విశాలాంధ్ర

వికీపీడియా నుండి

విశాలాంధ్ర తెలుగు దినపత్రిక.

ఈ పత్రిక జూన్ 22 తేదీన, 1952 సంవత్సరం విజయవాడలో ప్రారంభమైనది. చాలా కాలం తరువాత హైదరాబాదు కేంద్రం నుండి ప్రచురణ మొదలైంది.

మొదట్లో ముద్దుకూరి చంద్రశేఖరరావు, కంభంపాటి సత్యనారాయణ, కాట్రగడ్డ రాజగోపాలరావు లు సంపాదక వర్గంగా ఉండేవారు. 1965 - 1968 మధ్యకాలంలో ఏటుకూరి బలరామమూర్తి సంపాదకత్వ బాధ్యతను నిర్వహించారు. 1968 -1972 మధ్య వేములపల్లి శ్రీకృష్ణ సంపాదకులుగా ఉన్నారు. సి.రాఘవాచారి 1972 లో సంపాదకత్వం స్వీకరించి మూడు దశాబ్దాలు నిర్విఘ్నంగా కొనసాగించి కీర్తి గడించారు. 2002 లో విశాలాంధ్ర స్వర్ణోత్సవం జరుపున్న నాటి నుండి ఈడ్పుగంటి నాగేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పేజీకి సంభందించిన లింకులు