వికీపీడియా చర్చ:విశేష వ్యాసాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశేష వ్యాసాలుగా అనుకోవచ్చా?[మార్చు]

ఒక మారు వికీపీడియా:విశేష వ్యాసాలు మరియు వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి. మనకున్నంతలో ఈ వారం వ్యాసాలు సెలెక్ట్ చేస్తున్నాము. అయితే ఇవి విశేష వ్యాసాల లెవెల్‌కు రావడంలేదు. ఇది మనం విశేష వ్యాసాలను ఎలా పరిగణిస్తామనే విషయంపై ఆధారపడి ఉంటుందనుకోండి. కాని ప్రస్తుతం ఈ లెక్క కలగాపులగంగా ఉంది.

"ఈ వారం వ్యాసాలు" అన్నింటినీ "విశేష వ్యాసాలు"గా లెక్కించవచ్చునా? లేక రెండింటికీ వేరువేరు ప్రమాణాలు నిర్దేశించాలా? మీ అభిప్రాయం తెలియజేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:00, 31 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పనిసరిగా రెండూ ఒక్కటి కావు. విశేష వ్యాసాలు తెలుగులో చాలా తక్కువ. ఇవి అందరి సమిష్టి కృషితోనే సాధ్యం. మనవద్దనున్న వ్యాసాలలో మంచి వాటిలో ఒక దానిని ప్రతివారం తీసుకొంటున్నాము. వీటికి వేర్వేరు ప్రమాణాలు ఉండాలి.Rajasekhar1961 05:30, 16 నవంబర్ 2011 (UTC)

సాధారణంగా ఇంగ్లీషు వికీలో విశేష వ్యాస స్థాయికి వచ్చిన వాటినే ముఖపత్ర వ్యాసంగా ప్రదర్శించడం జరుగుతుంది. క్రియాశీలక వికీ సభ్యులు తక్కువగా వున్నప్పుడు మనం ఇన్ని రకాలుగా విభజించి నిర్వహించలేము. వీటిని ఈ వారం వ్యాసాలుగా చూడడమే మంచిది. వీటిని ఇప్పటికే ఈ వారం వ్యాసం వర్గంలో చేర్చడమైనది. --అర్జున (చర్చ) 10:53, 30 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]