వీనస్ విలియమ్స్

వికీపీడియా నుండి
వీనస్ విలయమ్స్

అమెరికాకు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి అయిన వీనస్ విలయమ్స్ (Venus Williams) 1980, జూన్ 17న జన్మించింది. తాజాగా 2008 వింబుల్డన్ టైటిల్ గెలిచిన వీనస్ 7 సింగిల్స్ టైటిళ్ళతో పాటు గ్రాండ్‌స్లాం టైటిళ్ళను చేజిక్కించుకుంది. రెండు ఒలింపిక్ స్వర్ణపతకాలను కూడా స్వంతం చేసుకున్న ఈ క్రీడాకారిణి మాజీ నెంబర్ 1 గా కూడా చెలామణి అయింది. అమెరికాకే చెందిన మరో అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలయమ్స్‌ ఈమె సోదరి.

విషయ సూచిక

క్రీడాజీవితం [మార్చు]

1994లో 14 సంవత్సరాల ప్రాయంలోనే వీనస్ ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా మారింది. ఆక్లాండ్ లో ఆడిన తొలి ప్రొఫెషనల్ టైటిల్ వేటలో రెండో రౌండ్‌లో ఓడిపోయినప్పటికీ ఆ టోర్నెమెంట్ టాప్‌సీడ్ క్రీడాకారిణి అరంటా సాంఛెజ్ వికారియో తో ఆడుతూ సర్వీస్ బ్రేక్ చేసి సెట్ సాధించడం విశేషం. 1995లో 3 టోర్నమెంట్లలో పాల్గొన్నప్పటికీ చెప్పుకోదగిన విజయాలు సాధించలేదు. 1996లో కూడా 5 టోర్నమెంట్లలో పాల్గొని టైటిల్ అభించలేదు.

1997

1997లో తొలిసారిగా గ్రాండ్‌స్లాం ఆడే భాగ్యం లభించింది. తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంటులో పాల్గొని రెండో రౌండ్ వరకు వెళ్ళగలిగింది. ఆ తరువాత జరిగిన వింబుల్డన్ టోర్నమెంటులో తొలి రౌండ్ లోనే వెనుతిరిగినా సంవత్సరం చివరలో స్వంతదేశంలో జరిగిన అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో తొలిసారిగా ఆడుతూ ఏకంగా ఫైన వరకు దూసుకెళ్ళింది. మార్టినా హింగిస్ చేతిలో ఓడినప్పటికీ తొలి గ్రాండ్‌స్లాం ఫైనల్ ఆడిన అనుభవం లభించింది.

1998

1998లో ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ మరియు వింబుల్డన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగా, అమెరికన్ ఓపెన్‌లో సెమీఫైనల్ ఆడగలిగింది. ఇదే సంవత్సరంలో తొలిసారిగా WTA త్రీ టయర్ టోర్నమెంటులో టైటిల్ సాధించింది.

1999

1999లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లో పరాజయం పొందినది. వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు ఆడగలిగింది. చివరన జరిగిన అమెరిక ఓపెన్‌లో సెమీఫైనల్‌లో ఇంటిముఖం పట్టింది. ఇదే సంవత్సరంలో 3 WTA టోర్నమెంట్లలో టైటిల్ సాధించింది.

2000

2000లో వీనస్ విలయమ్స్ తొలిసారిగా గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోగా ఆ తరువాత జరిగిన వింబుల్డన్ మరియు అమెరికన్ ఓపెన్‌లలో టైటిల్ సాధించింది. రెండింటిలోనే ఫైనల్‌లో లిండ్సే డావన్‌ఫోర్ట్ పై విజయం సాధించింది. ఇదే ఏడాది ఒలింపిక్ క్రీడలలో కూడా టెన్నిస్ స్వర్ణం వీనస్ విలయమ్స్‌కే వరించింది.

2001

2001లో కూడా 2000లో సాధించినట్లు మళ్ళీ అవే రెండు గ్రాండ్‌స్లాం టైటిళ్ళను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైన వరకు వెళ్ళగలిగినా, ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టింది.

వీనస్ విలయమ్స్ సర్వ్ చేస్తున్న దృశ్యం
2002

2002లో వీనస్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో పరాజయం పొందగా మిగితా మూడు గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లలో ఫైన వరకు వెళ్ళగలిగినా టైటిల్ దక్కలేదు. ఈ మూడింటిలోనే సోదరి సెరెనా విలయమ్స్ చేతిలో వరుస సెట్లలో భంగపడటం జరిగింది.

2003

2003లో ఫ్రెంచ్ ఓపెన్‌లో 4వ రౌండ్ వరకు వెళ్ళగా ఆస్ట్రేలియన్ మరియు వింబుల్డన్‌లలో ఫైనల్ వరకు వెళ్ళగలిగింది. ఈ సారి కూడా రెండింటిలోనూ సోదరి సెరెనా విలయమ్స్ చేతిలో ప్రతిఘటన చేసి ఓడిపోయింది. ఈ ఏడాది ఒక్క WTA టైటిల్ కూడా లభించలేదు.

2004

2004లో ఒక్క WTA టైట్ల్ మినహా చెప్పుకోదగ్గ విజయాలు లభించలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 4వ రౌండ్ లో పరాజయం పొందగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 3వ రౌండ్ లోనే నిష్క్రమించింది.

2005

2005లో మద్యలో మూడేళ్ళ విరామం అనంతరం గ్రాండ్‌స్లాం టైటిల్ లభించింది. హోరాహోరీగా జరిగిన వింబుల్డన్ టైటిల్ పోరులో లిండ్సే డాబన్‌పోర్ట్ పై 4–6, 7–6(4), 9–7 స్కోరుతో విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనూ, ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్ లోనూ నిష్క్రమించగా, అమెరికన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైన వరకు ఆడగలిగింది. ఈ ఏడాది ఒక్క WTA టైటిల్ కూడా లభించలేదు.

2006

2006లో వీనస్‌కు ఒక్క టైటిల్ కూడా లభించలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా, వింబుల్డన్‌లో మూడో రౌండ్ వరకు ఆడగలిగింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలిగింది. WTA టోర్నమెంట్లలో సెమీఫైన దశ దాటి ముందుకు వెళ్ళలేదు.

2007

2007లో మళ్ళీ రెండేళ్ళ తరువాత వింబుల్డన్ టైటిల్ ను మరియన్ బార్తోలిని ఓడించి కైవసం చేసుకుంది. అమెరిక ఓపెన్‌లో సెమీస్ వరకు వెళ్ళగలిగినా ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్ లోనే నిష్క్రమించింది. ఈ సారి కూడా ఎలాంటి WTA టైటిళ్ళు లభించలేదు.

2008

2008లో మళ్ళీ వింబుల్డన్ టైటిల్ సాధించింది. ఇది ఆమెకు 5వ వింబుల్డన్ టైటిల్ కాగా మొత్తంపై 7వ గ్రాండ్‌స్లాం టైటిల్. సోదరి సెరెనా విలయమ్స్‌పై పోరాడి గ్రాండ్‌స్లాం గెలుపొందటం ఇది రెండో పర్యాయం. ఇదే ఏడాది అస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్ వరకు వెళ్ళగలిగింది.

