వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 21

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మల కాపీ హక్కుల గురించి ఇంత పట్టుదల ఎందుకు?

వికీపీడియా నియమాల ప్రకారం విషయ సంగ్రహం ఏదైనా - పాఠం (text) గాని బొమ్మలు కాని - కాపీ హక్కులను ఉల్లంఘించరాదు. కానీ బొమ్మల విషయంలో ఈ నియమాలు ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయబడుతాయి. ఇందుకు కారణాలు.

  • వేరొకరికి హక్కులున్నది అనుమతి లేకుండా వికీలో వాడుకుంటే అది చౌర్యం క్రిందే లెక్క
  • వికీ ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇక్కడ "స్వేచ్ఛ" అంటే - ఇతరులు ఇందులోని విషయాన్ని స్వేచ్ఛగా వాడుకోచ్చు. అంతే గాని ఇతరుల సొమ్మును వికీలో స్వేచ్ఛగా వాడకూడదు.
  • ఒక మంచి చిత్రాన్ని చేయడానికి ఆ చిత్రకారుడు లేదా ఫొటోగ్రాఫర్ కష్టపడవలసి వస్తుంది. కనుక వారి కష్టాన్ని అప్పనంగా వాడేసుకో తగదు.
  • పాఠం కంటే బొమ్మల కాపీని తేలికగా పట్టుకోవచ్చును.


దయ చేసి సరైన ఉచిత కాపీహక్కులు లేని బొమ్మలను వికీలోకి అప్‌లోడ్ చేయవద్దు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా