విద్యుత్తు

వికీపీడియా నుండి
(విద్యుచ్ఛక్తి నుండి దారిమార్పు చెందింది)
విద్యుత్తు ఉనికికి ప్రత్యక్ష సాక్షి మెరుపులు.

విద్యుత్తు లేదా విద్యుచ్ఛక్తి (ఆంగ్లం Electricity) అనేది ఎలక్ట్రాన్ ల ప్రవాహం, మరో విధంగా చెప్పాలంటే ఎలక్ట్రాన్‌ల కదలిక. దీనిని ఆంపియర్ అనే యూనిట్స్‌లలో కొలుస్తారు. ఇది ఒక కులోంబ్ చార్జ్ పర్ సెకను.

విషయ సూచిక

[మార్చు] ఉత్పత్తి

గాలి మర విద్యుత్తు ఉత్పాదనలో శ్రేష్టమైనది.

విద్యుచ్ఛక్తి సాధారణంగా విద్యుత్-యాంత్రిక జనరేటర్లు ద్వారా తయారుచేస్తారు. ఇవి నీటి ఆవిరి, గాలి, ప్రవహించే నీరు మొదలైన వాటి శక్తి మూలంగా పనిచేస్తాయి. బొగ్గు, సహజ వాయువు మొదలైన ఇంధన వనరులు ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి. అణు విచ్ఛేదన ద్వారా వేడిని తద్వారా విద్యుచ్ఛక్తిని రియాక్టర్లులో తయారుచేస్తున్నారు. అతి వేగంగా వీచే గాలిని ఉపయోగించి గాలి మర ద్వారా విద్యుత్తు తయారుచేయవచ్చును. వీటన్నింటికి ముఖ్యమైన పరికరం ట్రాన్స్ ఫార్మర్.

సూర్య వికిరణాన్ని ఫోటోవోల్టాయిక్ ఘటాలను ఉపయోగించి సౌర విద్యుత్తుగా ఉత్పత్తి చేస్తున్నారు.

[మార్చు] ఉపయోగాలు

  • విద్యుత్తుతో మన ఇంట్లో ఎన్నో గృహోపకరణాలు పనిచేస్తున్నాయి. వానిలో విద్యుద్దీపాలు, పంఖాలు, హీటర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైనవి. వీనిలో మొట్టమొదటగా మానవులకు ఉపయోగంలోకి వచ్చినది 1870లో కనుగొన్న విద్యుద్దీపాలు. ఇవి నూనె దీపాలను, వాటి వల్ల కలిగే ప్రమాదాలను తొలగించాయి.
  • విద్యుత్తు నుండి జనించిన వేడిని వంటకోసం, నీటిని మరియు గాలిని వేడిచేయడం కోసం, అనేక ఇతర రకాలుగా ఉపయోగించుకుంటున్నాము. కొన్ని సమయాలలో గాలిని చల్లగా చేయడానికి దీనిని వేసవికాలంలో వాడుకుంటున్నాము.
  • విద్యుత్తు టెలిగ్రాఫ్ వంటి కొన్ని సమాచార సాధనాలలో ఉపయోగిస్తున్నారు.
  • విద్యుదయస్కాంత సూత్రాల్ని ఉపయోగించి విద్యుత్ మోటారు కనుగొన్న తరువాత ఎన్నో రకాలుగా దీనిని రైలు, మోటారు వాహనాలు, పంఖాలు, జనరేటర్లు గా ఉపయోగిస్తున్నాము.
  • రేడియో, దూరదర్శిని వంటి అన్నో ఎలక్ట్రానిక్ పరికరాలలో కొద్దిగా విద్యుత్తును ఉపయోగిస్తున్నారు.

[మార్చు] ఫారాక్స్ బల్బు ఆయుష్షు 25 ఏళ్లు

ఆధునాతన విద్యుత్తు బల్బు ఫారాక్స్ 25ఏళ్ల కాలం మన్నుతుంది. రోజుకు నాలుగు గంటలే వాడితే మరింత కాలం పనిచేస్తుంది. అతి తక్కువ విద్యుత్తును ఉపయోగించుకునే ఈ బల్బు 60వాట్ల కాంతి నిచ్చే బల్బుతో సమానమైన వెలుగునిస్తుంది.ధర రూ.2,275 .ఏటా రూ.60 నిర్వహణ కోసం ఖర్చు పెట్టాలి. మొదటి మూడేళ్లలోనే ఇది 27 పౌండ్లదాకా ఇంటి విద్యుత్తు బిల్లును పొదుపు చేస్తుంది.ఈ బల్బులో వెలుగును పెంచడానికీ, తగ్గించడానికీ అవకాశం ఉంది.(ఈనాడు25.10.2009)

[మార్చు] వ్యర్థ జలాలతో విద్యుత్తు

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్‌ చదువుతున్న మనోజ్‌ మండేలియా మైక్రోబయల్‌ ఫ్యూయల్‌ సెల్‌(ఎంఎఫ్‌సీ) జీవ విద్యుత్తు రసాయన ప్రక్రియద్వారా వ్యర్థ జలాలను వినియోగించి విద్యుత్తు ఉత్పత్తి చేశారు.

[మార్చు] పొదుపు

  • బహుళ అంతస్తుల భవనాల్లో సూర్యరశ్మితో నీళ్లను వేడెక్కించే యంత్రాలు తప్పనిసరి చేశారు. వాటిని ఏర్పాటు చేస్తేనే నిర్మాణాలను అనుమతించాలని పురపాలక శాఖ 2006లో జీవో ఇచ్చింది.
  • మామూలు బల్బులకు 60 వాట్‌లు, ట్యూబ్‌లైట్లకు 36 వాట్‌ల కరెంటు అవసరం అవుతుంది. అదే కాంపాక్టు ఫ్లోరోసెంట్‌ ల్యాంపుల(సీఎఫ్‌ఎల్‌)కు 11-15 వాట్‌లు అయితే సరిపోతుంది.
  • చౌక్‌ ఉన్న ట్యూబ్‌లైట్‌ల(55 వాట్‌) స్థానంలో చౌక్‌ లేకుండా పనిచేసే సన్నటి ట్యూబ్‌లైట్లు బిగిస్తే దుబారాను నివారించవచ్చు.
  • కొత్తగా ఎల్‌ఈడీ దీపాలు వచ్చాయి. వీటికి ఒక వాట్‌ కరెంటు సరిపోతుంది. వీటిని బెడ్‌ ల్యాంప్‌లుగా వాడొచ్చు
  • సాధారణ జెట్‌ పంపులు వాడితే రోజుకి 2.25 యూనిట్లు ఖర్చవుతుంది. అదే సబ్‌ మెర్సిబుల్‌ పంపుసెట్లకు 1.25 యూనిట్లు సరిపోతుంది.
  • సాధారణ రెగ్యులేటర్‌ స్థానంలో ఎలక్ట్రానిక్‌ రెగ్యులేటర్లు బిగిస్తే 15 శాతం కరెంటు పొదుపు చేయొచ్చు.

[మార్చు] ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ ( ఏ ఎం ఆర్ )

ఆటోమేటిక్ రీడింగ్ విధానంలో ప్రధాన కార్యాలయం నుంచే మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశం వుంది. పవర్ సరఫరా సమయంలో ఆయా ప్రాంతాలకు సరఫరా అవుతున్న ఫీడర్‌లకు ఒక కంప్యూటర్ చిప్‌ను అమర్చుతారు. దీనిని ఆయా ఫీడర్‌ల పరిధిలోని సబ్‌స్టేషన్‌ లకు అనుసంధానం చేస్తారు.ఒక్కోఫీడర్ నుంచి ఏ ఏ ప్రాంతాల్లోని సబ్ స్టేషన్‌ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతుందన్నది కూడా రికార్డవుతుంది. ఇలా ఆయా సబ్‌స్టేషన్‌ల పరిధిలో ఎన్ని కనెక్షన్ దారులకు విద్యుత్ సరఫరా అవుతుందన్నది కూడా తెలిసి పోతుంది. ఆయా ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్‌ల పరిధిలో వ్యక్తిగత కనెక్షన్ దారులకు కూడా నేరుగా ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేసే ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తారు.దీంతో నేరుగా ప్రధాన కార్యాలయం నుంచి ఆయా మీటర్‌ల ద్వారా ఎంత విద్యుత్‌ఖర్చవుతుందన్నది తెలిసిపోతుంది. దీని వల్ల ఒక సబ్‌స్టేషన్ పరిధిలో ఫీడర్‌ల నుంచి ఎంత విద్యుత్ సరఫరా అవుతంది.....ఎన్ని కనెక్షన్‌లకు ఇది వెళ్తున్నది ...అన్న విషయం కూడా తెలిసి పోతుంది. దీని వల్ల టెలిఫోన్ బిల్లు లాగా కరెంట్ బిల్లులు కూడా పంపిణీ చేసేందుకు అవకాశం వుంటుంది. ఆయా సబ్‌స్టేషన్‌ల పరిధిలో ఎంత విద్యుత్ వృ«థా అవుతోందన్నది కూడా ఈ ఏఎంఆర్‌ల వల్ల తెలిసిపోతుంది.పంపీణీలో ట్రాన్స్‌మిషన్ లాస్‌(వృథా),విద్యుత్ చౌర్యం దాదాపు 45శాతం వరకూ వుంది.ఏఎంఆర్ మీటర్లను ఏర్పాటుచేసినట్టయితే వృధాను,విద్యుత్ చౌర్యాన్ని అరికట్టే అవకాశం వుంది.ఆయా ప్రాంతాల్లో ఫీడర్‌లకు,సబ్ స్టేషన్‌లకు అనుసంధానంగా కొనసాగే ఆటేమేటిక్ మీటర్ రీడింగ్ టెక్నాలజీలో ఎక్కడ విద్యుత్ చౌర్యం జరుగుతోందన్న విషయం కూడా చాలా సులభంగా తెలిసిపోతుంది.విద్యుత్‌మీటర్ల ట్యాంపరింగ్‌ను ఈ టెక్నాలజీ చాలా సులభంగా పసిగట్టగలుగుతుంది. దీంతో ఏ ప్రాంతంలో ఇది ఎక్కువగా జరుగుతోందన్నది కూడా ప్రధానకార్యాలయానికి సమాచారం అందుతుంది.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు


[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=విద్యుత్తు&oldid=719066" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు