Coordinates: 16°55′33″N 81°43′33″E / 16.9257°N 81.7257°E / 16.9257; 81.7257

విజ్జేశ్వరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 16°55′33″N 81°43′33″E / 16.9257°N 81.7257°E / 16.9257; 81.7257
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండలంనిడదవోలు మండలం
Area
 • మొత్తం2.82 km2 (1.09 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం2,640
 • Density940/km2 (2,400/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి937
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534302 Edit this on Wikidata


విజ్జేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన గ్రామం. ఇది రాజమహేంద్రవరంకి 20 కి.మీ. దూరంలో నిడదవోలుకి 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో సహజ వాయువు ఉపయోగించి విద్యుత్తు తయారు చేసే కేంద్రం ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

మహాభారతం కాలంలో, అర్జునుడు భారత సంగ్రామంలో విజయం సాధించి మార్గ మధ్యంలో ఈ గ్రామమందు శివ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందులకే, ఈ గ్రామానికి విజయేశ్వరం అని పేరు వచ్చిందని నానుడి

చరిత్ర[మార్చు]

2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, ఈ ఊరు పశ్చిమ గోదావరి జిల్లానుండి తూర్పుగోదావరి జిల్లాకు మారింది.

భౌగోళికం[మార్చు]

ఇది మండల కేంద్రమైన నిడదవోలు నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. ఈ గ్రామం రాజమండ్రి నుండి నిడదవోలు వయా వాడపల్లి వెళ్ళే మార్గంలో వస్తుంది. తరచూ రాజమండ్రి నుండి నిడదవోలు నుండి బస్సు సదుపాయం ఉంది. ధవళేశ్వరం నుండి బ్రిడ్జి మీదుగా విజ్జేశ్వరం చేరుకోవచ్చు

జనగణన విషయాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం 718 ఇళ్లతో, 2640 జనాభాతో 282 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1363, ఆడవారి సంఖ్య 1277

ఆకర్షణలు - ప్రత్యేకతలు[మార్చు]

  • కాటన్ దొర చేత నిర్మించబడ్డ ధవళేశ్వరం ఆనకట్ట ఉంది. దీనిని భారత ప్రభుత్వం 1982లో ఆధునీకరించింది.
  • ఈ గ్రామంలో సహజ వాయువు చేత విద్యుత్తు తయారు చేసే కేంద్రం ఉంది. ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో నడుచు జనకో క్రిందకు విద్యుత్తు తయారు చేస్తోంది. 1998 సంవత్సరం డిసెంబరు నాటికి ఈ కేంద్రం మెదటి దశలో 60 మెగావాట్ల విద్యుత్తు తయారు చేసింది. ఇప్పుడు రెండవ దశ పూర్తి అయ్యాక 172 మెగావాట్ల విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఈ కేంద్రానికి బడ్జెట్ 434 కోట్లు కేటాయించగా 471 కోట్లయ్యింది. [2] ఈ కేంద్రం భారతదేశంలోనే మెట్టమెదటి సహజవాయువు ద్వారా విద్యుత్తు తయారు చేయబడే కేంద్రం.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప మాధ్యమిక పాఠశాల మద్దూరులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల నిడదవోలులోను, ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, అనియత విద్యా కేంద్రం, అనియత విద్యా కేంద్రం నిడదవోలులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమండ్రి లోనూ పాలీటెక్నిక్ తణుకులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, ఉన్నాయి.

భూమి వినియోగం[మార్చు]

విజ్జేశ్వరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 32 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 4 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 26 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 220 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 220 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

విజ్జేశ్వరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 48 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 172 హెక్టార్లు

ఉత్పత్తులు[మార్చు]

వరి, చెరకు, అరటి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Vijjeswaram Gas-Based Power Project". Retrieved 2021-06-24.

బయటి లింకులు[మార్చు]