వివేకవర్ధని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివేకవర్ధని పిభ్రవరి1878 ముఖచిత్రం

వివేకవర్ధని కందుకూరి వీరేశలింగం ప్రారంభించిన మొట్టమొదటి తెలుగు పత్రిక. ఇది మాస పత్రికగా ప్రారంభమై, పక్ష పత్రికగా వృద్ధిచెంది, తరువాత వార పత్రికగా స్థిరపడినది.

ఇది 1874 సంవత్సరం ఆశ్వయుజమాసము నుండి ప్రారంభించబడినది. పత్రిక చెన్నపురి లోని కొక్కొండ వేంకటరత్నం పంతులువారి సంజీవినీ ముద్రాక్షర శాలలో ముద్రించబడేది. కొందరు భాగస్వాములను కలుపుకొని ఏప్రిల్ 1876లో స్వగృహంలో సొంత ముద్రణాలయం నెలకొల్పి పత్రికను ముద్రించేవారు.

పత్రిక ఉద్దేశాలు[మార్చు]

వీరేశలింగం పత్రిక ముఖ్యోద్దేశాలను నాలుగు అంశాలుగా ప్రకటించారు.

  • రాజకీయ ఉద్యోగులలో లంచాలు పుచ్చుకోవడం అనే అక్రమాన్ని మాన్పించడం.
  • లంచాలు ఇచ్చే ప్రజలలో నీతిని పాటించాలనే దృష్టిని ఏర్పరచి వృద్ధిచేయాలి.
  • సంఘంలోని వేశ్యాగమనాదులు వంటి కులాచారాలను చక్కబరుచుట.
  • మత సంప్రదాయాల కన్నా సత్ప్రవర్తనము కలిగిఉండటం ముఖ్యమైనదని తెలియజేయుట.

ఇబ్బందులు[మార్చు]

పత్రికా నిర్వహణలో నిజాన్ని సూటిగా, నిర్మొగమాటంగా చెప్పినందుకు ఎటువంటి కషాలు రావడానికి అవకాశాలు ఉన్నాయో అవన్నీ వీరేశలింగం ఎదుర్కొనవలసి వచ్చింది. వివేకవర్ధని పత్రిక కారణంగా వీరేశలింగం దౌర్జన్యాలను ఎదుర్కొనవలసి వచ్చింది. కోర్టు కేసులలో పోరాడవలసి వచ్చింది. వివిధ వర్గాల ఆగ్రహావేశాలకు గురికావలసి వచ్చింది.

సాంఘికోద్ధరణ[మార్చు]

వివేకవర్ధిని పత్రిక సంఘంలోని పలు సమస్యలకు వ్యతిరేకంగా పోరాడి మంచి పేరు తెచ్చుకుంది. స్త్రీవిద్యకు వ్యతిరేకంగా రచనలు చేసేవారితో సైద్ధాంతికమైన చర్చలతో ఒప్పించే ప్రయత్నం చేసేవారు ఈ పత్రిక ద్వారా. పత్రికలో స్త్రీవిద్యకు అనుకూలమైన వాదాలను ప్రతిపాదించేవారు.[1]

మూలాలు[మార్చు]

  1. వేంకటశివుడు, రాయసం (1910). "కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 73. Archived from the original on 28 సెప్టెంబరు 2017. Retrieved 6 March 2015.
  • ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, హైదరాబాదు, 2004