వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 16

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 15 | పాత చర్చ 16 | పాత చర్చ 17

alt text=2012 డిసెంబరు 31 - 2013 జనవరి 19 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2012 డిసెంబరు 31 - 2013 జనవరి 19

linseed కుసరియైన తెలుగు పేరు[మార్చు]

నాదగ్గరున్న పుస్తకంలో linseed మొక్కకు తెలుగులో పేరు 'అవిశ '(కన్నడంలోఅగసె)అనివుంది.వృక్షశాస్త్రనామం Linum usitatissimum.తెవికి లో తెలుగు పేరు మదనగింజ అనివుంది.అలాగే En.wiki లో 'Sesbania grandiflora 'అనేమొక్క పేరును తెలుగులో అవిసి(కన్నడలో అగసె)అనివుంది.ఇప్పుడు Linseed oil ను మదన నూనె అనాలా?లేక నాపుస్తంలో(SEA Handbook of2009) వున్నట్లుగా అవిసె నూనె అని శీర్షిక పెట్టాలా?మీఅమూల్యమైన సలహ,సూచనలను ఆకాంక్షిస్తూపాలగిరి (చర్చ) 15:17, 31 డిసెంబర్ 2012 (UTC)
అవిసె నూనె అనిన బాగుంటుంది.[1] నిఘంటువు లో ఉన్న మేరకు అవిసె నూనె అనిన బాగుండునని నా అభిప్రాయం కె.వి.రమణ- చర్చ 15:41, 31 డిసెంబర్ 2012 (UTC)

  • పాలగిరిగారూ ! సాధారణంగా దీనిని అవిశ అంటారు. వ్యవహాంలో అవిసి అని కూడా అంటారు. మదన గింజ అన్నది సంస్కృత అర్ధాన్ని స్పురించ్లా చేస్తున్నది. పైగా అది ఇప్పుడు వాడుకలో లేదు కూడా. అందువలన అందర్కీ అర్ధ అయ్యేలా అవిశ నూనె అంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు కూడా ఆలోచించండి. --t.sujatha (చర్చ) 15:50, 31 డిసెంబర్ 2012 (UTC)
  • అవిశ పేరుతో తెవికీలో ఇంతకు ముందే ఒకవ్యాసం వున్నందున్న,అయోమయనివృత్తికై అవిసె నూనె పేరుతో వ్యాసం ప్రారంభించాను.పాలగిరి (చర్చ) 08:41, 6 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బ్లాగు లింకులు నియమాలు[మార్చు]

బ్లాగు లింకుల గురించి అడపదడపా చర్చిస్తూనేవున్నాము. మన నియమాల ప్రకారం ప్రసిద్ద వ్యక్తుల బ్లాగు లింకులు చేర్చటం పై అభ్యంతరము లేనప్పటికి, దానిని కార్యరూపం చేయటంలో సంపాదకుల మధ్య భిన్నాభిప్రాయాలు పరిష్కరించబడుటలేదు. అందువలన తెవికీ అభివృద్ధి కుంటుపడుతున్నది. ఈ విషయానికి సంబంధించి ఇటీవలి చర్చ చూడండి. ఈ పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి నేను ఈ క్రింది చిత్తుప్రతి ప్రతిపాదనను చేరుస్తున్నాను. తోటి సంపాదకుల స్పందనల తరువాత ప్రతిపాదనను సంస్కరించి దానిపై వోటింగు జరిపి దాని ఫలితం ప్రకారం విధానాలను మెరుగుపరచుకొని తెవికీ అభివృద్ధిని పెంచుదాం.

ప్రముఖ వ్యక్తుల బ్లాగు లింకులు చేర్చటానికి స్పష్టతా విధానం.
అ)వ్యక్తి వివరాలను అంతర్జాలంలో వెతికినప్పుడు ప్రముఖత్వాన్ని తెలిపే వివరాలు అనగా పుస్తక రచయిత గా కాని, పత్రికలలో ప్రముఖమైన శీర్షికలను నిర్వహించిన వ్యక్తిగాని, పత్రికలలో రెండు సంవత్సరాలైనా చర్చావిషయాల్లో కనబడే వ్యక్తి కాని ప్రభుత్వ సంస్థలలో గెజిటెడ్ స్థాయి అధికారులు కాని అయివుండాలి.
ఆ)బ్లాగులో వాణిజ్య ప్రకటనలుండకూడదు.
ఇ) లింకు చేర్చే వారి స్వంత బ్లాగు అయివుండకూడదు
ఈ) ఒక వ్యాసంలో ఒక బ్లాగుకి ఒకటి కంటే ఎక్కువ లింకు లివ్వకూడదు.
ఉ)ఒక సంపాదకుడు బ్లాగు లింకు చేర్చిన తరువాత అభ్యంతరాలుంటే చర్చా పేజీలో చర్చించి దాని కనుగుణంగా అవసరమైతే అ బ్లాగు లింకుని తొలగించవచ్చు.
పై దానిపై ఒక వారంలోగా సహ సంపాదకులని స్పందించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 01:14, 4 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సంపాదకులు మాత్రమే బ్లాగు లింకులు చేర్చగలరా? మామూలు రచయితలు లింకులు చేర్చకూడదా? Chavakiran (చర్చ) 01:32, 4 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సంపాదకుడు రచయిత ఒకటే. --అర్జున (చర్చ) 01:41, 4 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్వహులైనంత మాత్రాన ఏక వాక్య వ్యాసానికి ఎక్కువ బ్లాగు లింకులు చేరుస్తారా!నియమ నిబంధనలు పాటించనవసరం లేదా!106.208.244.162 02:20, 4 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పై ప్రతిపాదనలో నిర్వాహకులకు ప్రత్యేకహక్కులు లేవని గమనించగలరు.--అర్జున (చర్చ) 23:38, 5 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అసలు బ్లాగు లింకులు పొందుపరుచుట వలన కలుగు లాభనష్టముల చర్చ ఏదైనా జరిగితే దాని జత జేయండి. లెదా చర్చ చేయండి. చాలామంది వాడుకరులు చర్చలు తెలుసుకుంటే మంచిది. తదుపరి ఎటువంటి నియమ నిబంధనలు చేర్చవచ్చునో ఆలోచించ వచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:01, 4 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కొన్ని బ్లాగులలో ‌విషయానికి సంబంధించిన విలువైన సమాచారం వున్నదనేది అందరికీ అమోదయోగ్యంఅనుకుంటాను. కొంతమంది వికీ నిబంధనలకు అనుగుణంగా రాయలేనప్పుడు, వారి సమాచారానికి వారికొక్కరికే గుర్తింపు రావాలనుకున్నప్పడు, వ్యక్తిగత అభిప్రాయాలు తెలియచేయాలనుకున్నప్పుడు వికీలో వ్రాయకుండా బ్లాగులో రాసుకుంటారు కదా.అందుకనే మన ప్రస్తుత నియమాలలో దీనిగురించి ప్రస్తావన వున్నది. దీనికి కార్యరూపం ఇవ్వడంలోనే ఇబ్బందిగా వుంటున్నందున ఈ చర్చ ప్రారంభించటమైనదని గమనించగలరు. పాత చర్చల గురించిన వివరాలకోసం తెవికీలో వెతికితే సరిపోతుంది. నేను కొద్దిసేపు వెతకగా కనబడిన ఒక లింకు చూడండి.--అర్జున (చర్చ) 23:38, 5 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
బ్లాగులింకులకు తెవికీ అభివృద్ధికి సంబంధమేంటో తెలిసిరావడం లేదు. ఈ మధ్య అర్జునరావు గారు ప్రతీ చర్చలలో తెవికీ అభివృద్ధి కుంటుపడుతున్నదనో, మందగిస్తున్నదనో వ్రాయడం(హెచ్చరించడం!) సాధారణం అయిపోయింది. తాను చేసే మార్పులు నిబంధనల ప్రకారం లేదని చెబితే తెవికీ అభివృద్ధి ఎలా మందగిస్తుందో వివరిస్తే బాగుంటుంది. తెవికీ అభివృద్ధి మహోన్నత దశలో ఉన్న కాలంలో చురుగ్గా ఉండే సభ్యులలో నేనూ ఒకడిని. ఆ కాలంలో అర్జునరావుగారు చురుగ్గా లేరని గణాంకాలే చెబుతున్నాయి. అప్పుడూ సభ్యుల మధ్య చర్చలు బాగానే జరిగాయి కాని తెవికీ అభివృద్ధికి ఎలాంటి ఢోకా రాలేదు. చర్చలే అభివృద్ధికి సోపానాలుగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే బ్లాగులింకులపై ఇప్పటికే నియమాలు ఉన్నాయి. స్పష్టత కోసం మరిన్ని నియమాలు చేర్చే అవసరాన్ని నేను కాదనను కాని ఇంతకంటే ముఖ్యమైన నియమాలు తెవికీకి అవసరమున్నప్పుడు కేవలం తాను పెట్టిన లింకులు కొన్ని నియమాలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో నేను చేసిన నిర్వహణ పని అర్జునరావుగారికి నచ్చక ఇప్పుడు ఏకంగా రచ్చబండనే ఆధారం చేసుకొని చర్చ తీయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. రచ్చబండలో చర్చ తీసేటప్పుడు కొత్త ప్రతిపాదిత నియమాలకై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలి అంతేకాని 5 పాయింట్లు పెట్టి వాటిపై అభిప్రాయాలు చెప్పమనడం బాగుండదు. ఆ 5 పాయింట్లు నియమాలలో పెడితే స్పష్టత వస్తుందా అంటే సందేహమే. నియమాలు ఎన్ని ఉన్ననూ మళ్ళీ చర్చలే ఆధారం. ఖచ్చితమైన నియమాలు తయారుచేయడం ఎవరికైనా అసాధ్యమే. ఒక నియమానికి ఇతర నియమాలతో ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. (ఇది ఇక్కడే కాదు దేశ రాజ్యాంగానికైనా ఎన్ని సార్లు సవరనలు చేసిననూ స్పష్టత ఉండటం లేదు. నియమాలు పూర్తిగా స్పష్టంగా ఉంటే కోర్టులు, లాయర్ల అవసరం ఇంతగా ఉండేది కాదు). ఆంగ్లవికీలోని వ్యాసాలు విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా బోధనకు మార్గదర్శకంగా ఉపయోగిస్తున్నారు. మనం తెవికీని కూడా ఆ దిశకు తీసుకురావడానికి వ్యాస నాణ్యత విషయంలో చర్చించాలి. అయినా సరే చర్చ ప్రారంభమైంది కాబట్టి, ఒక్కో పాయింటును చూస్తే మొదటి పాయింటులో ఎలాంటి స్పష్టత లేదు, మునుముందు దీనిపై కూడా చర్చలు జరిగే అవకాశముంది. రెండో పాయింటు అసలు అవసరమే లేదు. ప్రకటనలు తెవికీ మూల నియమానికి విరుద్ధం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా చేర్చే అవసరం లేదు. మూడవ పాయింటు చూస్తే స్వయంగా కాకున్నా చేర్చేవారు మరోమార్గం ద్వారా చేర్చడానికి అవకాశం ఉంటుంది, దీనిపై కూడా మళ్ళీ చర్చలు మామూలే. నాలుగో పాయింటు ముందే గ్రహిస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. 5వ పాయింటులో స్పష్టత లేదు. మునుముందు దీనితోనూ కష్టమే. నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు తొలిగించడానికి చర్చ అవసరమే ఉండదు. బ్లాగులకు అధిక ప్రాధాన్యత ఇస్తే కేవలం బ్లాగులింకుల కోసమే కొందరు వ్యాసాలు సృష్టించే ప్రమాదాన్ని కూడా మనం ముందే గ్రహించాలి. బయటి లింకుల కంటే లోపలి సమాచారంపైనే మనం దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. ఇతర నియమాలకు భంగం కలగకుండా, ప్రముఖులకు సంబంధించి ఉండి, బయట ఎక్కడా దొరకరాని సమాచారం ఉంటే, తెవికీ దృష్ట్యా అది అవసరం అనుకుంటే బ్లాగు బయటిలింకులు పెట్టడానికి ఇప్పటికే అవకాశం ఉంది కదా. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:08, 4 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ముందు కొన్ని సంగతులు. మీ గురించి నాకు వ్యక్తిగతంగా వివాదాలు లేవని, మీరు నేను తెవికీ గురించి తెవికీలో మరియు అంతర్జాలంలో తప్ప మరెచటా కలుసుకొనటానకి కూడా వీలుపడలేదని తెలియచేస్తున్నాను. తెవికీ అభివృద్ధికి కృషిచేసిన మీరంటే పూర్తిగౌరవం అనికూడా ఇంతకుముందే కొన్ని సార్లు తెలపటం జరిగింది. అందుకని సహ సంపాదకులు దీనిని మన ఇద్దరికే పరిమితమైన విషయంకాదని తెవికీ అభివృద్ధికి సంబంధించినదని గమనించకోరుచున్నాను. కొంతమంది సహసంపాదకులు వివాదం ఏర్పడినపుడు కొంతకాలందానిని ప్రక్కకి పెట్టటం పరిష్కారమని భావిస్తున్నారు. వివాదం ఒక వ్యాస విషయానికి సంబంధించినదైతే ఏమైనా ఉపయోగపడుతుందేమో, నియమాలకు సంబంధించినదైతే ఉపయోగంకాదని నా అనుభవం. ఇంగ్లీషు వికీలో చర్చలు గమనిస్తే వాటి ప్రాధాన్యం కొంత అర్థంచేసుకోవచ్చు. అందుకని తెవికీలో ఆసక్తికల అందరూ తమ తమ అభిప్రాయాలను తెలియచేయాలని కోరుతున్నాను.
తెవికీ గణాంకాల గురించి మీరు, నేను ఇంకొంతమందిమి విశ్లేషిస్తూనేవున్నాము. ఉదాహరణకు నా విశ్లేషణ తీసుకుంటే] తెవికీ అభివృద్ధి కుంటుపడిందని నా అభిప్రాయం. అయితే ఈ విశ్లేషణ మొత్తం తెవికీ సంబంధించింది నా మార్పులు చేర్పులు గురించి కాదు. లింకులు ‌విషయంలో ఒక ఉపమానం ద్వారా ‌ విశదీకరిస్తాను. ఏదైనా గోడ కట్టదామనుకునే సమూహం, ఒక ఇటుక పై ఇటుక పేర్చటమో లేక కొంత సవరించటమో చేర్చితే గోడ తయారవుతుంది. ఒకరు ఇటుక పేర్చితే ఇంకొకరు తొలగించితే గోడ తయారు కాదుకదా? ఒకరు కొంత పరిశోధించి ఉపయోగమని చేర్చిన లింకు ఇంకొకరు తొలగిస్తే అలా ఎక్కువ సార్లు జరుగుతుంటే ఈఆ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలి? నాకు తెలిసిన పద్దతిలో నేను ప్రతిపాదించాను. దానికన్నా మెరుగైన పద్దతుంటే తెలియచేయండి. కొత్త వ్యాసం తయారు చేసేటప్పుడు లింకులు చాలా ప్రాముఖ్యంకలవి కనుక ఒక లింకన్నా వుండాలి అన్న నియమం వుందని గుర్తు. వికీలో పనిచేసేవారందరు వ్యాసం రాయాలని లేదు కదా? ఒకరు ఉపయుక్తమైన లింకు చేరిస్తే దాని అధారంగా ‌‌ఇంకొకరు వ్యాసాన్ని విస్తరించవచ్చుకదా?
నియమాలు రాతిలో చెక్కబడినవి కాదుకదా. వాటివలన వివాదాలు ఏర్పడుతున్నప్పుడు చర్చించే మెరుగుచేసుకోవటమే పరిష్కారం కదా? ఒక వాక్యంలో తెలిపే విషయం కంటే ఎక్కువ వివరాలుమరియు ఉదాహరణలు గల విషయంలో స్పష్టతమెరుగుగావుంటుందనటానికి సందేహం లేదుకదా. ఇక నేను ప్రతిపాదించిన వాటిలో స్పష్టత లేదని మీరనుకుంటే మీరు కొత్త ప్రతిపాదనని చేయండి.మీకు అమోదయోగ్యమైన బ్లాగులింకులు అమోదంకాని బ్లాగు లింకులు ఉదాహరణలుఇవ్వండి. --అర్జున (చర్చ) 23:38, 5 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ జరుగుటకు కారణమైన అర్జున గారికి ధన్యవాదాలు. తెవికీ ని ఆంగ్ల తెవికీ లా ఉన్నతంగా తీర్చిదిద్దాలంటె విషయాన్ని చేర్చుటకు సభ్యులందరు కృషిచేయాలి. మీరు తెవికీ నియమావళి,నిబంధనలకు అనుగుణంగా బ్లాగు లింకులు చేర్చవచ్చుకదా. ఈ రోజె తెవికీ ప్రారంభింపబడలేదు. అనేక సంవత్సరాలుగా చాలా వ్యాసాలు చేరుతున్నాయి. యిప్పుడె బ్లాగు లింకుల గూర్చి చర్చ జరగాలా! మీరు విషయ విస్తరణను ప్రక్కన పెట్టి ఒకే పేరుతో గల నాలుగు బ్లాగు లింకులివ్వడం సబబుగా ఉన్నదా? మీరు ఉంచిన ప్రతి బ్లాగు లింకు లో గల విషయమొక్కటె. మీరు వివరించిన వ్యాసం ఎవ్వరికీ తెలియని వ్యాసం కాదు. నిరక్షరాస్యుడికి కూడా తెలిసిన విషయమే. క్రొత్త విషయాలు ఎవ్వరికీ తెలియని విషయాలు వ్రాసినపుడు రెఫరెన్స్ కోస్ం కొన్ని లింకులివ్వవచ్చని నా అభిప్రాయం. నేను చంద్రకాంతరావు గారు తొలగింపు విధానాన్ని సమర్థిస్తాను. తెవికీలో సభ్యులైనా, నిర్వాహకులైనా నిబంధనలకనుగుణంగా నడుచుకోవాలి. ఈ వీలునామా వ్యాసం కోసం అనవసరమైన చర్చ లేవదీసారు. తెవికీ లో అభివృద్ధి చేయవలసిన అంశాలను ప్రక్కన పెట్టారు. మీరు చేయవలసిన మొదటి పేజీ నిర్వహణ ప్రక్కన పెట్టారు. అందులో ఆశక్తి కర అంశాలను లేకుండా చేసారు. మీరు లేవదీసిన చర్చలో మొదటి పాయింటులో ఎలాంటి స్పష్టత లేదు, మునుముందు దీనిపై కూడా చర్చలు జరిగే అవకాశముంది.పుస్తక రచయిత అయినంత మాత్రాన ఆ పుస్తకాన్నే ప్రామాణికంగా తీసుకోవాలనే నియమం లేదు. ఎందరొ వివాదాస్పద పుస్తకములు వ్రాస్తున్నారు.అనవసర అంశాలను స్వంత బ్లాగులలో పెడుతున్నారు. వాటిని ఎలా ప్రామాణికంగా తీసుకోవాలి. రెండో పాయింటు అసలు అవసరమే లేదు. ప్రకటనలు తెవికీ మూల నియమానికి విరుద్ధం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా చేర్చే అవసరం లేదు. మూడవ పాయింటు చూస్తే స్వయంగా కాకున్నా చేర్చేవారు మరోమార్గం ద్వారా చేర్చడానికి అవకాశం ఉంటుంది. నాలుగో పాయింటు ప్రకారం ఒక లింకు యిచ్చినట్లయితే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. ఐదవ పాయింటు స్పష్టత లేదు. నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు తొలిగించడానికి చర్చ అవసరమే ఉండదు. తెవికీలో నిర్వాహకుడైనా సభ్యుడైనా ఒక్కటే అని గ్రహించాలి. ఎవరు నిబంధనలకు విరుద్ధమైన అంశాలను చేర్చినా వాటిని తొలగించడనికి నిర్వాహకులుగా చంద్రకాంతరావు గారికి ఎంత బాధ్య ఉన్నదో అర్జున రావుకి అంతే బాధ్యత ఉన్నదని గ్రహించాలి. మీలో ఎవరైనా ఎవరు నిబంధనలకు విరుద్ధమైన అంశాలను చేర్చినా వేరొకరు తొలగించె బాద్యత తీసుకోవాలి. మీరు సభ్యుల కంటె అతీతులు కాదు కదా! కొంతమంది బ్లాగులకు అధిక ప్రాధాన్యత ఇస్తే కేవలం బ్లాగులింకుల కోసమే కొందరు వ్యాసాలు సృష్టించే ప్రమాదాన్ని కూడా మనం ముందే గ్రహించాలి. బయటి లింకుల కంటే లోపలి సమాచారంపైనే మనం దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. ఇతర నియమాలకు భంగం కలగకుండా, ప్రముఖులకు సంబంధించి ఉండి, బయట ఎక్కడా దొరకరాని సమాచారం ఉంటే, తెవికీ దృష్ట్యా అది అవసరం అనుకుంటే బ్లాగు బయటిలింకులు పెట్టడానికి ఇప్పటికే అవకాశం ఉంది కదా.(106.206.96.166 07:22, 6 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
చర్చలలో తమ అభిప్రాయాలు తెలిపే వారు సభ్యనామంతో చర్చిస్తే బాగుంటుంది. ఐపీ అడ్రస్ తో చర్చాపేజీలలో వ్రాసిననూ ప్రాధాన్యత ఉండదు. అంతేకాకుండా ఆ విషయాలను చర్చా పేజీల నుంచి పూర్తిగా తొలిగించవచ్చు కూడా. అలాగే ఒకరి చర్చా విషయాలను మరొకరు కాపీ చేయకుండా ఉంటే మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:00, 6 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వుటంకించిన పేజీలో ఒక వ్యాఖ్య మరియు ప్రతిపాదనలో స్పష్టతలేదని కొట్టివేయటమే తప్ప స్పందించని సహసంపాదకుల నిర్లిప్తత నాకు బాధ కలిగించింది. ఈ పరిస్థితిలో నేను ఈ ప్రాజెక్టులోనా క్రియాశీలతను తగ్గించుకోవటమే సరియైనదిగా నాకనిపిస్తున్నది. ఇప్పటివరకు నాచర్యలకు స్పందించి తెవికీ అభివృద్ధికి తోడ్పడిన వారందరికి కృతజ్ఞతలు. --అర్జున (చర్చ) 03:57, 14 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


గత కొన్ని రోజులుగా బ్లాగు లింకుల గురించి జరుగుతున్న చర్చ గమనించినా స్పందన తెలపక పోవడానికి కారణం నాకు మీ ఇద్దరి మీద ఉన్న గౌరవం. చంద్రకాంతరావుగారు విలువైనవ్యాసాలను అనేకం వ్రాసి తెవికీని సుసంపన్నం చేసారు. అర్జునరావుగారు తెవికీ వార్త సంచిక, మొదటి పేజి నిర్వహణ, వికిమీడియా భాధ్యతలు వంటి భాత్యాతాయుతమైన కార్యాక్రమాలు చేపట్టి వికీ అభివృధ్ధికి దోహదం చేసారు. అకాడమీలు నిర్వహించి తెవికీ ని ప్రజల మధ్యకుతీసుకు వెళ్ళారు. ఈ చర్చ అ కారణంగా వీరిలోఎవరు తమ సేవలు తగ్గించుకున్నా తెవికీ అభివృద్ధి కుటువడడం తథ్యం. ఇద్దరిలో ఎవరి మనసు నొప్పించడం ఇష్టపడక నేను ఈ చర్చలకు దూరంగా ఉన్నాను. అది కూడా వారి మనసును నొప్పించ వచ్చు. విలువైన సభ్యులు తెవికీకి దూరం కావడం తెవికీకి నష్టం కలిగిస్తుంది. ఫలితం ఎదురుచూడకుండా తెలుగు భాషకు సేవచేసే అవకాశం రావడం అపురూపం. మాతృ భాషకు సేవచేయడం మతృమూర్తికి సేవచేయడంతో సమానం. అది మనం ఐకమత్యంహా సంతోషంగా చేస్తాం.

  • ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. మనం బ్లాగు లింకులు గురించి మార్గదర్శకం తయారు చేయడం. దానిని అతిక్రమించకుండా నడుచుకుంటాము. మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నవి ఏవరు చేసినా తొలగించమని సభ్యులకు సూచిస్తాం. తొలగించడం వారి ఇష్టానికి వదిలి వేద్దాం. ఇలా చేయవచ్చేమో ఆలోచించండి.
  • చర్చలు మంచి చేస్తాయి. విమర్శ పనిని మరింత మెరుగు పరుస్తుంది. చర్చలు, విమర్శలు తెవికీ అభివృద్ధికి సాయపడేలా పాటుపడదాం.

--t.sujatha (చర్చ) 15:54, 16 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలుసా? శీర్షిక[మార్చు]

మొదటి పేజీలో భాగంగా ఉండే "మీకు తెలుసా?" శీర్షిక నిర్వహణపై పెద్దగా నియమాలు లేవు. ప్రారంభం నుంచి ఆ శీర్షికను ఎవరూ ఆసక్తిగా పట్టించుకోనందున నియమాలు కూడా ఏర్పడలేవు. ఐదేళ్ళ క్రితం నేను ఆ శీర్షిక నిర్వహణ ప్రారంభించి చాలా కాలం పాటు నిర్వహించాను. అప్పుడు అన్ని కొత్త వ్యాసాలు పరిశీలించి ఆహా! అనిపించే, ఆశ్చర్యకరమైన, వింతైన వాక్యాలను పట్టుకొని ఈ శీర్షికలో పెడుతూ ప్రతి ఆదివారం రాత్రి తప్పనిసరిగా మార్చేవాడిని. పాత భండారము 2, (3లో చాలావరకు) నేను నిర్వహించిన కాలం నాటి వాక్యాలు చూడవచ్చు. ఇటీవల కాలంలో వాక్యాలకు చివరన వ్యాసం ప్రారంభించినవారు లేదా వ్యాసకర్త అని పేరు ఇవ్వడం, సభ్యులు స్వయంగా తమ వాక్యాలనే ఆ శీర్షికలో పెట్టడం (పెట్టుకోవడం)తో (చూడండి), ఇతర సభ్యుల లేదా తమకు నచ్చని సభ్యుల/వ్యాసాలపై వివక్ష చూపడం (కొన్ని మాసాలుగా దీన్ని పరిశీలిస్తున్నాను) తదితరాలతో మునుముందు దీనిపై ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశముంది. అంతే కాకుండా ఈ శీర్షికలో ఒక్కో వ్యాసం నుంచి ఒక్క వాక్యం మాత్రమే పెట్టవల్సి ఉండగా, పేరా మాదిరిగా పెట్టడంతో మొదటి పేజీలో శీర్షిక చాలా పెద్దదిగా కనిపిస్తోంది. వాక్యం చివరన వ్యాసం పేరు ఉంచితే సంబంధిత విషయం గురించి తెలుసుకొనేవారికి ఎలాగూ అవకాశం ఉంటుంది కాబట్టి శీర్షిక సంక్షిప్తంగా, మధురంగా ఉండాలంటే వ్యాసం నుంచి ఒక్క ముఖ్యమైన వాక్యం సరిపోతుందనుకుంటాను. అలాగే శీర్షికలో ఎన్ని వాక్యాలుండాలు?, ఎప్పుడు మార్చాలి, ఎవరు/ఎందరు మార్చాలి?, సభ్యులు స్వయంగా తాము సృష్టించిన వ్యాసాలలోని వాక్యాలను పెట్టుకోవచ్చా? ఒకే కొత్త వ్యాసంపై ఇద్దరు, ముగ్గురు సభ్యులు కృషిచేస్తే ఏ వాక్యాలు తీసుకోవాలి? వాక్యాలకు బదులు వ్యాసాల లింకులు పెట్టవచ్చా? తదితర నియమావళికై సభ్యుల అభిప్రాయాలు కోరబడుచున్నది. ఇది మొదటిపేజీకి సంబంధించినది కాబట్టి సభ్యులు తమ విలువైన అభిప్రాయాలు, ప్రతిపాదనలు త్వరలో తెలియజేస్తే దానిపై మళ్ళీ ఓటింగుకు పెట్టి నియమాలు ఖరారు చేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:14, 5 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ ప్రారంభించినందులకు ధన్యవాదాలు. దీనిని పునరుద్ధరించటంలో నా పాత్ర వున్నందున మరియు తెవికీ ఇది ముఖ్యమైనదని నా అభిప్రాయం కనుక నా అభిప్రాయాలు తెలియచేస్తాను. మొదటిపేజీ మెరుగుచేయాలన్నకోరికగలిగినప్పుడు కొన్ని భాషల మొదటిపేజీలు పరిశీలించడం ప్రస్తుతమున్నదానిపరిమితులు విశ్లేషించాను. ఈ వారపు బొమ్మలో ఛాయాచిత్రానికి దానికి కర్తలైనవారికి గుర్తింపు ప్రముఖంగా ఇస్తూ, వ్యాస పాఠ్యానికి కృషి చేసేవారికి మొదటి పేజీలో గుర్తింపు లేదని గమనించాను. తమిళ వికీలో మొదటిపేజీలో వికీ రచయితల పరిచయాలు శీర్షికగా గుర్తింపు ఇస్తున్నారు. అందుకని మీకు తెలుసాలో వ్యాసకర్తకు గుర్తింపు ప్రారంభించాను. మొదట కొత్త వ్యాసాలను మాత్రమే పొందుపరిచేటప్పుడు వ్యాసాన్ని ప్రారంభించినవారు అని రాస్తే సరిపోయేది. అయితే కొన్నిఆసక్తి కలిగించే కొత్త విషయాలు పాత వ్యాసాలను బాగా విస్తరించినప్పుడు కూడా కనబడతాయి. అందుకని వ్యాస విషయకర్త అని మార్చాను. సరిగా చెప్పాలంటే కొత్త విషయం చేర్చిన వ్యక్తి అని ఇవ్వాలి. ఈ పద్ధతివలన కొంత ప్రయోజనం కలిగిందని నమ్ముతాను. ఇక క్రిందటి సంవత్సరం దీని నిర్వహణకు అభ్యర్థించినప్పుడు పెద్దగా స్పందన రాలేదు. చాలావరకు నేను, రాజశేఖర్ గారి సహాయంతో క్రిందటి సంవత్సరం నిర్వహించటం జరిగింది. నిర్వహించేటప్పుడు నేను ఏదైన ప్రముఖమైన వ్యాసం చేర్చితే ఆ ‌‌విషయం నేనే చేర్చటం జరిగింది. అయితే దీనివలన నా గుర్తింపుని పెంచుకోవాలన్న ఆరాటం కాదని తెలియచేస్తున్నాను. క్రిందటి సంవత్సరం దీనిని వారం వారం మార్చుదామన్న ఆలోచనవున్నా, నా ధ్యాసం ఈ వారపు వ్యాసం, ఈ వారపు బొమ్మ పైన వున్నందున నాకు ఖాళీసమయం దొరికనప్పుడు సాధారణంగా వారానికోసారి మారుస్తూ వచ్చాను. నా నిర్వహణలో ఏదైనా లోటుపాట్లు వుంటే నాకున్న పరిమితుల దృష్ట్యా అదియాదృచ్ఛికమే తప్ప రాగద్వేషాల వలన జరిగినవి కావని తెలియచేస్తున్నాను --అర్జున (చర్చ) 00:02, 6 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ ప్రారంభించినందుకు ధన్యవాదాలు: నేను గత రెండు నెలలుగా వాడుకరిని. మొదటి పేజీలో "మీకు తెలుసా!" అనే విభాగం లో మంచి ఆశక్తి కరమైన విషయాలు లేనట్లు గమనించితిని. గత రెండునెలలుగా ఐదు లేదా ఆరు అంశాలనే ఉంచారు. కొన్ని సందర్భాలలో విశేష విషయం కాని సెలవుల జాబితాను ఉంచారు. తెవికీలో ఎన్నో ఆశక్తికరమైన విషయాలున్నప్పటికీ వాటిని చేర్చడంలో నిర్వహణ లోపం కనబడుతున్నది. ఒకరు మొదటి పెజీలో అంశాలను చేయలేనపుడు విభాగాలను విభజన చేస్తే మంచిదని నా అభిప్రాయం. "మీకు తెలుసా" విభాగంలో వ్యాస విషయ కర్తలుగా వాడుకరుల పేర్లను ఉంచడం సబబుగా ఉండదని నా అభిప్రాయం. ఎందువలనంటే అనామక వాడుకరులు లేదా కొంతమంది వాడుకరులు కొత్త పేజీలు సృష్టించడం కోసం ఒక సంబంధం గల లేదా సంబంధం లేని విషయాన్ని ఒక వాక్య వ్యాసం గా చేరుస్తున్నారు. వ్యాసాన్ని కొన్ని గంటలు శ్రమపడి దానిని అభివృద్ధి చేసిన క్రియాశీల వాడుకరులుంటారు. ఎంతో శ్రమపడి వ్యాసాన్ని అభివృద్ధి చేసినవారు వారి పేరు వ్యాసవిషయ కర్తగా లేదని బాధపడే అవకాశం ఉంది. దీనివల్ల వాడుకరుల మధ్య స్పర్థలు వస్తాయని నా అభిప్రాయం."మీకు తెలుసా" విభాగాన్ని నిర్వహకులే నిర్వహించాలి. కాని వాడుకరులకు కూడా స్వేచ్చ నివ్వాలి. "ఈవారం వ్యాసం" "ఈవారం బొమ్మ" లకు యేవిధంగా వారాలను నిర్దేశించారొ అదే విధంగా దీనిని నిర్వహించండి. వాడుకరులకు వారు గమనించిన ఆశక్తికర అంశాలను భండారములో చేర్చే అవకాశం యివ్వండి. నిర్వాహకులు వాడుకరులు చేర్చిన విషయాలలో ఆశక్తి కలిగించే అంశాలను గుర్తించి ప్రతి వారం చేర్చండి. కాని నేరుగా ఆ విభాగంలోనికి వెళ్ళి మార్చే అవకాశం యివ్వకపోవడమే మంచిదని నా అభిప్రాయం.( కె.వి.రమణ- చర్చ 05:10, 6 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

నేనుకూడా కె.వి.రమణ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.పాలగిరి (చర్చ) 06:42, 6 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వారం రోజులు గడిచిననూ ఎలాంటి నియమాలు రూపుదిదుకోలేవు. వ్యాసవిషయ కర్తల పేరు ఉండటం సబబుకాదని మాత్రం వ్యక్తం చేశారు. అలాగే భండారములో ఉన్న విషయం ప్రకారం ఇక్కడ పేరాలమాదిరిగా కాకుండా వాక్యాలు మాత్రమే ఉండాలి. కాబట్టి శీర్షికలోని విషయాలను నేను ఆ విధంగా మార్పు చేస్తున్నాను. శీర్షికలోని విషయాలను ఒక కాలం ప్రకారం నిర్వహిస్తే బాగుంటుంది. నేణు తెవికీ సెలవు నుంచి బయటకు వచ్చిన పిదప ఈ శీర్షికను పూర్తిస్థాయిలో నిర్వహించగలను. దీనికి సంబంధించిన ముసాయిదా నియమావళిని కూడా రూపొందిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:55, 12 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


చంద్రకాంత రావుగారూ ! మీరు మొదటి పేజీ నిర్వహణ వంటి బాధ్యతాయుతమైన కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. భంఢాగారంలో వ్యాసాలను పేర్కుంటె చాలు వ్యాసకర్తలతో పని లేదు. పూర్తి వ్యాసం చూసినప్పుడు వ్యాసకర్తలను తెలుసుకుంటారు. మిగిలిన మార్పులు మీరు అనుకున్నట్లు చేయండి . అప్పుడే స్వతంత్రంగా పని చేయవచ్చు. వీటికి కూడా మార్గదర్శకాలను తయారు చేసుకుంటే మంచిది. తెవికీకి మీ సహకారాన్ని ఇలాగే అందించాలని కోరుకుంటున్నను. --t.sujatha (చర్చ) 16:07, 16 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Be a Wikimedia fundraising "User Experience" volunteer![మార్చు]

Thank you to everyone who volunteered last year on the Wikimedia fundraising 'User Experience' project. We have talked to many different people in different countries and their feedback has helped us immensely in restructuring our pages. If you haven't heard of it yet, the 'User Experience' project has the goal of understanding the donation experience in different countries (outside the USA) and enhancing the localization of our donation pages.

I am (still) searching for volunteers to spend some time on a Skype chat with me, reviewing their own country's donation pages. It will be done on a 'usability' format (I will ask you to read the text and go through the donation flow) and will be asking your feedback in the meanwhile.

The only pre-requisite is for the volunteer to actually live in the country and to have access to at least one donation method that we offer for that country (mainly credit/debit card, but also real time banking like IDEAL, E-wallets, etc...) so we can do a live test and see if the donation goes through. **All volunteers will be reimbursed of the donations that eventually succeed (and they will be very low amounts, like 1-2 dollars)**

By helping us you are actually helping thousands of people to support our mission of free knowledge across the world. If you are interested (or know of anyone who could be) please email ppena@wikimedia.org. All countries needed (excepting USA)!!

Thanks!

Pats Pena
Global Fundraising Operations Manager, Wikimedia Foundation

Sent using Global message delivery, 21:19, 8 జనవరి 2013 (UTC)

పరిపూర్ణానంద స్వామి రథయాత్ర[మార్చు]

ఇలాంటి వ్యక్తిగత ప్రచారప్రకటనలు రచ్చబండలో వ్రాయడం సముచితం కాదని నాభావన.ఒకమతానికి చెందిన ప్రచారంలా కన్పిసున్నది పైవాఖ్య. ఇలాంటి వాటికి తెవికీని ప్రచారమాద్యంగా వాడరాదు. పాలగిరి (చర్చ) 17:02, 9 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మత ప్రచారానికి తెవికీని వినియోగించరాదని నా అభిప్రాయం. నేను పాలగిరి గారి భావనతో ఏకీభవిస్తున్నాను.( కె.వి.రమణ- చర్చ 17:19, 9 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
తెవికీ ప్రచార వేదిక కాదు, కారాదు కూడా. అందుకే పైన వ్రాసిన ప్రచారవ్యాఖ్యను హైడ్ చేశాను. తెవికీ నియమాలకు లోబడి వ్యాసం మాత్రం ఉండవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:47, 9 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీకిక చిన్న సెలవు[మార్చు]

అర్జునరావు ఏకపక్ష ధోరణికి నిరసగా కొంతకాలం పాటు తెవికీ సెలవులోకి వెళ్ళుచున్నాను. తాను చేసింది మాత్రమే సరైనదనే సభ్యునితో ఇక నేను వివరించే దశలో లేను. ఒకసారి వివరించిననూ అర్థంచేసుకొననివారికి ఇక కొత్తగా చెప్పేదేముంది? వ్యాసాలు కావచ్చు, ప్రాజెక్టు పేజీలు కావచ్చు ఇక్కడ ఎవరు సృష్టించిననూ మరెవరైనా మార్పు చేయవచ్చనే ఆలోచన కూడా లేకుండా పోయే సభ్యులతో ఇక కలిసి పనిచేసే అవసరం ఉండదనుకుంటున్నాను. కొత్త సభ్యులకు వివరించాల్సిన నియమాలు కూడా ఇన్నేళ్ళ సభ్యునికి కూడా మరీమరీ చెప్పే పరిస్థితికి రావడం శోచనీయం. తెవికీ అంతా తానే నిర్వహిస్తున్నట్లు భావించడం మిగితా సభ్యులను నిర్లక్ష్యపర్చినట్లుగానే భావించవలసి ఉంటుంది. తాను మొదటి పేజీ నిర్వహిస్తున్నట్లు, దాన్ని మెరుగుపర్చినట్లుగా చెప్పుకోవడం ఇదివరకు కాసుబాబు గారి నిర్వహణను చిన్నచూపు చూసినట్లే. ఎన్నో ఏళ్ళుగా మొదటి పేజీ శీర్షికలను ఎంతో బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా నిర్వహించిన కాసుబాబుగారిని బలవంతంగా ఆపుచేయించి (చూడండి) తన చేతులోకి తీసుకొని సీనియర్ సభ్యులు ఎవరూ చురుగ్గా లేరని మొదటి పేజీని తన ఇష్టమున్నట్లుగా మార్చుకొని (ఏకపక్షంగా మార్చిన దాన్ని నేను అడ్డుతగిలినందుకే నా పై కోపం) ఇప్పుడు ఆధునికీకరణ చేస్తున్నట్లు చెప్పుకోవడం మిగితా సభ్యులందరికీ బాధాకరమైన విషయం. నియమాలకు విరుద్ధంగా చేసిననూ తనకెవరూ అడ్డు చెప్పరాదనీ, తప్పని పరిస్థితిలో నేను చెప్పినా అది తెవికీ అభివృద్ధికి నిరోధకమని కొత్త కొత్త భాష్యాలు వల్లించడం ఆయనకే చెల్లింది. సైడ్ బార్ లో మార్పులు, రచ్చబండను మొత్తంగా తొలిగించడం, మొదటిపేజీ శీర్షికలన్నీ కిందికి మీదికి చేయడం, ఎందరికో మార్గదర్శకంగా (తమ గ్రామాలు చేరుకోవడానికి వీలుగా) ఉన్న "వికీపీడియాలో మీ ఊరు ఉందా?" లింకును ఎటువంటి సందేశం లేకుండా మాయం చేయడం దారుణమైన విషయంగా చెప్పుకోవాల్సియుంటుంది. రాష్ట్రస్థాయిలో ఉన్నత పదవులో ఉన్నవారి వ్యాసాలు ప్రాధాన్యత లేనివనీ, అలాంటివి తొలిగించాలని చెప్పిన సంగతి అందరికీ తెలుసు. తనకు ఇష్టం లేని వివరాలు చేర్చితే చివరకు పోలీసుల పేరుతో బెదిరించడం కూడా జరిగిందని ఇక్కడి సభ్యులకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. గ్రామవ్యాసాలు "కొత్తోక వింత"నట, గ్రామవ్యాసాలపై తనకు ఇష్టం లేకుంటే మిగితావారు కృషిచేస్తారు, అంతేకాని వాటిని చేరడానికే కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వకుంటే గ్రామవ్యాసాలు అభివృద్ధి ఎలా చెందుతాయి? తెవికీ అందరిదీ అనే విషయం గుర్తించుకోకుండా స్వంతబ్లాగు లాగా వ్యవహరించడం పద్దతికాదు. తాను ఎన్నయినా మార్పులు చేయవచ్చట, ఆ మార్పులను ఇతరులు సరిదిద్దడానికి మాత్రం చర్చించాలట ! వెబ్ చాట్ నిర్వహణ కాని, తెవికీ వార్త నిర్వహణకాని అంతా ఏకపక్షంగానే జరిగింది. చాటింగ్ లో అంతా తాను చెప్పినదే చర్చించాలట! నేనొక సారి రాజశేఖర్ గారితో మాట్లాడుతుంటే వారించిన సంగతి రికార్డులో చూడవచ్చు. ఆ తర్వాత మళ్ళీ చాట్ వైపు తలెత్తి చూడలేను. తెవికీ అనే భవన నిర్మాణంలో అందరూ సమానులేనని నేను ఇదివరకు చెప్పిన విషయం గుర్తించుకుంటే మంచిది. చర్చను కూడా సంవాదముగా పేర్కొన్న విషయం సభ్యులకు తెలుసు. చివరగా, గత 5 సంవత్సరాలకు పైగా నాకు సహకారాలు అందించిన వైజాసత్య, కాసుబాబు, దేవా, రాజశేఖర్, మాటలబాబు, రంగారావు, నిసార్ అహ్మద్, సుజాత, విశ్వనాథ్, రవిచంద్ర, తలపాగల రాజు, వీరా, కుమారరావు లాంటి సభ్యులందరికీ, ప్రస్తుతం చురుకుగా ఉన్న కొత్త సభ్యులకూ ధన్యవాదాలు తెలుకుంటున్నాను. అయితే నేను తెవికీ నుంచి పూర్తిగా విరమించుకోవడం లేదు, ఇది సెలవు మాత్రమే. చర్చలలో మాత్రం వీలుచూసుకొని అవసరమైతే పాల్గొంటాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:37, 17 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