సాధించిన సింగిల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళు [మార్చు]

సంవత్సరం చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ప్రత్యర్థి ఫైన్‌లో స్కోరు
2000 వింబుల్డన్ టోర్నమెంట్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు లిండ్సే డావన్‌పోర్ట్ 6–3, 7–6(3)
2000 అమెరిక ఓపెన్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు లిండ్సే డావన్‌పోర్ట్ 6–4, 7–5
2001 వింబుల్డన్ టోర్నమెంట్ (2వ సారి) Flag of బెల్జియం జస్టిన్ హెనిస్ 6–1, 3–6, 6–0
2001 అమెరిక ఓపెన్ (2వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెరెనా విలయమ్స్ 6–2, 6–4
2005 వింబుల్డన్ టోర్నమెంట్ (3వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు లిండ్సే డావన్‌పోర్ట్ 4–6, 7–6(4), 9–7
2007 వింబుల్డన్ టోర్నమెంట్ (4వ సారి) Flag of ఫ్రాన్స్ మరియన్ బార్టోలి 6–4, 6–1
2008 వింబుల్డన్ టోర్నమెంట్ (5వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెరెనా విలయమ్స్ 7–5, 6–4

సాధించిన డబుల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళు [మార్చు]

సంవత్సరం చాంపియన్‌షిప్ భాగస్వామి ఫైనల్‌లో ప్రత్యర్థులు ఫైనల్‌లో స్కోరు
1999 ఫ్రెంచ్ ఓపెన్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెరెనా విలయమ్స్ Flag of స్విట్జర్లాండ్ మార్టినా హింగిస్
Flag of రష్యా అన్నా కోర్నికోవా
6–3, 6–7, 8–6
1999 అమెరిక ఓపెన్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెరెనా విలయమ్స్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు చందా రూబిన్
Flag of ఫ్రాన్స్ సాండ్రిన్ టెస్టుడ్
4–6, 6–1, 6–4
2000 వింబుల్డన్ టోర్నమెంట్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెరెనా విలయమ్స్ Flag of ఫ్రాన్స్ జూలీ హరాల్డ్
Flag of జపాన్ అయి సుజుయామా
6–3, 6–2
2001 ఆస్ట్రేలియన్ ఓపెన్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెరెనా విలయమ్స్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు లిండ్సే డావన్‌పోర్ట్
Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు కొరినా మొరారియు
6–3, 4–6, 6–4
2002 వింబుల్డన్ టోర్నమెంట్ (2వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెరెనా విలయమ్స్ Flag of స్పెయిన్ వర్జీనియా రువానో పాస్కల్
Flag of అర్జెంటీనా Paola Suárez
6–2, 7–5
2003 ఆస్ట్రేలియాన్ ఓపెన్ (2వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెరెనా విలయమ్స్ Flag of స్పెయిన్ వర్జీనియా రువానో పాస్కల్
Flag of అర్జెంటీనా పావొలా సువారెజ్
4–6, 6–4, 6–3

సింగిల్స్ టైటిళ్ళ కాలరేఖ [మార్చు]

టోర్నమెంటు 1994 1995 1996 1997 1998 1999 2000 2001 2002 2003 2004 2005 2006 2007 2008 కెరీర్
గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లు
ఆస్ట్రేలియన్ ఓపెన్ A A A A QF QF A SF QF F 3R 4R 1R A QF 0 / 9
ఫ్రెంచ్ ఓపెన్ A A A 2R QF 4R QF 1R F 4R QF 3R QF 3R 3R 0 / 12
వింబుల్డన్ టోర్నమెంట్ A A A 1R QF QF W W F F 2R W 3R W W 5 / 12
అమెరిక ఓపెన్ A A A F SF SF W W F A 4R QF A SF 2 / 9
Grand Slam win-loss 0–0 0–0 0–0 7–3 17–4 16–4 18–1 19–2 22–4 15–3 10–4 16–3 6–3 14–2 6–2 166–35
గ్రాండ్‌స్లాం గెలుపు-ఓటములు 0 / 0 0 / 0 0 / 0 0 / 3 0 / 4 0 / 4 2 / 3 2 / 4 0 / 4 0 / 3 0 / 4 1 / 4 0 / 3 1 / 3 1 / 3 7 / 42
ఒలింపిక్ క్రీడలు
Summer Olympics NH NH A NH NH NH W NH NH NH 3R NH NH NH 1 / 2

బయటి లింకులు [మార్చు]