విశ్వమోహిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వమోహిని
(1940 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.వి.రావు
నిర్మాణం బి.యన్.రెడ్డి,
మూలా నారాయణ స్వామి
కథ వై.వి.రావు
తారాగణం చిత్తూరు నాగయ్య,
బెజవాడ రాజారత్నం,
వై.వి.రావు,
పుష్పవల్లి,
దొరైస్వామి,
కాకినాడ రాజరత్నం,
గంగారత్నం,
రంగస్వామి,
లలితాదేవి,
సంపూర్ణ
సంగీతం ఓగిరాల రామచంద్రరావు
నేపథ్య గానం చిత్తూరు నాగయ్య
గీతరచన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
సంభాషణలు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
నిర్మాణ సంస్థ శ్రీ జగదీశ్వరీ ఫిల్మ్స్
నిడివి 3 గంటల 14 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విశ్వమోహిని వై.వరదరావు దర్శకత్వం వహించి నటించిన 1940 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా. ప్రేమ త్రికోణం కథతోబాటు ఈ చిత్రం ద్వారా ఆనాటి కాలంలో సినిమా రంగంలోని సాధకబాధకాలను, తారల స్థితిగతులను, నిర్మాత, దర్శకుల అలవాట్లను కళ్ళకు కట్టినట్లు తెరకందించారు. దీనిలో వై.వి.రావు హీరోగా, బళ్ళారి లలిత హీరోయిన్ గా నటించారు.

కథ[మార్చు]

పద్మనాభం నడిపే ఒక ఫైనాన్స్ కంపెనీనుండి పురుషోత్తం (వై.వి.రావు) కొంత సొమ్మును మోసంతో సంపాదిస్తాడు. ఆ సొమ్ముతో తన కూతురు హేమలతను లక్షాధికారిణి విశాలాక్షమ్మ (రాజారత్నం) కొడుకు మోహనరావుకు ఇచ్చి పెళ్ళి చేయాలని అతని ఉద్దేశం. ఈ మోసం కారణంగా పేదవాడైన పద్మనాభం కూతురు సుశీల (లలితాదేవి) "విశ్వమోహిని" అనే పెద్ద సినిమానటి అవుతుంది. విశాలాక్షమ్మ సోదరుడు పశుపతి అనే సినిమా నిర్మాత సుశీలను విశాలాక్షమ్మకు పరిచయం చేస్తాడు. విశాలాక్షమ్మ కొడుకు మోహనరావు సుశీలను ప్రేమిస్తాడు. అయితే కుర్రవానికి ఉద్యోగం వస్తేనే తన కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తానని పద్మనాభం షరతు విధిస్తాడు. మోహనరావును వదిలేయడానికి ఒప్పుకొంటే తను చాలా డబ్బు ఇస్తానని సుశీలకు హేమలత చెబుతుంది కాని సుశీల అందుకు ఒప్పుకోదు. తనకు ఉద్యోగం వచ్చినట్లుగా నాటకమాడి మోహనరావు సుశీలను పెళ్ళి చేసుకొంటాడు.

పాటలు[మార్చు]

  • ఈ పూపొదరింట సేద దీర్చుకుని - గాయని (బెజవాడ రాజారత్నం)
  • బలేఫేస్ బ్యూటిఫుల్ ఈ నీ ఫోజ్
  • మేళవింపగదె చెలియా వీణా మేళవింపగదె
  • ఏల ఈ సరసాలు – చాలు
  • హాయీ హాయీ వెన్నెల రేయీ
  • జానకీ రమణ భక్త పారిజాత పాహి సకలలోల శరణ
  • జీవిత మార్గమి కేది జగాన
  • మనసే వేదనలో పడిపోయె
  • నేనీ వాడనే రాధికా
  • ఓ బేలా ఏమిటికే దిగులు
  • ఓ జగదంబ నన్ను జవమున బ్రోవు
  • ప్రేమ మధురమా హా
  • రాధా రమణా
  • వృధాయీగతి నా బ్రతుకేలా

విశేషాలు[మార్చు]

  • ఆనాటి సినిమా రంగాన్ని ఈ సినిమాలో సునిశితంగా విమర్శించారు.
  • నటుడు, దర్శకుడు అయిన వై.వి.రావు 1939లో తీసిన సినిమా మళ్ళీపెళ్ళి విజయవంతమైంది. తరువాత ఈ సినిమా కూడా విజయం సాధించింది.
  • సినిమాలో చాలా హాస్యపు సీనులు ఉన్నాయి. చిత్తూరు నాగయ్య పోషించిన దర్శకుని పాత్ర కూడా సినిమా దర్శకులను హాస్యంగా దుయ్యబట్టేదే.

వనరులు[మార్చు]