చంద్రకాంతారావుగారు,

తెవికి అభివృద్ధికి కృషిచేసిన సీనియరు సభ్యులలో మీరుఒక్కరు.ప్రస్తుతం తెవికీలో చురుకుగా,సమర్ధవంతంగా పాల్గొంటున్న సినియరు సభ్యులసంఖ్యతక్కువగా వుంది.మాలాంటి కొత్తసభ్యులకు మార్గదర్శకులుగావుంటూ,సలహ లివ్వవలసిన మీవంటి సినియర్లు సెలవుమీదవెళ్ళాలని నిర్ణయించడం భాధాకరం.వ్యక్తిగతంగాకాకుండా,తెవికి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని,మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి.పాలగిరి (చర్చ) 01:10, 18 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


చంద్రకాంతరావు గార్కి, నమస్కారములు,

మీరు, అర్జున గారు, రాజశేఖర్ వంటివారు తెవికీ లో సీనియర్ సభ్యులు మరియు మా వంటి నూతన సభ్యులకు మార్గ నిర్దేశకులు. మేము తెవికీ లో రచనలు చేసేటప్పుడు మీవంటి వారి సలహాలను పొందుతున్నాం. ఒక సంస్థ అభివృద్ధికి కృషి చేసే వారు, ఒక ఆశయం కోసం పనిచేసే వారు అయిన మీరు చిన్న చిన్న విషయాలకు స్పర్థలకు గురై తెవికీ నుండి సెలవు తీసుకోవడం మాకు మానసిక క్షోభకు గురి చేస్తుంది. మీవంటి వారి అడుగు జాడలలో పని చేస్తున్న అనేక మంది సభ్యులు ఉన్నారని దృష్టిలో ఉంచుకోండి. తెవికీలో మీరిద్దరు సీనియర్ సభ్యుల మధ్య గలిగిన చిన్న స్పర్థ మిమ్మల్ని తెవికీ నుండి సెలవు తీసుకొనేట్లు చేయడం శోచనీయం. చిన్న కుటుంబం లోనే చిన్న చిన్న స్పర్థలు వస్తాయి. అనేక సభ్యులు గల తెవికీ లో విభిన్న వ్యక్తిత్వం గల వ్యక్తులుంటారు. అందులో స్పర్థలు రావటం సహజం. వాటిని సామరస్యంతో పరిష్కరించుకొని తెవికీ అభివృద్ధికి కృషి చేయడం భావ్యమని నా అభిప్రాయం. మనకు వ్యక్తిగత అభిప్రాయాలు కాదు ముఖ్యం. సంస్థ ప్రయోజనాలని గుర్తించి మా కందరికీ మార్గ దర్శకులుగా ఉండాలని భావిస్తున్నాను. దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోవలను హృదయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.( కె.వి.రమణ- చర్చ 01:39, 18 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా ఏ పక్షాన్ని సమర్ధించడం నాకిష్టం లేదు, కానీ తోటి సభ్యునితో స్పర్ధల వల్ల విరమించుకోవటం విచారకరం --వైజాసత్య (చర్చ) 06:05, 31 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimedia sites to move to primary data center in Ashburn, Virginia. Read-only mode expected.[మార్చు]

(Apologies if this message isn't in your language.) Next week, the Wikimedia Foundation will transition its main technical operations to a new data center in Ashburn, Virginia, USA. This is intended to improve the technical performance and reliability of all Wikimedia sites, including this wiki. There will be some times when the site will be in read-only mode, and there may be full outages; the current target windows for the migration are January 22nd, 23rd and 24th, 2013, from 17:00 to 01:00 UTC (see other timezones on timeanddate.com). More information is available in the full announcement.

If you would like to stay informed of future technical upgrades, consider becoming a Tech ambassador and joining the ambassadors mailing list. You will be able to help your fellow Wikimedians have a voice in technical discussions and be notified of important decisions.

Thank you for your help and your understanding.

Guillaume Paumier, via the Global message delivery system (wrong page? You can fix it.). 15:44, 19 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]