వి.రామకృష్ణ

వికీపీడియా నుండి

వి.రామకృష్ణ (V. Ramakrishna) 1970వ దశకములో ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని ప్రముఖ చిత్రాలు ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, దానవీరశూర కర్ణ. ఈయన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు వంటి నటులకు పాడారు. కె.వి.మహదేవన్, పెండ్యాల వంటి సంగీతదర్శకులతో పనిచేశారు. అపర ఘంటసాలగా పేరొందిన రామకృష్ణ మద్రాసులో నివసిస్తున్నారు. రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు 1947, ఆగష్టు 20న జన్మించాడు. ప్రముఖ గాయని పి.సుశీల ఈయనకు మేనత్త. ఆకాశవాణిలోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించాడు.[1]

[మార్చు] సినిమాలు

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు