వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 35

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 34 | పాత చర్చ 35 | పాత చర్చ 36

alt text=2014 సెప్టెంబరు 2 - 2014 నవంబరు 10 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2014 సెప్టెంబరు 2 - 2014 నవంబరు 10

Grants to improve your project[మార్చు]

Apologies for English. Please help translate this message.

Greetings! The Individual Engagement Grants program is accepting proposals for funding new experiments from September 1st to 30th. Your idea could improve Wikimedia projects with a new tool or gadget, a better process to support community-building on your wiki, research on an important issue, or something else we haven't thought of yet. Whether you need $200 or $30,000 USD, Individual Engagement Grants can cover your own project development time in addition to hiring others to help you.

తెవికీ సమూహంలో ఇండివిజువల్ ఎంగేజ్ మెంట్ గ్రాంట్స్ ప్రోగ్రాం[మార్చు]

ఈ ప్రోగ్రాం క్రింద మన తెవికీ సభ్యులు ఎందుకు ఉత్సాహం చూపడం లేదు? అహ్మద్ నిసార్ (చర్చ) 20:08, 21 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా సభ్యుల కృషి[మార్చు]

గతంలో M.ప్రదీప్ గారు, వికీపీడియా:తెలుగు వికీపీడియా సభ్యుల కృషి అనే పేజీ నిర్వహించేవారు. అందులో గత 30 రోజులుగా తెలుగు వికీపీడియాలో సభ్యులు చేసిన మార్పులపై విశ్లేషణలు ఉండేవి. అవి బాట్లద్వారా రిఫ్రెష్ అవుతూ ఉండేవి. ఎవరైనా ఆపేజీని నిర్వహించగలరా? అహ్మద్ నిసార్ (చర్చ) 22:17, 2 సెప్టెంబరు 2014 (UTC) [1] వద్ద చూడగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:29, 4 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Change in renaming process[మార్చు]

Part or all of this message may be in English. Please help translate if possible.

-- User:Keegan (WMF) (talk) 16:22, 9 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

VisualEditor available on Internet Explorer 11[మార్చు]

VisualEditor will become available to users of Microsoft Internet Explorer 11 during today's regular software update. Support for some earlier versions of Internet Explorer is being worked on. If you encounter problems with VisualEditor on Internet Explorer, please contact the Editing team by leaving a message at VisualEditor/Feedback on Mediawiki.org. Happy editing, Elitre (WMF) 07:29, 11 సెప్టెంబరు 2014 (UTC).[ప్రత్యుత్తరం]

PS. Please subscribe to the global monthly newsletter to receive further news about VisualEditor.

వికీమీడియా ఫౌండేషన్ వారి వ్యూహరచన సమావేశంలో పాల్గొనడం[మార్చు]

గత ఒకటిన్నర ఏళ్లుగా నేను తెవికీలో చురుగ్గా పాల్గొంటున్నాను. రాబోయో రోజుల్లో తెవికీ అభివృద్ధిలో ఇంకా చురుగ్గా పాల్గొనదలచాను. అయితే భవిష్యత్తులో భారతదేశంలో వికీపీడియా గతివిధులు గురించిన చర్చలో నేను పాల్గొనాలని అనిపించింది. అందుకని నా పాల్గొనే ఆకాంక్షను పవన్ సంతోష్ కి తెలుపగా అతను నా పేరును మెటావికీ లో ప్రస్తావించాడు. అతనికి ధన్యవాదాలు. నేను స్వయం ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనదలచాను. Pranayraj1985 (చర్చ) 17:28, 12 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తగిన అనుభవం సాధించటము జరిగింది. కావున నేను వ్యూహరచన సమావేశంలో పాల్గొనదలచాను.--గుళ్ళపల్లి 02:32, 15 డిసెంబరు 2014 (UTC)

సెప్టెంబరు నెల మొలకల జాబితా[మార్చు]

సెప్టెంబరు నెల మొలకల జాబితా ను రహ్మానుద్దీన్ గారు విడుదలచేశారు. పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:35, 15 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలు రచించేందుకు కొత్త సోర్సులు[మార్చు]

మిత్రులకు నమస్కారం,
తెవికీలో వ్యాసాలు అభివృద్ధి చేసేందుకు కాస్త సోర్సుల కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో తెవికీలో వికీమీడియా సహకారంతో తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు ప్రారంభించిన విషయం తెలిసిందే. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలను జాబితా చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులో పుస్తకాలను జాబితా చేస్తూ పుస్తకం ఉన్న డీఎల్‌ఐ లింకులు, రచయిత పేరు, గ్రంథం విభాగం, వివరాలు వంటి వాటివి ఇస్తున్నాము. ఈ పుస్తకాలను వినియోగించుకుని వ్యాసాలు అభివృద్ధి చేయడం, కొత్తవి తయారు చేయడం దీని పరమలక్ష్యం. ఈ క్రమంలో మరో ముందడుగుగా నేను, రాజశేఖర్ గారూ చర్చించుకుని వికీపీడియన్లు తేలికగా వ్యాసాలు అభివృద్ధి చేసేందుకు కాపీరైట్ పరిధిలో లేని పుస్తకాలకు సంబంధించిన పేజీల్లో ఆయా పుస్తకాల ముందుమాటలు, విషయసూచికలు, కవర్‌పేజీ, లోపలి వివరాల పేజీలను కొత్తగా తయారుచేసే వ్యాసాల్లో చేర్చనున్నాము. శ్రీమాధవాచార్య విద్యారణ్యస్వామి (నాటకం), మాలతి (నాటకం), మాళవికాగ్నిమిత్రము (కందుకూరి వీరేశలింగం) వంటి పుస్తకాల గురించి తయారుచేసిన చిరువ్యాసాల్లో సంబంధిత పుస్తకాల వివరాలున్న పేజీలు చేర్చాము. సహ సభ్యులు వీలున్నంతవరకూ ఆయా వ్యాసాల్లో చేర్చిన పేజీలు చూసి వివరాలతో అభివృద్ధి చేయగలరని ఆశిస్తున్నాము.
--పవన్ సంతోష్ (చర్చ) 13:01, 16 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విషయ ప్రాముఖ్యత - పుస్తకాలు[మార్చు]

ప్రతి వ్యక్తికీ వికీలో పేజీ లేనట్టే, వికీలో ప్రతి ప్రచురించిన పుస్తకానికీ పేజీ అవసరం లేదు. ఇక్కడా విషయప్రాముఖ్యత నియమాలు వర్తిస్తాయి. ఆలోచించండి --వైజాసత్య (చర్చ) 11:27, 19 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 12:59, 19 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ పేజీల చరిత్రను తరలించడం సాధ్యమేనా?[మార్చు]

ఇదివరకే సృష్టించిన పేజీ సమాచారాన్ని వేరొక పేజీకి తరలించినపుడు ఆ పేజీ చరిత్రను కూడా తరలించడానికి వీలవుతుందా? ఉదాహరణకు నియంతలు అనే పేజీలోని సమాచారాన్ని నియంత అనే పేజీలోకి తరలించాను. కానీ దీని చరిత్ర మాత్రం తరలిపోలేదు. ఇది సాధ్యమయ్యేపనియేనా? సభ్యులు సందేహ నివృత్తి చేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:30, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీలు విలీనాలు చేయునపుడు వ్యాస చరిత్రలు కూడా విలీనం చేయవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 09:27, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు రమణ గారు. చరిత్రని ఎలా విలీనం చేయవచ్చునో దయచేసి తెలుపగలరు. నాకైతే ఇటువంటి ఆప్షన్ ఇప్పటివరకు కనిపించలేదు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:12, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక వ్యాసంలోని విషయం వేరొక వ్యాసంలో విలీనం చేయవలసి వచ్చినపుడు, సంబంధిత విలీన మూసను ఉంచిన తదుపరి చర్చ జరిగిన తర్వాత విలీనం చేయవచ్చుననే అభిప్రాయానికి వచ్చిన తర్వాత నిర్వాహకులు ఏ వ్యాసం విలీనం చేయవలెనో ఆ వ్యాసంలోని విషయాన్ని కాపీ,పేస్టు ద్వారా సంబంధిత వ్యాసంలో ముందుగా చేర్చాలి. ఆ తర్వాత వ్యాస చరిత్రలను విలీనం చేసే ఆఫ్షన్ ఉపయోగించి నిర్వాహకులు మాత్రమే చరిత్రలను విలీనం చేయగలరు. ప్రస్తుత వ్యాసం విషయంలో నియంత అనే వ్యాసం రాజశేఖర్ గారు 3 డిసెంబరు 2008‎ న సృష్టించారు. నియంతలు అనే వ్యాసాన్ని రెడ్డి గారు 18 సెప్టెంబరు 2014‎ న సృష్టించారు. ఈ పేజీలను మీరు దారిమార్పులు చేశారు. ఈ రెండు వ్యాస చరిత్రలను విలీనం చేస్తే నియంతలు అనే వ్యాసంలో మొట్టమొదటగా 2008 లో సృష్టించిన వారు మరియు యితరుల వ్యాస చరిత్ర వస్తుంది. ఆ తరువాత 2014 లో చేర్చిన వారు మరియు యితరుల వ్యాస చరిత్ర వస్తుంది.ఈ విధంగా చేసిన యెడల ఈ వ్యాసం యొక్క సృష్టికర్త రాజశేఖర్ గారి పేరు మీద వస్తుంది.---- కె.వెంకటరమణ చర్చ 16:01, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను రమణ గారూ . రెడ్డిగారు సృష్టించిన నియంతలు అనే వ్యాసాని పేరు మార్పు ప్రతిపాదన ఇప్పటికే ఆ వ్యాస చర్చా పేజీలో చేర్చాను. దీనికి నియంత అనే పేరైతే సమంజసంగా ఉంటుంది. అలాగే నియంతృత్వం నుంది కూడా ఒక లంకె వేయవచ్చు. కానీ నియంత అనే పేజీ ఇదివరకే ఉన్నది కానీ సినిమా పేరుకు దారిమార్పు చేయబడిఉన్నది. రాజశేఖర్ గారి అనుమతితో ఈ తరలింపు చేస్తే సమంజసంగా ఉంటుంది. అలాగే రెడ్డి గారికి అన్యాయం చేయకుండా వారి క్రెడిట్స్ వారికి ఇచ్చేస్తే ఎలాంటి బాధ ఉండదు. మీరు సరైన పరిష్కారాన్ని సూచించాలని కోరుతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:07, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ గారూ, ప్రస్తుతం నియంత అనే వ్యాసం రాజశేఖర్ గారు ప్రారంభించినప్పటికీ దానిని నియంతలు అనే వ్యాసానికి దారిమార్పు చేశారు. అది సరిపోతుందని నా అభిప్రాయం. యిపుడి నియంతలు వ్యాసం యొక్క సృష్టికర్త "రెడ్డి" గారు పేరుమీదనే ఉంటుంది.ప్రస్తుతం రెడ్డిగారి క్రెడిట్స్ వారికే చెందుతాయి. ప్రస్తుతం వ్యాసచరిత్రల విలీనం అవసరం లేదని నా అభిప్రాయం. ఒకవేళ సదరు సభ్యులిద్దరూ కోరితే విలీనం చేయవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 16:20, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రమణ గారూ, బహువచనమైన నియంతలు కన్నా ఏకవచనమైన నియంత అనేదే సరైన శీర్షిక అని నా అభిప్రాయము. మీరు ఉదాహరణకు కుక్క వ్యాసాన్ని తీసుకుంటే కుక్క గురించిన సమాచారము కుక్క వ్యాసంలో ఉన్నది. కుక్కలు అనే వ్యాసం నుంది కుక్క వ్యాసానికి దారిమార్పు ఉన్నది. నియంతలు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. కేవలం క్రెడిట్స్ విషయంలో రాజీపడి వ్యాసం సరైన పేరుమీద లేకపోవడము ఆవేదన కలిగిస్తున్నది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:25, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మీరన్నట్లు ఏక వచనంలోనే ఉన్న నియంత వ్యాస శీర్షిక సరియైనది. పద్దతి ప్రకారమైతే ముందుగా సృష్టింపబడిన వ్యాసం అయిన నియంత వ్యాసంలోనికి ప్రస్తుతం ఉన్న నియంతలు వ్యాసం విలీనం చేయాలి.నియంతలు వ్యాసాన్ని నియంత కు దారిమార్పు చేయాలి. నియంతలు వ్యాస చరిత్రను నియంత వ్యాస చరిత్రలో చేర్చాలి. ఆ విషయం రెడ్డిగారికి తెలియని విషయం కాదు. యిదివరకు ఒకసారి నేను గణిత శాస్త్రంలో వ్యాసము (గణితం) అనే వ్యాసం పూర్తి విషయాలాతో రాసాను. అంతకు ముందు రెడ్దిగారు అడ్డుకొలత అనే వ్యాసం వ్రాసారు. ఈ రెండు వ్యాసాల విలీనం కోసం ఆయన నేను వ్రాసిన వ్యాసాన్ని అడ్డుకొలత వ్యాసంలో విలీనం చేయమని అనేకసార్లు చర్చించారు. అప్పటి చర్చ ను మీరు చూడవచ్చు. నేను నిర్వాహకునిగా అయిన వెంటనే నేను నృష్టించిన వ్యాసాన్ని ఆయన వ్యాసంలో విలీనం చేశాను.చర్చ:వ్యాసం (గణిత శాస్త్రము) చూడండి. ఆ చర్చ ప్రకారం ముందుగా సృష్టించిన వారి పేజీలోనికి తర్వాత వ్యాసం యొక్క సమాచారాన్ని చేర్చవచ్చని నా అభిప్రాయం.దానికి ఇద్దరు సభ్యులు అంగీకరిస్తే మంచిది. ---- కె.వెంకటరమణ చర్చ 16:47, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అవసరమైన వికీ పేజీలను విలీనం చేసినట్లే, ఆ రెండు పేజీల చరిత్రను కూడా విలీన పేజీలో పొందుపర్చడం మంచి సాంప్రదాయమని నా అభిప్రాయం. పేజీల చరిత్ర విలీనం చేయకపోవడమన్నది వ్యాసాల విలీనానికి అవరోధంగా కూడా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో నేను ఎలకూచి బాలసరస్వతి పేరుతో ఒక వ్యాసాన్ని ప్రారంభించాను. తరువాత దానిని ఏలకూచి బాలసరస్వతి లో విలీనం చేశారు. తరువాత మళ్ళీ ఏలకూచిని→ ఎలకూచిలోకి మార్చినా ఎక్కడా నా దిద్దుబాట్లు కనిపించలేదు. ఇటీవల పప్పూరు రామాచార్యులు ← పప్పూరి రామాచార్యులు విలీన విషయంలోనూ ఇదే పునరావృతమైంది. రేటూరి రంగరాజు, రెంటూరి రంగరాజు వ్యాసాల విలీన జాప్యంలోనూ, మరెన్నో వ్యాసాల విలీనంలోనూ ఈ అంశానిది నిర్ణాయక పాత్ర అని నేననుకుంటున్నాను. ఈ విషయంలో వికీ నిర్వాహకులు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.Naidugari Jayanna (చర్చ) 18:46, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నాయుడుగారి జయన్న గార్కి, మీరన్నట్లు విలీనాలు చేసినపుడు వ్యాస చరిత్రలను కూడా విలీనం చేస్తే మంచిసాంప్రదాయం అని నా అభిప్రాయం. అనేక వ్యాసాలు విలీనం చేయునపుడు విలీనం చేయవలసిన రెండవ వ్యాసం యొక్క వ్యాస చరిత్రను మొదటి వ్యాసం యొక్క చర్చాపేజీలో ఒక పట్టికగా చేర్చడం జరుగుతున్నది. కానీ ఈ మధ్య పైడిమర్రి వెంకటసుబ్బారావు వ్యాస విషయంలో మాత్రం వాటి వ్యాస చరిత్రలను కూడా విలీనం చేయవలసి వచ్చింది. పైడిమర్రి సుబ్బారావు వ్యాసం 04:36, 13 ఆగష్టు 2013 న‎ రహమతుల్లా గారిచే సృష్టించబడి విస్తరింపబడినది. పైడిమర్రి వెంకటసుబ్బారావు వ్యాసం 03:55, 15 ఆగష్టు 2014‎ న ప్రణయరాజ్ గారిచే సృష్టింపబడినది. వీటి విలీనం విషయంలో ప్రణయరాజ్ గారు రచిచంద్ర గారి చర్చాపేజీలో తనకు యిదివరకు ఆ వ్యాసం ఉన్న సంగతి తెలియనందువల్ల మరలా సృష్టించానని చెప్పారు. అందువల్ల మొదట సృష్టించిన వారి కృషికి భంగంవాటిల్లకుండా వ్యాస చరిత్రలను విలీనం చేయడం జరిగినది. మీకు అలాంటిదేదైనా సమస్య ఉంటే దానిని చర్చాపేజీలో {{సహాయం కావాలి}} అనే మూసను చేర్చడం వల్లగానీ, మీకు ఆ సమస్య పరిష్కారానికి సహాయాన్నందించే నిర్వాకులను గానీ తెలియజేయడం వలన గానీ సమస్యను పరిష్కారం చేయవచ్చు. యిదివరకు ఒలిక్ ఆమ్లం వ్యాస చరిత్ర విషయంలో చంద్రకాంతరావుగారు సహాయం చేశారు.---- కె.వెంకటరమణ చర్చ 05:43, 21 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • సుల్తాన్ ఖాదర్ గారు అడిగిన ప్రశ్న ఏమిటి - పేజీ చరిత్రను కూడా తరలించడానికి వీలవుతుందా?
  • కె.వెంకటరమణ గారు దేనికి సమాధానం ఇచ్చారు - విలీనానికి (పేజీలు విలీనాలు చేయునపుడు వ్యాస చరిత్రలు కూడా విలీనం చేయవచ్చు.)
  • రాజశేఖర్ గారు వ్రాసిన వ్యాసం - నియంత (సినిమా)
  • వై.వి.యస్.రెడ్డి వ్రాసిన వ్యాసం - నియంత (డిక్టెటర్)
  • రాజశేఖర్ గారు నియంత అనే పదాన్ని నియంత సినిమాకు దారిమార్పు చేయకూడదు, ఎందుకంటే నియంత పేరుతో ఒక వ్యాసం సృష్టించవలసిన అవసరముంది కాబట్టి, నేను నియంత పేరుతో వ్రాద్ధామనుకున్నప్పుడు నియంత పేరు నియంత సినిమాకు దారిమార్పు అయినందున నియంతలుగా పేజీని ప్రారంభించాను. నియంతలు పేరును నియంతగా మార్చేందుకు మార్గాలు. 1. నియంత పేజిని తొలగించి నియంతలు పేజిని నియంతకు తరలించటం. 2. నియంత పేజీని నియంత (అయోమయనివృత్తి)కి దారిమార్పు లేకుండా తరలించి నియంతలు పేజీని నియంతకు తరలించడం. YVSREDDY (చర్చ) 06:48, 21 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ నేను పనిచేస్తున్న తొలిరోజుల్లో నియంత లాంటి కొన్ని వేల సినిమా వ్యాసాలు కనిపించాయి. అన్ని వేల వ్యాసాలు నేనొక్కడినీ తయారుచేయలేను. అప్పుడు మీకున్నంత అవగాహన నాకు లేదు. నాకు తెలిసిన విధంగా నియంత వ్యాసాన్ని నియంత (సినిమా) కు దారిమార్చాను. అలా కొన్ని వేల సినిమా వ్యాసాలు మరికొన్ని గ్రామాల వ్యాసాలు ఇలా మార్చాను. నాకు ఇలా వ్యక్తిగత క్రెడిట్లు గురించి ఆ సమయంలో తెలియలు; వారి క్రెడిట్లు నేను కొట్టేయాలనే దురాలోచన లేదు. తప్పుచేసివుంటే క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 03:58, 22 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేసిన సభ్యులు కటకం వెంకట రమణ గారికి, Naidugari Jayanna గారికి, YVSREDDY గారికి, రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. YVSREDDY గారు , రాజశేఖర్ గార్ల సమ్మతితో నియంతలు పేజీ ని నియంత పేజీలో విలీనం చేసి అలాగే చరిత్ర ను కూడా విలీనం చేసి, ఈ చర్చకు అర్ధవంతనైన ముగింపును ఇద్దాం.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:09, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ సమూహంలో ఇండివిజువల్ ఎంగేజ్ మెంట్ గ్రాంట్స్ ప్రోగ్రాం[మార్చు]

ఈ ప్రోగ్రాం క్రింద మన తెవికీ సభ్యులు ఎందుకు ఉత్సాహం చూపడం లేదు?

ఈ ప్రోగ్రాం క్రింద తెవికీ సమూహం నుండి కనీసము ఓ నాలుగు ప్రాజెక్టులు ఓ నలుగురు అప్లయ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. విశ్వనాథ్ గారు ఓ ప్రాజెక్టుకు చొరవ చూపిస్తున్నారు. ఇతరులూ చొరవ చూపాలని మనవి. సందేహాలూ, సూచనలూ రెండ్రోజుల్లో ఇక్కడే చర్చించండి. అహ్మద్ నిసార్ (చర్చ) 20:24, 21 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చక్కని అవకాశం, వీలైనవారు దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి --వైజాసత్య (చర్చ) 22:21, 21 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సెప్టెంబరు 30వ తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఎవరైనా ప్రపోజల్స్ చేద్దామని భావించేట్టయితే మొత్తం ప్రాజెక్టు ఒకసారే పెట్టవలసిన అవసరం, అన్ని వికీ పేజీల వలెనే దీనికీ, లేదు. ఈ పేజీలోని సూచనలు గమనించి, అక్కడే ఉన్న స్టార్ట్ డ్రాఫ్టింగ్ యువర్ ఇండివిడ్యువల్ గ్రాంట్ ప్రపోజల్ అన్న దగ్గర పేజీ టైటిల్ ప్రారంభించి డ్రాఫ్ట్ చేయడం మొదలుపెట్టండి. సెప్టెంబరు 30 లోపుగా వీలున్నంత సమగ్రంగా చేసి దాన్ని ప్రపోజ్ చేసేయవచ్చు. సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు చేపట్టదలుచుకున్న వికీమీడియన్లు ముందుకు వస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 05:02, 22 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వచ్చే నెల మొదటీ వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంపై ఆసక్తికలిగివున్న వికీమీడియన్లు అందరూ ప్రపోజల్‌ని రివ్యూ చేస్తూ రకరకాల ప్రశ్నలు, సలహా-సూచనలు ఇస్తారు. అవసరమైతే మన గ్రాంట్ ప్రపోజల్‌ని తదనుగుణంగా మార్పులు కూడా చేయవచ్చు. కనుక ఇప్పుడు కీలకమైన విషయాలతో ప్రపోజల్ పూర్తిచేస్తే తర్వాత మెరుగులు దిద్దుకునేందుకు కొంత సమయం ఉంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 05:08, 22 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ మిత్రులకు మనవి. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/ప్రతిపాదన ముసాయిదా పేరుతో ప్రాజెక్టు కొరకు వివరించాను. దయచేసి ప్రాజెక్టు మెరుగు కొరకు మీ సలహాలు, సూచనలు, మార్పులు, చేర్పులు చర్చాపేజీలో కాని అదే పీజీలో దిగువనైనా తెలియచేయగలరు..విశ్వనాధ్ (చర్చ) 04:39, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  1. విశ్వనాథ్ గారు తెలుగు గ్రంథాలయం/ప్రతిపాదన ముసాయిదా ప్రాజెక్టు గురించి వివరించారు. శుభం. అహ్మద్ నిసార్ (చర్చ) 11:52, 22 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాథ్ గారి సూచనకు సభ్యులు స్పందించగలరు. అలాగే ఇతర సభ్యులెవరైనా ప్రపోసల్ పెట్టండి. అహ్మద్ నిసార్ (చర్చ) 10:34, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ సభ్యులకు మనవి, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అనే పేరుతో ఓ ప్రాజెక్టు గురించి వివరించాను. సభ్యులు స్పందించి, సూచనలు, సలహాలు, తగిన మార్పులు గురించి తెలియజేయవలసినదిగా కోరుతున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 09:37, 25 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ మిత్రులకు నమస్కారం నేను మెటావికీలో ఇండివిడ్యువల్ ఎంగేజ్‌మెంట్ గ్రాంటుకోసం అఫ్లై చేసాను. ఇక్కడ [2]] చూడగలరు. మీ సూచనలు, సలహాలు తెలియచేయగలరు...విశ్వనాధ్ (చర్చ) 15:59, 29 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ సభ్యులకు, నేను మెటావికీలో ఇండివిజువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్ కోసం అప్లై చేసాను. ఈ ప్రాజెక్టు పేరు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం. ఇదో టీంవర్క్, సహగ్రాంటీలుగాను, వాలంటీర్లు గాను, ఇతర సభ్యులూ వున్నారు, దాదాపు ఇది టీం ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం లాంటిది. మెటావికీలో దీని పేజీ [3]. ఇక్కడ సందర్శించి, ఎండార్స్ మెంట్స్, సపోర్ట్ విభాగం వద్ద తమ తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, ఈ సబ్జెక్టు యొక్క ఆవశ్యకతను, దీనివలన తెవికీకి కలిగే ఉపయోగాలు, లాభాలు గురించి వ్రాసేది. మీ అభిప్రాయాలు ఈ ప్రాజెక్టుకు చాలా అమూల్యమైనవి. నిర్మాణాత్మకమైన విమర్శలునూ వ్రాయవచ్చు. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:46, 1 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

భవిష్యత్తులో భారత దేశంలో వికీమీడియా పురొగతి ఎలా? వికీమీడియా ఫౌండేషన్ వారి వ్యూహరచన సమావేశం[మార్చు]

"వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి" కొరకు, కమ్యూనిటీ కన్సల్టేషన్ - 2014 బెంగళూరు సమావేశం కొరకు, మన సమూహం తరపునుండి అధికారికంగా కొన్ని నిర్ణయాలు, రెకమెండేషన్లు చేయాల్సి వుంటుంది. మరియు ఇక్కడ వ్రాయాల్సి వుంటుంది. కావున సభ్యులందరూ ప్రతిస్పందించి ఇక్కడతమ సిఫారసులను క్రింద వ్రాయవలసినదిగా మనవి. రాజశేఖర్ గారు, విశ్వనాథ్ గారు నేను తమ తమ అభిప్రాయాలను పైన తెలిపాము. అలాగే మీరునూ నిర్దిష్టమైన సిఫారసులను వ్రాసేది. వికీ సమూహం మొత్తం ఈ సిఫారసులను తమ సంతకాలతో అంగీకరించవలసి యుంటుంది. కావున సభ్యులందరూ పాల్గొనేది. అహ్మద్ నిసార్ (చర్చ) 12:31, 27 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యులకు, వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి#తెవికీ సమూహపు అధికారిక సిఫారసులు వద్ద తెవికీ సమూహం చర్చించిన విషయాల సారాంశాన్ని ఓ ఐదు పాయింట్లుగా ఆంగ్లంలో వ్రాసి, ఇండియా కమ్యూనిటీ కన్సల్టేషన్ తెలుగు విభాగంలో అతికించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని నేను మరియు వెంకటరమణ గారు చేపట్టాం. సదరు విషయాన్ని రచ్చబండలో సూచించడం జరిగినది. అహ్మద్ నిసార్ (చర్చ) 12:11, 30 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వికీమీడియా ఫౌండేషన్ వారి వ్యూహరచన సమావేశంలో భారత వికీ సముదాయాల చర్చలు ఈ లంకెలో--విష్ణు (చర్చ)05:42, 5 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

2 కిలోబైట్ల కన్నా తక్కువ సమాచారమున్న వ్యాసాల తొలగింపు[మార్చు]

తెలుగు వికీపీడియాలో 2 కిలోబైట్ల కన్నా తక్కువ సమాచారం ఉన్న వ్యాసాలు ఉండరాదని నిబంధన ఉన్నది. ఇది నియమ రూపం కూడా దాల్చింది. తర్వాత చర్యగా మొలకల జాబితా కూడా విడుదల చేస్తున్నారు. ఈ నియమం అమలులోకి వచ్చిన తర్వాత సృస్టించిన వ్యాసాలలో 2 కిలో బైట్ల కన్నా తక్కువ ఉన్నవాటి జాబితా ప్రతినెలా విడుదల చేస్తున్నారు. అయినా కొన్ని వ్యాసాల విస్తరణ ఇంకా జరగలేదు. అలాంటి వ్యాసములు తొలగింపుకు అర్హత సాధిస్తాయి కావున తొలగింపు మూసలు ఉంచదలిచాను. సభ్యుల స్పందన కావాలి.--Bhaskaranayudu (చర్చ) 15:12, 1 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అక్టోబర్ నెల మొలకల జాబితా (సెప్టెంబర్ నెలలో రూపొందించబడినవి)[మార్చు]

అక్టోబర్ నెల మొలకల జాబితా ఇక్కడ చూడగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 19:57, 1 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారి[మార్చు]

తెలుగు వికీపీడియాలో మరికొందరు అధికారులు ఉంటే బాగుంటుందని దశాబ్ధి ఉత్సవాలాలో అహమ్మద్ నిస్సార్ గారూ సూచించారు. ఇప్పుడు వారు ఉత్సాహంగా తెలుగు వికీపీడియాలో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇండివిజువల్ ఎంగేజ్ మెంట్ గ్రాంట్స్ ప్రోగ్రాంలో ప్రాజెక్ట్ లీడర్‌గా ప్రాజెక్ట్ ప్రతిపాదన చేసారు. ఆయన విషయఙానం ఉన్నవారు. చక్కని నిర్వాహకుడు. అందరినీ కలుపుకు పోగలిగిన తతత్వం ఉన్న వారు. ఇలాంటి ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు సాగాలంటే భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని ప్రాజెక్టులు కావాలంటే మనకు మరింత మంది సమర్ధులైన అధికారులు కావాలి. వీరి మార్గదర్శకత్వం తెలుగు వికీపీడియా అభివృద్ధికి మరింత సహకరిస్తుంది. కనుక అహ్మద్ నిసార్ గారు అధికారిగా స్వీయ ప్రతిరపాదన చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. స్వీయ ప్రతిపాదన చేయమని నా అభిలాషను వెలిబుచ్చుతున్నాను.--t.sujatha (చర్చ) 12:43, 2 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • అత్యంత సౌమ్యులు సంయమనం పాటించగల వారు సున్నిత మనస్కులు -వైజాసత్య. వారు అధికారిగా విరమించడం నా మనసును బాధించింది. మనకు వారు అధికారిగా ఉండి మార్గదర్శకం చేయవలసిన అవసరం ఉంది. కనుక వారు తిరిగి అధికార బాధ్యతలను స్వీకరించి వికీపీడియన్లకు మార్గదర్శకం వహిస్తూ వికీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.--t.sujatha (చర్చ) 03:30, 2 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అహ్మద్ నిసార్ గారు తెవికీ అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టి తమ అనుభవంతో తెవికీ అభివృద్దిని పరుగు పెట్టించాలని కోరుకుంటున్నాను.వారి వంటి సమర్థ అధికారి మనకు ఎంతైనా అవసరం.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:42, 2 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అహ్మద్ నిసార్ గారు తెవికీలో క్రియాశీలయంగా అందరినీ కలుపుగోలుతత్వంతో పనిచేస్తూ ప్రాజెక్టులు ముందుకు సాగేటట్లు, వికీపీడియా అభివృద్ధికి మార్గనిర్డేశనం చేస్తున్న వారు. ఆయన అధికారిగా స్వీయ ప్రతిపాదన చేస్తే బాగుండునని నా అభిప్రాయం. ఆయన అధ్వర్యంలో అనేక ప్రాజెక్టులు నిర్వహింపబడి తెవికీ అభివృద్ధి పథంలో నడుస్తుందని నా ఆక్షాంక్ష.---- కె.వెంకటరమణ 15:15, 3 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాథ్ గారి ఇండివిజువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్ కి మద్దతు[మార్చు]

విశ్వనాథ్ గారు ఐఈజీ (ఇండివిజువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్) కింద గ్రంథాలయాల సూచిక రూపొందించే ప్రాజెక్టు కు అభ్యర్థన చేసుకున్నారని విదితమే, ఆ అభ్యర్థనను ఎందరో ఇతర భాషవారు సమర్థిస్తున్నారు. మానలో ఇంకా చాలా మంది మద్దతు తెలుపలేదు. ఇక్కడ చూడగలరు. దయచేసి మీ మద్దతు తెలపండి. --రహ్మానుద్దీన్ (చర్చ) 17:50, 4 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యేక తెవికీ వికీ సమూహం[మార్చు]

వాడుకరి:రహ్మానుద్దీన్ గారూ, నేను వ్రాసిన విషయాన్ని మీరు ఎందుకు తీసివేశారు? అహ్మద్ నిసార్ (చర్చ) 09:43, 5 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పైన తెలిపిన విషయం తీసివేయాలని అభ్యర్థిస్తున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:37, 5 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సాధారణంగా చర్చా పేజీలో చర్చలను తొలగించకూడదు. మరీ అసభ్యకరం అయితే మాత్రం అయితే తప్ప. నిసార్ గారు వ్రాసినదాంట్లో అభ్యంతరకరమైన విషయమేవీలేదు. మీరు ఎందుకు తొలగించమని కోరుతున్నారో వివరించగలరు. --వైజాసత్య (చర్చ) 00:29, 6 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ అంశం విజయవంతం కావడానికి మరికొందరు వ్యక్తులను వికీమీడియా వారి సమావేశంలో కలవవలసి, మరికొంత ఆలోచించుకోవలసి ఉన్నట్టు శనివారం రాత్రి బృందం నిర్ణయించుకుంది.(ఆ నిర్ణయంలో నిసార్ గారు కూడా ముఖ్యులు) నిసార్ గారు కూడా భాగస్తులైన నిర్ణయం ఆయనే హఠాత్తుగా తుంచివేసి, మిగిలిన ప్రతినిధి బృందంతో చర్చించకుండా ఆన్-వికీ, ఆఫ్-వికీ కూడా ప్రకటిస్తూండడం ప్రక్రియకు ఇబ్బందికరమైంది. ఈ నేపథ్యంలో రెహమాన్ కేవలం దిద్దుబాటుగానే, అదీ ముందుగా బృందంతో చర్చించి చేశారే తప్ప మరే ఉద్దేశంతోనూ చేయలేదు. కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రతినిధులు విశ్వనాథ్, ప్రణయ్ రాజ్ గార్లు బెంగళూరు నుంచి చేస్తున్న ప్రయాణాలు, తద్వారా అంతర్జాలం అందుబాటులో లేకపోవడమూ వంటి అసౌకర్యాల వల్ల ఈ చర్చలో భాగస్తులు కాలేకపోతున్నారు. ఆ విషయం నాకు వివరించారు. వారు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలియజేశారు.(ఐతే వారి నుంచే వినేందుకు మరికొన్ని గంటలు పట్టవచ్చు.)--పవన్ సంతోష్ (చర్చ) 10:33, 6 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగా, నాకు మీ పరిస్థితి అర్ధమైంది. వికీ బయట మీరేమనుకున్నారో అది మీ బృందం యొక్క అంతర్గత విషయం. వికీకి సంబంధించినంత వరకు చర్చలను చెరిపెయ్యటం సరైన సాంప్రదాయం కాదు. అయినా ఒకసారి ఇక్కడ వ్రాసిన తర్వాత అది సంధించిన బాణమని మీకు గుర్తుచేయనవసరం లేదు. వెనక్కి తీసుకోవటం అంటూ జరగదు. రహ్మానుద్దీన్ గారు దాన్ని అలాగే వదిలేసుంటే పోయింది. నిసార్ గారు చేసిన దాని తప్పొప్పుల సంగతి గురించి నేనేమీ వ్యాఖ్యానించడం లేదు. అది ఈ సముదాయపు పరిధిలోలేని విషయం --వైజాసత్య (చర్చ) 00:33, 7 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
గౌరవనీయ సభ్యులకు, ఇది వైజా సత్య గారు చెప్పినట్టుగా సముదాయ పరిధిలో లేని విషయంగా నేననుకోను. సముదాయం ప్రత్యేకంగా ఉంటే మేము బయటి సభ్యులుగా అనుకోవచ్చా ?, మేము ఇప్పటి వరకూ సముదాయపు ప్రతినిధులుగానే సమావేశానికి వెళ్ళాం అనుకుంటూన్నాం. ఇక సంధించిన బాణం అయినా మరేదయినా కూర్చున్న కొమ్మను నరికేందుకు ఉద్దేశించినది అయితే తప్పక నిరోదించాలి. నిరోదించినందుకు సభ్యునికి వివరణ ఇచ్చేందుకు మేము అక్కడే ఉన్నా, సభ్యునికి మాట్లాడేందుకు అవకాశం కల్పించమన్నా కల్పించకపోవడం మా తప్పు ఎంతమాత్రం కాదు....విశ్వనాధ్ (చర్చ) 12:30, 8 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారూ, పైన నిసార్ గారు వ్రాసిన విషయానికి మీరందరూ స్పందించిన తీరును బట్టి అది సముదాయానికి మేలుచేయని విషయమని నేను అర్ధం చేసుకోగలను. కానీ ఇది సముదాయపు పరిధిలో లేని విషయమని ఎందుకన్నానో ఒక కథతో వివరిస్తాను. ఇది కథే సుమండీ. వికీ అభివృద్ధికి సంబంధించిన కొన్ని విషయాలపై చర్చించడానికి ఒకానొక భాగ్యనగరంలో వైజాసత్య, విశ్వనాధ్ గార్లు ప్రత్యక్షంగా కలుస్తారు. వాదాల్లో మాటామాటా పెరిగా వైజాసత్య, విశ్వనాధ్ గారి చెంప చెళ్ళుమనిపిస్తాడు. దాంతో విశ్వనాధ్ గారికి కోపమొచ్చి వికీలో ఈ ఫలానా ఆయన ఉన్నన్నాళ్ళు నేను పనిచెయ్యను అని వెళ్ళిపోతారు. దీని వళ్ళ వికీ సముదాయానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. అంత మాత్రాన వికీ సముదాయం వైజాసత్య మీద ఏ చర్య తీసుకోలేదు. అదే వైజాసత్య, సంజాయిషీ లేకుండా నలుగురు వ్రాసినవి చెరిపేశాడనుకోండి అప్పుడు సముదాయం తప్పకుండా చర్య తీసుకుంటుంది. ఈ విపరీతమైన ఉదాహరణలో పిడకలవేటకు వెళ్ళకుండా చెప్పదలచుకున్నది గ్రహిస్తారని భావిస్తాను. --వైజాసత్య (చర్చ) 04:31, 9 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ మీరంటే నాకు చాలా గౌరవం. అతిశయోక్తి కాదు నిజంగానే. మాలాంటి పిలకాయలు ఏ రాసినా మీరు అపార్ధం చేసుకోరని నాకు బాగా పేద్ద నమ్మకం :) .....విశ్వనాధ్ (చర్చ) 05:30, 9 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు భలే బుట్టలో పడేస్తార్ సార్. హ్హిహ్హిహి. మీరందరూ కలిసి ఏదో మంచే తలపెట్టారని నాకర్ధం అయ్యింది. చర్చలను వివరణ లేకుండా తొలగించడం మంచి సాంప్రదాయం కాదని చెప్పటానికే ఇంత ఆయాసం. --వైజాసత్య (చర్చ) 05:39, 9 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వాండలిజం[మార్చు]

పైన ఉదాహరించిన సమూహపు విషయాన్ని మాటిమాటికీ తొలగించడం బాగాలేదు, దీన్ని వాండలిజం గా పరిగణించవచ్చు. ఈ విషయం తొలగిస్తే నేను తెవికీ నుండి శెలవు తీసుకుంటాను. ఇలాంటి వారిమధ్య పనిచేయడం కష్టమే మరి. ఒకరి పర్మిషన్ అడిగి వ్రాసే స్థితికి తెలుగువికీపీడియా చేరిందంటే దారుణమే మరి. అహ్మద్ నిసార్ (చర్చ) 13:30, 5 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్మద్ నిసార్ గారూ, వికీపీడియాలో వ్రాయటానికి ఒకరి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. రహ్మానుద్దీన్ గారు మీ వ్యాఖ్యను కనీసం వివరణ కూడా లేకుండా ఎందుకు తొలగించారో నాకర్ధం కాలేదు. --వైజాసత్య (చర్చ) 00:34, 6 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారూ, అహ్మద్ నిసార్ గారు అనుమతి లేకుండా వ్రాయలేని పరిస్థితి అని భావించడంతో, అనుమతి అవసరం లేదని చెప్పానంతే. అనుమతి ఉంటేనే ప్రచురించాలని అన్నారని నేను చెప్పలేదు. ఆయనా మీరు అన్నారని చెప్పటం లేదు, అలా ఉంది పరిస్థితి అని ఫీలయి వాపోతున్నట్టున్నారు. చెప్పవలసింది పైన చర్చలో చెప్పేశాను. నేనిందులో ఇంకా చెప్పేదేమీ లేదు --వైజాసత్య (చర్చ) 00:41, 7 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
"అలాగా, నాకు మీ పరిస్థితి అర్ధమైంది." పైన నేను చెప్పినది. మీరు సముదాయం బయట చేసుకున్న ఒప్పందంపై నేను స్పందించలేను --వైజాసత్య (చర్చ) 10:33, 8 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారూ, నిజానికి మీరేం వాపోతున్నారో నాకు అర్ధం కాలేదు. వివరించగలరు. ఇదివరకు మీరు నావద్దకు తెచ్చిన సమస్య గురించి నేనేమీ చెయ్యలేదని మీ ఉద్దేశ్యమైతే. అది నా తప్పే. క్షమించగలరు. అప్పట్లో సమస్యను పరిశీలిస్తాను అన్నాను కానీ, నా వ్యక్తిగత పరిస్థితుల వళ్ల ఎటువంటి చర్యా తీసుకోలేదు. సమస్యను పక్కన పెట్టడం ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని మీరు అర్ధం చేసుకుంటే చాలు. ఇప్పుడు కేవలం యాధృఛ్ఛికంగా ఈ చర్చను చూశానే తప్ప మరో ఉద్దేశంతో ఇక్కడ చర్చకు దిగలేదు. --వైజాసత్య (చర్చ) 10:43, 8 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయాన్ని ఎంత దాయాలని అనుకొన్నామో అంత ఎక్కువగా రచ్చ జరుగుతున్నది కనుక నేను రాయవలసి వస్తున్నది. పైన మీరు రాసినట్టు వికీపీడియాలో వ్రాయడానికి ఎవరి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. కాని దాని వలన తెలుగు వికీ, సముదాయం యొక్క అభివృద్ది నిరోధకంగా మారుతున్నపుడు. అనుమతి తప్పనిసరి. అది మా మద్య జరిగిన ఒడంబడిక. ఈ సమస్యకు రహమానుద్దీన్ ఎంత మాత్రం బాధ్యుడు కాబోడు. ఈ విషయంలో ఆయన ఏది వాపోయినా అది తెలుగు వికీ అభివృద్ది కొరకు మాత్రమే అనుకుంటున్నాను. దీనిపై మరిన్ని చర్చలు చేయుట వలన పరిస్థితి మరింత దిగజారుతుపోతుండటమే తప్ప ఒరిగేది ఏమీ ఉండదని నా అభిప్రాయం..విశ్వనాధ్ (చర్చ) 12:36, 8 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

బెంగుళూరులో జరిగిన సమూహ సంప్రదింపు సమావేశం విశేషాలు[మార్చు]

ఈ నెల ౪, ౫ తేదీలలో బెంగుళూరులో జరిగిన వికీపీడియనుల అంతర్గత సమూహ సంప్రదింపుల సమావేశం వివరాలు ఇక్కడ చేర్చుతున్నాను, ఆసక్తి గలవారు పరిశీలించి వారి సలహాలను చర్చ పేజీలో తెలుపవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:46, 7 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశం వివరాలను రిపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు. ఇతర వికీపీడియన్లు కూడా అక్కడి సూచనలు, నిర్ణయాలు, విశేషాలు గమనించి స్పందించగలరని ఆశిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 18:24, 7 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు లేవు మూస[మార్చు]

మనందరి తెలుగు వికీపీడియాకు పెద్ద సమస్య మూలాలు. ఈ మూలాలను చేయడం వ్యాసకర్తల బాధ్యత. తెవికీ నాణ్యతను పెంపొందించాలని కోరుతూ నేను మూలాలు లేని వ్యాసాల ప్రారంభంలో మూలాలు లేవు మూసను చేర్చుతున్నాను. ఇది ఏ ఒక వ్యక్తిని ఉద్దేశించి చేరుస్తున్నవి కావు. దయచేసి సభ్యులు వారు సృష్టించిన వ్యాసాలకు సరైన మూలాలు చేర్చి ఆ మూసను తొలగించండి. ఇకముందు ప్రారంభించే వ్యాసాలకు కీలకమైన మూలాలను ముందుగానే చేర్చి తెవికీ అభివృద్ధికి తోడ్పడండి.Rajasekhar1961 (చర్చ) 12:30, 10 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మీరన్నట్లు ప్రతి ఒక్కరు వారు వ్రాసిన వ్యాసాలలో మూలాలను చేర్చి అభివృద్ధికి తోడ్పడాలి. ప్రస్తుతం మూలాలు లేని వ్యాసాలు వర్గంలో సుమారు863 మాత్రమే ఉన్నవి. కానీ ఇంకా అనేక వ్యాసాలలో మూలాలు లేనట్లున్నది. కనుక ప్రతి ఒక్కరు ఈ వ్యాసాలలొ మూలాలను చేర్చే ప్రయత్నం చేస్తే తెవికీ అభివృద్ధి జరుగుతుంది.---- కె.వెంకటరమణ 17:10, 10 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ నాణ్యతాభివృద్ధిలో, ప్రామాణికతలో మూలాల చేర్పు చాలాముఖ్యమైన అంశం. ఈ ప్రయత్నం చాలా మంచిది. గౌరవ సభ్యులు వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేసేందుకు, రాసేందుకు వికీసోర్సులో ఉచితంగా లభ్యమవుతున్న పుస్తకాలను, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని పుస్తకాల జాబితాలను, ఆర్కైవ్స్.ఆర్గ్‌లోని అనేకానేకమైన గ్రంథాలను సంప్రదించాల్సిందిగా సూచన.--పవన్ సంతోష్ (చర్చ) 17:57, 10 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారి ప్రయత్నం అభినందనీయం. ఈ చర్య వలన ఇక నుండి వ్యాసాల విశ్వసనీయత పెరిగే అవకాశం ఉన్నది.కొత్త వ్యాసము సృష్టించేటపుడు, మూలాలు లేకపోతే డీఫాల్ట్ గా ఈ మూస ఉంచడానికి వీలవుతుందేమో పరిశీలించగలరు. దీనివలన మానవ ప్రమేయం లేకుండానే వ్యాసాల నాణ్యత పెంచడానికి వీలవుతుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:27, 25 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మరింత సమగ్రంగా మూలాలు[మార్చు]

తెవికీలో ఇన్సర్ట్ రిఫరెన్సెస్ అనే బొత్తం ద్వారా రిఫరెన్సులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే <ref></ref> మాత్రమే వస్తోంది. నేను పుస్తకం పేరు, రచయిత పేరు, ప్రచురణకర్త పేరు, పేజీ నెంబరు, ప్రచురణ సంవత్సరం అనేవి వరుసగా ఒకదాన్నొకటి ":" చిహ్నంతో వేరుచేసేలా పెట్టి రాసుకుపోతున్నాను. ఐతే ఆంగ్లవికీలో సైటేషన్స్ అన్న ప్రత్యేకమైన విభాగం కూడా ఉండడం గమనించాను. అది తెలుగులో ఉంటే నేను ఇస్తున్న రిఫరెన్సులు మరింత సమగ్రంగా ఇచ్చే వీలు దొరుకుతుంది కదా. పైగా నేను పక్కపక్కనే రాస్తూ పోతున్నవి అక్కడ స్పష్టమైన విభాగాల క్రిందికి వచ్చి భవిష్యత్తులో సమగ్రమైన అధ్యయనానికి ఉపకరిస్తుందనిపించింది. ఎలానూ ఆ వివరాలన్నీ రాలేని వారికి సాక్ష్యాలు/ఇన్సర్ట్ రిఫరెన్సెస్ అన్నది సరిపోతుంది.--పవన్ సంతోష్ (చర్చ) 04:36, 11 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారు ప్రస్తుతం తెవికీలో సైట్ అనే ఆప్షన్ చేర్చారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 17:08, 26 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
Cite సౌలభ్యాన్ని కలిగించిన వైజాసత్య గారికి ధన్యవాదాలు. పవన్ సంతోష్ దీనిలోని ఆంగ్లభాగాన్ని ఆంధ్రీకరించి తెవికీ నాణ్యతను పెంపొందించడంలో సహాయం చేయమని మనవి. తెవికీ రచయితలకు దీని గురించి ఎలా తెలియజేస్తే బాగుంటుందో చర్చించాలని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 07:42, 10 నవంబర్ 2014 (UTC)
ఈ సౌలభ్యాన్ని ఎక్కడ ఎలా తెనిగించాలనేది నిజానికి నాకు తెలియదు. మీరో మరొకరో ఒకసారి లింకిస్తే ప్రయత్నిస్తా. ఇక సైట్ నోటీస్ ద్వారా మన తెవికీ రచయితలకు తెలియపరచాలన్నది నా సూచన.--పవన్ సంతోష్ (చర్చ) 12:28, 11 నవంబర్ 2014 (UTC)

11 వ వార్షికోత్సవ ఉత్సవాల గురించి ప్రతిపాదన[మార్చు]

గతంలో విపీడియా పదవ వార్షికోత్సవము విజయవాడలో జరగడము.... దానికొచ్చిన స్పంధన చాల మందిని ఉత్సాహ పరిచింది. తద్వారా వికీపీడియాలోని వ్యాసాల సంఖ్యతో బాటు, వ్యాసాల నాణ్యతాభివృద్ధి కూడ పెరిగింది. ఎందరో కొత్తవారు వికీపీడియాకు చేరువయ్యారు. ఇలాంటి వార్షికోత్సవ కార్యక్రమాలే వికీపీడియాభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. అందుచేత 11 వ వార్షికోత్సవ మహాసభ తిరుపతి లో జరిపితే చాల బాగుంటుండని ప్రతిపాదిస్తూ సహ వికీపీడియన్ల స్పంధన కొరకు ఈ ప్రతిపాదన చేయడమైనది. తిరుపతిలోనే ఎందుకు? ....... గతంలో విజయవాడలో జరిగిన దశమ వార్షికోత్స సభలు జరిగాయి. తరువాత సభ విశాఖపట్టణంలో జరుప తలపెట్టినా ....... ప్రస్తుతం అక్కడి పరిస్థితి (ఇటీవల వచ్చిన తుపాను కారణంగా) అనుకూలంగా లేదు. ఆ తర్వాత ప్రముఖమైన పట్టణము తిరుపతి. అదియును గాక తిరుపతి దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలు అనేక విద్యాసంస్థలకు ఆలవాలమై వున్నది. తిరుపతి కేంద్రంగా రాయలసీమ జిల్లాలను, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కూడ ప్రభావితం చేయ వచ్చు. అందుకే తిరుపతి ప్రతిపాధన చేయడమైనది. ఈసారి ఈ వుత్సవాలను మరికొంత వైవిద్యంగా జరిపిస్తే చాల బాగుంటుంది. ఎలాగంటే..... వికీపీడియన్లు రెండు బృందాలుగా ఏర్పడి జిల్లాలలోని ప్రధాన కేంద్రాలను సందర్శిస్తూ..... అక్కడి విద్యాసంస్థలు, గ్రంధాలయాల వంటి సంస్థలలో వికీపీడియా అవగాహన సదస్సుల నిర్వహిస్తూ చివరి రోజున తిరుపతి చేరుకొని అక్కడ మహాసభ జరిపితే స్పంధన బాగా వుంటుందని భావించడమైనది. ఈ కార్యక్రమమంతా ఒక వారం రోజులు జరిగాలని (ఆర్థిక వనరులకు లోబడి) ప్రతిపాధన. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి తగినంత సమయము కూడ వుండాలి. కనుక సభ్యులు త్వరగా స్పంధించ గలరు. ఈ విషయమై సహ సభ్యులు తమ అమూల్యమైన సలహాలు ఇవ్వగలరు. .............. వాడుకరి: ఎల్లంకి భాస్కర నాయుడు. Bhaskaranaidu (Bhaskaranaidu) 05:20, 20 అక్టోబరు 2014 (UTC)]][ప్రత్యుత్తరం]

భాస్కరనాయుడు గారికి మంచి ప్రతిపాదన చేశాను. ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం మనలో నూతనోత్సాహాన్ని నింపడానికి; తెవికీ ఉద్యమాన్ని మరింత విస్తృత పరచడానికి బాగా తోడ్పడుతున్నది. ఈ కార్యక్రమం ఈసారి రాయలసీమ ప్రాంతంలో (ముందు రెండూ సమావేశాలూ తెలంగాణా, కోస్తా ప్రాంతాలలో జరిగాయి) జరపడం బాగుంటుంది. తిరుపతి చాలా ప్రాముఖ్యమున్న ప్రాంతం; ఎన్నో విద్యా సాంస్కృతిక సంస్థలకు నిలయం. నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కూడా అవగాహన సదస్సులతో ముందుగనే జాగృతం చేయాలి. అయితే ఈ కార్యక్రమం సక్రమంగా ప్రణాలికా బద్ధంగా చేయాలంటే నాలుగు-ఐదు నెలల సమయం అవసరం. అందువలన ఫిబ్రవరిలో జరిపితే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. దీనికి ఎప్పటిలాగే తెవికీ సభ్యులందరి సహకారాలతో చేయాలని; అయినా ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కీలకపాత్ర పోషించవలసి వస్తుంది. Bhaskaranaidu గారికి మరో ఇద్దరు అనుభవమున్న స్వరలాసిక లాంటి వికీపీడియన్లు ముందుకురావాలని కోరుతున్నాము.--Rajasekhar1961 (చర్చ) 06:16, 20 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ఆలోచన. మునుపు మాలాంటి యువకులు కొందరు ముందుకువచ్చి దశమ వార్షికోత్సవం నిర్వాహణలో పాలుపంచుకున్నాము. ఈసారి నిర్వాహణ బాధ్యతలను Bhaskaranaidu గారు, గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు, Rajasekhar1961 గారు, t.sujatha గారు, మల్లాది గారు, మురళీమోహన్ (స్వరలాసిక) గారు, పాలగిరి గారు, -- కె.వెంకటరమణ గారు వంటి ఇంకొంతమంది సీనియర్ సభ్యులు తీసుకోవాలని మాలాంటి వారి కోరిక. Pranayraj1985 (చర్చ) 06:54, 20 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తిరుపతిలో వార్షికోత్సవ సభలు ప్రతిపాదించడం చాలా మంచి ఆలోచన. సభలలో నేను పాల్గొనగలను కాని బాధ్యత విషయంలో దయచేసి నన్ను మినహాయించండి.--స్వరలాసిక (చర్చ) 07:11, 20 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్ చేసిన సూచన చాలామంచి సూచన. సీనియర్ వికీపీడియన్లు బాధ్యతలు అనగానే భయపడవద్దని మా విజ్ఞప్తి. మునుపు జరిగిన దశమ వార్షికోత్సవంలో కమిటీ మాత్రమే కాక ఇతర వికీపీడియన్లంతా మాకు సహాయ సహకారాలు అందించారు. అందువలన అంతమాత్రమే చేస్తూ కేవలం నిర్వహణ పర్యవేక్షణ చేస్తూంటే చాలు. మాలాంటి వారు వెన్నంటి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తాము.(అగ్రిమెంట్లు, బాండ్లు రాయమంటే కష్టంగానీ, మా మాటే అగ్రిమెంటుగా అనుకోవాలని మా మనవి). --విశ్వనాధ్ (చర్చ) 07:17, 20 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాథ్, ప్రణయ్లతో నేను ఏకీభవిస్తున్నాను. సీనియర్ వికీపీడియన్లు ఖచ్చితంగా ఈ బాధ్యతలు తీసుకుని మాలాంటి సభ్యుల పూర్తి సహకారంతో ముందు జరిగిన కార్యక్రమాల కన్నా కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. దీనికి నేను వికీపీడియా:తెవికీ ఏకాదశాబ్ద ఉత్సవాలు-Tewiki 11th Anniversary/ProgramDetails అంటే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నాను. మీరింకేమైనా ప్రతిపాదనలు చేస్తే బావుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 07:26, 20 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
11 వ వార్షికోత్సవ ఉత్సవాల గురించి ప్రతిపాదనపై ఇక్కడ పేజీ సృష్టించబడినది. సహ సభ్యులు మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు ఇక్కడ ఈ పేజీలో అందించగలరు.విశ్వనాధ్ (చర్చ) 13:46, 20 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

11 వ వార్షికోత్సవ ఉత్సవాల గురించిన చర్చ ముందుకు సాగడంలేదు. ఇంకా ఆలస్యంచేస్తే కార్యక్రమ నిర్వాహణకు సమయం సరిపోదని నా అభిప్రాయం. కావున చర్చకు సభ్యులు సహకరించగలరు.--Pranayraj1985 (చర్చ) 08:53, 30 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ కార్యక్రమం ప్రణాళిక ముందుకు వెళ్ళాలంటే మొదలు దీని గురించి ఒక ప్రాజెక్టు పేజి మొదలు పెట్టాలి. అదే విధంగా ఉత్సవ నిర్వహణ కమీటీ తయారయితే బాగుంటుంది. --విష్ణు (చర్చ)13:33, 30 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations విశ్వనాథ్ గారు ఇప్పటికే ప్రారంభించారు. దానిలో విష్ణుగారు చెప్పినట్లు నిర్వహణ కమిటీ మొదట ఏర్పడాలి. దానికోసం భాస్కరనాయుడు గారు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. వారి ప్రణాలిక (క్రింద చేర్చినది) బాగుంది.Rajasekhar1961 (చర్చ) 13:40, 30 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను ఈ కార్యక్రమానికి కొందరు సభ్యులను ప్రతిపాధించాను అక్కడ మీ మద్దతు లేదా వ్యతిరేకతలను తెలుపగలరు....విశ్వనాధ్ (చర్చ) 04:48, 5 నవంబర్ 2014 (UTC)
11 వ వార్షికోత్సవ ఉత్సవాల గురించిన చర్చ అలానే ఉండిపోయింది. విష్ణుగారు, రహ్మనుద్దీన్ గారు చొరవ తీసుకొని ఈ చర్చను కొనసాగించవలసిందిగా నా మనవి. --Pranayraj1985 (చర్చ) 19:45, 16 నవంబర్ 2014 (UTC)

సభ్యులకు నమస్కారం. గతంలో జరిగిన తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవం, తెలుగు వికీపీడియా దశాబ్ధి ఉత్సావాల లో ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వికీపీడియన్లు ఒకచోట కలవడంద్వారా వారి మధ్య స్నేహ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా తెలుగు వికీపీడియా దశాబ్ధి ఉత్సావాలకు ఇతర భారతీయ భాషల వికీపీడియన్లను ఆహ్వానించాము. దీనిద్వారా తెలుగు వికీపీడియాలో చేస్తున్న ప్రాజెక్టులు ఇతర వివరాలు వారు తెలుసుకొని, వారి వారి భాషలలో చేస్తున్న విషయాలను పరస్పరం పంచుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తే బాగుంటుందని సభ్యులు కోరుకున్నారు. దానిలో భాగంగా తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవం తిరుపతిలో నిర్వహించదలచాము. అయితే,

1. తిరుపతిలో తెవికీ సమాదాయం: తిరుపతిలో నిర్వహించడానికి ముందుగా అక్కడ ఒక సమదాయాన్ని ఏర్పాటుచేయాలి. దానికోసం కనీసం 4 వికీపీడియా శిక్షణా శిబిరాలను నిర్వహించాలి. ఈ శిక్షణా శిబిరాలలో పాల్గొన్న వారు వికీపీడియాలో చురుకుగా పాల్గొనేలా ఇతర వికీపీడియన్లు ప్రోత్సహించాలి. విద్యాసంస్థలతో పాటుగా సాధారణ జనాలకి కూడా శిక్షణా శిబిరం ఉండాలి.

