విటమిన్ ఎ

వికీపీడియా నుండి

రెటినాల్ రసాయనిక నిర్మాణం.

విటమిన్ A రసాయన నామం 'రెటినాల్'. ఇది ముఖ్యంగా చేప కాలేయపు నూనె, పాలు, వెన్న, గుడ్డు సొన మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా కారట్, ఆకుకూరలలో ఉంటుంది. మొక్కలలో ఇది బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది కాలేయం, పేగులలో విటమిన్ A గా మారుతుంది.

ఉపకళా కణజాలాలు ఉత్తేజితంగా ఉండటానికి, పెరుగుదలకు, కంటి చూపు మామూలుగా ఉంచడంలో విటమిన్ A ముఖ్య పాత్ర వహిస్తుంది. కంటి నేత్రపటలంలో రోడాప్సిన్ పునః సంశ్లేషణకు ఇది అత్యావసరం.

విటమిన్ A లోపంవల్ల రేచీకటి, జిరాఫ్తాల్మియా, కెరటోమలేసియా కలుగుతాయి.

పేజీకి సంభందించిన లింకులు