వీడియో కెమెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక సోనీ హై డెఫినేషన్ వీడియో కెమెరా
ఉపయోగిస్తున్న ఒక పాకెట్ వీడియో కెమెరా

విద్యుత్ ద్వారా చలన చిత్రాలను చిత్రీకరించడానికి ఉపయోగించే కెమెరాను వీడియో కెమెరా అంటారు. మొదట టెలివిజన్ పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగించారు కాని నేడు వీడియోకెమెరా అన్ని సందర్భాలలో సర్వ సాధారణమైనది. ప్రారంభంలో జాన్ లోగీ బైర్డ్ ఈ వీడియో కెమెరాను ఉపయోగించాడు. 1930 సంవత్సరంలో బిబిసి ప్రయోగాత్మక ప్రసారాల కోసం ఎలక్ట్రానిక్ పరికరమయిన నిప్కో డిస్క్ ఆధారంగా ప్రయోగాలు జరిపారు. అన్ని ఎలక్ట్రానిక్ రూపకల్పనలు వ్లాదిమిర్ జ్వొరికిన్ యొక్క ఐకానోస్కోప్, ఫిలో టి వంటి వాటి వలె క్యాథోడ్ రే ట్యూబ్ ఆధారంగా రూపొందినవే.

చరిత్ర[మార్చు]

మొట్టమొదటి వీడియో కెమెరాలు మెకానికల్ నిప్కో డిస్క్ మీద ఆధారపడి ఉన్నాయి, 1910 - 1930 లలో ప్రయోగాత్మక ప్రసారాలలో ఉపయోగించబడ్డాయి.

ఘన-స్థితి ఇమేజ్ సెన్సార్లకు ఆధారం మెటల్-ఆక్సైడ్-సెమీకండక్టర్ (MOS) టెక్నాలజీ,[1] ఇది 1959 లో బెల్ ల్యాబ్స్‌లో MOSFET (MOS ఫీల్డ్-ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్) యొక్క ఆవిష్కరణ నుండి ఉద్భవించింది.[2]

ఉపయోగాలు[మార్చు]

ఆధునిక వీడియో కెమెరాలు అనేక నమూనాలు, ఉపయోగాలను కలిగి ఉన్నాయి, ఇవన్నీ ప్రారంభ టెలివిజన్ కెమెరాలను పోలి ఉండవు.

టెలివిజన్ కార్యక్రమాల కొరకు, సినిమా నిర్మాణం కొరకు ప్రొఫెషనల్ వీడియో కెమెరాలు ఉపయోగిస్తారు. 21 వ శతాబ్దపు వీడియో కెమెరాలు డిజిటల్ కెమెరాలు, ఇవి సిగ్నల్‌ను నేరుగా డిజిటల్ అవుట్‌పుట్‌గా మారుస్తాయి, ఇటువంటి కెమెరాలు తరచుగా చిన్నవిగా ఉంటాయి. ఇటువంటి వాటిని సిసిటివి భద్రతా కెమెరాలుగా ఉపయోగిస్తున్నారు. సిసిటివి భద్రతా కెమెరాల కంటే ఇంకా చిన్నవిగా ఉన్న కెమెరాలను కంప్యూటర్లలో వెబ్‌క్యామ్‌లుగా ఉపయోగించబడుతున్నాయి.

వీడియో కెమెరాల యొక్క ప్రత్యేక ఉపయోగాలు సమయ రేసులకు, క్రీడా కార్యక్రమాలకు ముగింపు రేఖ వద్ద చిత్రాలను తీసే వ్యవస్థలు. టోల్‌గేట్ వద్ద టోల్ చెల్లించకుండా తప్పించుకుపోయే వాహనాలను గుర్తించుటకు వీడియో కెమెరాలను ఉపయోగిస్తున్నారు.

దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు జరగకుండా నిరోధించుటలో సిసిటివి భద్రతా కెమెరాల పాత్ర ప్రముఖమైనది. దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారం, హత్య వంటి సంఘటనలలో సిసిటివి భద్రతా కెమెరాల ద్వారా దోషులను గుర్తించడం సులభమయ్యింది.

మూలాలు[మార్చు]

  1. Williams, J. B. (2017). The Electronics Revolution: Inventing the Future. Springer. pp. 245–8. ISBN 9783319490885.
  2. "1960: Metal Oxide Semiconductor (MOS) Transistor Demonstrated". The Silicon Engine. Computer History Museum. Retrieved August 31, 2019.