విక్రయం
మూస:For మూస:Cleanup మూస:Refimprove
విక్రయం అనేది వ్యక్తులు మరియు సంఘములు వాటి యొక్క ప్రస్తుత మరియు ఆవిష్కృత అవసరాలు, కోరికలను తృప్తి పరచుకోనగలిగే ఇతరుల ఉత్పత్తులు మరియు సేవలను కనుగొనే సమీకృత సమాచార ఆధారిత పద్ధతి.
అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారి నిర్వచనం ప్రకారం విక్రయం అనునది వినియోగదారులకు, కక్షిదారులకు,భాగస్వాములకు చివరిగా సంఘమునకు ఉపయోగపడే సృజనాత్మక భావప్రసార పంపిణి మరియు వినిమయ సంబంధిత కృత్యముల,సంస్థల సముదాయము.[4][1] విక్రయం అనే పదం దాని సహజ అర్థములో మార్కెట్ లో వస్తువులను లేదా సేవలను కొనడం లేదా అమ్మడం అనే ప్రక్రియ నుంచి ఆవిర్భవించింది.
ప్రపంచంలో మార్కెటింగ్ కి సంబంధించిన అతి పెద్ద సంస్థ అయిన The Chartered Institute of Marketing వారి నిర్వచనంలో విక్రయం అనునది వినియోగదారుల అవసరాలను గుర్తించి, ఊహించి మరియు తృప్తి పరిచే లాభయుక్తమైన నిర్వహణా పద్ధతి.[2]
గతంలో విక్రయంని ప్రచారం, పంపిణి మరియు అమ్మకములతో కూడిన ఒక సృజనాత్మక పరిశ్రమగా భావించేవారు.ప్రస్తుతం విక్రయంలో సాంఘిక, సామాజిక, మనో వైజ్ఞానిక, ఆర్ధిక మరియు గణిత శాస్త్రములను, న్యూరో సైన్సు లను విస్తృతముగా ఉపయోగిస్తున్నందువలన దానిని ఒక ప్రత్యేక శాస్త్రంగా గుర్తించి అనేక విశ్వవిద్యాలయాలు స్నాతకోత్తర పట్టాను [M.Sc.] విక్రయంలో అందచేస్తున్నాయి. ఈ ప్రక్రియ విక్రయ పరిశోధనతో మొదలై మార్కెట్ విభాగీకరణ, వ్యాపార ప్రణాళిక మరియు నిర్వహణల ద్వారా అమ్మకముల వృద్ధి చేసే ఆది మరియు అంత్య ప్రక్రియలతో అంతమవుతుంది.ఇది అనేక సృజనాత్మక కళలతో సంబంధం కలిగి ఉన్నది. అంతేకాక మారుతున్న కాలము మరియు సంస్కృతులకు అనుగుణంగా విక్రయ సాహిత్యం తనకు తాను నవీకరించుకొనుటలో ప్రసిద్ధి చెందింది.
ఒక వ్యవస్థ దృక్కోణంలో చూసినపుడు అమ్మకపు ప్రక్రియ అనేది ఒకదానికొకటి అనుసంధానించబడి మరియు ఆధారపడి సాపేక్షంగా ఆధునిక దృక్పధంతో అభివృద్ధి పరచుకో గలిగిన వివిధ ప్రక్రియల[3] సముదాయం.
విషయ సూచిక |
[మార్చు] నాలుగు "P" లు
- ప్రధాన వ్యాసం: Marketing mix
1960 ల ప్రధమ భాగంలో ప్రొఫెసర్ నీల్ బోర్డెన్, Harvard Business School వారు వినియోగదారుల వస్తు మరియు సేవల కొనుగోలును ప్రభావితం చేయగల కంపెనీ చర్యలను గుర్తించారు.కంపెనీ చర్యలన్నీ "మార్కెటింగ్ మిక్స్" ని ప్రతిబింబించాయని Borden సూచించారు. అదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ ఈ.జెరోం మాక్ కాథి, కూడా మార్కెటింగ్ మిక్స్ నాలుగు అంశాలు కలిగి ఉంటుందని ప్రతిపాదించారు.అవి ఉత్పత్తి, ధర, స్థానము మరియు వృద్ధి.
- ఉత్పత్తి: ఉత్పత్తి అనేది అసలు అందించవలసిన వస్తు, సేవల స్పష్టతను మరియు అవి అంతిమ వినియోగదారుల అవసరాలను, కోరికలను ఏ విధంగా తీరుస్తాయనేదే విక్రయం చూసే విషయం. ఉత్పత్తి పరిధిలో దానికి పరిపుష్టినిచ్చే గారంటీలు, వారంటీలు ఆధారభూతాలవుతాయి.
- ధర:డిస్కోంట్లతో కలిపి ఒక వస్తువు యొక్క ధర నిర్ణయం దీని పరిధి లోకి వస్తుంది.ధర కేవలం ద్రవ్య రూపంలోనే ఉండనక్కరలేదు. అది వస్తు సేవల వినిమయముగా ఉండవచ్చు.ఉదా.కాలం, శక్తి లేదా ఏకాగ్రత . ధర నిర్ణయ పద్ధతులు ధర నిర్ణాయక శాస్త్ర పరిధిలో నిర్ణయించ బడతాయి.
- స్థానం [లేదా పంపిణి]:ఉత్పత్తి వినియోగదారుని చేరడానికి సంబంధించిన అంశం. ఉదా. అమ్మకపు స్థానం లేదా చిల్లర వర్తకం.ఈ మూడవ పి కొన్ని సందర్భాలలో స్థానం గా కూడా పిలువబడుతుంది.ఏ మాధ్యమం ద్వారా ఉత్పత్తి లేదా సేవ అమ్మబడుతుందో (ఆన్లయన్ లేదా రిటైల్ ), ఏ ప్రాంతం లేదా పరిశ్రమ , ఏ సమూహం (యువ వయస్కులు, కుటుంబాలు, వ్యాపార వర్గాలు)మొదలయినవి. ఏ పరిసరాలలో ఉత్పత్తి అమ్మబడుతున్నది అన్నది కూడా అమ్మకాలను ప్రభావితం చేస్తుంది.
- వృద్ధి :దీనిలో ప్రకటనలు, అమ్మకాల వృద్ధి ప్రచారం, వ్యక్తిగత అమ్మకాలు చేరి ఉంటాయి.ఉత్పత్తి, బ్రాండ్, కంపెనీల వృద్ధి కి చెందిన వివిధ పద్ధతులను బ్రాండింగ్ అనవచ్చు.
ఈ నాలుగు అంశాలను కలిపి తరచు మార్కెటింగ్ మిక్స్ గా వ్యవహరిస్తారు[4]విక్రయ ప్రణాళిక రచనకు విక్రేత దీనిని ఉపయోగించవచ్చు.
చౌక ధరల వినియోగ ఉత్పత్తులను విక్రయం చేయునపుడు ఈ 4P మోడల్ బాగా ఉపయోగ పడుతుంది.పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలు, ఖరీదైన వినియోగ ఉత్పత్తుల వంటి వాటిని విక్రయం చేయునపుడు ఈ 4P ల మోడల్ లో స్వల్ప మార్పులు అవసరమవుతాయిసేవల ప్రత్యేక స్వభావానికి సర్వీసెస్ విక్రయం బాధ్యత వహిస్తుంది.
గొలుసుకట్టు నిర్వహణతో కూడిన ధీర్గకాలిక సప్లై గొలుసు ఒప్పందాలకు పారిశ్రామిక లేదా B2B విక్రయం బాధ్యత వహిస్తుంది.వ్యక్తిగత వ్యవహారాల పరిమితి కంటే ధీర్గకాలిక సంబంధాల దృష్టిలో విక్రయం చేయుటకు సంబంధ విక్రయం ప్రయత్నిస్తుంది.
దీనికి విరుద్ధంగా Morgan, తన Riding the Waves of Change (Jossy-Bass,1988),లో 4pల మోడల్ ముఖ్యమైన పరిమితిని ఈ విధంగా చెప్పారు. "విక్రయం యొక్క సారాంశము బహిర్గత -అంతర్ విధానము కావలసి ఉండగా దీనికి విరుద్ధంగా అంతర్గత -బహిర్ దృష్టిని(కంపెనీ నుండి మార్కెట్ని) ప్రతిపాదిస్తుంది.
[మార్చు] ఉత్త్పత్తి
- ప్రధాన వ్యాసం: New Product Development
[మార్చు] బ్రాండింగ్
- ప్రధాన వ్యాసం: Brand
ఒక ఉత్పత్తిని ఇతర పోటీ ఉత్పత్తుల నుండి స్పష్టంగా గుర్తించేటట్లు ఉండే ఒక పేరు లేదా పదము లేదా నమునా లేక గుర్తుని బ్రాండ్ అని చెప్పవచ్చు.ఒక బ్రాండ్ అనేది ఒక సంస్థతో,ఉత్పత్తితో లేదా సేవతో వినియోగదారుని అనుభవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.బ్రాండ్ ని కేవలం ఒక గుర్తు లేదా ఒక పేరు లేదా ఒక నమునాగా చెప్పలేము. బ్రాండ్ ఒక కంపెనీ యొక్క సంస్థాగత సంస్కృతి అయిన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
క్రియాత్మకంగా కానీ, అచేతనం గా కానీ చేయబడి, ప్రామాణిక నిబద్ధ ఆధారిత వాగ్దానాలను గుర్తించగలిగే ఒక ఉనికిగా బ్రాండ్ ని చెప్పవచ్చు.
మనసులో ఉన్న కొన్ని నిర్దిష్ట ఉత్పత్తుల వివరములను సృజింపచేసేదే బ్రాండింగ్.
సహ-బ్రాండింగ్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తులతో కూడిన విక్రయ ప్రక్రియ.
[మార్చు] విక్రయ సమాచారము
విక్రయ సమాచారము, విక్రయ సందేశాలతో కూడిన వ్యూహాలను ఛేదించి వాటి యొక్క లక్ష్యాల ఆధారంగా ప్రతి సందేశాన్ని విభజిస్తుంది.అపరిచిత వ్యక్తులను వినియోగదారులుగా మలచటంలో ఉపయోగించే సమాచార మాధ్యమంలో వివిధ దశలు ఉన్నాయి.
[మార్చు] ప్రకటనలు
- భావ వృద్దికి మరియు ప్రజా సమర్పణకు చెల్లింపు పధ్ధతి
- సమూహాలను ఉద్దేశించినది
- ప్రకటన ఏ విధంగా ఉండాలో తయారిదారుడే నిర్ణయించు కొనవచ్చు
- అవ్యక్త పరివ్యాప్త మాధ్యమం
[మార్చు] ప్రభావాత్మక ప్రకటనల యొక్క విధులు మరియు ఉపయోగాలు
- అమ్మకందారుని పనిని సులభతరం చేయటం
- అమ్మకాలను గరిష్టంగా పెంచటం
- ప్రచారం
- బ్రాండ్ నిర్మాణం
- ఎరుక కలిగించడం
- వినియోగదారుని సమ్మతింపచేయడం
- నూతన ఉత్పత్తులను ప్రవేశ పెట్టడం
- మార్కెట్ నాయకత్వానికి సానుకూల పరచడం
- పోటీని ఎదుర్కోవడం
- మార్పులను తెలియచేయడం
- పోటీదారుల ప్రకటనలకు ప్రతిస్పందించడానికి
- గుడ్విల్ పెంచుకోవడానికి
[మార్చు] ఉద్దేశ్యములు
- ప్రముఖ వస్తువుల డిమాండ్ స్థిరీకరించడం
- నూతన మరియు తెలియని వస్తువులను ప్రవేశ పెట్టడం
- ప్రముఖ వస్తువుల/ఉత్పత్తుల/సేవల డిమాండ్ ను పెంపొందించటం
[మార్చు] మంచి ప్రకటన యొక్క అపేక్షితాలు
AIDA సూత్రము ఏకాగ్రత (Attention), ఆసక్తి(interest), కోరిక (Desire), క్రియ Action)
- ఏకాగ్రతను ఆకట్టుకోవడం(జాగరూకత)
- ఆసక్తిని రగిలించటం
- కోరికను పాదుకొల్పడం
- క్రియాశీలతను కలిగించటం (వస్తువు కొనుగోలుకు)
[మార్చు] ప్రకటనోద్యమానికి ఎనిమిది సూత్రాలు
- మార్కెట్ పరిశోధన
- లక్ష్యాలను నిర్దేశించుకోవటం
- ఆర్ధిక ప్రణాళిక
- మాధ్యమ ఎంపిక(టెలివిజన్, వార్తాపత్రికలు/వార పత్రికలు, రేడియో, వెబ్,అవుట్ డోర్)
- నటుల మరియు క్రీడాకారుల ఎంపిక (నూతన పోకడ)
- నమునా మరియు మాటల పొందిక
- సమన్వయము
- శోధన ఫలితాలు
[మార్చు] వ్యక్తిగత అమ్మకాలు
కొనుగోలు శక్తిగల వ్యక్తుల లేదా వినియోగదారుల సమూహాలను అమ్మకందారుడు కలసినపుడు ఇవ్వదగిన మౌఖిక ప్రదర్సన:
- ఉత్సాహభరిత, పరస్పర సంబంధం
- వ్యక్తిగత శ్రద్ధ
- ఏకాగ్రత మరియు ప్రతి స్పందన
- ఆసక్తికరమైన సమర్పణ
- స్పష్టత మరియు పరిపూర్ణత
[మార్చు] అమ్మకాల వృద్ధి
ఉత్పత్తుల కొనుగోలు పెంచుటకు స్వల్పకాలిక ప్రేరణలు:
- తక్షణ విజ్ఞాపన
- అమ్మాలనే ఆత్రుత
ఒక సేల్ లేదా కూపన్లని ఉదాహరణగా చెప్పవచ్చు.ఇవి ప్రజలలో తక్షణ కొనుగోలుకు ప్రేరణ కలిగించవచ్చు కానీ వినియోగదారుల విశ్వాసాన్ని, భవిష్యత్ లో పునః కొనుగోలును ప్రోత్సహించలేవు.అమ్మకపు వృద్ధి లోని ఈ వ్యూహాలు పోటీదారులచే తేలికగా అనుకరింపబడటం ఒక పెద్ద లోపం.ఒక నిలకడ కలిగిన విభిన్నవ్యూహంగా దీనిని ఉపయోగించలేము.
[మార్చు] పౌర సంబంధాల విక్రయం (MPR)
- అనుకూలమైన పత్రికా ప్రకటనల ద్వారా ఒక ఉత్పత్తి పట్ల డిమాండ్ ఉద్దీపన
- అత్యధిక విశ్వసనీయత
- ప్రభావాత్మక వార్తలు
- సంస్థ స్వరూపానికి సంపుష్టినిచ్చేది
[మార్చు] వినియోగదారు కేంద్రీకృత విధానం
అనేక కంపెనీలు నేడు వినియోగదారు కేంద్రీకృతంగా ఉన్నాయి(లేదా మార్కెట్ కేంద్రీకృతం)ఈ విధానంలో కంపెనీ తన కర్యక్రమాలను మరియు ఉత్పత్తులను వినియోగదారుల డిమాండ్ లను బట్టి నిర్ణయిస్తుంది.సాధరణంగా దీనిని మూడు విధాలుగా చేయవచ్చు. వినియోగదారు నిర్ణాయక పద్ధతి, మార్కెట్ మార్పులు గుర్తించే స్పృహ మరియు నూతన ఉత్పత్తుల విధానం.
