విప్రనారాయణ (1954 సినిమా)
| విప్రనారాయణ (1954) | |
| దర్శకత్వం | పి.ఎస్.రామకృష్ణారావు |
|---|---|
| నిర్మాణం | పి.ఎస్.రామకృష్ణారావు |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , పి.భానుమతి |
| సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
| గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
| సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
| కూర్పు | పి.ఎస్.రామకృష్ణారావు |
| నిర్మాణ సంస్థ | భరణీ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
విప్రనారాయణ 1954 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని భానుమతి మరియు రామకృష్ణారావు లు భరణీ పిక్చర్స్ పతాకం క్రింద నిర్మించారు. ఈ సినిమాకు కీలకమైన మాటలు మరియు పాటలను సముద్రాల రాఘవాచార్య సమకూర్చారు.
ఈ పూర్తి సంగీతభరితమైన చిత్రంలోని పాటల్ని ఎ.ఎమ్.రాజా మరియు భానుమతి గానం చేయగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని కూర్చారు.
విషయ సూచిక |
సంక్షిప్త చిత్రకథ [మార్చు]
విప్రనారాయణ (అక్కినేని) శ్రీరంగని భక్తుడు. రంగనాథున్ని పూలదండలతో అలంకరించి, పూజించి తరించాలనే భక్తాగ్రగణ్యుడు. నర్తకి దేవదేవి (భానుమతి) అందించిన నమస్కారాన్ని అన్యమనస్కుడైన విప్రనారాయణుడు గమనించడు. దానితో ఆమెలోని అహంకారం పడగ విప్పి ఎలాగైనా అతడిని తన పాదదాసున్ని చేసుకొంటానని అక్క (సంధ్య) తో పందెం వేస్తుంది. భక్తినెపంతో ఏకాకినని చెప్పి విప్రనారాయణుని ఆశ్రయం సంపాదిస్తుంది. అందుకు విప్రనారాయణుని ప్రియ సచివుడు రంగరాజు (రేలంగి) అడ్డు తగిలినా లాభం లేకపోతుంది.
దేవయాని నెరజాణ, వేశ్య. నాట్యం, హొయలు, నయగారాలు, అమాయకంగా కళ్ళభాషతో కవ్వించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. విప్రనారాయణునిలో నెమ్మదిగా సంచలనం కలిగిస్తూ అక్కడ వున్న మూడో వ్యక్తి రంగరాజుకు ఉద్వాసన పలికిస్తుంది. ఆమె భక్తినుంచి రక్తిపైపు విప్రనారాయణుని మళ్ళిస్తుంది. వర్షానికి తడిసి జ్వరం సెగలతో రగిలిపోతున్న విప్రనారాయణునికి దేవదేవి శీతల గంధం రాసే ప్రయత్నంలో, తొలిసారి స్త్రీ స్పర్శ అనుభూతి పొందిన ఆ భక్తునిలో రక్తి ప్రారంభమై ఆమెకు దాసుడౌతాడు. ఆమె లేనిదే క్షణమైనా నిలువలేని స్థితికి చేరతాడు.
దైవం ఆడిన నాటకం వల్ల విప్రనారాయణునిపై దొంగతనం మోపడం, రాజసభలో విచారణ, శిక్ష పడగా, పతాక సన్నివేశంలో భక్తి పారవశ్యంలో నాయికా నాయకులిద్దరూ భగవంతునిలో ఐక్యమౌతారు.
పాత్రలు-పాత్రధారులు [మార్చు]
- విప్రనారాయణ - అక్కినేని నాగేశ్వరరావు
- దేవదేవి - భానుమతి
- రంగరాజు - రేలంగి వెంకట్రామయ్య
- దేవదేవి తల్లి - ఋష్యేంద్రమణి
- దేవదేవి అక్కయ్య - సంధ్య
- మహారాజు - వి. శివరాం
- - అల్లు రామలింగయ్య
పాటలు [మార్చు]
- ఆడది అంటే లయం లయం ఆ నీడంటేనే భయం భయం - రేలంగి
- ఎవ్వాడే అతడెవ్వాడే కలలోన నను డాసినాడే ఓ భామా - పి. భానుమతి
- ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా ఇందుకేనా - గానం: పి. భానుమతి
- ఏలా నాపై దయచూపవు దేవా వేడుక చూసేవా - పి. భానుమతి
- కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్యా - ?
- చూడుమదే చెలియా కనులా బృందావనిలో నందకిషోరుడు - ఎ. ఎం. రాజా
- ధిల్లానా - ?
- పాలించర రంగా పరిపాలించర రంగా కరుణాంతరంగ శ్రీరంగా - గానం: ఎ. ఎం. రాజా
- మధురమధురమీ చల్లని రేయీ మరువతగనిదీ - ఎ. ఎం. రాజా, పి. భానుమతి
- మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా - గానం: ఎ. ఎం. రాజా
- రంగా కావేటి రంగ శ్రీరంగ రంగా నా పైయిన్ బడె - ఎ. ఎం. రాజా
- రారా నా సామి రారా రారా దాపేల చేసేవు రా ఇటు రారా నా సామి - గానం: పి. భానుమతి
- సావిరహే తవదీనా రాధా..విందతి చందన - రచన: జయదేవుడు; గానం: పి.భానుమతి