వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Pavan santhosh.s

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (మే 2, 2015) ఆఖరి తేదీ : (మే 9, 2015)
Pavan santhosh.s (చర్చదిద్దుబాట్లు) - పవన్ సంతోష్ గారు అతి తక్కువ కాలం లో తెవికీలో విశేషమైన కృషి చేసారు. ఒక విశిష్టమైన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసారు. ఆయన అనేక వ్యాసాలను తెవికీకి అందించడమేకాక యితర వ్యాసాలలో కూడా ఉపయుక్తమైన మార్పులు చేసి తెవికీలో వ్యాస నాణ్యతకు తోడ్పడుతున్నారు. దిద్దుబాట్లు చేయటమే కాకుండా వికీ నియమాలు, పద్ధతులు తెలుసుకొని నిర్వహణ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. కొత్తసభ్యులను ఆహ్వానించడం, సహాయం కావలసిన సభ్యులకు సత్వర సహాయాన్నందించడం, కొత్తవాడుకరులకు దిశానిర్దేశం చేయడం. తెవికీ వ్యాస నాణ్యతను పెంచడంలో కృషి, వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ఇప్పటికే నిర్వహిస్తున్న పనుల్లో కొన్ని ఉదాహరణలు మాత్రమే. సాహిత్యవ్యాసాలు పెంపొందించడమే కాకుండా విశేష వ్యాసాల నాణ్యతను పెండడంలో కొత్త పరికల్పనలు చేసి తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వ్యక్తి. అంతే కాకుండా బెంగళూరులో జరిగిన ఇండియా కమ్యూనిటీ కన్సల్టేషన్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం వహించిన సభ్యుల్లో ఒకనిగా, 2014 డిసెంబరులో తిరువనంతపురం(కేరళ)లో నిర్వహించిన అంతర్జాతీయ స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ కాన్ఫరెన్స్ స్వతంత్ర-2014లో కూడా పాల్గొన్నారు. ఈ పనులన్నీ తెలుగులో ప్రామాణికంగా అనేక చక్కని వ్యాసాలు వ్రాస్తూనే నిర్వహించారు. నిజానికి ఇప్పటికే నిర్వహణా పనులు చేస్తున్న పవన్ సంతోష్ గారికి ఈ నిర్వాహకహోదా కేవలం ఆ పనులు నిర్వహించడంలో సౌలభ్యం కొరకే. ఇక ముందు కూడా తెవికీని చక్కగా నిర్వహిస్తూ, ముందుకు నడిపించగలరని ఆశిస్తూ, ఈయన్ను నిర్వహకత్వానికి ప్రతిపాదిస్తున్నా. ---ఈ వాడుకరి నిర్వాహకుడు. కె.వెంకటరమణ (చర్చవిద్యుల్లేఖ)  06:19, 2 మే 2015 (UTC)-[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.

సభ్యుని అంగీకారం/అభిప్రాయం[మార్చు]

ఈ ప్రతిపాదనకు నేను అంగీకరిస్తున్నాను. నిర్వాహకత్వం వల్ల ఏర్పడే సదుపాయాలు నా కృషికి తోడ్పడతాయి. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం నిర్వహణ కార్యకలాపాలను చాలా చురుకుగా చేస్తున్న నిర్వాహకుల్లో ఒకరైన వెంకటరమణ గారు స్వయంగా నా నిర్వాహకత్వానికి ప్రతిపాదించడం నాకు గౌరవంగానూ భావిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 07:27, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు[మార్చు]

