వీరేంద్ర సెహ్వాగ్
| వీరేంద్ర సెహ్వాగ్ | ||||
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
| బౌలింగ్ శైలి | రైట్-ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| Tests | ODIs | |||
| మ్యాచ్‌లు | 103 | 251 | ||
| పరుగులు | 8586 | 8273 | ||
| బ్యాటింగ్ సగటు | 49.34 | 35.06 | ||
| 100లు/50లు | 23/32 | 15/38 | ||
| అత్యుత్తమ స్కోరు | 319 | 219 | ||
| ఓవర్లు | 621 | 732 | ||
| వికెట్లు | 40 | 96 | ||
| బౌలింగ్ సగటు | 47.35 | 40.14 | ||
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 1 | - | ||
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | n/a | ||
| అత్యుత్తమ బౌలింగ్ | 5/104 | 4/6 | ||
| క్యాచ్ లు/స్టంపింగులు | 59/- | 82/- | ||
|
As of ఏప్రిల్ 13, 2012 |
||||
భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) అక్టోబర్ 20, 1978 రోజున జన్మించాడు. వీరూ అని ముద్దుగా పిల్వబడే ఇతను 1999 నుంచి వన్డే, 2001 నుంచి టెస్టులకు భారత జట్టులో ప్రాతినిద్యం వహిస్తున్నాడు. కుడిచేతి వాటం గల ఈ బ్యాట్స్‌మెన్, బౌలింగ్ కూడా చేయగలడు. భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (319) సాధించిన బ్యాట్స్‌మెన్‌గానే కాడు, భారత్ తరఫున ఏకైక ట్రిపుల్ సెంచరీ వీరుడు ఇతను. 2005 అక్టోబర్లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇతను ఉప సారథిగా నియమించబడ్డాడు. 2006 డిసెంబర్‌లో వి.వి.యెస్.లక్ష్మణ్కు బదిలీ చేశారు. 2007 జనవరిలో భాతర వన్డే జట్టు నుంచి ఇతని పేరు తొలిగించారు.[1] 2007-08 ఆస్ట్రేలియా పర్యటనకై మళ్ళీ ఎంపికై అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్సులో శతకాన్ని నమోదుచేసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆ తరువాత స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుపై చెన్నైలోని చేపాక్ స్టేడియంలో మరో ట్రిపుల్ సెంచరీని సాధించి ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. డాన్ బ్రాడ్‌మెన్ మరియు బ్రియాన్ లారాలు మాత్రమే ఇది వరకు రెండేసి ట్రిపుల్ సెంచరీలు నమోదు చేశారు. 2009, మార్చి 11న హామిల్టన్ వన్డేలో న్యూజీలాండ్ పై కేవలం 60 బంతుల్లోనే సెంచరీ చేసి అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.[2]
విషయ సూచిక |
క్రీడా జీవితం [మార్చు]
1999 ఏప్రిల్లో పాకిస్తాన్ పై వన్డే క్రికెట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్ తొలిరోజుల్లో ఆశించినంతగా రాణించలేదు. తొలి వన్డేలో ఒక్క పరుగుకే ఔట్ అయి, బౌలింగ్‌లో కూడా 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చేశాడు. [3] 2000 డిసెంబర్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్‌కు మరో అవకాశం లభించింది. కాని 2001 మార్చిలో ఆడిన తన నాలుగవ మ్యాచ్ వరకు తన ప్రతిభను చూపలేక పోయాడు. తన నాలుగవ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై బెంగుళూరులో 54 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. 3 వికెట్లకు పాట్నర్‌షిప్ పరుగులు సాధించి భారత విజయానికి దోహదపడి తొలి సారిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.[4] ఆ తరువాత జిమ్బాబ్వే పర్యటనకు వెళ్ళిననూ అంతగా రాణించలేడు. 2001 ఆగస్టులో శ్రీలంక, న్యూజీలాండ్లతో జరిగిన ముక్కోణపు పోటీలలో సచిన్ టెండుల్కర్ గాయం కారణంగా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా పంపబడ్డాడు..[5] అదే సీరీస్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 69 బంతులోనే సెంచరీ సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. అదే అతని తొలి సెంచరీ కావడం గమనార్హం.[6] అప్పటికి ఆ సెంచరీ భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. సహజంగానే ఆ మ్యాచ్‌లో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆ తరువాత భారత జట్టులో రెగ్యులర్ బ్యాట్స్‌మెన్‌గా చెలామణి అయ్యాడు. 2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించి భారత్ తరఫున రెండో వేగవంతమైన అర్థసెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించినాడు. 2002 జనవరిలో సౌరవ్ గంగూలీ గాయపడడంతో ఇంగ్లాండ్తో కాన్పూర్లో జరిగిమ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రంగప్రవేశం చేసి 64 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. [7] అప్పటి నుంచి సచిన్ టెండుల్కర్‌కు మిడిల్ ఆర్డర్ పంపించి సెహ్వాగ్‌చే ఓపెనింగ్ బ్యాటింగ్ చేయించారు. [8] ఆ తరువాత ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా సీరీస్ లలో చెలరేగి ఆడి 4 అర్థ సెంచరీలతో 42.6 సగటుతో 426 పరుగులు సాధించాడు. 2002లో శ్రీలంకలో జరిగిన ఐ.సి.సి.చాంపియన్ ట్రోఫీలో 90.33 సగటుతో 271 పరుగులు సాధించాడు. అందులో రెండు పర్యాయాలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందినాడు. ఆ సీరీస్‌లో గంగూలీతో జతగా సాధించిన 192 పాట్నర్‌షిప్ సెంచరీ, వ్యక్తిగతంగా 104 బంతులలో సాధించిన 126 పరుగులు కూడా ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్లతో నెగ్గింది. [9] ఆ తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 58 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లో కూడా రాణించి 25 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి భారత్‌కు 10 పరుగుల విజయాన్ని అందించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించడానికి దోహదపడ్డాడు. [10]
2002 చివరిలో రాజ్‌కోట్లో వెస్ట్‌ఇండీస్తో జరిగిన మ్యాచ్‌లో 82 బంతుల్లో 114 పరుగులు సాధించడమే కాకుండా గంగూలీతో కలిసి 196 పరుగుల భాగస్వామ్య పరుగులు జతచేసి ఆ మ్యాచ్‌లో భారత్‌కు 9 వికెట్లతో విజయాన్నిఅందించాడు.[11] న్యూజీలాండ్తో జరిగిన 7 మ్యాచ్‌ల సీరీస్‌లో సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ అవతరించినాడు. అందులో మొదటిది నేపియర్లో 108 పరుగులతో సెంచరీ చేయగా [12] రెండో సారి ఆక్లాండ్లో 112 పరుగులు సాధించాడు.[13]
2003లో జరిగిన ప్రపప్చ కప్ క్రికెట్‌లో సెహ్వాగ్ 27 సగటుతో 299 పరుగులు సాధించాడు. అందులో అత్యధిక స్కోరు ఫైనల్లో ఆస్ట్రేలియాపై సాధించిన 82 పరుగులు. [14] ప్రపంచ కప్ తరువాత హైదరాబాదులో న్యూజీలాండ్తో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగులు చేయడమే కాకుండా సచిన్ టెండుల్కర్తో జతగా 182 పరుగుల భాగస్వామ్యం జతచేసి భారత్ 145 పరుగులతో విజయం సాధించడానికి పునాది వేశాడు. ఇది అతనికి నాలుగవ సెంచరీ కాగా ఆ మ్యాచ్‌లో కూడా అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. [15] ఆ తరువాత పాకిస్తాన్, బామ్గ్లాదేశ్ మరియు జింబాబ్వేలతో జరిగిన 22 మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక సెంచరీ సాధించాడు.
2008లో ఆస్ట్రేలియా పర్యటనకై ఎంపికై అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్సులో శతకాన్ని సాధించాడు. ఆ తరువాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టులో మరో సారి దక్షిణాఫ్రికాపై విరుచుకుపడి 41 ఫోర్లు, 5 సిక్సర్లతో రెండో ట్రిపుల్ సెంచరీని సాధించాడు.[16] భారత్ తరఫున నమోదై ఉన్న రెండు ట్రిపుల్ సెంచరీలు కూడా ఇతని పేరిటే ఉండటం గమనార్హం. టెస్ట్ క్రికెట్‌లో రెండూ ట్రిపుల్ సెంచరీలు సాధించిన వారిలీ సెహ్వాగ్ మూడోవాడు. ఇదివరకు డాన్ బ్రాడ్‌మెన్ మరియు బ్రియాన్ లారాలు మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించిన వారిలో ఉన్నారు.
2009 న్యూజీలాండ్ పర్యటనలో తన విశ్వరూప ప్రదర్శనతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. హామిల్టన్‌లో జరిగిన నాలుగవ వన్డేలో కేవలం 60 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి సరికొత్త భారత రికార్డును సృష్టించాడు. న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ క్రోచే అత్యంత విధ్వంసకరమైన బ్యాట్స్‌మెన్‌గా ప్రశంసలందుకున్నాడు. [17]
సాధించిన టెస్ట్ సెంచరీలు [మార్చు]
వన్డే సెంచరీలు [మార్చు]
| వీరేంద్ర సెహ్వాగ్ వన్డే సెంచరీలు | ||||||
|---|---|---|---|---|---|---|
| పరుగులు | మ్యాచ్ | ప్రత్యర్థి | నగరం/దేశం | వేదిక | సంవత్సరం | |
| [1] | 100 | 15 | న్యూజీలాండ్ | కొలంబో, శ్రీలంక | సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ | 2001 |
| [2] | 126 | 40 | ఇంగ్లాండు | కొలంబో, శ్రీలంక | ఆర్.ప్రేమదాస స్టేడియం | 2002 |
| [3] | 114* | 46 | వెస్ట్‌ఇండీస్ | రాజ్‌కోట్, భారత్ | మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్ | 2002 |
| [4] | 108 | 52 | న్యూజీలాండ్ | నేపియర్, న్యూజీలాండ్ | మెక్‌లీన్ పార్క్ | 2002 |
| [5] | 112 | 56 | న్యూజీలాండ్ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | ఈడెన్ పార్క్ | 2003 |
| [6] | 130 | 78 | న్యూజీలాండ్ | హైదరాబాదు, భారత్ | లాల్ బహదూ శాస్త్రి స్టేడియం | 2003 |
| [7] | 108 | 108 | పాకిస్తాన్ | కొచ్చి, భారత్ | నెహ్రూ స్టేడియం | 2005 |
| [8] | 114 | 169 | బెర్మూడా | పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ | క్వీన్స్ పార్క్ ఓవల్ | 2007 |
| [9] | 119 | - | పాకిస్తాన్ | కరాచి | నేషనల్ స్టేడియం, కరాచి | 2008 |
| [10] | 116 | 197 | శ్రీలంక | కొలంబో | ప్రేమదాస స్టేడియం | 2009 |
| [11] | 125* | 204 | న్యూజీలాండ్ | హామిల్టన్ | సెడ్డన్ పార్క్ | 2009 |
అవార్డులు [మార్చు]
- 2002లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు ప్రధానం చేసింది.[18]
రికార్డులు [మార్చు]
- వన్డేలలో అతితక్కువ బంతులలో సెంచరీ సాధించిన భారతీయుడు.
- టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారతీయుడు. (319 పరుగులు)
- పాకిస్తాన్ పై అత్యధిక డబుల్ సెంచరీలు (3) సాధించిన భారతీయుడు.[19]
- అతివేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్
- ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారతీయుడు.
- ఒకే ఇన్నింగ్సులో వరుసగా రెండు డబుల్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదుచేసిన రికార్డు.
- 2011 వన్డేవరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు.