వినియోగదారు నిర్ణాయక పద్దతిలో వినియోగదారుని కోరికలే విక్రయ వ్యూహాత్మక నిర్ణయాలను నడిపిస్తాయి.వినియోగదారుని పరిశోధనలో ఉత్తీర్ణత పొందనిదే ఏ వ్యూహము అనుసరింపబడదు.ప్రతి మార్కెట్ సమర్పణ, ఉత్పత్తి యొక్క స్వభావంతో సహా కనుగోలు శక్తిగల వినియోగదారుల అవసరాలచే నిర్ణయింప బడుతుంది.ఎల్లపుడు వినియోగదారుడు ఆరంభ బిందువై ఉంటాడు.ఈ విధానంలో ముఖ్య సూత్రం వినియోగదారు కొనుగోలు చేయని వస్తువులపై పరిశోధన మరియు అభివృద్ధిలో చేయు వ్యయాన్ని అరికట్టడం.సాంకేతికంగా అధ్భుతాలైన ఎన్నో ఉత్పత్తులు వ్యాపారాత్మకంగా విఫలమవటానికి చరిత్ర సాక్షీ భూతంగా నిలిచింది[5]
వినియోగదారు కేంద్రీకృత విక్రయంలో ఒక సాధారణ విధానాన్నిSIVA [6]గాపిలుస్తారు .[ఫలితము(Solution), సమాచారము(Information), విలువ (value), పరిచయం (access). వినియోగదారుని కేంద్రీకృతం చేయుటకు చెప్పబడిన ఈ పద్ధతి పైన తెలిపిన నాలుగు p ల విధానములో మాటలమార్పు మరియు పేరు మార్పు.
విక్రయ మానేజ్మెంట్ యొక్క చిరపరిచితమైన నాలుగు p ల పంపిణి ఆధార మోడల్ కు ప్రత్యామ్నాయంగా వినియోగదారు/డిమాండ్ కేంద్రీకృత విధానాన్ని SIVA మోడల్ అందిస్తుంది.
| ఉత్పత్తి | ఫలితం | |
| వృద్ధి | సమాచారం | |
| ధర | → | విలువ |
| స్థానం | → | పరిచయం |
SIVA మోడల్ లోని నాలుగు అంశములు ఈ విధంగా ఉన్నాయి:
- ఫలితము:వినియోగదారు అవసరానికి లేదా సమస్యకు ఫలితం ఎంతవరకు ఉపయోగ పడగలదు?
- సమాచారము:వినియోగదారునికి ఫలితం గురించి తెలుసా? తెలిస్తే ఎవరిద్వారా లేదా ఎలా వారి కొనుగోలు నిర్ణయం ప్రభావితమైంది?
- విలువ: వినియోగదారునికి ఈ వ్యవహారం ఎంత విలువ కలది, దాని ధర, ఉపయోగాలు, వారు త్యాగం చేయవలసిన విషయాలు, వారు పొందగలిగే ప్రయోజనం గురించి తెలుసా?
- పరిచయం:వినియోగదారుడు ఫలితాన్ని లేదా ఉత్పత్తిని ఎక్కడ పొందగలడు?ఎంత సులభంగా/స్థానికంగా/దూరంగా వస్తువును కొనగలరు మరియు పొందగలరు?
ఈ మోడల్ చేకిటాన్ దేవ్ మరియు డాన్ షుల్త్జ్ లచే American Marekting Association వారి మార్కెటింగ్ జర్నల్ లో ప్రతిపాదించబడి UKలో మార్కెటింగ్ సొసైటీకి చెందిన మార్కెట్ లీడర్ అనే సంచికలో ప్రచురించబడింది.
[మార్చు] ఉత్పత్తి కేంద్రీకృతం
నూతన ఉత్పత్తి విధానంలో కంపెనీ ముందుగా నూతన ఉత్పత్తిని ఆవిష్కరించి, ఆ నూతన ఉత్పత్తి మార్కెట్ అభివృద్ధికి ప్రయత్నం చేస్తుంది. నూతన ఉత్పత్తి మరియు పరిశోధన ప్రాధమికంగా లాభదాయకమైన మార్కెట్ వర్గాల అస్తిత్వం తో నడిపింప బడుతుంది.వినియోగ దరులుకు భవిష్యత్ ఉపలబ్ధత గురించి తెలియదు కనుక వారు భవిష్యత్ లో ఏమి కొంటారనేది వారి నించి ఆశించలేము.కాని ఈ ప్రత్యేక మార్కెట్ వర్గాలు అతి మూలధనీకరణతో అణచివేత ధోరణిని అవలంబించే అవకాశం ఈ నూతన ఉత్పత్తి విధానంలో ఉంది ఈ నూతన ఉత్పత్తి విధానాన్ని అనుసరించడంలో విక్రేతలు వివిధ రకాల మరియు బహుళ-అంచెల విధానమును అవలంబించవలసి ఉంటుంది. ఒకవేళ థామస్ ఎడిసన్ మార్కెట్ పరిశోధన పై ఆధార పడి ఉంటే విద్యుద్దీపం బదులుగా పెద్ద కొవ్వొత్తులనే ఉత్పత్తి చేసి ఉండాలి. పరిశోధన మరియు అభివృద్ధి పై కేంద్రీకరించే కంపెనీల వంటి అనేక సంస్థలు, నూతన ఉత్పత్తుల విధానాన్ని విజయవంతంగా అవలంబించగలవు. వినియోగదారుల అవసరాల పరిశోధనను దృష్టిలో పెట్టుకొని ఈ మార్కెట్ కేంద్రీకృత విధానం ఒక నిజమైన మార్కెట్ విధనమేనా అని కొందరు సాంప్రదాయవాదుల సంశయం.ఇది ఒక విక్రయ విధానమేనా? అని కొందరు ప్రశ్నిస్తారు.
