వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 18

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • క్రీ.పూ.3102: కొందరు పౌరాణికులు, చరిత్రకారుల లెక్క ప్రకారం కలియుగము ప్రారంభమైనది.
  • 1911: ఎయిర్‌మెయిల్‌ సేవ అధికారికంగా బ్రిటీష్ ఇండియా ప్రయోగించిన రోజు. హెన్రీ పెక్వెట్ అనే వైమానికుడు 6,500 ఉత్తరాలను అలహాబాద్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైనికి బట్వాడా చేశాడు.
  • 1486: రాధాకృష్ణ సాంప్రదాయంలో, భక్తి ఉద్యమంలో ముఖ్యునిగా పేరొందిన భక్తుడు చైతన్య మహాప్రభు జననం (మ.1534).
  • 1564: ఇటలీ కి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు మైఖేలాంజెలో మరణం (జ.1475).
  • 1745: బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా జననం (మ.1827).
  • 1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం (జ.1886). (చిత్రంలో)
  • 1939: సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మ మరణం (జ.1888).
  • 1994: నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు గోపీకృష్ణ మరణం (జ.1933).
  • 2015: తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు దగ్గుబాటి రామానాయుడు మరణం (జ.1936).