వికీపీడియా:నిరోధ విధానం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

దుశ్చర్యలను, వ్యక్తిగత దాడులను, దుష్టబాట్లను, అసభ్యమైన సభ్యనామాలను ఎదుర్కొనేందుకు నిరోధం ను వాడతారు. నిషేధాలను అమలు చేసేం సాంకేతిక విధానం కూడా నిరోధమే. నిరోధాలు మూడు రకాలు:

  • సభ్యనామం - ఒక వ్యక్తికి సంబంధించినది
  • ఐ.పి.అడ్రసులు - ఆ అడ్రసును వాడుకునే సభ్యులందరూ దీనికి గురవుతారు
  • ఐ.పి.శ్రేణులు: వందల, వేల మంది నిరోధానికి గురయ్యే అవకాశముంది.


పై నిరోధాలను ఎంతకాలానికైనా అమలుచేసే సాంకేతికత నిర్వాహకులకు అందుబాటులో ఉంది. కాని, ఆ నిరోధాలు నిరోధ విధానాన్ని అనుసరించి జరగాలి.


సభ్యులు తమ నిరోధ అభ్యర్ధనలను వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు లేదా వికీపీడియా:దుశ్చర్యపై నిర్వాహకుడి జోక్యం లో సాక్ష్యాలు చూపుతూ నమోదు చెయ్యాలి. నిరోధించి తీరాల్సిన అవసరం నిర్వాహకులకు లేదు.

నిరోధాలను ఎప్పుడు వాడవచ్చు[మార్చు]

దుశ్చర్యలను ఎదుర్కొనేటపుడు, నిషేధాలను అమలు జరిపేటపుడు నిరోధాలను వాడతారు. అరుదైన కొన్ని ఇతర సందర్భాలలో కూడా నిరోధాలను వాడవచ్చు. ఆ జాబితా కింద ఉంది. ప్రత్యేకించి ఇక్కడ చూపించినవి కాక మిగిలిన కేసుల్లో నిరోధం 24 గంటలు ఉండాలి.

దుశ్చర్య[మార్చు]

ప్రధాన వ్యాసము: Wikipedia:వికీపీడియాలో దుశ్చర్య

ఐ.పి.అడ్రసులు అడ్డం పెట్టుకుని వికీపీడియాలో దుశ్చర్యలు చేసే సందర్భాలలో, నిర్వాహకులు తమ విచక్షణను అనుసరించి ఆ అడ్రసులను నిరోధించవచ్చు. డైనమిక్ ఐ.పి.అడ్రసులకు (ఎప్పటికప్పుడు మారేవి) వ్యవధి 24 గంటల వరకు ఉండవచ్చు. స్థిర ఐ.పి.అడ్రసులకు, తొలి వడ్డింపు 24 గంటలు ఉండవచ్చు. పదే పదే దుశ్చర్యలు చేసే వారిని గరిష్టంగా ఒక నెల వరకు నిరోధించవచ్చు; వ్యవధి ఎన్నాళ్ళుండాలనే విషయమై చాలా నియమాలున్నాయి గాని, ఇవేవీ అధీకృత విధానాలు కావు. మామూలుగా, సరదాగా దుశ్చర్యలు చేసేవారిని నిరోధించే ముందు ఒకసారి హెచ్చరించవచ్చు. కావాలని, వికీపీడియాను చెడగొట్టే ఉద్దేశ్యంతో దుశ్చర్యలు చేసేవారికి ఈ హెచ్చరికలు ఇవ్వరు.


దుశ్చర్యలు చెయ్యడమే పనిగా పెట్టుకుని, లాగిన్ అయి మరీ చేసే సభ్యులను కూడా ఈ వ్యవధికి నిరోధించవచ్చు. అయితే, దుశ్చర్యలు చేస్తూ, పనిలో పనిగా కొన్ని మంచి దిద్దుబాట్లు చేసే వాళ్ళను ఇలా నిరోధించరాదు.


ఏదో అక్కడక్కడా జరిగే చెదురుమొదురు సంఘటనల్లో నిరోధాలు వాడరాదు.

మితిమీరిన రివర్టులు[మార్చు]

ప్రధాన వ్యాసము: Wikipedia:మూడు రివర్టుల నియమం

మూడు రివర్టుల నియమాన్ని ఉల్లంఘించే వారిని నిరోధించవచ్చు. ఎంతమంది ఉల్లంఘిస్తే అంతమందినీ నిరోధించాలి. అన్ని పక్షాలనూ సమానంగా చూడాలి.

నిరోధం సంగతిని తెలియజేస్తూ, నిబంధనను ఉల్లంఘించిన తేడాలకు లింకులిస్తూ సభ్యుడి చర్చా పేజీలో పెడితే ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ నియమం ప్రకారం నిరోధించబడిన నిర్వాహకులు తమను తాము విడుదల చేసుకోరాదు.

నిషేధాలు[మార్చు]

ప్రధాన వ్యాసము: Wikipedia:నిషేధ విధానం

నిషేధించబడ్డ సభ్యులు వికీపీడియాలో రచనలు చెయ్యలేరు. నిషేధాలు కింది కారణాల వలన జరగవచ్చు:

ఏదైనా సభ్యనామం, ఇప్పటికే నిషేధించబడిన సభ్యుని మరో అవతారమని స్పష్టంగా తేలిపోతే దాన్ని కూడా అలాగే నిషేధించవచ్చు. ఈ విషయంపై చర్చ కొరకు ఇంగ్లీషు వికీపీడియా చూడండి. కొత్త అవతారాల పై విధించిన నిషేధాలెపుడు వివాదాస్పదం అవుతూ ఉంటాయి.

అజ్ఞాత మరియు బహిరంగ ప్రాక్సీలు[మార్చు]

అజ్ఞాత ప్రాక్సీల ఐ.పీ లను శాశ్వతంగా నిరోధించమని నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నాం. కింది లింకులను చూడండి:


అడ్డంకులు[మార్చు]

వికీపీడియాను మామూలుగా పనిచేయనీకుండా అడ్డంకులు సృష్టించే వారి ఐ.పి.అడ్రసులను, సభ్యనామాలను నిర్వాహకులు తమ విచక్షణను ఉపయోగించి నిరోధించవచ్చు. ఇతర సభ్యులు సంతకంతో సహా చేసిన వ్యాఖ్యలను మార్చడం, తప్పుదారి పట్టించే రచనలు ఉడ్డేశపూర్వకంగా చెయ్యడం, వేధించడం, మితిమీరిన వ్యక్తిగతంగా దాడులు ఈ అడ్డంకుల కోవలోకి వస్తాయి. నిరోధం విధించే ముందు సభ్యుని హెచ్చరించాలి. డైనమిక్ ఐపీ లకు ఈ నిరోధాలు 24 గంటల వ్యవధి ఉండాలి. స్థిర ఐపీలు, సభ్యనామాలకు ముందుగా 24 గంటలతో మొదలుపెట్టి, ఆపై చేసే అతిక్రమణలకు వ్యవధిని పెంచుకుంటూ పోవాలి. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నిరోధించడానికి, మధ్యవర్తిత్వ సంఘ నిర్ణయం అవసరం.


మరీ ఎక్కువగా అడ్డంకులు సృష్టించే కొత్త ఎకౌంట్లను నిర్వాహకులు అమ విచక్షణను ఉపయోగించి, ఎంత వ్యవధికైనా, శాశ్వతంగానైనా సరే నిరోధించవచ్చు. వికీపీడియా విధానాలను అతిక్రమించే ఉద్దేశంతో సృష్టించబడిన సాక్‌పపెట్లను శాస్వతంగా నిరోధించాలి. అయితే, చెదురుమదురుగా జరిగే అడ్డంకులు, మంచి రచనలు కూడా చేస్తూ ఉండే సభ్యులను నిరోధించరాదు.


నిరోధించబడిన సభ్యుల కొత్త అవతారాలు కూడా అలాగే అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే, లేదా వారి రచనల ధోరణి అడ్డంకులు సృష్టించే సూచనలను అందిస్తూ ఉంటే కూడా సదరు ఎకౌంట్లను నిరోధించవచ్చు. దీని కింద విధించిన నిరోధాలు వివాదాస్పదం కావచ్చు.


సభ్యనామాలు[మార్చు]

Main article: వికీపీడియా:సభ్యనామము

మా సభ్యనామం విధానం ప్రకారం, రెచ్చగొట్టే విధంగా ఉండేవి, కావాలని తికమకపెట్టేవి, ఇతరత్రా అనుచితమైనవి అయిన సభ్యనామాలకు అనుమతి లేదు. కొన్ని పరిస్థితులలో అలాంటి సభ్యనామాలు కలిగిన ఖాతాలను నిరోధించవచ్చు.

ఇతర సభ్యనామాలను పోలి ఉండేవిధంగా (ఇంపర్సనేటర్) ఎంచుకున్న సభ్యనామాలను వెంటనే, నిరవధిక కాలానికి నిరోధించవచ్చు. సదరు సభ్యుల ఐపీఅడ్రసులు ఆటోబ్లాకులో ఉంచాలి. ఇతర సభ్యుల పేర్లను తమ సంతకంలో వాడే ఖాతాలు, ఐపీఅడ్రసులను ముందుగా హెచ్చరించి, తరువాత నిరోధించాలి.

నిరోధించేముందు ఆ ఖాతా చెడు తలంపులు కలిగిన ఇంపర్సనేటరని నిర్ధారించుకోండి; కొందరు చెడుతలంపేమీ లేకుండానే ఇతర సభ్యనామాలను పోలి ఉండేవిధంగా తమ సభ్యనామాన్ని పెట్టుకోవచ్చు. వాళ్ళ రచనల్లో అలాంటి చెడు తలంపు కనిపించకపోతే, సభ్యనామాల సామ్యం వలన కలిగే తికమక గురించి చెప్పి, దాన్ని మార్చుకునేలా వాళ్ళకు నచ్చచెప్పాలి.