విష్ణుమాయా విలాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విష్ణుమాయా విలాసము
విష్ణుమాయా విలాసము
కృతికర్త: కంకంటి నారసింహరాజు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ద్విపద కావ్యం
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సాహిత్యం
ప్రచురణ: విద్వన్మనోరంజనీ ముద్రాక్షరశాల
విడుదల: 1865

విష్ణుమాయా విలాసము అనే పేరుతో ఒక పద్యకావ్యాన్ని చింతలపూడి ఎల్లన అనే కవి మొదట వ్రాశాడు. ఇతడు 16వ శతాబ్దం పూర్వార్థానికి చెందినవాడు. ఈ కావ్యాన్ని కంకంటి పాపరాజు తమ్ముడు కంకంటి నారసింహరాజు యథాతథంగా ద్విపదలోకి పరివర్తించాడు. కంకంటి నారసింహరాజు సా.శ1600-1610 ప్రాంతాలలో ఈ రచన చేశాడు. ఈ కావ్యాన్ని శ్రీరామునికి అంకితమిచ్చాడు.పుష్పగిరి తిమ్మన ఈ కృతికి సహాయకుడిగా ఉన్నాడు.

పరిష్కరణ, తొలి మలి ముద్రణలు[మార్చు]

ఈ కావ్యాన్ని మొట్టమొదట పాలపర్తి నాగేశ్వరశాస్త్రి లేఖక ప్రమాదాలను సవరించి పరిష్కరించాడు. ఇతడు వ్యాకరణం అంగీకరించని ప్రయోగాలను దిద్దకుండా కవి ప్రయోగాలను యథాతథంగా ఉద్ధరించాడు. ఈ గ్రంథాన్ని మొదటిసారి చెన్నపురిలోని విద్వన్మనోరంజనీ ముద్రాక్షరశాలలో పాలపర్తి నాగేశ్వరశాస్త్రి, మద్దాళి అయ్యపరాజు, గోవిందరాజు అప్పయ్య పంతులు, రామచంద్రుని కామయ్య పంతులు సా.శ1865లో ప్రకటించారు. కానీ తరువాతి కాలపు పరిష్కర్తలు, వేదం వేంకటరాయశాస్త్రి వంటివారు పరిష్కరణమంటే వ్యాకరణానుకూలంగా దిద్ది ప్రకటించడమనే భావాన్ని తీసుకు వచ్చారు.

మొదట పరిష్కరింపబడిన కావ్యంలోని గణ యతి దోషాలను, ఇతర వ్యాకరణ దోషాలను సవరించి ఉన్నం జ్యోతివాసు అనే యువ పండితుడు పరిష్కరించి 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ఈ కావ్యాన్ని ప్రకటించాడు.

విశేషాలు[మార్చు]

భక్తి, శృంగార రసాలు ప్రధానంగా కలిగి ఉన్న ఈ ద్విపద కావ్యంలో మొత్తం 5 ఆశ్వాసాలు ఉన్నాయి. కవి వీటిని రెండు భాగాలుగా విభజించాడు. మొదటి మూడు ఆశ్వాసాలను పూర్వభాగంగా, చివరి రెండు ఆశ్వాసాలను ఉత్తరభాగంగా విభజించాడు. ఈ కథలను శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు వినిపిస్తాడు. సత్యభామా గర్వభంగం, లక్ష్మీదేవి గర్వభంగం, మార్కాండేయోపాఖ్యానం, బ్రహ్మ గర్వభంగం, పుండరీకోపాఖ్యానం, శివ గర్వభంగం, నారద గర్వభంగం అనే ఏడు కథల సమాహారమే ఈ విష్ణుమాయావిలాసము. ఎల్లన రచించిన పద్యకావ్యాన్ని యథాతథంగా ద్విపదకావ్యంగా మార్చినప్పటికీ కంకంటి నారాసింహరాజు స్వంత పాండిత్యాన్ని కూడా కొంత ప్రదర్శించాడు. అంత్యానుప్రాస, అనుప్రాస, ఛేకానుప్రాస, యమకం మొదలైన శబ్దాలంకారాలను విరివిగా కావ్యంలో వాడాడు. అచ్చతెలుగు నుడికారాలను ప్రయోగించాడు. కకారాదిస్తుతి, గుణితము, నిర్యోష్ఠ్య ముక్తపదగ్రస్తము, ఓష్ఠ్య నిర్యోష్ఠ్యమేళనము, చలజిహ్వ, అనుష్టుప్ గర్భితము, సీసగర్భితము, కందగర్భితము మొదలైన చిత్ర, గర్భకవిత్వాన్ని ఈ కావ్యంలో రచించాడు. ఈ కావ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని బహుజనపల్లి సీతారామాచార్యులు తన శబ్దరత్నాకరములో 104 ప్రయోగాలను స్వీకరించాడు.

కథానుక్రమణ సూచిక[మార్చు]

ప్రథమాశ్వాసము

  1. కథారంభము
  2. పరీక్షిన్నరేంద్రుండు శుకయోగితోఁబ్రశ్నించుట
  3. శుకయోగి పరీక్షిన్మహారాజునకు విష్ణుమహిమఁ దెలుపుట
  4. శుకుఁడు పరీక్షిత్తునకు ధర్మరాజప్రభావముఁ దెలుపుట
  5. వేదవ్యాసుండు ధర్మజునకడకేతెంచుట
  6. ధర్మరాజు శ్రీకృష్ణుని మహిమలు వ్యాసునితోఁజెప్పుట
  7. వ్యాసుండు ధర్మరాజునకు శ్రీకృష్ణుని మాహత్మ్యముఁ దెలుపుట
  8. ధర్మరాజుకడకు శ్రీకృష్ణసఖుండగు గోవిందశర్మ యేతెంచుట
  9. నారదుడు మొదలగువారు ధర్మజునిగొనియాడుట
  10. గోవిందశర్మతనకుఁ బారిజాతపుష్పహారము గలిగిన విధానము ధర్మజునకుఁదెలుపుట
  11. సత్యభామ శ్రీకృష్ణదేవునిఁగూడి క్రీడించుట
  12. సత్యభామ రుక్మిణీప్రముఖులకుఁ బారిజాతపుష్ఫంబులు పంపుట
  13. సత్యభామ శ్రీకృష్ణుని దూరుట

ద్వితీయాశ్వాసము

14. గోవిందశర్మ ధర్మరాజునకు విష్ణుదేవుండు లక్ష్మీదేవితోఁబాచికలాడిన కథఁదెలుపుట
15. విష్ణుదేవుఁడు లక్ష్మీదేవిని జూదంబున మోసపుచ్చుట
16. లక్ష్మీదేవి విష్ణుదేవునిఁ దిరస్కరించి పలుకుట
17. లక్ష్మీదేవి వైకుంఠపురమును బాడుఁగావించుట
18. విష్ణుదేవుఁడు లక్ష్మీదేవిమొదలగు నెలఁతలతో సముద్రతీరంబున విహరింపంబోవుట
19. విష్ణుదేవుఁడు లక్ష్మీదేవి గర్వమడఁగింపఁదలచుట
20. విష్ణుమాయచే లక్ష్మీదేవి భ్రమఁజెంది మాయాలక్ష్మినిఁజూచి వర్ణించుట
21. లక్ష్మీదేవికి మాయాలక్ష్మి తన వృత్తాంతంబుఁదెలుపుట
22. మాయాలక్ష్మి విమానరూఢయై వైకుంఠమునకరుగుట
23. లక్ష్మీదేవి విష్ణుదేవునిఁగానక విలపించుట
24. లక్ష్మీదేవి యుద్యానవనముననుండి వైకుంఠమునకేఁగుట
25. లక్ష్మీదేవి వైకుంఠపురోద్యానవనమందుండెడు చెలులతో భాషించుట
26. లక్ష్మీదేవి విష్ణుదేవునిఁగూర్చి తపంబు సేయుట

తృతీయాశ్వాసము

27. బ్రహ్మ నారాయణునిచే వరంబువడసి ప్రపంచనిర్మాణంబు సేయుట
28. బ్రహ్మ కొలువుదీరియుండుట
29. బ్రహ్మదేవుండు విష్ణుమాయచే మోహితుడై సభాసదులఁజూచి పలుకుట
30. మార్కండేయమహాముని బ్రహ్మదేవునిఁ దిరస్కరించి పలుకుట
31. బ్రహ్మ మార్కండేయునకుఁ బ్రత్యుత్తరంబిచ్చుట
32. మార్కండేయమహాముని బ్రహ్మకు విష్ణుమహిమఁదెలుపుట
33. మార్కండేయుఁడు బ్రహ్మకుఁబుండరీకుని చరిత్రంబుదెలుపుట
34. పుండరీకునికడకు నారదుండు వచ్చుట
35. నారదుండు పుండరీకునకుఁ దులసీ సాలగ్రామముల మహిమనుఁ దెలుపుట
36. పుండరీకుండు విష్ణుమాయందగిలి బోయదానింజూచి మోహించుట
37. పుండరీకుఁడు పుళిందస్త్రీనిగూడి నీతిమార్గముదప్పుట
38. పుండరీకుఁడు బోయతనుజూచి దుఃఖించుట
39. పుండరీకుఁడు కళత్రపుత్రసహితంబుగ గోదావరీతీరంబునకరుగుట
40. పుండరీకుఁడు భిక్షఁదేఁబోవుట
41. పుండరీకుఁడు దనకుఁబ్రత్యక్షంబైన శ్రీవిష్ణుదేవుని నుతించుట
42. బ్రహ్మ మార్కండేయమహర్షిని దూరుట
43. బ్రహ్మ తపంబుచేయుటకు మందరపర్వతంబునకరుగుట
44. మందర పర్వతవాసులగు ఋషులకు బ్రహ్మ వరములిచ్చెదననుట
45. మాయాసరస్వతి బ్రహ్మతపంబు జెరుపఁదలంచుట
46. బ్రహ్మ మాయాసరస్వతినిఁజూచి మోహించుట
47. మాయాసరస్వతి చతుర్ముఖునితో సంభాషించుట
48. మార్కండేయుఁడు నలువకు హితబోధంబొనర్చుట
49. బ్రహ్మ శ్రీవిష్ణుదేవుని ధ్యానించుట
50. శ్రీవిష్ణుదేవుఁడు బ్రహ్మకుఁబ్రత్యక్షమగుట
51. బ్రహ్మ శ్రీవిష్ణుదేవునిఁగొనియాడుట

ఉత్తరభాగము-చతుర్థాశ్వాసము

52. గోవిందశర్మ ధర్మరాజునకు సముద్రమథనకథఁదెలుపుట
53. నారాయణుండు మోహినీరూపంబుఁదాల్చుట
54. బలీంద్రులు మోహినీదేవితో భాషించుట
55. మోహినీదేవి యమృతము వడ్డించుట
56. నారాయణుఁడు మోహినీరూపమువిడిచి వైకుంఠమునకరుగుట
57. నారదుఁడు తుంబురుసహితముగఁగైలాసమునకరుగుట
58. శివుఁడు నారదుని యమృతముఁజిలికిన వృత్తాంతమడుగుట
59. శివుని పలుకులకుఁబార్వతి ప్రత్యుత్తరంబిచ్చుట
60. శివుఁడు వైకుంఠపురమునకేఁగుట
61. శివుఁడు పార్వతీదేవికి వైకుంఠమునుజూపి వర్ణించుట
62. శ్రీవిష్ణుదేవుఁడు శివునినెదుర్కొని తోడ్కొనిపోవుట
63. శివుఁడు విష్ణుదేవుని మోహినీరూపంబుఁజూపుమనుట
64. నారాయణుండు శివునకు మోహినీరూపంబుఁజూపుట
65. శివుఁడు మోహినీరూపంబును వర్ణించుట
66. శివుఁడు మోహిని నాలింగనంబు సేయఁదలంచుట
67. శివుఁడు మోహినీదేవినిఁ బట్టికొనబోవుట

పంచమాశ్వాసము

68. నారాయణునికడకు నారీరూపంబున మాయవచ్చుట
69. నారదుఁడు విష్ణుదేవునికడకేతెంచుట
70. మాయ విష్ణ్వాదులమ్రోలఁదన విచిత్రశక్తిఁజూపుట
71. నారాయణుఁడు కృత్రిమఋషివేషము ధరించుట
72. నారదుఁడు కపటఋషి వేషంబుంబూని విష్ణునికడకు వచ్చుట
73. కపటఋషి నారదుని విష్ణుమాయకు లోబడనివానిఁ జెప్పుమనుట
74. ఆకాశవాణి నారదునకుఁజండదమనుని వృత్తాంతముఁదెలుపుట
75. చండదమనునకు బ్రహ్మ ప్రత్యక్షంబగుట
76. చండదమనునకు రుద్రభాస్కరులు ప్రత్యక్షంబగుట
77. విష్ణుమాయానిర్మిత పురవర్ణన
78. చండదమనుఁడు రాజ్యపరిపాలనంబొనర్చుట
79. సనత్కుమారుఁడు చండదమనునికడకేతెంచుట
80. చండదమనుఁడు శ్రీవిష్ణుదేవుని నుతించుట
81. నారదుఁడాకాశవాణి పలుకులఁదిరస్కరించుట
82. విష్ణుమాయచే నారదమహాముని స్త్రీరూపమునుదాల్చుట
83. స్త్రీరూపధారియైన నారదుడు చంద్రకేతుని వరించుట
84. చంద్రకేతనునిమీఁదికి యహికేతనుఁడు దండెత్తుట
85. ఫణికేతుఁడు చంద్రకేతునిఁ దునుముట
86. నారదునకు నారాయణుఁడు ప్రత్యక్షమగుట
87. నారదుఁడు నారాయణునిఁగొనియాడుట
88. ధర్మరాజు శ్రీకృష్ణుని స్తోత్రము చేయుట
సమాప్తము