విష్ణువు వేయి నామములు-101-200

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విష్ణు సహస్రనామ స్తోత్రము
వేయి నామముల వివరణ
1 - 100
101 - 200
201 - 300
301 - 400
401 - 500
501 - 600
601 - 700
701 - 800
801 - 900
901 - 1000
1 - 1000 లఘు వివరణ
కమలంపై పద్మాసనంలో కూర్చున్న విష్ణువు క్లోజప్. కవి జయదేవుడు విష్ణువుకు నమస్కరించడం, కాగితంపై గౌచే పహారీ, భక్తి చిత్రం, బేర్-బాడీ, తల వంచి, కాళ్లు, చేతులు ముడుచుకుని, జయదేవుడు ఎడమవైపు నిలబడి, పూజా సామగ్రిని పద్మాసనం ముందు ఉంచారు. అక్కడ కూర్చున్న విష్ణువు కవిని ఆశీర్వదించాడు.

విష్ణు సహస్రనామ స్తోత్రములోని వేయి నామాలలో 101 నుండి 200 వరకు నామములకు క్లుప్తంగా అర్ధాలు ఇక్కడ ఇవ్వడమైనది.

విష్ణు సహస్రనామాల గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశరభట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంథం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించింది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.

వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఈ వ్యాసం చివరిలో చూపిన వనరులు ఆధారంగా వివిధ భాష్యకారుల భాష్యాలను సంక్షిప్తంగా చెప్పే వివిధ భావాలను ఇచ్చే ప్రయత్నం జరిగింది.

కొన్ని నామాలకు ప్రత్యేక వ్యాసాలు కూడా ఉన్నాయి.

శ్లోకం 11[మార్చు]

  1. అజః --- జన్మము లేనివాడు; అన్ని అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించుచుండువాడు; అన్ని శబ్దములకు మూలమైనవాడు.
  2. సర్వేశ్వరః --- ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు; ఎవరు తనను వేడుకొందురో వారి చెంతకు తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు.
  3. సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొదియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు.
  4. సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు.
  5. సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రథమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ.
  6. అచ్యుతః --- తన దివ్య తేజో విభూతి శక్తి సంపన్నత్వములనుండి యెన్నడును జారని (తరగని) వాడు; తన భక్తులెన్నడును పతనము చెందకుండ గాచువాడు; జన్మ, పరిణామ, వార్ధక్యము వంటి దశలకు అతీతమైనవాడు.
  7. వృషాకపిః --- జలములలో (అధర్మములో) మునిగిపోవు భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; ధర్మ పరిరక్షకుడు.
  8. అమేయాత్మా --- ఆ పరమాత్ముని స్వరూపము కొలుచుటకు (తెలిసికొనుటకు) సాధ్యము కాదు; ఆశ్రితులను అనుగ్రహీంచుటలో పరిమితి లేనివాడు.
  9. సర్వ యోగ వినిసృతః --- అన్ని సంగములకు, బంధములకు, విషయ వాసనలకు అతీతుడు; ఎన్నో విధములైన (జ్ఞాన, కర్మ, భక్తి వంటి) యోగములద్వారా సులభముగా పందనగువాడు.

    శ్లోకం 12[మార్చు]

  10. వసుః --- సమస్త భూతములు తనయందు గలవాడు; తన భక్తుల హృదయములందు వసించువాడు; క్షీరసాగరమున వసించువాడు; భక్తులు కోరుకొను పరమార్ధము; అష్ట వసువులలో శ్రేష్టుడైన పావకుడు; అంతరిక్షమున వసించువాడు.
  11. వసుమనాః --- శ్రేష్ఠమయిన, సకలైశ్వర్యవంతమయిన మనసు గలవాడు; ఏ విధమైన వికారములకును లోనుగాని పరమ శాంతిచిత్తుడు; తన భక్తులను గొప్ప నిధులుగా భావించువాడు.
  12. సత్యః --- నిజమైనది, మూడు కాలములలోనుండునది, నాశనము లేనిది; ప్రాణము, పదార్ధము (అన్నము), సూర్యుడు అనే మూడింటిచే కూడిన రూపము గలవాడు; సత్ప్రవర్తనయందు ప్రీతిగలవాడు,
  13. సమాత్మా --- సమమైన, భేదభావములేని, రాగద్వేష రహితమగు ఆత్మ;
  14. సమ్మితః --- తన భక్తులచే ఇచ్ఛానుసారముగా నియంత్రింపబడువాడు (వారి అనుభవములకు గోచరించువాడు) ; ఋషులచే అంగీకరింపబడి, ఉపనిషత్తుల ద్వారా తెలుపబడినవాడు;
    అసమ్మితః --- పరిచ్చేదింపబడజాలనివాడు; అంత్యము, హద్దు లేనివాడు
  15. సమః --- అన్నింటియందును సమభావముగలవాడు; మార్పులేకుండ ఎల్లప్పుడు సమముగా (ఒకే తీరున) ఉండువాడు; (స మయా-) శ్రీలక్ష్మీ సమేతుడు.
  16. అమోఘః --- తనను పూజించువారికి నిశ్చయముగ సత్ఫలితములనిచ్చువాడు (భగవంతుని ఆరాధన వ్యర్ధము కాదు).
  17. పుణ్డరీకాక్షః --- తామరపూవు వంటి కన్నులు గలవాడు; అందరి హృదయ కమలమున వసించి సమస్తమును చూచువాడు; వైకుంఠవాసులకు కనుచూపువంటివాడు.
  18. వృషకర్మా --- ధర్మమే తన నిజకర్మగా గలిగినవాడు.
  19. వృషాకృతిః --- మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు.

    శ్లోకం 13[మార్చు]

  20. రుద్రః --- కన్నులలో నీరు తెప్పించువాడు (1. ప్రళయకాలమున ప్రాణుల లయము చేయునపుడు 2. తనను స్మరించు భక్తులను ఆనందపరచుచు) ; భక్తులకు శుభములను కలిగించువాడు; దుఃఖమును, దారిద్ర్యమును నాశనము చేయువాడు.
  21. బహుశిరాః --- అనేకములైన శిరములు గలవాడు; ఆదిశేషునిగా అవతరించినవాడు; అనంతుడు.
  22. బభ్రుః --- ఆధారమైనవాడు, భరించువాడు (ఆదిశేషుడై, ఆది కూర్మమై, ఆదివరాహ మూర్తియై)
  23. విశ్వయోనిః --- విశ్వమునకు కారణమైనవాడు; తనను ఆశ్రయించిన భక్తులను తనలో విలీనము చేసుకొనువాడు.
  24. శుచిశ్రవాః --- శుభప్రథమైన, శ్రవణమాత్రముననే పవిత్రులను చేయగల దివ్యనామములు గలవాడు; ధర్మపూరితములు, సత్యములునగు వాక్కులు విని ఆనందించువాడు; దివ్య సుందరమగు చెవులు గలవాడు.
  25. అమృతః --- భక్తులకు తనివి తీరని అమృతమూర్తి; అజరుడు, అమరుడు.
  26. శాశ్వత స్థాణుః --- కాళముతో నిమిత్తము లేకుండ నిశ్చలముగా, నిత్యమై, సత్యమై, నిరంతరమైనవాడు; ఆదిమధ్యాంత రహిత పరబ్రహ్మము; స్థిరుడై భక్తులకు నిత్యభోగమైనవాడు.
  27. వరారోహః --- అన్నింటికంటె శ్రేష్టమగు ఊర్ధ్వగతి, పొందదగిన అత్యున్నత పదము; ఏ స్థానము చేరినపిదమ మరల తిరిగి జన్మింపరో అట్టి పరమోత్కృష్ట స్థానము గలవాడు; అత్యుత్తమమగు వృద్ధి గలవాడు; ఆదిశేషునిపై పవళించువాడు.
  28. మహాతపాః --- గొప్ప తపస్సు (జ్ఞానైశ్వర్య ప్రతాపములు) గలవాడు; మహత్తరమైన జ్ఞానము గలవాడు.

    శ్లోకం 14[మార్చు]

  29. సర్వగః --- అంతటను గమనము గలవాడు; ఎక్కడైనా చేయూతనిచ్చువాడు.
  30. సర్వవిత్ --- సమస్తము తెలిసినవాడు; సమస్తమునకు పునరుజ్జీవనము ప్రసాదించువాడు (వెలుపలికి తీయువాడు)
    సర్వవిద్భానుః --- (శంకరాచార్యులు ఒకేనామముగా పరిగణించిరి) సర్వము తెలిసి, అవిరామముగ, అవికారముగ ప్రకాశించేవాడు.
  31. భానుః --- ప్రకాశించువాడు.
  32. విష్వక్సేనః --- లోక రక్షణార్ధము అన్ని దిక్కులందు సైన్యము గలవాడు; తన తలంపు మాత్రమున సర్వదానవ సైన్యమును నాశనము చేయువాడు.
  33. జనార్దనః --- దుష్టులను శిక్షించువాడు; దుష్టుల బారినుండి సజ్జనులను రక్షించువాడు; భక్తుల రక్షణలో విఘ్నములు కలిగించువారిని పరిమార్చువాడు; కామితార్ధములకై భక్తులు ఎవరిని ఆశ్రయింతురో ఆ దేవుడు.
  34. వేదః --- సమస్త జ్ఞానము మూర్తీభవించినవాడు; వేదమూర్తి.
  35. వేదవిత్ --- వేదములను, వాని సారము (అర్థమును) సంపూర్ణముగా నెరిగినవాడు; వేదజ్ఞానము బోధీంచువాడు.
  36. అవ్యఞ్గః --- ఏ విధమైన లోపములు లేనివాడు (వేద జ్ఞానమందు, గుణ వైభవమునందు). వేదాంగములు తానే అయినవాడు.
  37. వేదాఞ్గః --- వేదములే శరీరముగా (అంగములుగా) గలవాడు; వేదమూర్తి.
  38. వేదవిత్ --- వేదములనెఱుగుటయే గాక, వేదసారమైన ధర్మమునెరిగినవాడు.
  39. కవిః --- సామాన్య దృష్టినధిగమించి, సునిశిత దర్శనము (సూక్ష్మ దృష్టి) కలిగిన వాడు; సకలమును దర్శించువాడు; రమ్యముగా కనుపించువాడు.

    శ్లోకం 15[మార్చు]

  40. లోకాధ్యక్షః --- లోకములకు స్వామి, త్రిలోకాధిపతి.
  41. సురాధ్యక్షః --- దేవతలకు స్వామి; దేవదేవుడు.
  42. ధర్మాధ్యక్షః --- ధర్మమునకు ప్రభువు.
  43. కృతాకృతః --- ఇహపరములు రెండింటను ఫలములు ప్రసాదించువాడు; ప్రవృత్తి, నివృత్తి ధర్మములచే జీవులకు నిత్యఫలమునిచ్చువాడు; కారణ రూపమున అవ్యక్తమైనవాడు, కార్యరూపమున వ్యక్తమైనవాడు.
  44. చతురాత్మా --- సృష్టి, స్థితి, లయములందు నాలుగేసి విభుతులతో నొప్పువాడు; (నాలుగు సృష్టి విభూతులు - బ్రహ్మ, దక్షుడు మున్నగు ప్రజాపతులు, కాళము, సర్వభూతములు; నాలుగు స్థితి విభూతులు - విష్ణువు, మనువు మొదలగువారు, కాళము, సర్వభూతములు; నాలుగు లయ విభూతులు - రుద్రుడు, కాలము, యముడు, సర్వభూతములు) ; నాలుగు విధములగు సాధనావస్థలకు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలకు) ప్రభువు.
  45. చతుర్వ్యూహః --- నాలుగేసి వ్యూహములతో నొప్పువాడు (వ్యూహము = ఒక ప్రయోజనము కొరకు ఏర్పడిన ఆకారము) ; ప్రద్యుమ్న వ్యూహము - సృష్టి కార్యము నిర్వహించు ఐశ్వర్య, వీర్య సంపన్న స్వరూపము; అనిరుద్ధ వ్యూహము - స్థితికార్యము నిర్వహించు శక్తి, తేజో ప్రధాన స్వరూపము; సంకర్షణ వ్యూహము - లయ కార్యము నిర్వహించు జ్ఞాన బల గుణ ప్రధాన స్వరూపము; వాసుదేవ వ్యూహము - షడ్గుణ (జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజో) పరిపూర్ణ స్వరూపము, అనంత నిరవధిక శక్తి గుణ కాంతి సంపన్నుడు.
  46. చతుర్దంష్ట్రః --- నాలుగు కోరపండ్లు కలవాడు (అభయ ప్రదాత శ్రీనృసింహస్వామిని స్మరించు మంగళ నామము).
  47. చతుర్భుజః --- నాలుగు బాహువులతో నొప్పువాడు; శంఖ చక్ర గదా పద్మ ధారి.

    శ్లోకం 16[మార్చు]

  48. భ్రాజిష్ణుః --- స్వయంప్రకాశ స్వరూపుడు; తేజోమయుడు; (సాధన చేయు, శరణాగతులైన) భక్తులకు కనిపించువాడు.
  49. భోజనం --- నోటితో గాని, జ్ఞానేంద్రియములతోగాని స్వీకరించు విషయములు (అన్నము, శబ్దము, స్పర్శ, గంధము వంటివి) అన్నియును భగవత్స్వరూపములే. ఇంద్రియముల ద్వారా గ్రహించు విషయముల రూపమునను, ఇతర పూజాదిక కార్యముల ద్వారా లభించు ఫల రూపమునను భక్తులకు ఆనందానుభూతిని ప్రసాదించువాడు; సచ్చిదానంద స్వరూపుడు.
  50. భోక్తా --- భుజించువాడు; భోజన రూపమగు ప్రకృతి లేక మాయను పురుష రూపమున అనుభవించువాడు; భక్తితో నొసగిన కానుకలు స్వీకరించి సంతుష్టుడయ్యేవాడు; యజ్ఞములో అర్పించినదానిని గ్రహించువాడు.
  51. సహిష్ణుః --- సహించి, క్షమించి, అనుగ్రహించు కరుణామయుడు; ఓర్పు కలిగి భరించు సర్వ సాక్షి, సహన మూర్తి; దుష్టులను సంహరించువాడు.
  52. జగదాదిజః --- జగములన్నింటికంటే ముందుగా నున్నవాడు.
  53. అనఘః --- పాపరహితుడు; కల్మషము లేనివాడు.
  54. విజయః --- జయించుటయే స్వభావ స్వరూపముగా గలవాడు; బ్రహ్మ రుద్రాదుల విజయములకు కూడా కారణమైనవాడు; ప్రకృతిని జయించినవాడు; పాండవులలో అర్జునుడు.
  55. జేతా --- జయించువాడు; అంతా ఆయన ఇచ్ఛానుసారమే జరుగును.
  56. విశ్వయోనిః --- విశ్వమునకు జన్మ స్థానము, కారణము; విశ్వమే కారణముగా గలవాడు.
  57. పునర్వసుః --- తన సృష్టి యందంతట సకల దైవములందును అంతరాత్మయై మరల మరల విలసిల్లువాడు; ప్రళయానంతరము మరల సృష్టి కావించువాడు.

    శ్లోకం 17[మార్చు]

  58. ఉపేంద్రః --- ఇంద్రునిపై ఇంద్రుడు (ఇంద్రునకు అధిపతి) ; ఇంద్రునకు తమ్ముడై (వామనుడై) అవతరించినవాడు; ఇంద్రియములకు అగోచరుడు.
  59. వామనః --- పొట్టివానిగా అవతరించిన వాడు; చక్కనైన, కనులకింపైన, చూడ చిన్నదైన రూపము గలవాడు; ఇంద్ర రక్షణకు వామనావతారము దాల్చినవాడు.
  60. ప్రాంశుః --- ఎంతో ఎత్తైన, ఉన్నతమైన, విస్తారమైన దేహముగలవాడు; త్రివిక్రముడై ముల్లోకములు ఆక్రమించినవాడు.
  61. అమోఘః --- మహదాశయముతో విశేష పరిణామములు గల పనులు చేసెడివాడు; శ్రీహరి ప్రతి కార్యము విశేషించి కారణ యుక్తము, ఏదియును వ్యర్ధము కాదు, ప్రతి పనికిని పరమార్ధము ఉంది.
  62. శుచిః --- పరమ పావన మూర్తి, ఏ విధమైన దోష మాలిన్యములు అంటనివాడు; ప్రత్యుపకారమేమియును కోరని పరిశుద్ధుడు; భక్తులను పవిత్రులుగా చేయువాడు.
  63. ఊర్జితః --- అనంత శక్తి సామర్థ్య సంపన్నుడు; బలి చక్రవర్తిని పాతాళమునకు త్రొక్కిన మహాబలవంతుడు; ఐశ్వర్యము, శక్తి సంపన్నత, నిర్మలత్వము గలవన్నియును భగవద్విభూతులు (తేజోంశ సంభూతములు).
  64. అతీంద్రః --- ఇంద్రునికంటె అధిపుడు; మనసు కంటే శ్రేష్ఠుడు.
  65. సంగ్రహః --- ప్రళయ కాలమున సమస్తమును తనయందు చేర్చుకొనువాడు; సమస్తమును కలిపి తన అధీనములో నుంచుకొన్నవాడు; సులభముగా, కేవలము భక్తి వల్లనే పొందనగువాడు (అందుబాటులో ఉండేవాడు)
  66. సర్గః --- తనను తానే సృష్టించుకొని, తననుండి సమస్తమును సృజించినవాడు; భక్తులననుగ్రహీంచుటకు తనను తానే సృష్టించుకొనువాడు (అవతరించువాడు).
  67. ధృతాత్మా --- సకల జీవాత్మలకును ఆధారమైనవాడు (అన్ని ఆత్మలను ధరించువాడు) ; షడ్భావ వికారములు లేనివాడు.
  68. నియమః --- శాసన కర్త; నియమములనేర్పఱచి, నియంత్రించి, నడపువాడు; భక్తుల శత్రువులను నిగ్రహించువాడు.
  69. యమః --- పరిపాలించువాడు. సమస్తమును (ప్రకృతి శక్తులను) వశము చేసుకొన్నవాడు; జీవుల హృదయములందు అంతర్యామియై నడిపించువాడు.

    శ్లోకం 18[మార్చు]

  70. వేద్యః --- తెలిసికొనబడువాడు; తెలిసికొన దగినవాడు (మోక్షగాములకు).
  71. వైద్యః --- విద్య లన్నియును తెలిసినవాడు, సర్వజ్ఞుడు; జనన మరణ చక్రమునుండి తన భక్తులను ముక్తులోనరింప నెరిగినవాడు; భవరోగ బంధన విమోచకమగు ఔషధ విద్యయందు ప్రవీణుడు.
  72. సదాయోగీ --- భక్తులపట్ల ఎల్లపుడు జాగరూకుడై అందుబాటులోనుండెడివాడు; సర్వవ్యాపియై విశ్వమును అవిచ్ఛిన్నముగా నిలుపువాడు; సదా ధర్మమార్గానువర్తి యైనవాడు; యోగచింతనలో నిమగ్నుడైన సచ్చిదానంద పూర్ణ బ్రహ్మము; ఎల్లపుడు సమత్వ భావన కలిగినవాడు.
  73. వీరహా --- బలవంతులగు దుష్టులను నాశనము చేయువాడు.
  74. మాధవః --- (73, 169, 741 నామములు) మా ధవః -శ్రీమహాలక్ష్మి (మా) కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు) ; మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు; బ్రహ్మ విద్యను ప్రసాదించువాడు.
  75. మధుః --- భక్తులకు తేనెవలె, అమృతమువలె అత్యంత ప్రియమైనవాడు; మంగళకరమగు జ్ఞానమయుడు.
  76. అతీంద్రియః --- ఇంద్రియములకు అందనివాడు (ఇంద్రియముల ద్వారా తెలియరానివాడు).
  77. మహామాయః --- అధిగమింపజాలని మాయామయుడు
  78. మహోత్సాహః --- గొప్ప ఉత్సాహముతో కార్యాచరణ కావించువాడు; అంతులేని సహనముతో జగత్తును భరించువాడు.
  79. మహాబలః --- అనంతమగు, అద్భుతమగు బలము కలవాడు; బలవంతులకంటె బలవంతుడు; అందరికిని (భక్తులకు) వివిధ బలములను ప్రసాదించువాడు (జీవనాధారము).

    శ్లోకం 19[మార్చు]

  80. మహాబుద్ధిః --- అనంతమగు బుద్ధి (జ్ఞానము, విచక్షణ, గ్రహణము) కలవాడు; అన్ని ప్రాణులలోను బుద్ధికి కారణమైనవాడు.
  81. మహావీర్యః --- సకల సృజనాత్మక దివ్య శక్తులకును ఆఆరము; అచంచల మూర్తి; సృష్టిలోని చేతనత్వమంతా భగవంతుని అంశయే.
  82. మహాశక్తిః --- సృష్ట్యాది సకల కార్యములకును ఆరణమగు శక్తిగలవాడు; క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తుల సంగమమైన అనంత శక్తి సంపన్నుడు; అన్ని శక్తులకు, అందరిలోని శక్తులకు మూలము. మహిమాన్విత శక్తిపరుడైన భగవానుడు. భగవానుని యందలి ఇచ్చాశక్తిచే సృష్టి ఊహించబడెను. ఆ పరమాత్మ యందలి జ్ఞానశక్తిచే సృష్టిక్రమము నిర్వహించబడెను. ఆ పావనాత్ముని యందలి క్రియాశక్తిచే క్రియారూపము దాల్చెను. ఈవిధంగా తనలోని శక్తిత్రయ ప్రభావముచే భగవానుడు సృష్టికార్యమును నిర్వహించెను. అందుచేత అతను మహాశక్తి అని పిలువబడెను.
  83. మహాద్యుతిః --- అసమానమగు దివ్యమైన కాంతితో విరాజిల్లువాడు, తేజోమయుడు; సృష్టిలోని కాంతి అంతయు భగవంతుని ప్రకాశము వలననే కలుగుచున్నది.
  84. అనిర్దేశ్యవపుః --- వర్ణించుటకు వీలు కానట్టి, ఊహింపనలవి కానట్టి దివ్య మంగళ మూర్తి.
  85. శ్రీమాన్ --- (22, 180, 222 నామములు) దివ్యాభరణ శోభితుడు; సౌందర్యమూర్తి; సుందరాంగుడు; లక్ష్మీ వల్లభుడు; సకలైశ్వర్యయుతుడు.
  86. అమేయాత్మా --- తెలియరాని స్వరూపము గలవాడు; ఊహింపరాని తత్వమూర్తి; దివ్య గాంభీర గుణ సంపన్నుడు.
  87. మహాద్రిధృత్ --- / మహాద్రిధృక్ --- గొప్ప కొండలను ధరించినవాడు; క్షీరసాగర మథనమున శ్రీకూర్మమూర్తియై మందర గిరిని, చిన్నికృష్ణునిగా గోవర్ధన గిరిని ఎత్తినవాడు.

    శ్లోకం 20[మార్చు]

  88. మహేష్వాసః --- తిరుగులేని, గొప్ప బాణములు ప్రయోగించువాడు; బ్రహ్మాండమగు ధనుస్సును ధరించినవాడు; గొప్ప విలుకాడు.
  89. మహీభర్తా --- భూభారమును వహించినవాడు - ఆదికూర్మమై భూమిని భరించియుండు కూర్మావతార మూర్తి, పాతాళాంతర్గతయైన భూదేవిని ఉద్ధరించిన భూవరాహమూర్తి.
  90. శ్రీనివాసః --- సిరికి నిలయమైనవాడు, శ్రీమహాలక్ష్మికి తన హృదయమే నివాస స్థానముగా నున్నవాడు.
  91. సతాంగతిః --- సత్పురుషులకు, ముముక్షువులకు పరమగతియైనవాడు.
  92. అనిరుద్ధః --- ఎవరివల్లను, ఎన్నడైనను నిరోధింపబడనివాడు; అపరిమిత చేష్టామూర్తి.
  93. సురానందః --- దేవతలకు ఆనందము ప్రసాదించు దేవదేవుడు.
  94. గోవిందః --- దేవతలచే ప్రస్తుతింపబడు దేవదేవుడు; మహార్ణవమునుండి భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; గోవులను కాచేటి గోపాలుడు; వేదములనొసగిన, వేదముల ద్వారా పొందదగినవాడు, వేదవేద్యుడు.
  95. గోవిదాం పతిః --- వేదార్ధములనెఱిగిన జ్ఞానులకు రక్షకుడు.

    శ్లోకం 21[మార్చు]

  96. మరీచిః --- కాంతి, కిరణము, తేజోమయుడు; తేజోవంతులలో దివ్యతేజోమూర్తి.
  97. దమనః --- సంసార భారమును తొలగించి, బంధ విముక్తినొసగువాడు; అధర్మమార్గమున చరించువారిని శిక్షించువాడు; తన దివ్య తేజస్సుచే సమస్త ప్రాణుల తాపములను హరించువాడు.
  98. హంసః --- భక్తులకు సంసార భయమును పోగొట్టువాడు; హంసవంటి గుణములు గలవాడు, హంసావతారమును ధరించినవాడు; సోహం అని తెలిపిన పరబ్రహ్మము; అన్ని శరీరములందలి అంతర్యామి.
  99. సుపర్ణః --- చక్కనైన రెక్కలు గలవాడు (గరుత్మంతుడు, హంస) ; జ్ఞానము, కర్మ అను అందమైన రెక్కలనధిరోహింపజేసి సంసార సాగరమును తరింపజేయువాడు.
  100. భుజగోత్తమః --- ఆదిశేషునకు ప్రభువు, శేషశాయి; సర్పములలో ఉత్తముడు (అనంతుడు, వాసుకి) ; వ్యాపనము, చలనము కలిగినవానిలో ఉత్తముడు (సర్వవ్యాపి).
  101. హిరణ్యనాభః --- బంగారమువంటి, కళ్యాణప్రథము, మనోహరమునగు నాభియందు చతుర్ముఖ బ్రహ్మకు ఆధారమైనవాడు; బ్రహ్మను కన్న తండ్రి.
  102. సుతపాః --- అత్యుత్తమ జ్ఞానమునకు ఆలవాలము; మూర్తీభవించిన తపము; బదరికాశ్రమమున నరనారాయణ రూపమున గొప్ప తపసు నాచరించినవాడు.
  103. పద్మనాభః --- బొడ్డు తామరపూవు గలవాడు (బ్రహ్మకు జన్మస్థానము) ; అందరి హృదయ కమలములందు వసించువాడు; జ్ఞానమునకు నిలయము; బహు మనోహరుడు.
  104. ప్రజాపతిః --- సకలజీవులకును ప్రభువు; బ్రహ్మాదులకు ప్రభువు.

    శ్లోకం 22[మార్చు]

  105. అమృత్యుః --- మరణము గాని, నాసనము గాని లేనివాడు.
  106. సర్వదృక్ --- విశ్వ దర్శియై మహాజ్ఞానముతో జీవులు చేయు సర్వ కర్మలు చూచుచుండువాడు.
  107. సింహః ---సింహము; నరసింహావతారము; పాపములను నశింపజేయువాడు.
  108. సంధాతా --- జీవులను వారి కర్మఫలములకు ముడివేయు (అనుసంధానించు) వాడు; నిత్యము ఆశ్రితులను చేరదీయువాడు.
  109. సంధిమాన్ --- భక్తులందు ఐక్యమై యుండువాడు; తాను స్వయముగా జీవరూపుడై కర్మఫలములను అనుభవించువాడు.
  110. స్థిరః --- భక్తుల పట్ల బాంధవ్యము నిలకడగా గలాడు; నిశ్చలుడు, నిర్వికారుడు, నిత్యుడు.
  111. అజః --- పుట్టుకలేనివాడు (స్తంభమునుండి అవతరించిన శ్రీనారసింహమూర్తి) ; అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించువాడు; భక్తుల మనములోని అజ్ఞానము హరించువాడు; సకల శబ్దములకును మూలము ('అ'కారము)
  112. దుర్మర్షణః --- ఎదురులేనివాడు, అడ్డులేనివాడు; అసురులకు భరింపశక్యముగాని వాడు.
  113. శాస్తా --- బోధించువాడు, జగద్గురువు; శాసించువాడు, భక్తుల మార్గము నవరోధించువారిని శిక్షించువాడు.
  114. విశ్రుతాత్మా --- జగమంతయు విస్తృతముగా ఎవరి అద్భుత లీలా మహాత్మ్యములను గానము చేయునో ఆ దేవదేవుడు; సత్యము, జ్ఞానము, పరబ్రహ్మము - ఇత్యాది విశిష్ట నామములచే స్తుతింపబడు అనంతగుణ సంపన్నుడు; వివిధ స్వరూపములుగా కీర్తింపబడు సహస్రమూర్తి; విశేష, షడ్గుణ్య పరిపూర్ణ, పరమాత్మ.
  115. సురారిహా --- దేవతల శతృవులను హరించువాడు.

వనరులు[మార్చు]