విన్‌స్టన్ బెంజిమన్

వికీపీడియా నుండి

1964, డిసెంబర్ 31న జన్మించిన విన్‌స్టన్ బెంజమిన్ (Winston Benjamin) వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 21 టెస్టు మ్యాచ్‌లకు మరియు 85 వన్డే మ్యాచ్‌లకు ఇతడు వెస్టీండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించినాడు. బెంజమిన్ తన తొలి టెస్టును 1987-88లో భారత్ పై ఢిల్లీలో ఆడినాడు.

విషయ సూచిక

టెస్ట్ క్రికెట్ [మార్చు]

బెంజిమన్ 1987-88లో తొలిసారిగా భారత్ పై ఢిల్లీలో టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. 8 టెస్టులు ఆడిన తరువాత 1993 వరకు జట్టులో స్థానం దక్కలేదు. రెండు సంవత్సరాలు ఆడిన తరువాత మళ్ళీ 1994-95లో ఆస్ట్రేలియా పర్యటన తరువాత ఉధ్వాసనకు గురైనాడు. మొత్తం 21 టెస్టు మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు, 61 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 85 పరుగులు. టెస్ట్ బౌలింగ్‌లో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 46 పరుగులకు 4 వికెట్లు.

వన్డే క్రికెట్ [మార్చు]

బంజిమన్ మొత్తం 85 వన్డేలలో ప్రాతినిద్యం వహించి 298 పరుగులు, 100 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 22 పరుగులకు 5 వికెట్లు.

ప్రపంచ కప్ క్రికెట్ [మార్చు]

బెంజిమన్ 1987 మరియు 1992 ప్రపంచ కప్ క్రికెట్‌లో వెస్ట్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిద్యం వహించాడు.

కోచ్‌గా [మార్చు]

క్రీడాజీవితం అత్యున్నత దశ తరువాత కోచ్‌గా కొత్త అవతారం ఎత్తి లీవార్డ్ ఐలాండ్ జట్టుకు కోచ్‌గా కొద్దికాలం వ్యవహరించాడు. కాని 2005 జూన్ లో తొలిగించబడ్డాడు.[1]

మూలాలు [మార్చు]

  1. [1] Leewards sack Benjamin, 1 July, 2005, accessed 16 March, 2007