- ఉద్యోగస్తుల శిక్షణ మరియు నిర్వహణ ద్వారా వినియోగదారునికి వస్తువు పంపిణి తో సకారాత్మకంగా ఆకట్టుకొని, నిలబెట్టుకొనే అంతర్గత విక్రయంవిధానం ఒక కొత్త అలోచన(యజమాని బ్రాండింగ్).
- నూతన ఉత్పత్తుల వ్యాపనం ప్రజలు ఎలా లేదా ఎందుకు నూతన ఉత్పత్తులను,సేవలను, భావనలను అనుసరిస్తారో పరిశోధిస్తుంది.
- ఒక సాపేక్ష నూతన విక్రయ విధానం ఇంటర్నెట్ ను ఉపయోగించుకొని, ఇంటర్నెట్ విక్రయం లేదా సాధరణంగా 'e'విక్రయం ,సభ్యత్వ విక్రయం ,డెస్క్టాప్ ప్రకటనలు లేదా ఆన్ లైన్ విక్రయం గా ఉంది. సాంప్రదాయ విక్రయ విధానంలోని విభాగ వ్యూహాన్ని మెరుగు పరచడానికి ఇది ప్రయత్నిస్తుంది.దీని లక్ష్యం ప్రేక్షకులు, సూక్ష్మంగా చెప్పాలంటే దీనిని వ్యక్తిగత లేదా one-to-one మార్కెటింగ్ అని చెప్పవచ్చు.
- వినియోగదారుల శ్రద్దలో కొరత మరియు ప్రకటనల సారాంశానికి సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడకపోవడం వలన విక్రేతలు కొత్త మార్కెట్ విధానలైన అనుమతిపూర్వక విక్రయం ,బ్రాండెడ్ విషయాలు 1},మాధ్యమ అలవాట్లు, రియాల్టీ విక్రయం ల వైపు మరలుతున్నారు.
- మార్కెట్లో మంద ప్రవర్తన ఉపయోగాలు
- ఇటీవల రోమ్ లో జరిగిన ఒక సమావేశంలో ఉన్నది లేనట్లుగా అనుసరించు మానవ ప్రవర్తన గురించి ది ఎకనోమిస్ట్ లో ఈ విధంగా ప్రచురించారు[7]ఇది ప్రజలు ప్రేరణాత్మక కొనుగోలు అధికం చేయుటకు "మంద స్వభావం ద్వార అధిక కొనుగోలు" గురించి చర్చించింది. ప్రజలు ప్రముఖంగా కనిపించే ఉత్పత్తులను ఎక్కువగా కొంటారనేది దీని ఆధార భావన మరియు అనేక పరిపుష్టి విధానాలుద్వార ఉత్పత్తుల ప్రాముఖ్యత సమాచారం వినియోగదారులకు అందించ బడుతుంది.దీనిలో స్మార్ట్-కార్ట్ సాంకేతికత మరియు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ టెక్నాలజీ వాడబడుతున్నాయి. ప్రిన్స్టన్ పరిశోధకుని ద్వార తెలియ చేయబడిన చీమ కదలిక నమూనా సూపర్ మర్ర్కెట్లకు అనుకూలంగా ఉంది.ఎందుకంటే "ప్రజలకు డిస్కౌంట్ ఇవ్వనవసరం లేద్కుండా అమ్మకాలు పెంచవచ్చు."పెద్ద స్థాయి చిల్లర వర్తకులైన యునైటెడ్ స్టేట్స్ .కి చెందిన వాల్ల్మర్ట్ -బ్రిటన్ కి చెందిన Tesco ఈవిధానాన్ని 2007 వసంత ఋతువు లో పరీక్షించుటకు ప్రణాళిక రచించాయి.
విక్రయం అనేది వ్యాపార ఉత్పత్తుల అభివృద్దికి మరియు వ్యాపార అభివృద్దికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
- ఇటీవలి కాలంలో 'సామాజిక ప్రభావిత శక్తి ' అనే అంశంపై జరిగిన పరిశోధనలు ఈ విధంగా సూచిస్తున్నాయి. కృత్రిమ సంగీత ప్రపంచంలో సుమారు14,000 మంది ప్రజలు వారు పూర్వం విననటువంటి పాటలను డౌన్ లోడ్ చేసుకున్నారు.( కొలంబియా విశ్వవిద్యాలయం, న్యూయార్క్);జపాన్కు చెందిన నిత్యావసర వస్తువుల దుకాణ శ్రేణి తన ఉత్పత్తులను "విభాగ స్టోర్ లు మరియు పరిశోధన కంపెనీల అమ్మకాల సంఖ్యపై ఆధార పది ఉత్పత్తి చేస్తుంది." మస్సుచుసేట్ట్స్ కు చెందిన ఒక కంపెనీ తన అమ్మకాల వృద్దికి సోషల్ నెట్ వర్కింగ్ విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటుంది.పెరుగుతున్నఆన్ లైన్ చిల్లర వర్తకులు సమాచారం అందించే వినియోగదారులుగా కూడా ఉన్నారు. వీరు "ఏ ఏ ఉత్పత్తులు ఒకే విధమైన ఆలోచనలు గల వినియోగదారులలో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి" అనేది తెలియ చేస్తారు. ఉదా.అమెజాన్, ఈ బే
[మార్చు] విక్రయంలో ప్రావీణ్యం పొందగలుగు రంగాలు
- వ్యవసాయ విక్రయం
- ప్రకటనలుమరియు బ్రాండింగ్
- సమాచార రంగం
- CRM, వినియోగదారులతో సంబంధాల నిర్వహణ
- డాటాబేస్ విక్రయం
- వృత్తి పరమైన అమ్మకాలు
- డైరెక్ట్ మార్కెటింగ్
- ప్రత్యక్ష కార్య నిర్వహణ (ఈవెంట్ మేనేజెమెంట్)
- అనుభవ పూర్వక విక్రయం
- ఫీల్డ్ విక్రయం
- ప్రపంచ విక్రయం
- గెరిల్లా విక్రయం
- అంతర్జాతీయ విక్రయం
- ఇంటర్నెట్ విక్రయం
- పారిశ్రామిక విక్రయం
- మార్కెట్ పరిశోధన
- విక్రయ వ్యూహాలు
- విక్రయ ప్రణాళిక మార్కెటింగ్ ప్రణాలిక
- రాజకీయ విక్రయం
- ఉత్పత్తి విక్రయం
- సామీప్య విక్రయం
- ప్రజా విక్రయం
- ప్రజా సంబంధాలు
- చిల్లర వర్తకము
- సెర్చ్ ఇంజన్ విక్రయము
- విభాగీ కరణము
- సాంఘిక మాధ్యమ విక్రయం
- పూచీ
- వ్యూహాత్మక నిర్వహణ
- టోకు విక్రయం
[మార్చు] ఇవి కూడా చూడండి
- ప్రధాన వ్యాసం: Outline of Marketing
- ప్రకటన పరిశోధన
- AIDA
- వస్తు విక్రయం
- ఎల్లలు లేని అమ్మకాలు
- [[Brand|బ్రాండ్బ్రాండ్ ]]
- బ్రాండ్ సంస్కృతి
- బ్రాండెడ్ విషయం
- కారణ విక్రయం
- కాపీ రైటింగ్
- వినియోగదారులతో సంబంధాల నిర్వహణ
- వినియోగ దారుల విభజన
- డిజిటల్ విక్రయం
- డిమాండ్ ఉత్పత్తి
- ఎర్లీ అడాప్టర్
- ఎంగేజిమేంట్ విక్రయం
- క్రైస్తవ మత లేదా బైబిల్ విక్రయం
- భయం, అనిశ్చిత, సంశయం
- సమీకృత విక్రయ సమాచారం
- LGBT విక్రయం
- స్థూల విక్రయం
- మార్కెట్ విభజన
- విక్రేత
- సమాంతర విక్రయం
- విక్రయ సహకారం
- మార్కెటింగ్ మిక్స్
- విక్రయ సమర్ధత
- వర్తకము
- సంచారిత విక్రయం
- బహుళ పంధా విక్రయం
- ముందస్తు విశ్లేషణ
- ఉత్పత్తి విక్రయం
- రియాల్టీ విక్రయం
- రెఫెర్రల్ విక్రయం
- మార్కెట్ పెట్టుబడులపై లాభాలు
- అమ్మకాల నైపుణ్యం
- SEO కాపీ రైటింగ్
- సేవలు
- ప్రకటనలలో సెక్స్
- సీనియర్ మీడియా క్రియేటివ్
- సాంకేతిక విక్రయం*
- వర్తక విక్రయం
- విలువ
- విజువల్ బ్రాండ్ లాంగ్వేజ్
inline
inline
[మార్చు] సంబంధిత జాబితాలు
- విక్రయ వ్యాసాల విస్తృత జాబితా కొరకు విక్రయ విషయాల జాబితా చూడండి.
- మానేజెమెంట్ విషయాల జాబితా
- మానవ వనరుల నిర్వహణ విషయాల జాబితా
- ఆర్ధిక విషయాల జాబితా
- విత్త విషయాల జాబితా
- అకౌంటింగ్ విషయాల జాబితా
- సమాచార సాంకేతిక నిర్వహణ విషయాల జాబితా
- ఉత్పత్తి విషయాల జాబితా
- వ్యాపార చట్ట విషయాల జాబితా
- అంతర్జాతీయ వర్తక విషయాల జాబితా
- వ్యాపార నీతి, రాజకీయ అర్ధశాస్త్రం మరియు వ్యాపార తత్వ విషయాల జాబితా
- వ్యాపార సిద్ధాంత కర్తల జాబితా
[మార్చు] సూచనలు /రేఫెరెన్సెస్
- ↑ అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారిచే అక్టోబర్ 2007 న అంగీకరింపబడిన విక్రయం నిర్వచనం: http://www.marketingpower.com/AboutAMA/Pages/DefinitionofMarketing.aspx.
- ↑ Chartered Intitute of Marketing, వారిచే ఇవ్వబడిన విక్రయం నిర్వచనము
- ↑ Paul H. Selden (1997). Sales Process Engineering: A Personal Workshop. Milwaukee, WI: ASQ Quality Press.
- ↑ Advertising Research జర్నల్ వారు ప్రచురించిన "ది కాన్సెప్ట్ అఫ్ మార్కెటింగ్ మిక్స్", జూన్ 1964 PP-2-7
- ↑ "మార్కెటింగ్ మానేజేమంట్: వ్యూహాలు మరియు కార్యక్రమాలు", Guiltinan et al., McGraaw Hill/Irwin, 1966
- ↑ "In the Mix: 21 వ శతాబ్దం లో ప్రస్తుత మార్కెటింగ్ మిక్స్ లో అనుసరింపదగిన వినియోగదారు కేంద్రీకృత విధానం".Chekitan S. Dev and Don E. Schultz, మార్కెటింగ్ మానేజ్మెంట్ v.14 n.1 జనవరి/ఫిబ్రవరి 2005
- ↑ "Swarming the shelves: How shops can exploit people's herd mentality to increase sales?", The Economist, 2006-11-11, p. 90.