2. వికీపీడియా 11వ వార్షికోత్సవం కార్యనిర్వాహణ కమిటీ: వికీపీడియా 11వ వార్షికోత్సవం సక్రమంగా నిర్వహించడానికి కార్యనిర్వాహణ కమిటీ అవసరం. కనుక సభ్యులు ఎవరికి వారుగా తమ తమ పేర్లను ప్రతిపాదించవచ్చు. లేదా ఇతర సభ్యలు పేర్లను ప్రతిపాదించవచ్చు. కార్యనిర్వాహణ కమిటీ వారం రోజులలో ఏర్పాటుకావాలి. ధన్యవాదాలు...--Pranayraj1985 (చర్చ) 10:42, 19 నవంబర్ 2014 (UTC)

మంగలి వ్యాసం - వాండలిజం[మార్చు]

వాడుకరి:Royalvaidya మంగలి వ్యాసంలో ఉన్న సమాచారాన్ని ఎటువంటి ముందస్తు నోటీసు లేకుందా తీసివేసి కొత్త సమాచారాన్ని చేరుస్తున్నారు. ఈ విషయంపై ఆయన చర్చా పేజీ లో మరియు వ్యాస చర్చా పేజీ లో చేర్చినా ఆయన సమాచారాన్ని తీసివేయడం ఆపలేదు. నిర్వాహకులు స్పందిచమని మనవి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:28, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆవిడ లేదా ఆయన మైబైల్ ద్వారా ఎడిట్ చేస్తునారు. అక్కడ ఇబ్బంది ఏమంటే ఆయన/ఆవిడకు మనం ఇచ్చిన సూచనలను చూడలేడు. పైన గంట ఆకారంలో ఉన్నా కొందరు గమనించరు. బహుశా అలా జరుగుతూ ఉండవచ్చు...కనుక ఆయన/ఆవిడను చేయనివ్వంది తరువాత మనం తిరగరాయవచ్చు...విశ్వనాధ్ (చర్చ) 06:43, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే విశ్వనాధ్ గారూ. కానీ వాడుకరి:Royalvaidya గారు సంయమనం కోల్పోయి మంగలి వ్యాసంలో వ్యక్తిగత హెచ్చరికను చేర్చారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:17, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసాన్ని ఒక వారం పాటు కేవలం నిర్వాహకులు మాత్రమే దిద్దేట్టు నిబంధనం విధించాను --వైజాసత్య (చర్చ) 07:12, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సత్వర స్పందనకు ధన్యవాదములు . వాడుకరి:Royalvaidya గారు తెవికీలో కొత్త సభ్యులుగా చేరినట్లు ఉన్నారు. వారు తెవికీ సంబంధిత ప్రాధమిక విషయాలు తెలుసుకోవలసినదిగా మనవి. తెవికీ లో రాసే వ్యాసాలపై ఏ ఒక్కరికీ అధికారం ఉండదు. ఇవి సార్వజనీయమైనవి.ఈ వ్యాసాలను మీరు వ్యక్తిగతంగా తీసుకోవలసిన అవసరం లేదు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:17, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Asalu miru hindu caste lo muslim caste gurinchi enduku add chestunaru..వాడుకరి:Royalvaidya07:30, 22 అక్టోబరు 2014‎

ఇక్కడ రెండు విషయాలున్నాయి - మంగలి వృత్తి, మంగలి కులం, వ్యాసం రెండింటి గురించి వివరిస్తున్నది. సమాచారం అభివృద్ధి చెంది, ఈ రెండు విషయాలను వేర్వేరు చేయాలని సభ్యులు అభిప్రాయపడితే అలాగే చేద్దాం --వైజాసత్య (చర్చ) 07:35, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Royalvaidya గారు. హిందూ మరియు ముస్లిం అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. మంగలి కులమునకు మరియు క్షౌరవృత్తి కి సంబంధమున్నది. ఈ వృత్తి మంగలి కులస్తులే కాకుండా ఇతరులు కూడా ఆచరిస్తారు. ఉదాహరణకు ముస్లింలొ కూడా ఈ వృత్తిని ఆచరిస్తారు. అదే విషయాన్ని వ్యాసంలో తెలిపాను. దానికి ఆధారాలను కూడా చేర్చాను. గమనించండి. అలాగే ఆఫ్రికా మరియు అమెరికా దేశాలలో కొందరు క్రైస్తవులు కూడా ఈ వృత్తిని ఆచరిస్తున్నట్లు విన్నాను. కానీ దీనికి సరైన ఆధారము దొరకనందున ఈ విషయాన్ని వ్యాసంలో ప్రస్తావించలేదు. మీరు ప్రసిద్ది చెందిన కొందరు నాయీ బ్రాహ్మణుల జాబితా చేర్చారు. దీనికి ఆధారాన్ని కూడా జతచేశారు. ఆ జాబితాలో చూసిన పేర్లు చూసి నేనొ కూడా కొత్త విషయాలను కనుగొన్నాను. మీరు ఉదహరించిన ఆధారానికి ref ట్యాగు కూడా చేర్చాను. మనం వ్యక్తిగతంగా కాకుండా సంయుక్త కృషితో మంగలి వ్యాసాన్ని అభివృద్ది చేసి తెలుగు వికీ పీడియా లోని మేటి వ్యాసాలలో ఒకటిగా దీనిని తీర్చిదిద్దుద్దాము.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:40, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్గారికి అభినందనలు. కలిసి వ్యాసాలు అభివృద్దిచేయాలనే మీ ప్రయత్నం అభినందనీయం :)...విశ్వనాధ్ (చర్చ) 13:11, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య garu&సుల్తాన్ ఖాదర్ garu thq.miku emina information kavalante 100% ista nayeebrahmin ki sambandinchina information motam na dagara undi.full proofs kuda na dagara unnai brother.inko korika nadi nadaswaram photos kuda mi wikipedia mention cheyandi brother plzz.miru ee post ki respond avtaru anukuntunanu brother.

ఇందూ జ్ఞాన వేదిక[మార్చు]

  • ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాలపై 40-50కి పైగా ఉన్న వ్యాసాలని తొలగించాలి. అవి విషయప్రాముఖ్యత లేని వ్యాసాలు. (పుస్తకాల్లోని విషయాలకు ప్రాముఖ్యత లేదు అనటం లేదు). ఈ పుస్తకాల గురించి కేవలం వారి జాలగూళ్లో తప్ప మరెక్కడా విశ్వసనీయ సమాచారం లేదు. ఈ సంస్థ తమ పుస్తకాలకు లేదా సంస్థకు ప్రాచుర్యం కల్పించుకునేందుకే వికీవ్యాసాలు దోహదం చేస్తున్నాయి. ఈ సంస్థ వారు తమ పుస్తకాలను క్రియేటివ్ కామన్స్ ద్వారా విడుదలచేయటం అభినందనీయం. కానీ అంతమాత్రం చేత వాటికి వికీపీడియా ప్రచారసాధనం కాకూడదు --వైజాసత్య (చర్చ) 09:45, 24 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ పుస్తకాలలో చాలా విలువైన సమాచారం వున్నది. ప్రబోధానంద యోగీశ్వరులు చాలా విజ్ఞానం కలిగినవారు. వారి విలువైన జ్ఞానాన్ని వారు రచించిన పుస్తకాల ద్వారా సామాన్యులందరికీ అందించాలని తపిస్తున్నారు. వికీసోర్సులో చేర్చిన పుస్తకాల్ని నేను చదివాను. అవి సమగ్రంగా ఉన్నాయి. గుత్తా పుస్తకం యోగీశ్వరుల ఆత్మకథ కూడా వారి వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ తెలియజేస్తుంది. వీరు ఇందూ జ్ఞాన వేదిక వారి సమావేశంలో వ్యక్తిగతంగా వచ్చి ఇలా తెలుగు వికీపీడియాతో భాగస్వామం కావాలని కోరుతున్నట్లు చెప్పారు. విష్ణువర్ధన్ గారు, రహ్మానుద్దీన్, పవన్ మొదలైన వారందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇ.జ.వే. సభ్యులు ఒక 2 నెలలు శ్రమించి ఈ వ్యాసాల్ని అందులోని విలువైన సమాచారాన్ని క్లుప్తంగా చేర్చారు. వీటిని తొలగించడం మంచిది కాదని నా అభిప్రాయం. ఆ వాడుకర్లకు పుస్తకాలకు సంబంధించిన విషయ ప్రాముఖ్యతకు తెవికీలోనున్న కొలమానాలను గురించి దయచేసి తెలియజేయండి. ధన్యవాదాలు..Rajasekhar1961 (చర్చ) 16:12, 26 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • పైన నేను చెప్పినట్టు ఈ పుస్తకాల్లో విషయం ప్రాముఖ్యమైనది కాదు అనట్లేదు. ప్రబోధానంద యోగీశ్వరులు జ్ఞాన పురుషులే అయిఉండవచ్చును. సాక్షాత్తు కృష్ణపరమాత్ముడే దిగివచ్చి ఇది కలియుగంలో నేను తెలియజేయదలచుకున్న ప్రబోధం అని తెలియజెప్పినా, వికీపీడియా మీకు నిర్ధారించదగిన ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుంది. అది వికీ నైజం. దీని వళ్ళ కొన్ని నిజంగానే గొప్పవైన వాటి గురించి వికీ వ్రాయకపోవచ్చు. ప్రమాణాలకు వికీపీడియా:విషయ ప్రాముఖ్యత చూడంది. ఇది ఇంకా పూర్తిగా తర్జుమా కాలేదు. ఈ వ్యాసపు ఆంగ్ల ప్రతిని కూడా చూడండి. క్లుప్తంగా ఈ పుస్తకాలకు వికీలో వ్యాసాలుండాలంటే సాంప్రదాయ మాధ్యమాల్లో (పుస్తకాలు, పత్రికలు, టీవీ, రేడియో వగైరాల్లో) ఈ పుస్తకాల గురించి వ్రాయబడి, చర్చించబడి లేదా విశ్లేషించబడి ఉండాలి. వికీసోర్సులో ఈ పుస్తకాలు చేర్చవచ్చని అనుకుంటా (నాకు వికీసోర్సు యొక్క విషయప్రామాణ్యత గురించి అంతగా తెలియదు) కానీ వికీపీడియాలో ఖచ్చితంగా ఉండదగినవి కావు. ఉండదగినవి అని నిరూపించడానికి మీరు తప్పకుండా తగిన ఆధారాలు చూపించవచ్చు. మరో విషయం ఒక వికీ వ్యాసానికి మరో వికీ వ్యాసం సాక్ష్యం కాదు. ప్రబోధానంద యోగీశ్వరులపై వ్యాసానికి కానీ, ఇందూ విజ్ఞాన వేదిక పై వ్యాసం ఉండదగినవో కాదో నేనింకా పరిశీంచలేదు. వాటికి తగిన ఆధారాలు, వనరులు చూపించవచ్చు అనుకుంటా. ఇందూ జ్ఞాన వేదిక ఈ పుస్తకాలను కామన్స్ లైసెన్సు విడుదల చేయటం ఫ్రీ నాలెడ్జ్ ఉద్యమానికి తెలుగులో చాలా చేయూతనిచ్చే పని, అంతమాత్రం చేత వికీపీడియా విలువలను దిగజార్చలేము. వికీపీడియా ఒక ఎన్‌సైక్లోపీడియా, తెలుగులో వ్రాసిన సమాచారం అంతా ఇక్కడ పెట్టడం దాని లక్ష్యం కాదు. నిజంగానే ఈ పుస్తకాలు అంత ప్రాముఖ్యమైమవైతే, ఇతర మాధ్యమాలలో ఆధారాలు చూపించడం అంత కష్టమైన విషయమేవీ కాదు. --వైజాసత్య (చర్చ) 17:30, 26 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • ద్వైతము అద్వైతము లాగానే త్రైతము కూడా ఒక విశిష్ఠ సిద్ధాంతము. ఈ పేజీని వ్యాసాన్ని తొలగించకుండా ఆ సిద్ధాంత బోధనలు ఇంకా వివరంగా చేర్చితే బాగుంటుంది.భవిష్యత్తులో ఎంతో సమాచారం ఈ వ్యాసంలో చేరే అవకాశం ఉంది.(the above opinion copied from త్రైత సిద్ధాంతము వ్యాసము తొలగింపు చర్చ )--Nrahamthulla (చర్చ) 14:00, 26 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అయ్యా సత్యాగారు నమస్కారం. తెవికీ లో వ్యాసాలకు కొలమానాలు వున్నాయి అన్న విషయము మేమూ వాడుకరులుగా సంస్థలో చేరినప్పుడే తెలియచేయాలి, ఆ విధముగా జరిగినదా? అంటే లేదు. ఇప్పుడు తొలగిస్తున్నాము అంటూ నోటీస్ ఇస్తూ అవి మా కొలమానాలు అంటే ఎలా? ఎప్పుడో విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన రచనలు ఇన్ని సంవత్సరాలలో ప్రాచుర్యం పొందితే అలాంటివి మాత్రమే పెడతాము. సమకాలీన రచనలు మీద వ్యాసాలు పెట్టము అంటే ఎలాగ? ఒక గ్రంథం రాసాక ప్రజాబాహుళ్యం అవ్వడానికి సమయము పడుతుంది. అంటే అందరు తెలుసుకున్నాక అప్పుడు వికీ వాళ్ళు గుర్తిస్తారా? మేము మా గ్రంథాలకు ప్రాచుర్యము కల్గించాలి అనే ఉద్దేశ్యము మాకు ఏ కోశానా లేదు. యోగీశ్వరుల వారికి అంత కంటే అవసరము లేదు. ఇంత మంది ప్రపంచ జనాభాలో ఆయన రచించిన జ్ఞానాన్ని తెలుసుకోనే శ్రద్ధాళువు ఎక్కడో వుండి వుంటారు వారు కూడ తెలుసుకొంటారు అనే ఉడ్డేశ్యము మాత్రమే మాలో వుంది, అలా కాకపోతే Internet Library వున్నది దేనికి? యోగీశ్వరుల వారి రచనలు చదివితే తెలుస్తుంది ఇవి సమాజానికి ఎంత అవసరము అనీ. మొన్ననే ఒక గ్రంథము release అయ్యింది "జీహాద్ అంటే యుద్ధమా? అని ఆ గ్రంథము చదివిన వారు ఎవరు పవిత్ర యుద్ధము అంటు మనుషులను చంపరు. వాస్తవానికి మనము ఎవరో మనకే తెలియదు, మనల్ని ఆడిస్తున్న సూత్రధారి ఎవరో కూడా మనకు తెలియదు.ఆ విషయాలు తెలుసుకోమనే ఈ గ్రంథాలు చెపుతున్నాయి. సమ సమాజాన్ని స్థాపించే రచనల గూర్చి తెలియచేయడము విలువలు దిగజార్చుకోవడము ఎలా అవుతుంది??? మీరు చదివితే ఆ రచనల గొప్పదనము తెలుస్తుంది. ఈనాడు లేని సిద్ధాంతకర్తలు శంకరాచార్య, రామానుజాచార్య,మధ్వాచార్యల గూర్చి మాత్రము ఏ సందేహము లేకుండా వారి సందేఃహాస్పద రచనలు మాత్రము గుర్తిస్తాము. కాని సందేహాలకు తావు లేని, ఎదురాడని (జవాబులేని ప్రశ్న అంటూ లేని) జ్ఞానము అందిస్తున్న యోగీశ్వరుల వారి రచనలకు మాత్రము రూల్స్. ఒక సిద్ధాంత కర్త సమకాలీనులమైన మనము ఆయన రచనలకు ఏ పాటి విలువ ఇస్తున్నామో ఆలోచించండి. * ఈ సృష్టి చేసిన ఆ కృష్ణపరమాత్మ(creator of Universe)(Allah=paramaatma=Yehova) దిగి వచ్చినా, ఆయనే సృష్టించిన ఈ మానవ మేధస్సు ఆయననే ప్రశ్నింస్తుంది, నువ్వు చెప్పేదానికి ఆధారము వుందా అంటూ!!! అది నేటి మానవుని పరిస్థితి. ఇందుశ్రీ ఉషశ్రీ (వాడుకరి చర్చ:ఇందుశ్రీ ఉషశ్రీ) 01:00 27 అక్టోబరు 2014 (IST)
  • ఇందుశ్రీ ఉషశ్రీ గారూ, Article content does not determine notability - నేను ఇది పదే పదే చెబుతున్నాను. ఈ పుస్తకంలోని విషయాలకు ప్రాముఖ్యత లేదని చెప్పటం లేదు. మీకు ఈ విషయాన్ని ఒక ఉదాహరణతో చెబుతాను. నాలాంటి ఒక అనామకుడు రామాయణంపై ఒక పుస్తకం వ్రాశాడనుకొండి. ఆ పుస్తకానికి వికీపీడియాలో వ్యాసం ఉండేంత విషయప్రాధాన్యత లేదు అంటే అది రామాయణం వికీపీడియా ప్రమాణాలకు తగింది కాదు అన్న ఉద్దేశ్యం కాదు. Wikipedia is not a leading indicator of notability, but a lagging indicator of notability (ఆంగ్ల భాషా ప్రయోగాన్ని క్షమించాలి. నాకివి తెలుగులో ఎలా చెప్పాలో తట్టలేదు). బయట ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన తర్వాతనే వికీపీడియాలో చేరతాయి. అంతేకానీ బయట ప్రసిద్ధి పొందటానికో, ప్రాచుర్యం పొందటానికో వికీపీడియా దోహదపడదు. ప్రతి సమాజానికి కొన్నినియమాలు, పద్ధతులు ఉంటాయి. ఒక దేశంలో విమానం దిగగానే ఆ దేశపు చట్టాలన్నీ కొత్తవారిని బోధించటం ఎంత అసాధ్యమో, ఇక్కడ కొత్తగా చేరిన వారందరికీ అన్ని పద్ధతులు తెలియజేయటం అంతే కష్టం. నేను దాదాపు తొమ్మిదేళ్ళుగా వికీలో పనిచేస్తున్నాను. ఇప్పటికీ నాకు తెలియని పద్ధతులు, నిబంధనలు చాలానే ఉన్నాయి. ఇందు విజ్ఞాన వేదిక పుస్తకాలన్నీ వికీసోర్సులో చేర్చి, ఉడతాభక్తిగా ఇందు విజ్ఞాన వేదికకు ఎంతో కొంత దోహపడిందనే నేనకుంటున్నాను. --వైజాసత్య (చర్చ) 01:51, 27 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్యగారు మీ ప్రమాణాలు ఆ విధముగా వుంటే యధేఛ్ఛగా మీరు ఆ వ్యాసాలని తీసివేయండి. కాని పాఠకులకు ఇటువంటి గొప్ప గ్రంథాల పరిచయము లేకుండా పోతుంది. అర్ధ శతాధిక గ్రంథకర్త, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులువారు ఎవరో మునుముందు కాలములో అందరికి తెలియగలదు మాకు దైవ జ్ఞానాన్ని జ్ఞాన జిజ్ఞాసులకు తెలియచేయాలన్నదే ఒకే ఒక ఉద్దేశ్యము. అది ఈ వ్యాసాలు చదివిన తర్వాత జ్ఞాన జిజ్ఞాసులకు ఈ గ్రంథాలలో ఎదురాడని జ్ఞానం వుందని తెలిసి ఎంతో శ్రద్ధతో చదివి అసలయిన దైవ జ్ఞానము తెలుసుకొనే అవకాశము వుంటుంది. ఈ వ్యాసాలు తొలగించడము ద్వారా జ్ఞాన జిజ్ఞాసులకు ఆ అవకాశము పొగొట్టినట్టే కదా! అంతే తప్ప ఎటువంటీ ఆర్ధిక, ఏ ఇతర ప్రయోజనాలకో, ఉద్దేశ్యాలతోనో మా ఇందూ జ్ఞాన వేదిక పని చేయట్లేదు, తొలగించే ముందు ఒకసారి ఆలోచించండి. నమస్కారం.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 09:30 27 అక్టోబరు 2014 (IST)
  • వైజాసత్య గారు, ఇందుశ్రీ ఉషశ్రీ గారు మరియు మిత్రులకు ఈ పుస్తకాల యొక్క మరిన్ని సరియైన మూలాలు చేర్చబడాలి. పుస్తకాలలో పేర్కొన్నట్టుగా - ఈ గ్రంథ రచయిత శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు యోగులకే ఈశ్వరుడు(అధిపతి) అనగా యోగీశ్వరులు అయినందువల్ల వారి శరీరము నుండి దివ్యాత్మ ప్రత్యేకమైన, శాస్త్రబద్ధమైన, ఎదురాడని జ్ఞానాన్ని అందిస్తున్నది - అనేది సరియైన మూలం కాబోదు. పుస్తకాలను గురించి ఏదైనా మీడియాలో వచ్చిన కధానాలు, ఇతర వెబ్సైట్‌లలో కధానలను జతచేయాలి. అయితే ఏకమొత్తంగా ఇన్ని వ్యాసాలను తొలగించడం కూడా సరికాదు. మనం ఆంగ్లవికీని అనుసరించి చేస్తున్న కొన్ని విధానాలను సమీక్షించి మనకోసం కొన్నిటీని సవరించుకోవలసిన అగత్యం ఉంది. తదనంతరం ఇలాంటి వ్యాసాల గురించి చర్చించవచ్చు. అప్పటి వరకూ వీటిని తొలగించరాదని కొనసాగించాలని నా కోరిక..విశ్వనాధ్ (చర్చ) 04:38, 27 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ సమస్య ఇంతవరకు వచ్చిందీ అంటే అది ఖచ్చితంగా నిర్వహణ లోపమే. అర దశాబ్దం క్రితము ఎప్పటికప్పుడు కొత్త సభ్యుల రచనలు గమనిస్తూ సూచనలు చేస్తుండేవాళ్ళము. అప్పుడు కొత్త సభ్యులకు నియమాలపై మంచి అవగాహన మరియు పట్టు ఏర్పడేది. ఇటీవలి కాలంలో ఎవరికి వారు చేయబట్టే తెవికీ మొత్తం అస్తవ్యస్తం అయిపోతోంది. ఇదొక్కటే కాదు ఇంకనూ ఇక్కడ చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ చర్చ తీయడానికి నెలరోజుల ముందే వైజాసత్యగారు పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రతి పుస్తకానికి పేజీ అక్కరలేదని చర్చతీస్తే సహజంగానే దానికీ ప్రతిస్పందన కొరవడింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చర్చతీసిననూ పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఈ వ్యాసాలు ఇలాగే వదిలేస్తే ఇక ముందు ప్రతి రచయిత, సంస్థ తమ పుస్తక ప్రచారానికై తెవికీని ఆశ్రయించడం మామూలైపోతుంది. ఇది తెవికీ మూలనియమానికే పూర్తిగా విరుద్ధమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పుస్తక వ్యాసాల సంగతినే తీసుకుంటే ఈ వ్యాసాలు కూడా తెవికీ ప్రమాణాలకు అనుగుణంగా లేవు. పుస్తక సమీక్ష కంటే పుస్తక పరిశోధన వ్యాసాలుగానే అనిపిస్తున్నాయి (మౌళిక పరిశోధన అనేది వికీస్పూర్తికి విరుద్ధము). ఇక్కడ సభ్యత్వం తీసుకొని వ్యాసాలు వ్రాస్తూ కూడా తెవికీని పరాయి సంస్థగా చూస్తుంటే (ఉదా: "అందరు తెలుసుకున్నాక అప్పుడు వికీ వాళ్ళు గుర్తిస్తారా?") వాళ్ళు ఖచ్చితంగా వారి స్వంత ఉద్దేశ్యాలతో వచ్చినట్లుగానే భావించవలసి వస్తుంది. పుస్తక రచయిత గురించి ప్రత్యేకంగా పేజీ ఉన్ననూ, ప్రతి వ్యాసంలో దానికి లింకులున్ననూ మళ్ళీ ప్రతి పుస్తక వ్యాసంలో ఒక విభాగం ప్రత్యేకంగా రచయిత గురించి వ్రాసే అవసరం ఉన్నదా? అంతేకాకుండా వ్యక్తులకు ముందు గౌరవసూచక సంబోధాలు చేయరాదనే నియమానికి విరుద్ధంగా "శ్రీశ్రీశ్రీ" సంబోధాలు ఉండవచ్చా? ఫేస్‌బుక్, యూట్యూబ్ లింకులు ఉంచవచ్చా? త్రవ్విచూస్తే ఇలాంటి పొరపాట్లు చాలానే ఉన్నాయి, కాని వ్యాసాలే తొలగించే సమయం ఆసన్నమైనప్పుడు ఇవి చెప్పడం అనవసరం. వికీ నియమాలకు విరుద్ధమైనందున ఇలాంటి వ్యాసాలన్నీ పూర్తిగా తొలగించడమే ఉత్తమం, దీనిపై సభ్యుల అభిప్రాయాలు, ఓటింగులు కూడా పనిచేయవు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:47, 27 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది వికీ ఐదు మూల స్థంభాల నుండి యధాతథంగా "All articles must strive for verifiable accuracy, citing reliable, authoritative sources, especially when the topic is controversial or is on living persons. Editors' personal experiences, interpretations, or opinions do not belong." ఇందులో చర్చించడానికి ఏమీలేదు. తెలుగు వికీపీడియాలో మూల స్థంబాలనే తిరగరాస్తే ఇక వికీపీడియానే ఎందుకు. ఇందులోని సమాచారం మొత్తం ఎత్తుకు పోయి ఎక్కడైనా బ్లాగులోనో, సొంత వెబ్సైట్లో పెట్టుకోవటానికి వికీకి అభ్యంతరపెట్టడం లేదు. వికీ నియమాలు నచ్చని వారికి వికీ ఎప్పుడైనా వదిలి సొంత గూడు పెట్టుకొనే హక్కు ఉన్నది (right to fork) --వైజాసత్య (చర్చ) 00:38, 28 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వికీలో చాలాకాలంగా పనిజేస్తున్న నిర్వాహకులు, అధికారులకు కూడా మౌళిక విషయాలు తెలియపోవటం, సముదాయంలో సరైన శిక్షణ లోపించిందని భావిస్తున్నాను. అందుకూ నేనూ కొంతవరకు బాధ్యత వహిస్తున్నాను --వైజాసత్య (చర్చ) 00:43, 28 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
* ఈ పుస్తకాల విషయంలో కాకున్నా అభివృద్ది చెందుతున్న కొన్ని భాషా వికీలలో వికీ మూల స్థంభాలను కాకుండా కొన్ని సోంత పద్దతులను ప్రవేశపెట్టడం ద్వారా మరింత అభివృద్ది చెందవచ్చునని మళయాల వికీ ద్వారా తెలుస్తున్నది. మక్కికి మక్కి ఆంగ్లవికీని అనుసరించడం అనేది ప్రాంతీయ బాషా వికీలలో సాద్యం అయినా అది పూర్తి అభివృద్ది నిరోధకంగా పరిణమిస్తుందని మిగతా భారతీయ భాషా వికీపీడియన్ల ద్వారా నేను తెలుసుకొన్న ఒక విషయం. (కొన్ని విషయాలు ఇక్కడ చదవచ్చు])అభివృద్ది కొరకు కొన్ని మార్పులతో (ఎప్పటికప్పుడు) వికీని నవీకరించడం ద్వారనే చిన్న సముదాయాలు ముందుకు దూసుకెళ్ళడం, వాడుకరులను పెంచుకోవడం జరుగుతున్నాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా స్తబ్ధంగా ఉన్న తెలుగు వికీ గత సంవత్సరంగా నాణ్యతా పరంగా, సంఖ్యాపరంగానూ కొంత మెరుగుగా ఉంది. వికీ అబివృద్ది చెందే కొద్దీ, బాట్‌లు, మూసలు, టెక్నికల్ ఉపకరణాల వినియోగం ఎక్కువగా జరుగుతుండడం వలన కొత్త సభ్యులు అర దశాబ్ధం ముందులా వెంటనే విషయ అవగాహన చేసుకోలేకపోతున్నారు. కనుక కొత్త సభ్యులకు వనరుల సృష్టి, సమాచారంపై అవగాహన జరగాలంటే నెలవారీ సమావేశాలు, అవగాహనా కార్యక్రమాలు వంటివి జరగాలి. వాటి ద్వారా విధి విధానాల రూపల్పన, నిర్వహణాపరమైన లోపాల నివారణ వంటివి నిర్వహకులూ, అధికారులూ, సభ్యులూ తెలుసుకోగలుగుతారు.(నిజానికి ప్రస్తుతం నెలవారీ సమావేసాలకే పైకి క్రిందకు చూడవలసి వస్తున్నది. ఇక ఇలాంటి శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చే సభ్యులెందరు ?, పాల్గొనే సభ్యులెందరు ?) ఉన్న కొందరితోనే మరింత అభివృద్ది సాదించే దిశగా మనప్రయత్నాలు ఉంటే బావుంటుంది. పైన లింకులో ఉన్న
  1. కొత్త వాడుకరులను దూరంగా ఉంచటం.
  2. ఫౌండేషన్ వారు బలవంతంగా సాఫ్టువేర్ మార్పులను రుద్దటం.
  3. కఠినమైన విధానాలను కాస్త సరళీకరించడం.
  4. సీనియర్ సభ్యులను తికమక పెట్టి, లేదా వారిని వికీకి దూరం చేసే పనులు.
  5. ఫౌండేషన్ నుండి వచ్చే సమాచారం, సంభాషణలు ప్రాంతీయ భాషలోనే ఉండాలి.

ఇలాంటి వాటి గురించి మనమూ ఆలోచించి సరియైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏది ఏమైనా రాసిన వ్యాసాలను వికీకి అనుగుణంగా మార్చగలరా అనేది పరిశీలించి వారికి కొంత సమయం ఇవ్వడం, దానికి మిగతా వికీ సభ్యులు సహకరించడం జరగాలి. ఒక్కసారిగా 45 వ్యాసాలను తుడిచేయడం సరికాదని నా అభిప్రాయం...విశ్వనాధ్ (చర్చ) 08:16, 28 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్లవికీ నియమాల ప్రకారం పోయి పుస్తకాలలోని విషయ ప్రాముఖ్యతను బట్టి తెవికీలో వ్యాసాలను తయారుచేయాలంటే ఒక 10 శాతం తెలుగు పుస్తకాల గురించి కూడా మనం వ్యాసాలు వ్రాయలేము. ఇక్కడ విషయ ప్రాముఖ్యతను ఎవరు నిర్ణయిస్తారు అనేది ముఖ్యం. నేను పుస్తకాల ప్రాజెక్టును కొంతకాలం కొనసాగించాను. నేను పుస్తకంలోని విషయాల ప్రాముఖ్యతను బట్టి వ్యాసాల్ని తయారుచేశాను. బహుశా పుస్తకాల గురించి సుమారు 200 వ్యాసాలు నేను చేర్చాను. ఈ పైన పేర్కొన్న ఆంగ్లవికీ నియమాల ప్రకారం నిర్ణయించుకొంటే ఈ వ్యాసాలన్నీ కూడా తొలగించవలసినవే. నేను ఈ పుస్తకాల గురించి వ్యాసాలు తయారుచేయడానికి ఒక ముఖ్యమైన కారణం (నియమాలను పక్కనపెట్టి) తెవికీలోనున్న మూలాల సమస్యకు ఈ పుస్తకాలు తెవికీలోని వ్యాసలకు మూలాలుగా ఉపయోగపడతాయని మాత్రమే. వీటిని చేర్చడం వలన నాకేమీ వ్యక్తిగత ప్రయోజనం లేదు (నేను రచయితకు గాని, ప్రచురణకర్తకు గాని సంబంధించిన వ్యక్తిని కాదు). ప్రస్తుతం వ్యక్తిగత గ్రాంటీగా పవన్ చేస్తున్న ప్రాజక్టు (తెలుగు సమాచారం అందుబాటులోకి) లో నేను చురుకుగా పాల్గొనడానికి కూడా ముఖ్యమైన కారణం ఇదే. మన ప్రాచీన గ్రంథాలకు కూడా విషయప్రాముఖ్యత నిర్ణయించబడాలంటే దేనిగురించి కూడా మూలాలు దొరకవు. అయితే ఆ ప్రాజెక్టు క్రింద మేము పుస్తకంలోని సమాచారాన్నే తీసుకొని వ్యాసం వ్రాస్తున్నాము. అవికూడా ఆంగ్లవికీ నియమాలకు వ్యతిరేకమే. వైజాసత్యగారు, చంద్రకాంతరావు గారు వీటి గురించి మరికొంత ఆలోచనచేసి, పుస్తకాల గురించిన వ్యాసాలన్నింటినీ సమీక్షించి తర్వాత విషయప్రాముఖ్యత లేని పుస్తక వ్యాసాలను తొలగించండి. నేను నెలవారీ సమావేశాలను నిర్వహిస్తున్నాను. తెలుగు వికీపీడియాలో రచించేవారే దొరకడం కష్టంగా వున్నప్పుడు, సమావేశాలకు వచ్చేవారు 3-5 గురు మాత్రమే, వారుకూడా వికీ గురించి తెలిసిన సీనియర్లే. కొత్తవారు, తెలుగులో వ్రాయడానికే కష్టపడుతుంటే వారికి ఎలా ఈ నియమాల్ని నేర్పించాలి, నేర్పించి ఎందుకు భయపెట్టాలి. చంద్రకాంతరావు గారు నియమాల ఉల్లంఘన సమయానికి తప్పకుండా తెవికీలో ప్రవేశించి విస్తృతంగా తమ కోపాన్ని వెల్లగక్కుతారు, వారు తెవికీ అభివృద్ధికి, సహ వికీపీడియన్లకు, కొత్తవారికి సహాయపడితే బాగుంటుంది. అన్ని సమావేశాలకు వ్యక్తిగతంగా ప్రాధేయపడినా వారికది ముఖ్యం కాదు. తెవికీ నాణ్యత దిగజారుతుందని మాత్రం వీరు బాధపడుతుంటారు. కానీ దానికి మనం ఏం చేస్తున్నాం అని ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.

