విక్రమశిల విశ్వవిద్యాలయం
| ?విక్రమశిల Vikramaśīla బీహార్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| సమీప నగరం | భగల్‌పూర్ |
| కోడులు • టెలిఫోను |
• +0641 |
పాల సామ్రాజ్యకాలంలోని, రెండు ప్రముఖమైన బౌద్ధ అభ్యాసకేంద్రాలలో ఒకటి నాలందా విశ్వవిద్యాలయం కాగా రెండవది ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం. నాలందా విశ్వవిద్యాలయంలోని పండితుల నాణ్యత పడిపోతూ ఉండుటవల్ల, పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిల ని స్థాపించాడు. ఇక్కడి పండితులలో ముఖ్యమైనవాడు అతిషుడు.
ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని భగల్‌పూర్ 50 కి.మీ దూరంలో అంతిచక్ గ్రామం ఉన్న స్థలమే ఒకప్పటి విక్రమశిల విశ్వవిద్యాలయం.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
పాలవంశరాజుల కాలంలో ప్రాచీన వంగ, మగధ ప్రాంతాలలో ఎన్నో బౌద్ధ మఠాలు వెలిసాయి. టిబెట్‌వారి సమాచారం ప్రకారం, ఆ కాలంలో ఐదు మహావిహారాలుండేవి. మొదటిదైన విక్రమశిల ఆ కాలంనాటి అత్యున్నతమైనది కాగా, నాలందా పాతదైపోయినప్పటికీ వెలుగులీనుతూనే ఉన్నది. మిగిలినవి సోమపుర, ఓదంతపుర మరియు జగ్గదల లు.
పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిల ని స్థాపించినప్పటి నుండి 12వ శతాబ్దంలో భక్తియార్ ఖిల్జీ అనేక బౌద్ధ కేంద్రాలతో బాటు దీనిని కూడా ధ్వంసం చేసేవరకూ వెలుగొందింది. మనకు విక్రమశిల గురించిన సమాచారం కేవలం టిబెట్ వారి వద్దనే లభ్యమౌతోంది. అందులో ముఖ్యమైనవి క్రీ. శ 16-17 శతాబ్దాలనాటి తారనాథుడనే టిబెట్ సన్యాసి రచనలు.
100మందికి పైగా అచార్యులతోనూ, 1000కిపైగా విద్యార్థులతోనూ విక్రమశిల అతి పెద్ద బౌద్ధ విశ్వవిద్యాలయం. బౌద్ధ అభ్యాసం, సంస్కృతి, మతం ప్రచారం చేసేందుకు ఇక్కడి పండితులకు విదేశాలనుండి కూడా అహ్వానాలొస్తూ ఉండేవి.
సంస్థ [మార్చు]
విక్రమశిల తక్కిన విశ్వవిద్యాలయాకంటే స్పష్టమైన అధికార క్రమాన్ని కలిగి ఉండేదని, సుకుమార్ దత్త్ వంటివారి అభిప్రాయం.
- అధ్యక్షుడు
- ద్వారపాలకుడు లేదా ద్వారపండితుడు (ద్వారాలు ఆరు. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, మొదటి మధ్యం, రెండవ మధ్యం)
- మహాపండితుడు
- పండితుడు (సుమారుగా 108 మంది)
- ఉపాధ్యాయులు లేదా అచార్యులు (పండితులతో కలిపి 160మంది)
- భిక్షువులు (సుమారుగా 1000మంది)
వాస్తు మరియు త్రవ్వకాలు [మార్చు]
విశ్వవిద్యాలయ శిథిలాలలో కొన్నిటిని మాత్రమే ఇప్పటివరకూ తవ్వకాలలో బయట పడ్డాయి.
స్థూపం [మార్చు]
చేరడం ఎలా..? [మార్చు]
దగ్గర్లోని పెద్ద పట్టణం కహాల్‌గావ్ 13కి.మీ దూరంలో ఉన్నది. భారతీయ రైల్వే ఢిల్లీ నుండి భగల్‌పూర్‌కి నెం2367/2368 విక్రమశిల ఎక్స్‌ప్రెస్ ని కూడా నడుపుతోంది.
విశేషాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- Vikramshila Mahotsav
- Bihar Government Tourism Department
- Vikramshila page Bhagalpuronline
- A visit to Vikramasila
- Vikramshila Guide