  1. Support ' అన్ని విధములుగా సమర్థత కలిగిన వాడుకరి. జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ (చర్చ) 06:35, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Support ' నాకు సమ్మతమే... --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:52, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Support ' నాకు సమ్మతమే.--శ్రీరామమూర్తి (చర్చ) 08:13, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. Support ' అత్యంత చురుకైన మరియు క్రియాశీలకంగా పని చేస్తున్న పవన్ సంతోష్ గారి నిర్వాహకత్వానికి నా పరిపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. --సుజాత తుమ్మపూడి (చర్చ) 08:16, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Support ' పవన్ ఒక సంవత్సరం కాలంగా వికీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, నాణ్యత పెంపుదల కోసం కృషిచేస్తున్న వ్యక్తి. నిర్వాహకునిగా మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తారని భావిస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 10:45, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  6. Support ' పవన్ సంతోష్ గారు నిర్వాహకత్వానికి సరైన అభ్యర్ధి. మున్ముందు చక్కని నిర్దేశకత్వంతో తెవికీని ముందుకు నడిపించగలరని నా నమ్మకం --వైజాసత్య (చర్చ) 12:38, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  7. Support ' పవన్ సంతోష్ ఒక నిబద్ధత కలిగిన వికీ కార్యకర్త. చేరినప్పటి నుంచి వికీలో మంచి నాణ్యమైన సమాచారాన్ని చేర్చి నియమావళిని బాగా అర్థం చేసుకున్నారు. అందరి అభిమానాన్ని చూరగొన్నారు. అతనికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 12:59, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  8. Support ' పవన్ సంతోష్ చురుకైన వికీపీడియన్, అన్ని విషయాలలో నేర్చుకొని పనిచేసే గుణం ఉండటం వలన ఆయన నిర్వహకునిగా అదనపు బాధ్యతలు సమర్ధవంతంగా నెరవేర్చగలరని అనుకుంటున్నాను.--విశ్వనాధ్ (చర్చ) 15:05, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  9. Support ' పవన్ సంతోష్ నిర్వాహకునిగా మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తారని భావిస్తున్నాను. ఎల్లంకి భాస్కరనాయుడు (చర్చ) 15:51, 2 మే 2015 (UTC)]][ప్రత్యుత్తరం]
  10. Support ' పవన్ సంతోష్ గారి నిర్వాహక హోదాకై మద్దతు తెలుపుతున్నాను----నాయుడుగారి జయన్న (చర్చ) 16:41, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  11. Support ' కొద్ది కాలంలోనే వికీపైన అవగాహన పెంచుకొని IEG గ్రాంటు ప్రాజెక్టు చక్కగా నిర్వహించి తెలుగు వికీపీడియా, వికీసోర్స్ అభివృద్ధికి తోడ్పడిన పవన్ సంతోష్ కి నిర్వహణహోదా వికీపనులలో తోడ్పడుతుంది మరియు వికీ ప్రాజెక్టులఅభివృద్ధికి దోహదపడుతుంది.--అర్జున (చర్చ) 15:32, 3 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  12. Support ' నాణ్యత కరువై, నిర్వహణ బరువై, చర్చలు అధికమై, ఫలితం శూనమై, దిక్కుతోచని స్థితిలో ఊబిలో కూరుకున్న తెవికీని ప్రక్షాళన చేసి లక్ష్యంవైపు నడిపిస్తారని ఆశిస్తూ, ... సి. చంద్ర కాంత రావు- చర్చ 17:42, 3 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  13. Support ' సమ్మతి .--Vijayaviswanadh (చర్చ) 07:28, 4 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  14. Support ' --182.74.163.10 10:09, 4 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  15. Support ' --రహ్మానుద్దీన్ (చర్చ) 10:11, 4 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకత[మార్చు]

తటస్థం[మార్చు]

ఫలితం[మార్చు]

దాదాపు క్రియాశీలక సభ్యులందరి మద్దతు కూడగట్టుకొని ఈ ప్రతిపాదన విజయవంతమైనది. కావున పవన్ సంతోష్ గారికి నిర్వాహకత్వ హోదా ఇవ్వవలసిందిగా అధికారులను కోరుతున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 06:18, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి నిర్వాహకహోదా ఇవ్వబడినది. పవన్ సంతోష్ కి అభినందనలు. ఎన్నికని సమవ్వయం చేసిన కె.వెంకటరమణ గారికి, పాల్గొన్న సభ్యులందరికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:59, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నాపై నమ్మకం ఉంచి ఓట్లువేసిన తెవికీ సహసభ్యులకు ధన్యవాదాలు, నన్ను ఈ బాధ్యతకు ప్రతిపాదించిన కె.వెంకటరమణ గారికి కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 06:19, 12 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]