వికీపీడియా:మీకు తెలుసా? భండారము

వికీపీడియా నుండి

ఈ జాబితా మొదటి పేజిలోని మీకు తెలుసా? విభాగములో ఇప్పటిదాకా ప్రదర్శించిన వాక్యాల భాండాగారము.

  • మీరు ఏదైనా వికిపీడియా వ్యాసము చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయము ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
  • ఈ భాండాగారములోనుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలుగింటిని మాత్రమే ఈ మూసలో చేర్చండి.
  • వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చేర్చేయండి. అలాగే ఇక్కడా చేర్చిన విషయాలను దాయనవసరం లేదు.

[మార్చు] మీకు తెలుసా?

[మార్చు] 2012

  • భారతదేశంలో రెండవదిగా మరియు, ఆంధ్ర ప్రదేశ్‌ లో మొట్టమొదటిదిగా ప్రారంభమైన పంచాయతీ మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ లేదా ఫరూక్ నగర్ అనీ!
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవుదినాల కేలండర్ మరియు భారతదేశ ప్రభుత్వ సెలవు దినాల కేలండర్ చూడండి.
  • జాతీయ సేవా పథకం 1969లో ప్రారంభం అయిందని..
  • తెలుగునాట ప్రఖ్యాతి చెందిన పద్యనాటకాలలో చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గయోపాఖ్యానం నాటకం ఒకటి.
  • కదులుతున్న కారు నుండి ఎగిరిదిగటం ఎలా, మృత సముద్రంలో మనం ఎందుకు మునిగిపోలేము లాంటి ఆసక్తిగల విషయాలున్న పుస్తకం నిత్యజీవితంలో భౌతికశాస్త్రం
  • స్వస్తిక్ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం వుంది.
  • జాస్తి చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయముర్తిగా నియంచబడ్డారు.
  • కేంద్రకామ్లాలు జన్యు పదార్థాలుగా వ్యవహరించే జీవ రసాయనాలు. వీనిలో డి.ఎన్.ఎ. మరియు ఆర్.ఎన్.ఎ. లు ముఖ్యమైనది.
  • ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకం లోనిది.
  • ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ ప్రకారం ఫ్రాన్స్ లోని లాస్కూ గుహల్లో ఆదిమానవులు గుహల గోడల మీద వేలకొలది వ్యంగ్య చిత్రాలు చిత్రించారు.
  • మానవుని శరీరంలో శారీరకంగా మానసికంగా అత్యధిక వేగంగా అనేక మార్పులు సంభవించే ఈ కాలాన్ని టీనేజ్ అంటారు. చూడండి యవ్వనం
  • శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు (CSIR, 1942) అనునది 39 పరొశోధనాశాలలు, 50 క్షేత్ర స్థానాలు మరియు విస్తరణా కేంద్రాలతో కూడిన భారతదేశపు అతిపెద్ద పరిశోధన సంస్థ.
  • తల్లి సౌభాగ్యాన్ని మరియు పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసే వేడుక సీమంతం.
  • ఇందిరా పార్క్, హైదరాబాదులోని చక్కటి ఉద్యానవనాలలో ఒకటి.
  • తంగి సత్యనారాయణ (1931 - 2009) సుప్రసిద్ధ శాసనసభ్యుడు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు.
  • ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా నివసించడం అని అర్ధం.
  • గంధమహోత్సవం అనగా గంధపుచెక్కల నుండి తయారుచేసిన గంధపు లేపన్నాన్ని పంచే ఉత్సవం.
  • రక్తపుగడ్డ అనగా రక్తము ఒక అవయవములో గాని లేదా ఒక ప్రాంతములో గాని గూడుకట్టుకొనుట.
  • నీలగిరి కొండలలో పెరిగే నీలగిరి లేదా యూకలిప్టస్ చెట్టు నుంచి లభించే ఔషధ తైలాన్ని నీలగిరి తైలం అంటారు.
  • ఖతి అనేది భాష యొక్క రాత రూపాన్ని నిర్మించే విధానం.
  • ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాలను నివారించే రహదారి నియమాలు పాటించండి.
  • భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ భారతీయ కళలు మరియు సంస్కృతులను పరిరక్షించడానికి నిరంతరం శ్రమిస్తున్నదని.
  • విశ్వనాథ్ సూరి ప్రముఖ తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు మరియు రాజకీయనేత.
  • సచిన్ టెండుల్కర్ (కుడి పక్క చిత్రంలో) 2012, మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.
  • మార్క్ ఎలియట్ జూకర్ బర్గ్ ప్రపంచప్రసిద్ధిగాంచిన సోషల్ నెట్వర్కింగ్ జాలస్థలమైన ఫేస్‌బుక్ సృష్టికర్త.
  • ప్రసిద్ధిచెందిన త్ర్యంబక మహా మంత్రం అవసాన సమయాల్లొ జపిస్తే పరమశివుడు రక్షిస్తాడని నమ్మకం.
  • శారదా లిపిని క్రీ.శ. 8వ శతాబ్దంలో సంస్కృత, కాశ్మీరీ భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు.
  • శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 24 గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారంచేసే ఒక టెలివిజన్ ఛానల్.
  • శరత్ చంద్ర చటోపాధ్యాయ్ తెలుగు పాఠకులకు సుపరిచుతులైన ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా మరియు కథా రచయిత.
  • పుష్కరిణి లేక కోనేరు అనేది దేవాలయ అవసరముల నిమిత్తము ఏర్పరచుకున్న దిగుడు బావి.
  • గుజరాత్ రాష్ట్రంలో పఠాన్ జిల్లాలో ఉన్న బిందుసరోవం మాతృగయగా పిలువబడుతుంది. భారతదేశంలో హిందూ ధర్మం అనుసరించి తల్లికి శ్రాద్దకర్మలు నిర్వహించే ఏకైక క్షేత్రమిదే.
  • పుట్టగొడుగుల పెంపకం - ఒక ఆహారసంబంధమైన కుటీర పరిశ్రమ.
  • బృందావన్ గార్డెన్స్ కర్నాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఉద్యానవనం.
  • న్యూట్రాన్ తార సూపర్నోవా పేలుళ్ళ తర్వాత మిగిలిన అవశేష తారలు.
  • అంతర్జాలంలోగల తెలుగు నిఘంటువులలో ప్రముఖమైనది ఆంధ్రభారతి.
  • పొన్న చెట్టు రూపంలో తయారు చేయబడిన పొన్నమాను వాహనంపై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహంను ఉంచి జరుపుకునే ఉత్సవాన్ని పొన్నమాను సేవ అంటారు.
  • నూనెగింజల నుండి నూనెను తీయు పరిశ్రమలవారు మొదట నూనెగింజలను సేకరించునప్పుడు తమ పరిశ్రమలో వున్న క్వాలిటి కంట్రోల్ లాబోరెటరిలో సేకరించు విత్తనాల నమూనాలనునూనె గింజలను పరీక్షించు పద్ధతులు వాడి దాని ఫలితాలపై కొనుగోలు చేస్తారు.
Fire Engine (YS).jpg
  • అగ్ని భద్రత అనేది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు చేయగల అగ్నిప్రమాదాలు ఏర్పడగల సంభావ్యతని తగ్గీంచడం లేదా పూర్తిగా నివారించడం కోసం, ఏదేని భవనం అనియంత్రిత అగ్ని ప్రమాదకాలంలో ఉన్నపుడూ అందలి వ్యక్తులను హెచ్చరించడానికీ, కాపాడడానికీ, ప్రాణ నష్ట తీవ్రతని తగ్గించడానికీ సంబంధించినది.
  • తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె