విద్యుత్తు
వికీపీడియా నుండి
విద్యుత్తు లేదా విద్యుచ్ఛక్తి (Electricity) అనేది ఎలక్ట్రాన్ ల ప్రవాహం, మరో విధంగా చెప్పాలంటే ఎలక్ట్రాన్‌ల కదలిక. దీనిని ఆంపియర్ అనే యూనిట్స్‌లలో కొలుస్తారు. ఇది ఒక కులోంబ్ చార్జ్ పర్ సెకను.
విషయ సూచిక |
[మార్చు] ఉత్పత్తి
విద్యుచ్ఛక్తి సాధారణంగా విద్యుత్-యాంత్రిక జనరేటర్లు ద్వారా తయారుచేస్తారు. ఇవి నీటి ఆవిరి, గాలి, ప్రవహించే నీరు మొదలైన వాటి శక్తి మూలంగా పనిచేస్తాయి. బొగ్గు, సహజ వాయువు మొదలైన ఇంధన వనరులు ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి. అణు విచ్ఛేదన ద్వారా వేడిని తద్వారా విద్యుచ్ఛక్తిని రియాక్టర్లులో తయారుచేస్తున్నారు. అతి వేగంగా వీచే గాలిని ఉపయోగించి గాలి మర ద్వారా విద్యుత్తు తయారుచేయవచ్చును. వీటన్నింటికి ముఖ్యమైన పరికరం ట్రాన్స్ ఫార్మర్.
సూర్య వికిరణాన్ని ఫోటోవోల్టాయిక్ ఘటాలను ఉపయోగించి సౌర విద్యుత్తుగా ఉత్పత్తి చేస్తున్నారు.
[మార్చు] ఉపయోగాలు
- విద్యుత్తుతో మన ఇంట్లో ఎన్నో గృహోపకరణాలు పనిచేస్తున్నాయి. వానిలో విద్యుద్దీపాలు, పంఖాలు, హీటర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైనవి. వీనిలో మొట్టమొదటగా మానవులకు ఉపయోగంలోకి వచ్చినది 1870లో కనుగొన్న విద్యుద్దీపాలు. ఇవి నూనె దీపాలను, వాటి వల్ల కలిగే ప్రమాదాలను తొలగించాయి.
- విద్యుత్తు నుండి జనించిన వేడిని వంటకోసం, నీటిని మరియు గాలిని వేడిచేయడం కోసం, అనేక ఇతర రకాలుగా ఉపయోగించుకుంటున్నాము. కొన్ని సమయాలలో గాలిని చల్లగా చేయడానికి దీనిని వేసవికాలంలో వాడుకుంటున్నాము.
- విద్యుత్తు టెలిగ్రాఫ్ వంటి కొన్ని సమాచార సాధనాలలో ఉపయోగిస్తున్నారు.
- విద్యుదయస్కాంత సూత్రాల్ని ఉపయోగించి విద్యుత్ మోటారు కనుగొన్న తరువాత ఎన్నో రకాలుగా దీనిని రైలు, మోటారు వాహనాలు, పంఖాలు, జనరేటర్లు గా ఉపయోగిస్తున్నాము.
- రేడియో, దూరదర్శిని వంటి అన్నో ఎలక్ట్రానిక్ పరికరాలలో కొద్దిగా విద్యుత్తును ఉపయోగిస్తున్నారు.
[మార్చు] ఫారాక్స్ బల్బు ఆయుష్షు 25 ఏళ్లు
ఆధునాతన విద్యుత్తు బల్బు ఫారాక్స్ 25ఏళ్ల కాలం మన్నుతుంది. రోజుకు నాలుగు గంటలే వాడితే మరింత కాలం పనిచేస్తుంది. అతి తక్కువ విద్యుత్తును ఉపయోగించుకునే ఈ బల్బు 60వాట్ల కాంతి నిచ్చే బల్బుతో సమానమైన వెలుగునిస్తుంది.ధర రూ.2,275 .ఏటా రూ.60 నిర్వహణ కోసం ఖర్చు పెట్టాలి. మొదటి మూడేళ్లలోనే ఇది 27 పౌండ్లదాకా ఇంటి విద్యుత్తు బిల్లును పొదుపు చేస్తుంది.ఈ బల్బులో వెలుగును పెంచడానికీ, తగ్గించడానికీ అవకాశం ఉంది.(ఈనాడు25.10.2009)
[మార్చు] ఓ విషయం
ఈ ప్రపంచం నుండి ఒకవేళ హటాత్తుగా ఈ విద్యుత్ చ్చక్తి మాయం ఐతే మానవ జీవితం అత్యంత దుర్భరం అవుతుంది కదూ.