వీరప్రతాప్ (1958 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీర ప్రతాప్
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ప్రకాశరావు
తారాగణం శివాజీ గణేషన్ ,
పద్మిని ,
కన్నాంబ
సంగీతం టి.చలపతిరావు & జి.రామనాధన్
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఇది ఉత్తమ పుతిరన్ అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్.

నటీనటులు[మార్చు]

  • శివాజీగణేశన్
  • పద్మిని
  • రాగిణి
  • కన్నాంబ
  • హెలెన్
  • రీటా
  • తంగవేలు
  • నంబియార్

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం:తాతినేని ప్రకాశరావు
  • పాటలు, మాటలు: శ్రీశ్రీ
  • సంగీతం: టి.చలపతిరావు, రామనాథన్

కథ[మార్చు]

మణిపురి మహారాజు వేటకోసం అడవికి వెళ్లిన సమయంలో మహారాణి కొడుకును కంటుంది. రాణి తమ్ముడు నాగరాజు ఆ పిల్లాణ్ణి నమ్మిన బంటుకు ఇచ్చి చంపమని ఆదేశిస్తాడు. పీడవిరగడయిందని నాగరాజు అనుకునేలోపల మహారాణి ఇంకో కొడుకును కంటుంది. ఆ వేళకు మహారాజు తిరిగి రావడంతో దుష్టుడు నాగరాజు రెండో యువరాజును ఏమీ చేయలేకపోతాడు. కొంత కాలానికి మహారాజు చనిపోతాడు. రెండవ యువరాజు విక్రముడు నాగరాజుతో కలిసి మహారాణి మాటలు వినకుండా ప్రజలను హింసిస్తూ ఉంటారు. ఇంకోవైపు నాగరాజు చంపించబూనిన మొదటి యువరాజు ప్రతాపుడు మారుమూల పెరిగి పెద్దవాడవుతాడు. ప్రతాపుడూ, విక్రముడు ఇద్దరూ మంత్రి కుమార్తె పద్మినిని ప్రేమిస్తారు. ఆ విధంగా శత్రువులైన ఇద్దరికీ ప్రతాపుడి జన్మరహస్యం కూడా తెలిసిపోవడంతో అటు ఒకే ప్రేయసి, ఇటు ఒకే సింహాసనం కోసం పోటీ జరుగుతుంది. ప్రతాపుడు మంచివాడుకాబట్టి అతనికి సింహాసంపై మోజు లేకపోయినా విక్రముడూ,నాగరాజూ ప్రజలను హింసిస్తుండడంవల్ల వారిని అణచడం తన విద్యుక్త ధర్మంగా భావిస్తాడు. చివరకు ప్రజలలో ఒక చిన్న విప్లవం బయలుదేరి, యుద్ధం జరిగి ఈ సమస్యల పరిష్కారంతో ఉత్తమ పుత్రుడైన విక్రముడిని సింహాసనం ఎక్కిస్తారు[1].

పాటలు[మార్చు]

  1. అందాల రాసీ ముచ్చటగా ఇచ్చట నీ సుందర ముఖమే - ఎస్.జానకి, ఎ.పి. కోమల
  2. ఉల్లాసం మనసులోని ఉల్లాసం కైలాసం బొందితోనే - పి.లీల
  3. జగమే ఇపుడే కనుతెరచే సాగరమాయే ఏమో నామదియే - ఘంటసాల, పి.సుశీల - రచన: శ్రీశ్రీ
  4. నీ తలపే కమలనయనా చెలికి నీ తలపే నిలిచి నిలిచి - పి.లీల
  5. పొడి వెయ్యనా బోణీ చెయ్యనా మహా బాధంటావా - పి.లీల, పిఠాపురం
  6. మంజులగానం మనసున సాగే మాయని వేళా మాకిది - పి.సుశీల, జిక్కి
  7. మధువనమేలె భ్రమరమువోలె హాయిగ పాడుదమా గీతాలే - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  8. రాగదే నా మోహినీ కోరినానే కామినీ - పిఠాపురం నాగేశ్వరరావు, టి.జి. కమలాదేవి, ఎస్.జానకి, జిక్కి
  9. లాలి పాడి నిన్నే రమ్మంటిరా చిన్ని లాలన గీతాల వినమంటి - ఎస్.జానకి
  10. సుందరుడా నీ సొగసే చూచిననాడే డెందము నీ తలపే - పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (1 June 1958). ""వీరప్రతాప్"". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 28 January 2020.[permanent dead link]