విఠోబా

వికీపీడియా నుండి
విఠోబా
విఠలుడి ప్రతిమ
విఠలుడి ప్రతిమ
సంప్రదాయభావం విష్ణు అవతారం
ఆవాసం పండరీపురం
భార్య రుక్మిణి
వాహనం గరుడ పర్వతం
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

విఠోబా ( విఠలుడు లేదా పాండురంగడు) మహారాష్ట్ర, కర్ణాటక, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఆరాధించే ఒక హిందూ దేవుడు. ఈయన విష్ణువు యొక్క అంశగా చెప్పబడ్డాడు. కానీ కొద్ది మంది శివుని అంశ అనీ, బుద్ధుని అంశ అని కూడా అంటారు. విఠోబాను సాధారణంగా చేతులు వెనక్కు కట్టుకుని నిల్చుని ఉన్న నల్లటి యువకుడిగా చిత్రీకరిస్తారు. చాలా ప్రతిమల్లో రుక్మిణి కూడా తోడుగా ఉంటుంది.

రాయలసీమ లోని చిత్తూరు, కడప జిల్లాల్లోని చాలా గ్రామాల్లో పాండురంగనికి దేవాలయాలున్నాయి. ఈ ఆలయాలన్నింటిలో ప్రతి సంవత్సరం లో ఒక పౌర్ణమికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో అగ్నిగుండ ప్రవేశం ప్రధానమైన భాగం. ఇంకా ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పండరి భజనలు కూడా ప్రదర్శిస్తారు.ఈ భజనల్లో పండరీనాథుని కీర్తిస్తూ భక్తులందరూ వలయాకారంలో నిలిచి లయబద్ధంగా అడుగులు వేస్తారు. కోలాటం కూడా ప్రదర్శిస్తారు.

భక్త తుకారాం సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు పాండురంగని భక్తుడైన తుకారాం గా నటించాడు.

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది

"http://te.wikipedia.org/w/index.php?title=విఠోబా&oldid=568997" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు