వికీపీడియా:సమావేశం/జూన్ 9,2013 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు[మార్చు]

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

సమావేశం నిర్వాహకులు[మార్చు]

సమావేశంలో పాల్గొన్నవారు[మార్చు]

చర్చించిన అంశాలు[మార్చు]

  • తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు పరిశీలన. సుమారు వెయ్యి మంది ప్రముఖుల జీవితచరిత్రలు ఒక వేదిక మీదకు వచ్చాయి. వానిలో 80 శాతం వ్యాసాలు మొలక స్థాయిలో ఉన్నాయి. ఈ నెల మొలక అభివృద్ధిమీద దృష్టి పెట్టాలని సూచించారు.
  • ఆంధ్ర మహాభాగవతము పూర్తి పాఠం మరియు ఆడియో వికీసోర్సులో చేర్చుట. నెట్ లో సాంబశివరావు గారితో సమావేశంలో ఉండగానే మాట్లాడి వారి అనుమతి తీసుకొవడం జరిగింది. అయితే ఆయన సూచించిన మేరకు పోతన భాగవతాలు తొమ్మిది రకాలుగా ఉన్నాయని; తన కృషిని ప్రత్యేకంగానే వుంచమని కోరారు. ఆ విధంగా పోతన తెలుగు భాగవతము అని సాంబశివరావు గారి పేరుమీద ఈ మొత్తం అంతా వికీసోర్సులో ఉంచడానికి అంగీకరించారు. తెలుగు అకాడమీ వారి భాగవతంతో కలపవద్దని మనవిచేసుకున్నారు.
  • మొదటి పేజీ - మార్పులు చేర్పులు - అభిప్రాయాలు. ఒక్కొక్కరి అభిప్రాయాలను తెలియజేయమని; అన్నింటిని పరిశీలించిన పిమ్మట తగినవిధంగా మార్పులు చేయవచ్చునని నిశ్చయించాము.
  • ఇంతవరకు రాసిన వ్యాసాలు, ఇకపై రాయాలనుకుంటున్న వ్యాసాల గురించిన చర్చ.
  • శేఖర్‌బాబు మరియు పి.ఆర్.ఎస్. శర్మ గారు ఈసారి కొత్తగా చేరారు.
  • విద్య - ఉపాధి తదితర అంశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించడానికి బండి శ్రీనివాస శర్మ ప్రతిపాదించగా మల్లాది గారు సమర్ధించి; అందరి ఆమోదంతో తెలుగు వికీపీడియాను నేటి యువతకు చేరువచేయడానికి; అంతర్జాల మాధ్యమంలో అందరికీ ఈ పోటీ వివరాలు తెలియజేయడానికి అంగీకరించాము. ఈనెల విద్య-ఉపాధి ప్రాజెక్టును సైట్ నోటీసులో ఉంచడానికి కూడా తీర్మానించాము. ఎనిమిది ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పోటీ విధివిధానాలు నిశ్చయించాము.
  • తెలుగు విక్షనరీలో తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు చేరిక పూర్తయిందని భాస్కరనాయుడుగారు తెలియజేశారు. తర్వాత తెలుగు అకాడమీవారి తెలుగు నిఘంటువు నుండి శాస్త్రవిజ్ఞానానికి చెందిన పదాలను చేర్చడం మొదలుపెట్టారు. ఒక వారంలో అది పూర్తవుతుంది. ఇంటిపేర్లు; మహిళల పేర్లు మరియు పురుషుల పేర్లకు ఆంగ్ల విక్షనరీలో మాదిరిగా అనుబంధాలను స్టీఫెన్ బ్రౌన్ సహకారంతో విక్షనరీలో చేర్చడం అయింది. తెలుగువారి పేర్లను అన్నింటినీ ఈ విభాగాలలో చేర్చవచ్చును.
  • శేఖర్ బాబు గారి వద్ద నాటకరంగానికి చెందిన వీడియోలు 250 పైగా యూట్యూబ్ లో ఉంచినట్లు తెలియజేశారు; వాటిని వికీలో చేర్చడానికి చర్చించాము. అలాగే హిందూ దేవాలయాల గురించిన సమాచారం చాలా ఉన్నది.
  • తెలుగు వికీపీడియా ప్రచారం కోసం బండి శ్రీనివాస శర్మ గారివద్ద నున్న 50,000 పైగా ఈమైల్ అడ్రసులకు సందేశం పంపడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను చర్చించాము.
  • తెలుగు వికీలో ఏకవచన ప్రయోగం ద్వారా మీడియాలో కలిగిన ఇబ్బంది గురించి మల్లాది గారు తెలియజేశారు. దానిని వీలైనంత త్వరగా నిర్ణయాత్మకంగా మార్చకపోతే మీడియా నుండి ఎవరు కూడా వికీలో రచనలు చేయడం కష్టమని హెచ్చరించారు.
  • పి.ఆర్.ఎస్.శర్మ గారిని భాస్కరనాయుడు గారు పరిచయం చేశారు. వీరికి భక్తి సమాచారం సేకరణ; పుణ్యక్షేత్రాలు దర్శించడం ప్రవృత్తి. ఆవిధంగా తెవికీ లో అకౌంట్ సృష్టించుకున్నారు.

చిత్రమాలిక[మార్చు]