ఆంగ్ల వికీపీడియాలో మంచి కృషిచేసినవారు. తెలుగులోనూ చేయాలని ప్రయత్నిస్తున్నారు. గ్రామాల వ్యాసాల్లో ఆసక్తి ఉంది, వాటిలో చరిత్ర, సంస్కృతి వంటివి చేర్చే ప్రతిపాదన గురించి చెప్తే సంతోషంగా అంగీకరించారు. అలానే తెలుగు ఉపన్యాసకురాలైన వారి అమ్మ గారు కూడా ఈ పనిలో సహాయపడతారని సూచించారు. IM3847 మాత్రం వ్యాకరణ యుక్తంగా వాక్యరచన నేర్చుకోదలిచారు.
  • వాడుకరి:Yasshu28: సినిమా రంగంపైన, సినిమా పాటల పైన, విశ్లేషణలపైన ఆసక్తి. సినిమా సాహిత్యం ఇప్పటికే బ్లాగుల్లో వెబ్సైట్లలోనూ తయారుచేశారు.
  • వాడుకరి:Raamanamma kalidassu: కాళిదాసు పురుషోత్తం అనే వీరు ప్రఖ్యాత చరిత్రకారులు, సాహిత్యవేత్త.