ఇంక అసలు విషయానికి వస్తే భారతీయ భాషలలో (మూలాల సమస్య కలిగిన) విషయ ప్రాముఖ్యత గురించిన నియమాలను మనం (తెవికీ సముదాయం) మన స్వంత మార్గదర్శకాలను రూపొందించుకోవడం దీనికి ఉత్తమమైన మార్గం. నా యీ అభిప్రాయాల వ్యక్తీకరణలో ఎవరినైనా బాధిస్తే క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 11:41, 28 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, మీరు ఆవేదనకు, కోపానికి తేడా గుర్తించడం లేదు. తెవికీలో జరుగుతున్న లోటుపాట్లు, ఉల్లంఘనలు పరిశీలించేవారికే ఈ ఆవేదన అర్థం అవుతుంది. తెవికీ ఇంకనూ మొదటిదశను అధికమించలేదు. నాణ్యతా పరంగా, వ్యాసాలపరంగా, చురుకైన సభ్యులపరంగా చూస్తే ఇంకనూ చేయాల్సింది చాలా ఉంది. ఇలాంటి సమయంలో కూడా సభలు, సమావేశాలలో పాల్గొనడమే ముఖ్యమైతే మీరు పాల్గొనండి కాని ఇతరులను బలవంతం చేయకండి. ఇది ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వం కాబట్టి ఆన్‌లైన్ సేవలు మాత్రం తప్పకుండా నా నుంచి ఉంటాయి ఇదే నాకు ముఖ్యం. ఇక్కడ పనిచేయడం మాకు వృతి కాదు ప్రవృత్తి మాత్రమేనని గుర్తించుకోండి. పరిస్థితులు చక్కబడితే మునుముందు నేనూ సమావేశాలు నిర్వహించే రోజు రావచ్చునేమే అంతేకాని సమావేశాలకు హాజరుకారాదని నేనేమి కంకణం కట్టుకోలేదు. అందులోనూ రోజూవారీ వృత్తినిర్వహణలో తీరికలేకుండా ఉంటూ ఏ అర్థరాత్రికో సమయం లభ్యమైనప్పుడు ఉడుతా భక్తిగా తెవికీకి తోడ్పడుతున్నాను. నేను కేవలం చర్చా సమయంలోనే తెవికీలో ప్రవేశించడం లేదనేది నా దిద్దుబాట్లే చెబుతాయి. అయితే మునపటిలా అన్ని చర్చలలో పాల్గొనకపోవడానికి కారణం మరియు కొన్నేళ్ళ క్రితం వరకూ నిర్వహించిన నిర్వహణ పనులకు ఇప్పుడు తాత్కాలికంగా దూరంగా ఉండటానికి కారణం మళ్ళీమళ్ళీ చెప్పను. తెవికీని సంస్కరించడానికి, తెవికీ నియమాలు కొత్తవారికి తెలియజేయడానికి నేను ప్రత్యేకంగా బ్లాగు కూడా ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని అగ్రిగేటర్లలో కలిపిననూ పోస్టులు వేసిననూ అంతర్జాలంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో తాత్కాలికంగా మానివేశాను. సమావేశాలే ముఖ్యమని చెప్పే మీరు సమావేశాలు నిర్వహించని రోజులతో పోలిస్తే ఇప్పుడు తెవికీ ఎందుకు దిగజారిందో మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:06, 28 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్యగారు చర్చ తీసినది పుస్తకాలలోని విషయ ప్రాధాన్యత అంశం కాదు, పుస్తక వ్యాసాలలోని విషయ ప్రాధాన్యత గురించి మాత్రమే. ఇదే విషయం పదేపదే చెప్పిననూ మళ్ళీ రాజశేఖర్ గారు "పుస్తకాలలోని విషయ ప్రాముఖ్యత" గా అర్థం చేసుకొని దాని గురించే ఆవేదం వ్యక్తం చేశారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:16, 28 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్యగారూ వ్యక్తిగత ఆసక్తితో ఒక చిన్న సందేహం అడుగుతున్నాను. ఆంగ్ల వికీపీడియాలోని పుస్తకాల నోటబిలిటీ సూత్రాలను పరిశీలించాను. The book has been considered by reliable sources to have made a significant contribution to a significant motion picture, or other art form, or event or political or religious movement. అన్న సూత్రం ప్రకారం రెలిజియస్ మూవ్ మెంటుకు సంబంధించి ప్రాముఖ్యత కలిగిన పుస్తకాలు నోటబిలిటీ ప్రమాణాలు అందుకున్నట్టేగా. ఇప్పుడు ఇందూ జ్ఞాన వేదిక వారి పుస్తకాల విషయంలో వారిది ఒకానొక ప్రాముఖ్యమైన మతపర ఉద్యమం అని అంగీకరిస్తే ఈ పుస్తకాల్లోని కొన్ని (మరీ ముఖ్యంగా వారి మూలసూత్రాలు కలిగినవి) నోటబిలిటీ ప్రమాణాలు అందుకుంటాయా? ఇంతకీ త్రైత సిద్ధాంతానికి సంబంధించిన ఈ ఉద్యమం అంత ప్రాముఖ్యత కలిగినది అవునా కాదా? దాన్ని నిర్ధారించడానికి మనం ఏ ప్రమాణాలేమైనా నిర్ధారించుకున్నామా?(ఈ విషయంలో ఆంగ్ల వికీ పనికివచ్చేట్టు నాకు కనిపించలేదు. ఎందుకంటే అక్కడ మతపరమైన సంస్థలకు నోటబిలిటీ ప్రమాణాలు రాసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యినట్టుగా నా గమనింపు.) --పవన్ సంతోష్ (చర్చ) 01:32, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
*విశ్వనాథ్ గారూ, ఆ నివేదిక వ్రాసినప్పుడే చదివాను. అందులో మూలస్థంబాలను పక్కన పెట్టాలని ఎక్కడాలేదు. మూలస్థంబాలు ఆంగ్ల వికీ యొక్క స్థానిక నియమాలు కావు. భాషలకు అతీతంగా వికీపీడియా మొత్తం నిలబడి ఉన్న స్థంబాలు. మీకు అర్ధం కావటం లేదు తెలుగు వికీపీడియాలో వికీని తీసేస్తే అర్ధం లేదు. ఇది పైపై మెరుగుల్లాంటి సాఫ్టువేరులు, ఇతరత్రా నియమాల గురించి కాదు. అర్జునరావు గారు ఆంగ్ల వికీ నుండి కొత్త నియమాలు, పద్ధతులు అమలు చేసినప్పుడల్లా, నియమాలు సముదాయన్ని అనుగుణంగా సముదాయంలోనుండే పుట్టాలని నేను పదే పదే చెప్పాను. నేను ఇప్పటికీ అదే మాటపై నిలబడి ఉన్నాను. కానీ మూలస్థంబాలు ఉల్లంఘించలేని నియమాలు.
*వ్రాసినదానికి ఆధారం ఉండాలన్నది చాలా మౌళిక నియమం. దానికి మినహాయింపు ఇవ్వలేము. దైత్వం, ఆద్వైతం, కర్మ సిద్ధాంతం, రామాయణం, మహాభారతం ఇలా కొల్లలకొద్ది పౌరాణిక వ్యాసాలను మూలాలతో సహా వ్రాసిన్నప్పుడు, ఈ ఇందూ జ్ఞాన వేదిక వ్యాసాలకే ఆధారం దొరకవు అంటే విచిత్రంగా ఉంది. తైత్ర సిద్ధాంతం అంతగా బయటి ప్రపంచంలో ప్రాచుర్యం పొందితే నేనే స్వయంగా ఆధారాలతో సహా వ్యాసం వ్రాసి తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను
*ఓపెన్ సోర్స్ ఉద్యమం, క్రియేటివ్ కామన్స్, వికీపీడియా తదితర సంస్థలు అవినాభావ సంబంధం కలవి అంతమాత్రం చేత అవి ఒకటి కావు. ఇందూ విజ్ఞాన వేదిక తమ పుస్తకాలను కామన్స్ లైసెన్సు ద్వారా పునర్విడుదల చేయటం చక్కని అభినందించదగిన విషయం. కానీ అదే కారణంతో వికీపీడియా ఆయా పుస్తకాలకు ప్రచారం కల్పించలేదు, కూడదు. సీఐఎస్ సంస్థకు వివిధ పుస్తకాలను కామన్స్ ద్వారా విడుదల చేయించటం ఒక లక్ష్యం అయి ఉండవచ్చు. కానీ అది వికీపీడియా లక్ష్యం కాదు. (వికీపీడియా లక్ష్యాలు, వికీమీడియా ఫౌండేషన్ లక్ష్యాలు కూడా భిన్నమైనవని గ్రహించాలి). అలా చాలా పుస్తకాలు కామన్స్ లైసెన్సుతో విడుదలైతే వికీపీడియాకు పరోక్షంగా సహాయపడుతుందా? ఓ, తప్పకుండా. కానీ అది వికీపీడియా లక్ష్యం కాదు.
*ఇంతగా మీరు ఈ ఇందూ విజ్ఞానవేదికను వెనుకేసుకొస్తున్నారంటే మీరు వికీపీడియా తరఫున ఇందూ విజ్ఞానవేదిక పుస్తకాలపై వ్యాసాలు వ్రాసి వాటికి ప్రచారం కల్పిస్తామని ఆ సభలో ఏమైనా వాగ్ధానం చేశారా? ఇది సముదాయాన్ని ప్రభావితం చేసే నిర్ణయం, కాబట్టి సముదాయానికి తెలియాలి.
*చివరగా ఒక విషయం. పైన ఇందుశ్రీ గారు, వికీపీడియాలో వ్యాసాలు తీసేస్తే ఈ జ్ఞానం పదిమందికీ చేరకుండా పోతుందని అన్నారు. స్వయం ప్రచురణ చాలా సులభమైన ఈ రోజుల్లో ముద్రించడానికి బ్లాగులు, వెబ్సైట్లు, ప్రచారానికి ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఉండగా తదితర మాధ్యమాలు బోల్డన్ని ఉండగా, వికీపీడియాలో వ్యాసాలు లేనంతమాత్రాన కొరవడిందేమీ లేదు. --వైజాసత్య (చర్చ) 02:00, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ :-) చక్కని ప్రశ్న. మీ ప్రశ్నకు నా ప్రతిప్రశ్న. ఆంగ్ల వికీపీడియాలో రాద్ధాంతాలు పక్కన పెడదాం. త్రైత సిద్ధాంతం మతోద్యమమా కాదా అన్నది కాదు ప్రశ్న. ఇది ఇంకా మౌళికమైనది. మీరు ఉదహరించిన సూత్రంలోనే కీలకం ఉంది. significant contribution చేసిందని reliable sources ద్వారా చూపించమని అడుగుతున్నాం. పోనీ అదీ కాదు, contribution చేసిందని third-party sources (unbiased or not) ద్వారా చూపించమంటే కూడా లేదు. అక్కడొచ్చింది సమస్య. రహంతుల్లా గారు త్రైత సిద్ధాంతం గొప్ప సిద్ధాంతమని చెప్పినప్పుడు నేను పనిగట్టుకొని అధారాలు చేర్చుదామని వెతికా, ఫేసుబుక్లో వీరిపేజీ, వీరి వెబ్‌సైటు, తెలుగు వికీ తప్ప మరెక్కడా సమాచారం దొరకలేదు --వైజాసత్య (చర్చ) 02:12, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నిజానికి ఇది త్రైత సిద్ధాంతం గురించిన చర్చ కూడా కాదు. ఇందూ జ్ఞాన వేదిక ప్రచురించిన పుస్తకాలపై వ్యాసాల గురించే (ఖరాఖండిగా ఆంగ్ల వికీ స్థాయిలో నియమాలు ఇక్కడ అమలుచేస్తే ఈ సిద్ధాంతంపై వ్యాసంతో పాటు, స్వామీజీ పై వ్యాసం కూడా ఉండదగినవి కావనుకుంటా..కానీ ఇంత వదులుగా నియమాలను అమలు చేస్తున్నందుకు నన్నేదో యమకింకరునిలా చూస్తున్నట్టున్నారు..హ్హిహ్హిహి (-:) --వైజాసత్య (చర్చ) 02:25, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు ఈ పుస్తకాల సంబందించిన వ్యాసాలలో నేను రాసినది ఒక్క పదం కూడా లేదు, వాళ్ళు క్రియేటివ్ కామన్స్ సభకు నేను హాజరు కాలేదు. అయితే రాస్తున్నపుడే వీటి గురించి చర్చించి ఉంటే నేనందుకు అభ్యంతరం వ్యక్తం చేసిఉండేవాడిని కాను. ఎన్నోవ్యాసాలుగా అభివృద్ది చేసిన తరువాత వాటిని తొలగించడం కంటే వికీకి అనుగుణంగా మార్చగలిగే వీలు ఉండేలా మార్గాలను మీలాంటి వారు వెతికి పట్టుకుంటే బావుంటుంది..... (కానీ ఇంత వదులుగా నియమాలను అమలు చేస్తున్నందుకు నన్నేదో యమకింకరునిలా చూస్తున్నట్టున్నారు)... వదులుగా నియమాలు మలు చేస్తే యమకింకరునిలా ఎందుకు చూస్తారు సార్. యమకింకరుడు సినిమా హీరోలానే చూస్తారు :) .....విశ్వనాధ్ (చర్చ) 05:46, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారూ, నేను వీటిని ఇటీవలే చూడటం జరిగింది. చూసిన వెంటనే చంద్రకాంతరావు గారన్నట్టు రచ్చబండలో వ్రాశాను. దీని ముందు వ్యాఖ్యలో చెప్పినట్టు ఆధారాలు చేర్చటానికి నేను ప్రయత్నించాను కూడా. వికీలో మూలాలు చూపించని వ్యాసాలు చాలానే ఉన్నాయి (గ్రామాలు, సినిమాలు తదితర) కానీ వాటికి చేర్చాలంటే మూలాలు దొరుకుతాయి. ఇక నమ్మకమైన ఆధారాలు వెతికినా, దొరకనివాటిని ఏం చేస్తాం? (ఆంగ్ల వికీలోగా ఆధారాల ప్రామాణికత, ఆధారాల యొక్క బేరీజు, వాటి నిష్పాక్షిత అలాంటివన్నీ సమాజం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వస్తాయి..కానీ అంత తీవ్రమైన స్థాయిలో తెలుగు వికీ ప్రస్తుతానికి లేదు). --వైజాసత్య (చర్చ) 06:23, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలు జరిగాక ఏదో ఒక పరిష్కారం లభించాలి. దీనికై నాదో చిన్న అలోచన- ప్రస్తుతం ఈ వ్యాసాలకు కొంత సమయం(సుమారు నెల అనుకోవచ్చు) ఇస్తే ఆఫ్ వికీలో,ఆన్ వికీలో మనం కొంత ప్రయత్నం చేద్దాం. అప్పటికీ సరియైన మూలాలు జతచేయలేకపోతే వీటిలో ఎన్ని తొలగించవచ్చో నిర్ణయించుకొని చేయవచ్చు. (దీనిలో నాకెటువంటి స్వంత ఆశక్తి లేదు. ఒక్కసారిగా అందరు చేసిన కృషి, అన్ని వ్యాసాల్ను తొలగించడం ఇష్టం లేకనే)...సహ సభ్యులకు ఆమోదయోగ్యమైతే ఇక ఈ చర్చ ఆపేయవచ్చు...విశ్వనాధ్ (చర్చ) 07:08, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే --వైజాసత్య (చర్చ) 07:14, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇక్కడ వికీపీడియా పాలసీల గురించి కొంత వివరణ మరియు సూచనలు ఇవ్వాలనుకుంటుంన్నాను. ఎవరినీ, ఏ సంస్థనూ సమర్ధిస్తూనో లేక విమర్శిస్తూనో చేస్తున్న ప్రయత్నం కాదు అని గమనించగలరు. వైజాసత్య గారు వికీ మూల స్థంభాల గురించి ప్రస్తావించారు. అవి ఏమిటి అంటే
  1. వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం
  2. తటస్థ దృక్కోణం
  3. స్వేచ్ఛగాపంచుకోగల విషయమైన వికీపీడియా ఎవరిచేనైనా మార్చుటకు వాడుటకు, సవరించుటకు మరియు పంపిణి చేయటకు వీలైనది
  4. వికీపీడియా తోటి సభ్యులతో - వారితో మీరు ఏకీభవించకపోయినా - మర్యాదపూర్వకంగా నడుచుకోండి
  5. ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు

విషయ ప్రాముఖ్యత మరియు విషయ నిర్ధారణ అనేవి వికీ మూల స్థంభాలు కావు అనేది మనం గమనించాలి. విషయ ప్రాముఖ్యత అనేది ఒక Guideline (మార్గదర్శకం) మరియు విషయ నిర్ధారణ ఒక Core content policy. అయితే ఇవి రెండూ కూడా ఆంగ్ల వికీ లో చాలా చర్చల ద్వారా అమలులోకి వచ్చాయి మరియు ఒక నిర్ధిష్టమైన పాలసీలుగా తయారయ్యాయి. వీటిని కొన్ని వికీ సముదాయాలు తమ Linguistic Universe కి అనుగుణంగా మలుచుకున్నాయి. మరికొన్ని ఇంతవరకు నిర్ధిష్టమైన అవగాహనకు రాలేదు. E.g. ఒక రచయిత ప్రాముఖ్యమున్నవాడా, అనడానికి మళయాళం వాళ్ళు కనీసం 5 ప్రచురణలు ఉంటేకాని ఆ రచయితపై వ్యాసం విషయ ప్రాముఖ్యత కలిగిందని అనరు. అదే తమిళం లో 1 ప్రచురణ ఉన్నా అ రచయిత విషయ ప్రాముఖ్యత కలిగిన వాడిగా గుర్తిస్తారు.
మన తెవికీ నాణ్యతా పరంగా అభివృద్ధి చెందాలంటే వీటితో పాటు మిగతా పాలసీలపై సముదాయంలో చర్చ జరగాలి. అయితే ఇందుజ్ఞాన వేదిక పుస్తకాలపై చర్చ మన సముదాయానికి ఒక మంచి అవకాశంగా మనందరం భావించి, ఎలాంటి పుస్తాకాలు విషయ ప్రాముఖ్యత కలవో మనం చర్చించి ఒక సమిష్టి అవగాహనకు వస్తే మంచిది అని నా అభిప్రాయం.
విషయ నిర్ధారణ గురించి ఓ రెండు వాక్యాలలో ముగిస్తాను. ఆంగ్ల వికీలో Verifiability (విషయ నిర్ధారణ) చూస్తే పాశ్చాత్య దేశాలకు మాత్రమే అవి ఎక్కువ వెసులుబాటుగా ఉన్నాయి. ఎందుకంటే మనవి Oral Cultures అయితే అవి advanced print cultures. ఆంగ్లవికీలో కూడా భారత దేశానికి సంభందించిన వ్యాసాలు చాలా తక్కువగా ఉండటానికి ఇది ఒక ప్రధాన కారణం. ఈ విషయాన్ని పరిశోధించడానికి ఒక ప్రాజెక్టు కూడా జరిగింది. అందులో గణాంకాలు చూడండి. నేను చెప్పదలచుకున్నదేమిటంటే ఈ local and complex విషయాలను మనం దృష్టిలో ఉంచుకొని విషయ నిర్ధారణ గురించి మనం ఒక అవగాహనకి రావాలి.
ఇక, పైన చర్చిస్తున్న పుస్తాకాల గురించి: అవి తెవికీసోర్సులో ఉన్నందున, ఆ పుస్తకానికి సంభందించిన వ్యాసంలో తటస్థ దృక్కోణం ఉందో లేదో నిర్ధారణ చేయవచ్చుమరియు సవరించనూ వచ్చు. కనుక ఆ పుస్తకాన్నే వ్యాసానికి మూలంగా వినియోగించుకోవడంలో మన తెవికి నాణ్యత తరగదని నా అభిప్రాయం. "విషయ ప్రాధాన్యత-పుస్తకాలు" తో ఒక తెవికీ పాలసీకి ఈ చర్చ తోడ్పడుతుందని, వైజా సత్య గారు తెవికీ లోకకల్యాణం కోసం చేసిన ఈ చర్యను మనం సద్వినియోగ పరచుకుంటామని ఆశిస్తున్నాను. --విష్ణు (చర్చ)09:50, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విష్ణు గారూ, నేను అక్షరాల వికీ మూల స్థంభాలలో తటస్థ దృక్కోణం వివరిస్తున్న పేరా నుండే యథతథంగా వ్యాఖ్య వ్రాశాను. మీరనట్టు మూలాలు చూపించకపోవటానికి చాలా అరుదైన సందర్భాలలో కొంత హేతువుంది. కానీ Oral Culture అనేది ఇక్కడ వర్తించదు ఎందుకంటే నేను వ్యాసంలోని విషయానికి అధారాల గురించి మాట్లాడటం లేదు. పైన చర్చలో ఉన్న పుస్తకాలు మౌఖిక ప్రచారంలో వచ్చినవి కాదు. సామాజిక మాధ్యామాల యుగంలో సిర్కా 2012లో ప్రచురించబడినవి. మిగిలినా మీడియా ఎవరు వీటిని గుర్తించలేదు కానీ వికీపీడియా వారు వీటిని వెలికితీసి గుర్తిస్తాం అంటున్నారు. ఇక నే చెప్పేదేమీ లేదు --వైజాసత్య (చర్చ) 06:18, 30 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు విషయనిర్ధారణ గురించి నేను చేసింది ఒక generic point. పై పుస్తకాలగురించి కాదండి,please గమనించగలరు. --విష్ణు (చర్చ)10:58, 30 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విష్ణు గారూ, నన్ను క్షమించండి. అది చాలా స్థూల వ్యాఖ్య అని గుర్తించినా, చాలా narrow గా అన్వయించినందుకు. అప్పుడప్పుడు నా ఓపిక, సంయమనాన్ని, ఆవేశం జయిస్తూ ఉంటుంది :-) --వైజాసత్య (చర్చ) 05:45, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్య బాబోయ్ వైజాసత్య గారు... ఏమిటండీ ఇం త పెద్ద మాట అనేసారు... క్షXXX అనే బదులు మీలాంటీ వికీపీడియను తిట్టినా నాకు బాగుంటుందండీ.. ఎందుకంటే...
తనువెల్ల యెదలై
యెదలెల్ల మళ్ళెలై
వికసించిన మనసులు, మనుషులు
నా తెవికీపీడియనులు
నా తెవికీపీడియనులుఅనుకునేవారిలో మీరూ ఉన్నారండీ... కాబట్టీ ఆమాటను తుడిచివేయండి.... నేనే చేసేవాన్ని కానీ తెలిసి తెలిసి తప్పు సేయనేల అని మీకు విన్నవించుకుంటున్నాను  :) --విష్ణు (చర్చ)11:39, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
హ హ హాహా (ఎన్.టి.ఆర్. స్టైల్ వికటాట్టహాసపు నవ్వు)...విశ్వనాధ్ (చర్చ) 11:43, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
హహ్హహ్హ.. నా మీది మీకున్న అభిమానానికి ధన్యుడను --వైజాసత్య (చర్చ) 10:49, 1 నవంబర్ 2014 (UTC)

విషయప్రాముఖ్యత - పుస్తకాలు[మార్చు]

వైజాసత్య గారు, మీ వ్యాఖ్యను బట్టి పుస్తకాలలోని విషయానికి ప్రాముఖ్యత కలిగినా, పుస్తకానికి అవి వర్తించవు అని భావించాల్సిందేనా. అయితే ఒక మంచి పుస్తకంలోని విషయాలను తెవికీలో చేర్చి ఆయా పుస్తకాలకు మూలాలుగా చూపిస్తున్నాము. కానీ ఆ విషయాలను గురించి చదువరులకు తెలియజేసిన పుస్తకాలకు మాత్రం వ్యాసాలు ఉండకూడదు. ఎలాంటి పుస్తకాల గురించి (అందులోని విషయాన్ని ప్రక్కనపెట్టి) వ్యాసాలు ఉండాలో, దయచేసి నా క్లారిటీ గురించి ఒక 2-3 పుస్తకాల గురించిన వ్యాసాలను తయారుచేసి చూపించగలరా. పుస్తకాల ప్రాజెక్టులో నడిపినా కూడా ఇంకా వాటిలో ఏయే పుస్తకాల వ్యాసాలు ఉంచాలి; వేటిని తొలగించాలని నాకు స్పస్టంగా అర్ధం కావడానికి మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 07:33, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దీన్ని రెండువైపుల నుండి చూడవచ్చు. ఉదాహరణకు రామాయణం తీసుకుందాం. చాలా గొప్ప ఇతిహాసం. రామాయణం - అసలు ఇతిహాసం మీద ఒక వ్యాసం ఉంటుంది. దాని గురించి చర్చించాల్సిన పనేలేదు. రామాయణం మీద కొన్ని వందల (వేలు కూడా కావొచ్చు) పుస్తకాలు వచ్చాయి, రామాయణంపై వచ్చిన అన్ని పుస్తకాలకీ వ్యాసాలు అవసరం లేదు. కొన్ని ప్రాచుర్యం పొందిన వాటికి మాత్రమే వ్యాసాలుంటాయి రామాయణ కల్పవృక్షం, రామాయణ విషవృక్షం తదితరమైనవి. ఎందుకంటే వీటిపైనే తర్జనభర్జనలు, సమీక్షలు, ఇతరమాధ్యమాలో వీటిగురించి చర్చలు జరిగిఉంటాయి. ఎంతోకొంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. పుల్లారావు పబ్లిషర్సు వారి పొట్టి రామాయణం, వెంకాయమ్మ పొడుగు రామాయణం వంటి పుస్తకాలకు వికీపీడియాలో వ్యాసాలు అవసరం లేదు. ఎందుకంటే వాటిపై వ్యాసాలు వ్రాద్దామన్నా మూలాలు దొరకవు. అలాంటి వాటినే విషయప్రాధాన్యత లేని పుస్తక వ్యాసాలుగా పరిగణించవచ్చు. ఇప్పటి దాకా అర్ధమైన విషయం ఏమిటంటే మనం రామాయణం యొక్క ప్రాముఖ్యతను ప్రశ్నించడం లేదు. అలాగే రామాయణంలోని విషయాలకు మూలాలు, ఆధారాలు చూపించమని కూడా అడగట్లేదు. ఇక రెండో పార్శ్వం విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగులో ఒక గొప్ప రచయిత, కవి. అయన వందలాది రచనలు చేసి ఉండవచ్చు. పైన ఉదహరించినట్టు కల్పవృక్షంపై వ్యాసం ఉన్నది. అదే ఆయన లాగులేసుకొనే వయసులో దుర్భిణీ (ఉత్తుత్తి) అనే నవలను వ్రాసారనుకొండి, దానికి వ్యాసం అవసరం లేదు. ఎందుకంటే వ్యాసం వ్రాద్దామన్నా పెద్ద విషయమేమీ దొరకదు. మహా అయితే విశ్వనాథ గారి వ్యాసంలో ఇది కూడా ఆయన రచన అని ఒక ముక్క వ్రాస్తాం లేదా రచనల జాబితాలలో చేరుస్తాం.
మరి ఏ పుస్తకంపై వ్యాసం ఉండదగింది, ఏ పుస్తకంపై వ్యాసం అవసరం లేదు అని ఎలా నిర్ణయిస్తాం? అది వ్యాసం వ్రాసేవారి సొంత అభిప్రాయంపై ఆధారపడదు. అక్కడే మూలాలు సహకరిస్తాయి. ఒక పుస్తకం గురించి ఇతర పుస్తకాల్లో ఉదహరించారా? పత్రికల్లో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ ఈ పుస్తకాన్ని సమీక్షించారా? చర్చించారా? అన్నవి ముఖ్యం. ఇది చాలా బేసిక్ అనాలిసిస్. తెవికీ అభివృద్ధి చెందుతున్న కొద్ది ఈ ఉదహరింపులు ఎలాంటివైతేనే పరిగణించాలి మొదలైన ఇతర నియమాలు చేసుకోవచ్చు. ఉదాహరణకు "విశ్వనాథ వారు లాగులేసుకొనే వయసులో దుర్భిణీ (ఉత్తుత్తి) నవల వ్రాశారు" అని ఈనాడు, వార్త, సాక్షి పత్రికలో వార్తవచ్చిందని ఒక మూలం చూపిస్తే, అలాంటి ఏకవాక్య ప్రస్తావనలు విశ్వనాథ గారి వ్యాసంలో పెట్టవచ్చేమో కానీ దుర్భిణీ (ఉత్తుత్తి) నవలకు వ్యాసం సృష్టించేందుకు ఆధారం కాదు. ఆపై వ్యాసం సృష్టించేందుకు సమాచారం ఏమీ ఉండదు. ఇలాంటి నియమాలన్నీ వ్రాసుకోవచ్చు. కానీ తొలి అడుగుగా అసలు ఏదో ఒక మూలం ఉంటేగా.
సొంత వెబ్సైట్లలో మూలాలు, బ్లాగులు, ఫేస్బుక్లో సమాచారం మూలంగా ఎందుకు భావించరు అంటే, అవి ఎవరైనా వ్రాసే వీలుంది, సొంతడబ్బా కొట్టుకొనే వీలుందికాబట్టి. వాటి విశ్వసనీయత అంచనా వేయలేము కాబట్టి. ఇవి కృత్రిమంగా ఒక వ్యక్తికి లేదా విషయానికి ప్రాధాన్యతను కల్పించగలవు. ఉదాహరణకి నా స్థాయిలో ఉన్న పరిశోధకులు ప్రపంచంలో కొన్ని లక్షలమంది ఉంటారు. నేను వికీపీడియాలో వ్రాస్తుండటం వళ్ళ వైజాసత్య పేరు గూగుళ్లో చాలా వందల పేజీల్లో వస్తుంది. అంతమాత్రంచేత వైజాసత్య చాలా ఫేమస్ అని అనుకొని వ్యాసం సృష్టించకూడదు. తెలుగు వికీపీడియన్లపై వ్యాసాలు సృష్టించడాన్ని నేను అందుకే వ్యతిరేకించింది. --వైజాసత్య (చర్చ) 08:27, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మీ విపులీకరించిన సమాధానానికి ధన్యవాదాలు. పుస్తకంలోని సమాచారం గురించి గాక పుస్తకాల గురించిన సమీక్షలు గాని జరగాలి. Citation Index అనగా ఇదేనేమో. నేను పుస్తక ప్రాజెక్టు క్రింద తయారుచేసిన పుస్తకాలను మరొకసారి తిరిగిచుస్తాను. మీరు కూడా ఒకసారి వర్గీకరించబడిన తెలుగు పుస్తక వ్యాసాలను పరిశీలించి అసలు వ్యాసం ఉండకూడని పుస్తకాల వ్యాసంలో కూడా తొలగింపు మూసను చేర్చండి. నేను వాటిని ఇతర వ్యాసాల్లోనో, రచయిత వ్యాసంలోనో విలీనం చేసి పుస్తకం వ్యాసాన్ని తొలగిస్తాను. మరొకసారి ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 11:19, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
చక్కని పుస్తకాల వ్యాసాల ఉదాహరణలు చూపించాలంటే నందోరాజా భవిష్యతి వ్యాసం చూడండి. పవన్ సంతోష్ గారూ ఇలాంటివి ఇంకా అనేక చక్కని పుస్తకవ్యాసాలు వ్రాశారు --వైజాసత్య (చర్చ) 11:12, 1 నవంబర్ 2014 (UTC)
  • ఈ విషయం చక్కని చర్చలోకి దారితీయడం చాలా సంతోషకరం. దీనికి పాదులు వేసిన వైజాసత్య గారికి, రాజశేఖర్ గారికి, విష్ణు గారికి తదితరులకు ధన్యవాదాలు. వైజాసత్య గారి లాంటి వ్యక్తి నుంచి చక్కని ప్రశంస లభించడం నాకు వ్యక్తిగతంగా చాలా ఉత్సాహం, ఆనందం కలిగించింది. ఆయన చెప్పిన చాలా విషయాలు మంచి అవగాహనను కలిగించాయి. అయితే The book's author is so historically significant that any of his or her written works may be considered notable. This does not simply mean that the book's author is him/herself notable by Wikipedia's standards; rather, the book's author is of exceptional significance and the author's life and body of written work would be a common subject of academic study. అన్న సందర్భంలో హిస్టారికల్లీ నోటెడ్ గా ఎవర్ని తీసుకోవచ్చు. ఆ ఎక్సెప్షనల్ సిగ్నిఫికెన్స్ ఎలా నిర్ధారించేది? --పవన్ సంతోష్ (చర్చ) 19:21, 2 నవంబర్ 2014 (UTC)
ప్రతిసారీ ఆంగ్ల వికీనోటబిలిటీ ప్రమాణాలు సంప్రదించడంపై సహసభ్యులు క్షమించాలి. పుస్తకాలకు తెవికీలో పుస్తకాల వ్యాసాలకు ప్రత్యేకించి అటువంటి ప్రమాణాలు లేవనుకుంటున్నాను. అందుకే ఇలా చేయవలసివస్తోంది. (ఐతే తెలుగుకే ప్రత్యేకించిన పలు ప్రమాణాలు ఉంటే బావుంటుంది. ఎందుకంటే తెలుగులో లిఖిత, ముద్రిత సాహిత్య విస్తృతి ఆంగ్ల సాహిత్యంతో పోల్చడానికి లేదు. ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే దాదాపు 20 ఏళ్ళ వరకూ లిఖిత సాహిత్యంతో సమాంతరంగా, సాహిత్య విమర్శ విధానాలు ప్రసంగాలు, వాదవివాదాల్లో జరిగినాయి.)--పవన్ సంతోష్ (చర్చ) 19:30, 2 నవంబర్ 2014 (UTC)
పవన్ సంతోష్ గారూ, క్షమించమని అడగవలసిన అవసరం లేదు. ఆంగ్లవికీలోని నియమాలను సంప్రదించడం చాలా మంచి అలవాటు. ఎలాంటి నియమాలు, ఎందుకు ఈ నియమాలు అవసరం అన్న వాటిపై విస్తృతంగా చర్చలు జరిగి/జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని ఎంతవరకు అమలుచేయాలి అన్ని విషయంలో వచ్చినప్పుడు మన వికీ స్థాయిని దృష్టిలో పెట్టుకుంటే చాలు. ఇక మీరు అడిగిన విషయానికొస్తే, పైన చెప్పిన హిస్టారికల్లీ నోటెడ్ రచయితలకు ఉదాహరణలుగా విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీరి సాహిత్యంపై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. వీరు వ్రాసిన ప్రతి పుస్తకానికీ వ్యాసం వ్రాయదగినంత ప్రాముఖ్యత ఉందనుకున్నా, వ్యాసం వ్రాయటానికి విషయం ఉండాలి. ఇక్కడ ఇది విషయప్రాధాన్యతను దాటి ఇతర విషయాలకు వస్తుంది. దీనికి విస్తరించే అవకాశం ఉందా? రచయిత పేజీలోనే దీన్ని కలపలేమా వంటి విషయాలు పరిగణలోకి వస్తాయి. అందుకే ఆంగ్ల వికీలో ఆ ఐదు బండగుర్తుల్లాంటి నియమాలకు దిగువన "These criteria are rules of thumb for easily identifying books that Wikipedia should probably have articles about. In almost all cases, a thorough search for independent, third-party reliable sources will be successful for a book meeting one or more of these criteria. However, meeting these criteria is not an absolute guarantee that Wikipedia should have a separate, stand-alone article entirely dedicated to the book." అని వ్రాశారు. బోల్డన్ని స్వతంత్రమైన, నమ్మదగిన మూలాలను సూచించగలిగితే ఎలాంటి చెత్తసాహిత్యంపైన అయినా వ్యాసాలు సృష్టించవచ్చు. ఎందుకంటే వికీపీడియా సాహిత్యవిలువలను బట్టి ఒక పుస్తకంపై వ్యాసం ఉండాలా లేదా అన్నది నిర్ణయించదు --వైజాసత్య (చర్చ) 06:50, 4 నవంబర్ 2014 (UTC)

నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) - వాండలిజం[మార్చు]

వాడుకరి:Nayeevaidya గారు నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వ్యాసంలోని విలీన ప్రతిపాదనను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసివేస్తున్నారు. ఈ విషయాన్ని వారికి తెలియజేసినా తిరిగి తీసివేశారు. గమనించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:23, 24 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

"సుల్తాన్ ఖాదర్" garu nayeebeamhanulu(vaidya bramhanulu) wikipedia create chesindi nene and miru mangali Wikipedia lo nayeebramhanula manobavalu debbatise vidamga konni vakyalu raseru avi miku chepenu

"Pani leni mangali pilli bochhu gokinatlu" ane samitalu miru twaraga tisivetali.inko padam mangali varu antaranivaru kadu ane matakuda tisiveyamani miku ippatike chalasarlu chepa kani miru spandinchadamledu enta twaraga vilayite anta twaraga aa matter ni tisiveyalani na manavi..

వాడుకరి:Nayeevaidya, మంగలి వ్యాసంలో మంగలి వారు అంటరానివారు కాదు అనే వాక్యం నేను రాయలేదు. దయచేసి వ్యాస చరిత్రను చూసి నిర్థారించుకోగలరు. ఇక సామెతల విషయనికి వస్తే తెవికీ లోని కొన్ని వ్యాసాలలో ఇదివరకే ఇవి ఉన్నాయి. కావాలంటే ఈ లింకు దూదేకుల#దూదేకుల సాయిబుల మీద సామెతలు చూడగలరు. మంగలి వ్యాసము సంరక్షింపబడి వికీ అధికారుల పర్యవేక్షణలో ఉన్నది. వారు వ్యాసాన్ని చూసి తెవికీ నియమ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకునేవరకు సంయమనం పాటించమని మనవి. మంగలి కులాన్ని కించపరిచే ఉద్దేశ్యము నాకు ఎన్నడూ లేదు. నా బాల్య మిత్రులలో మరియు ఇప్పటి కుటుంబ మిత్రులలో అత్యధికులు వారే. వారి ఇంటికి మరియు మా ఇంటికి మధ్య రాకపోకలు కూడా ఉన్నాయి. మా ఇంటి శుభకార్యాలన్నీ వారి చేతులమీదుగా ప్రారంభమయ్యాయి. మీకు ఇదివరకే చెప్పాను మరియు ఇప్పుడు కూడా చెబుతున్నాను. తెవికీ లోని విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:41, 24 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Nayeevaidya గారు, వికీపీడియా ఏ సామాజికవర్గపు మనోభావాలను కానీ, ఏ దేశప్రజల అభీష్టాలను కానీ పట్టించుకోదు. కేవలం నిష్పాక్షిక ధోరణితో, ఆధారబద్ధంగా మాత్రమే రచనలు చేయాలని చెబుతుంది. మంగలి వారు అంటరానివారు కాదు అనే వాక్యం వెంటనే తొలగిస్తాను, కానీ పనిలేని మంగలి సామెత వాడుకలో ఉన్నదే కాబట్టి దాన్ని తొలగించవలసిన అవసరం లేదు. కానీ మీరు ఈ సామెతల చేర్చటం వ్యాసంలో ప్రధానమైన అంశానికి అక్కడ అవసరం లేని సమాచారం అని వాదించవచ్చు. --వైజాసత్య (చర్చ) 10:37, 25 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

"వైజాసత్య" garu miru Wikipedia lo ala sametalu petadani chala mandi nayeebramhanulu vyatirekincharu andukane tisiveyamanamu.miru unchina sametalani chalamandi tappuga antunaru"panileni mangalodu pilli atu.... Gikutunadanta ani" ento miku ardam ayiuntundi anukuntuna.nenu face book lo mangalu wikipedia mention chesa aa word undatam valla chala mandi serious ayaru.inka wikipedia ni oka community ki sambandinchina website laga use cheyatamla akkada aa mater anta undakarledu asalu mangali profession ela stary ayindi ani vatigurinchi clear ga rayandi emina information kavalante na dagara 100% information undi. Ex: viswabrahmin,padmasali Wikipedia example ga tisukondi.. Nenu rasina matalu miru pariganaloki tisukovalani korukuntunanu.. Nayeebramhanula original profession ayurvedam asalu kshurakudu ane padam ela vachindi ante ayurvedamni prapanchaniki chatichepina person "charaka" ayana vaidya profession ni prati uriki veli rich & poor ane teda lekunda chesevadu ayana,ayana sisyulani "charakalu" ane vallu aa tarvata rogula pranalu kapadataniki barbe profession introduce cheseru aa tarvata "charakulu" ane name kasta "kshurakulu" ga marindi.. Thq sir na matalani pariganaloki tisukunanduku

Meta RfCs on two new global groups[మార్చు]

Hello all,

There are currently requests for comment open on meta to create two new global groups. The first is a group for members of the OTRS permissions queue, which would grant them autopatrolled rights on all wikis except those who opt-out. That proposal can be found at m:Requests for comment/Creation of a global OTRS-permissions user group. The second is a group for Wikimedia Commons admins and OTRS agents to view deleted file pages through the 'viewdeletedfile' right on all wikis except those who opt-out. The second proposal can be found at m:Requests for comment/Global file deletion review.

We would like to hear what you think on both proposals. Both are in English; if you wanted to translate them into your native language that would also be appreciated.

It is possible for individual projects to opt-out, so that users in those groups do not have any additional rights on those projects. To do this please start a local discussion, and if there is consensus you can request to opt-out of either or both at m:Stewards' noticeboard.

Thanks and regards, Ajraddatz (talk) 18:04, 26 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వేడి వేడి చర్చలు[మార్చు]

పైన జరిగిన చర్చలో ప్రతి విషయానికి స్పందిస్తే చర్చ తప్పుదోవ పడుతుందని కొన్ని ఇతర విషయాలకు స్పందించలేదు. నా వ్యాఖ్య(లు) ఎవరి కృషిని తక్కువ చేయటానికి వ్రాసినవి కాదు. వికింట మరియు బయటా వికీ అభివృద్ధికి చేసిన, చేస్తున్న కృషి సర్వదా అభినందనీయం. ఇన్నేళ్ళ తర్వాత కూడా మళ్ళీ చాలా మౌళికమైన విషయాలను కూడా అనుభవజ్ఞులైన సభ్యులకు గుర్తు చేయవలసిన వస్తున్నదన్న ఆవేదన తప్ప మరేం కాదు. బయటి సమావేశాలు తప్పవు, కానీ వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏదేని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే సమావేశాలకు హాజరు కాని, కాలేని వారిని పక్కకు నెట్టినట్టు అవుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకొంటే మళ్ళీ అది సముదాయానికి నివేదించాలి. వికీ సాధారణంగా నిర్ణయాలు తీసుకునేందుకు బయట సమావేశాలను ప్రోత్సహించదు (శిక్షణకు, సమాచార మార్పిడికి తప్పించి). ఎందుకంటే బయట జరిగే పనులపైన సముదాయపు నియంత్రణ ఉండదు (పైన జరిగిన నిసార్ గారి ఉదంతంలో సోదాహరణంగా చెప్పాను). ఒకరినొకరు కలుసుకొని అవగాహన పెంచుకోవటానికి, వికీ శిక్షణకు ఈ సమావేశాలు చక్కగా ఉపయోగపడతాయి. సమావేశాలు నిర్వహిస్తున్న రాజశేఖర్ గారికి, ప్రణయ్‌రాజ్ తదితర సభ్యులకు కృతజ్ఞతలు. సమావేశాలు, వికీలో పనిలాగే ఐచ్ఛికాలు. వీటిలో పాల్గొనటం, పాల్గొనక పోవటం ఆయా సభ్యుల ఇష్టం. సమావేశాలలో పాల్గొననందుకు నిందించకూడదు. కొన్నేళ్ళ క్రితం వరకు తెవికీలో పనిచెయ్యటం సరదాగా ఉండేది. ఎవరైనా కొన్నాళ్ళు సెలవు తీసుకుంటున్నాం అంటే, అలాగే స్వకార్యాలు పూర్తిచేసుకున్న తర్వాతే తిరిగి రండి అని సాగనంపేవాళ్ళం. ఆ తర్వాత "మీరు నిర్వాహకులు కదా, రోజూ ఇక్కడ ఎందుకు కనపడటం లేదు?" అన్న ధోరణి బయలుదేరటంతో, ఎదో ఉడతాభక్తిగా మాతృభాషకు సేవ చేసుకుందామంటే ఇదేమి తలనొప్పిరా బాబు అని అనిపించింది. అందరమూ మన తెలుగు భాషలో పదికాలాలు నిలిచే చక్కని విజ్ఞానసర్వస్వం తయారుచేయటానికి కృషిచేస్తున్నాం. చిన్న చిన్న మనఃస్పర్ధలు పక్కన పెట్టి అందరూ కలసి పనిచేస్తారని ఆశిస్తున్నాను. నేను చాలా గర్వపడే, ఆశ్చర్యపడే విషయమేవిటంటే ఇక్కడ ఇంతమంది తెలుగువాళ్ళు కలిసి పనిచేస్తున్నా, ఏదో చిన్న చిన్న వాగ్వివాదాలు తప్ప, చర్చలు చాలావరకు సహృద్భావంతోనే జరుగుతాయి. ఇతర తెలుగు ఫోరంలలో చర్చలు ఎప్పుడైన చూశారా? --వైజాసత్య (చర్చ) 06:08, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మీరన్నది నిజమే, గతంలో అర్జునరావుగారు చాట్‌లో తీసుకున్న నిర్ణయాలు తెవికీలో అమలుపర్చడానికి ప్రయత్నించినప్పుడు కూడా నేను తీవ్రంగా వ్యతిరేకించాను. తెవికీ చర్చలే మనకు ముఖ్యం. అలాగే మీరన్నట్లు తెవికీ పరిస్థితిలోనూ మార్పు వచ్చింది. నేను పై చర్చలో పాల్గొనగానే నా చర్చా పేజీలో ఉన్న బొమ్మకు తొలగింపు ట్యాగ్ చేర్చబడింది. దానికీ, దీనికీ సంబంధం ఏమిటో కాని సభ్యపేజీలలో, చర్చా పేజీలలో ఉన్న వాక్యాలకు కూడా ఆధారాలు కావాలట! వ్యాసం పేజీలలో ఉన్న బొమ్మలకు వర్తించే నిబంధనలు, సభ్యపేజీలలో, వ్యాసేతర పేజీలలో ఉన్నవాటికి కూడా వర్తంచలేము. ఇదివరకు కూడా ఒక సభ్యుడు ఈ బొమ్మ చర్చాపేజీలో వ్రాస్తూ అందులో నా స్వంత అభిప్రాయాలున్నాయని తెలిపారు. నా స్వంత అభిప్రాయాలంటే నేను గర్వపడతాను, కాని ఒక విషయం- అది స్వంత అభిప్రాయాలే అనుకున్ననూ చర్చాపేజీలలో కూడా మన స్వంత అభిప్రాయాలు రచించక ఇంకెక్కడ వ్రాయాలో తెలిపితే బాగుంటుంది. నేను తెలంగాణ ప్రాజెక్టులో పనిచేస్తుంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలంటూ ఐపీ అడ్రస్‌తో ఒక సభ్యుడు వ్రాస్తాడు. ఇక్కడ నిబంధనలకు లోబడి ఎవరికి తోచిన పనులు వారు చేయవచ్చు. నేను వ్రాసే వ్యాసాలలో ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలున్నాయో తెలిపితే బాగుంటుంది. అలాంటి వ్యాఖ్యలు చేర్చాలంటే నా వద్ద లేవని కాదు, అలా చేస్తే పరిస్థితి దారుణంగా మారుతుందని అర్థం చేసుకుంటే చాలు. అప్పటి సురవరం ప్రతాపరెడ్డి నుంచి ఇప్పటి జైపాల్ రెడ్డి వరకు చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ మేధావులు, రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు, ఉద్యమకారుల వ్యాఖ్యలు ఆధారాలతో సహా నా వద్ద ఉన్నాయి. ఇప్పటివరకు అలాంటిపని చేయలేను, అలా చేసే ఉద్దేశ్యం కూడా లేదు, సభ్యులు కూడా నన్ను అనవసరంగా రెచ్చగొట్టకుండా ఉంటే చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:03, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తత్సమానమైన ప్రముఖుల వ్యాఖ్యను పెట్టుకోండి. అప్పుడు సొంత అభిప్రాయం అన్న అపవాదు రాదు. సమస్య ఇక్కడ సభ్యుని పేజీలో వ్యాఖ్య గురించి కాదనుకుంటా. ఇది బొమ్మ రూపంలో ఉండటం వలన ఇది ఎవరైనా, ఎక్కడైనా అమర్చుకొని ఇది మీ వ్యక్తిగతమైనదిగా కాకుండా, వికీపీడియాది అని పొరపాటు పడవచ్చు, వ్యాసాలలో ఉపయోగించే అవకాశం ఉంది. --వైజాసత్య (చర్చ) 07:44, 30 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈవారం బొమ్మ[మార్చు]

హంపిలో గల మల్లిఖార్జున స్వామి ఆలయం, కర్నాటక\హంపిలో గల మల్లిఖార్జున స్వామి ఆలయం, కర్నాటకఫోటో సౌజన్యం: Udayaditya Kashyap/ ఈ పుటలో కనబరిచిన ఆలయం బొమ్మ అందులో తెలియజేసినట్లు కర్నాటక/హంపిలో లేదని నా స్థిర నమ్మకము. నానమ్మకానికి అధారమేమంటే..... నేను హంపిలో ప్రతి ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పోటోలు తీశాను. ఆయా ఆలయాల వివరాలు కూడ నామోదు చేశాను. వాటిలో ఈ ఆలయం లేదు. వివరాలు లేవు. దాన్ని నేను ఎలా వదిలిపెట్టానో అర్థం కావడం లేదు. ఆ ఆలయం ఏ ప్రాంతానికి చెందినదో పరిశీలించమని వినతి. Bhaskaranaidu (చర్చ) 13:14, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

"Mallikarjuna Temple was built by King Vikramadiyta's second queen Trilokyamahadevi in 745. Mallikarjuna was formerly known as Trailokeshvara which is situated just next to Virupaksha temple.This temple is also was constructed by Rani Trilokyamahadevi to celebrate the victory (by Vikramaditya II) over the Pallavas." అని ఈ బొమ్మను అప్లోడ్ చేసిన కష్యప్ బొమ్మ చరిత్రలో వ్రాసివున్నది. గమనించండి.Rajasekhar1961 (చర్చ) 13:37, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
..... అవును నిజమే.... నేనూ గమనించాను. అయినా నా సందేహం తీరలేదు. అందుకు కారణం. ఇవి కూడ చూడండి.
https://en.wikipedia.org/wiki/List_of_State_Protected_Monuments_in_Karnataka
S-KA-65 Temples of Haridev and Mallikarjuna; old shrine of Daridevi Belgaum
http://asi.nic.in/asi_protected_monu_karnataka.asp.... క్రమ సంఖ్య 65 చూడండి

దీనిప్రకారము ఈ ఆలయము కర్నాటక / బెల్గాం లో వున్నట్టు వ్రాయబడివున్నది. ఏది నిజమో???? Bhaskaranaidu (చర్చ) 14:13, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

బహుశా ఆ ప్రదేశం పట్టడకల్లు కావచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 16:07, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారు బహుశా.... అని సందేహాస్పదంగా చెప్పినా అది నిజంగానే తోస్తున్నది. పట్టడకల్లు లోని ఆలయాల ప్రాంగణాలలో {బొమ్మలో} ఈ ఆలయం కూడ వున్నది. ఈ ఆలయం ఎక్కడ వున్నది అన్న దానికంటే..... ఇది హంపి లో లేదు అని నేను వెలుబుచ్చిన సందేహమే నిజమైంది. నాసందేహ నివృత్తికి రహ్మానుద్దీన్ గారికి నెనరులు. ఈ వారం బొమ్మక్రింద వివరాలలో తగు మార్పులు చేస్తే బాగుండునేమో?? Bhaskaranaidu (చర్చ) 18:08, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మౌఖిక మూలాలు[మార్చు]

విష్ణు గారు ఉదహరించిన ఒక ప్రాజెక్టును చూశాను, అందరూ సినిమా చూసి చప్పట్లు కొట్టినట్టుంది. ఆ తర్వాత దాని గురించి ఏమీ చేసినట్టులేరు. ఎందుకో ఊహించగలను. ఇలాంటి వాంగ్మూలాలను, విశ్వసనీయమైన సమాచారంగా అక్కడ నుండి జ్ఞానంగా మార్చటం చాల కష్టం. అది పరిశోధకులకే వదిలెయ్యటం మంచిది. కర్రాబిళ్ల మీద వ్యాసం వ్రాయటానికి ఊరికి వెళ్ళనవసరం లేదు. తెలుగులో నేదునూరి గంగాధరం గారి పుస్తకాలు తిరగేస్తే చాలు. ఇలాంటివెన్నో ఆయన సేకరించారు. మౌఖిక సాంప్రదాయాలను కాపాడుకోవాలంటే, సశాస్త్రీయంగా సేకరించి, విశ్లేషించి, గ్రంథస్థం చేయటమో, బ్లాగస్థం చేయటమే తప్ప మరో సులువైన దారి లేదు. వికీపీడియా అందుకు సరైన సాధనం కాదు. --వైజాసత్య (చర్చ) 10:27, 30 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Hello, Dear wikipedians. I invite you to edit and improve this article and to add information about your and other country.--Kaiyr (చర్చ) 13:39, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K PO Selection[మార్చు]

Dear Wikipedians,
CIS-A2K is seeking applications for the post of Programme Officer (Institutional Partnerships). The position will be based in its Bangalore office. Programme Officer will collaboratively work with the A2K Team and would report to the Programme Director, Interested applicants are encouraged to deeply engage with the CIS-A2K Work Plan before making the application. The last date of submitting applications is November 14, 2014. You can also find the job posting on our website (http://cis-india.org/jobs/programme-officer-institutional-partnership).
Thank you
రహ్మానుద్దీన్ (చర్చ)
Program officer, CIS-A2K

నవంబర్ నెల మొలకల జాబితా (అక్టోబర్ నెలలో రూపొందించబడినవి)[మార్చు]

నవంబర్ నెల మొలకల జాబితా ఇక్కడ చూడగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 18:40, 1 నవంబర్ 2014 (UTC)

రహ్మానుద్దీన్ గారూ, నెలనెలా కొత్త మొలకల జాబితాను తయారుచెయ్యటం కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 00:51, 2 నవంబర్ 2014 (UTC)
ఎప్పటిలాగానే మొలకలను అందరం కలసి అభివృద్ధి చేద్దాము. కొత్తవారికి వాటిని విస్తరించి సహాయం చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 07:15, 3 నవంబర్ 2014 (UTC)
  • సైట్ నోటీసు చాలా బావుంది. త్వరలోనే మొలకలు చెట్లుగా ఎదిగి ఫలించాలి. విష్ణు గారికి అభినందనలు.--పవన్ సంతోష్ (చర్చ) 07:36, 4 నవంబర్ 2014 (UTC)
సైట్ నోటీస్ డిజైన్ చాలా క్లుప్తంగా మరియు ఆకర్షనీయంగా ఉన్నది. ప్రతినెల మొలకల జాబితా చేర్చిన ఒక వారం పదిరోజులు ఈ సైట్ నోటీసు చేరిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 03:47, 7 నవంబర్ 2014 (UTC)
ఈ సైట్ నోటీసు పెట్టిన తర్వాత ఏవైనా వ్యాసాలు వృద్ధి చెందాయా? చెందివుంటే వాటి సంఖ్య ఎంత? కేవలం కుతూహలంతో అడుగుతున్నాను.--స్వరలాసిక (చర్చ) 01:15, 17 నవంబర్ 2014 (UTC)
మీరు ఒకసారి ఆ పుటను పరికించి పరిశీలించండి. అభివృద్ధి అయిన వాటిని లేదా అవసరం లేని వాటికి అడ్డంగా గీత గీసి ఉంటుంది. JVRKPRASAD (చర్చ) 01:25, 17 నవంబర్ 2014 (UTC)

మెదటి పుటలో నోటీసు[మార్చు]

మొదటి పుటలోని నోటీసులు ఉపయోగ కరంగా వుంటున్నాయి. అటు వంటి నోటీసు వెంబడి కొత్తగా చేరేవారి అవగాహన కొరకు మరొక నోటీసు కూడ శాస్వత ప్రతిపాధికన పెడితే బాగుండును. ప్రతిరోజు పదుల సంఖ్యలో క్రొత్తవారు వికీపీడియాలో తమ ఖాతా సృష్టిస్తున్నారు. వారిలో 90 శాతం మంది కనీసం తమ స్వీయ పరిచయము కూడ పొందుపరచడము లేదు. కనుక కొత్తగా ఖాతా తెరిచే వారు, వారి స్వీయ పరిచయముతో బాటు వారి విలాసము, ఫోన్ నెంబరు మొదలగు నవి కూడ పొందు పరిస్తే సీనియర్ వికీపీడియన్లు వారితో సంప్రదించి, ఉత్సాహ పర్చి వ్యాసాలు వ్రాసే దిశగా వారిని ప్రోత్సహించి కార్యోన్ముఖులను చేసేందుకు అవకాశముంటుంది. కనుక అటు వంటి నోటీసు చిరకాలము ఉండేట్లు పెడితే బాగుండును. Bhaskaranaidu (చర్చ) 16:54, 5 నవంబర్ 2014 (UTC)

ఇదొక మంచి ఆలొచన. ఒక నెల పరీక్షిస్తే బాగుంటుంది. కొత్త వాడుకరుల స్పందన చూసి దానిని కొనసాగించాలా లేదాయని ఆలోచించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 03:53, 7 నవంబర్ 2014 (UTC)

New Wikipedia Library Accounts Now Available (November 2014)[మార్చు]

Apologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!

The TWL OWL says sign up today :)

The Wikipedia Library is announcing signups today for, free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for:

  • DeGruyter: 1000 new accounts for English and German-language research. Sign up on one of two language Wikipedias:
  • Fold3: 100 new accounts for American history and military archives
  • Scotland's People: 100 new accounts for Scottish genealogy database
  • British Newspaper Archive: expanded by 100+ accounts for British newspapers
  • Highbeam: 100+ remaining accounts for newspaper and magazine archives
  • Questia: 100+ remaining accounts for journal and social science articles
  • JSTOR: 100+ remaining accounts for journal archives

Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team.23:19, 5 నవంబర్ 2014 (UTC)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message to The Wikipedia Library Global Delivery List.
హైబీమ్, క్వెస్టియా, జేస్టోర్ మనకు బాగా పనికొచ్చే జర్నల్ డేటాబేసులో. వీటికి సభ్యత్వం కొనుక్కోవాలంటే వందలాది డాలర్లు అవుతుంది. చక్కని మూలాలతో వ్యాసాలు వ్రాయలనుకున్నవాళ్ళు తప్పకుండా ఉచిత అకౌంటుకై ధరఖాస్తు చేసుకోండి. నాకు చరిత్ర పిచ్చి కాబట్టి నేను జేస్టోరుకు దరఖాస్తు పెట్టుకున్నాను --వైజాసత్య (చర్చ) 03:34, 7 నవంబర్ 2014 (UTC)
దయచేసి మిగిలిన డాటాబేసుల ప్రధాన సమాచారం తెలియజేస్తే; నేను కూడా వానిలో సభ్యత్వం తీసుకుంటాను.--Rajasekhar1961 (చర్చ) 05:17, 7 నవంబర్ 2014 (UTC)
హైబీమ్ లో చాలాదేశాలకు చెందిన అనేక వార్తాపత్రికలు ఉంటాయి, దానితో పాటే చాలా ఆకడెమిక్ జర్నల్లు కూడా, క్వెస్టియా లో దాదాపు 80 వేల పుస్తకాలున్నాయి. --వైజాసత్య (చర్చ) 11:50, 10 నవంబర్ 2014 (UTC)

జనాబా లెక్కలు[మార్చు]

రహమనుద్దీన్ గారు 2011 జనాబాలెక్కల సైట్ ను మన సౌలభ్యముకొరకు ఎక్కడో పెట్టినట్లు నేను చూశాను. ప్రస్తుతం అది కనబడడము లేదు. రహమనుద్దీన్ గారు గానీ, మరెవరైనా గానీ 2011 జనాబా లెక్కలు వివరాలున్న సైట్ లింకు ఇవ్వగలరా?...భాస్కరనాయుడు (చర్చ) 14:15, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]