టెస్ట్ మ్యాచ్ అవార్డులు [మార్చు]
-
- మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు
-
# సీరీస్ సీజన్ సీరీస్ గణాంకాలు 1 పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్ 2003/04 438 (3 మ్యాచ్‌లు, 4 ఇన్నింగ్సులు, 1x100, 1x50); 6-0-27-0; 2 క్యాచ్‌లు 2 దక్షిణాఫ్రికాతో టెస్ట్ సీరీస్‌లో 2004/05 262 పరుగులు (2 మ్యాచ్‌లు, 3 ఇన్నింగ్సులు, 1x100, 2x50); 1 క్యాచ్ 3 పాకిస్తాన్తో టెస్ట్ సీరీస్ 2004/05 544 పరుగులు (3 మ్యాచ్‌లు, 6 ఇన్నింగ్సులు, 2x100, 1x50); 5-2-14-0; 2 క్యాచ్‌లు
-
- మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు
-
క్ర.సం. ప్రత్యర్థి వేదిక సీజన్ మ్యాచ్ గణాంకాలు 1 వెస్ట్‌ఇండీస్ ముంబాయి 2002/03 తొలి ఇన్నింగ్స్: 147 (24x4, 3x6); 2-0-7-0
రెండో ఇన్నింగ్స్: 1 క్యాచ్2 పాకిస్తాన్ ముల్తాన్ 2003/04 తొలి ఇన్నింగ్స్: 309 (39x4, 6x6); 2-0-11-0
రెండో ఇన్నింగ్స్: 3-0-8-0; 1 క్యాచ్3 పాకిస్తాన్ లాహోర్ 2006 తొలి ఇన్నింగ్స్: 254 (47x4, 1x6); 6-0-24-0 4 వెస్ట్‌ఇండీస్ సెయింట్ లూసియా 2006 తొలి ఇన్నింగ్స్: 180 (20x4, 2x6); 16.1-5-33-3
రెండో ఇన్నింగ్స్: 30-9-48-15 దక్షిణాప్రికా చెన్నై 2007-08 మొదటి ఇన్నింగ్సు 319 319 (42x4, 5x6); 11-1-37-1
రెండో ఇన్నింగ్సు 22-2-55-16 శ్రీలంక గాలె 2008-09 మొదటి ఇన్నింగ్సు 201 (22x4, 4x6)
రెండో ఇన్నింగ్సు 50 (6x4, 1x6)7 ఇంగ్లాండు చెన్నై 2008-09 మొదటి ఇన్నింగ్సు 9 (2x4); 1-0-8-0
రెండో ఇన్నింగ్సు 83 (11x4, 4x6); 6-0-22-0
ఇవి కూడా చూడండి [మార్చు]
|
|||||
|
|
|
|---|---|
| సౌరవ్ గంగూలీ · రాహుల్ ద్రవిడ్ · వీరేంద్ర సెహ్వాగ్ · సచిన్ టెండుల్కర్ · అనిల్ కుంబ్లే · హర్భజన్ సింగ్ · శ్రీశాంత్ · జహీర్ ఖాన్ · ఆశిష్ నెహ్రా · నయన్ మోంగియా · పార్థివ్ పటేల్ · సంజయ్ బంగర్ · అజిత్ అగార్కర్ · యువరాజ్ సింగ్ · మహమ్మద్ కైఫ్ |
|
|
|
|---|---|
| హర్భజన్ సింగ్ · మహేంద్రసింగ్ ధోని · సచిన్ టెండుల్కర్ · యువరాజ్ సింగ్ · మునాఫ్ పటేల్ · రాహుల్ ద్రవిడ్ · సౌరవ్ గంగూలీ · రాబిన్ ఊతప్ప · జహీర్ ఖాన్ · శ్రీశాంత్ · అనిల్ కుంబ్లే · వీరేంద్ర సెహ్వాగ్ · ఇర్ఫాన్ పటాన్ · అజిత్ అగార్కర్ · దినేష్ కార్తిక్ |
మూస:2011 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు
మూలాలు [మార్చు]
- ↑ http://content-usa.cricinfo.com/indvwi/content/story/276198.html
- ↑ ఈనాడు దినపత్రిక, చాంపియన్ పేజీ, తేది 12.03.2009
- ↑ 6th ODI: India v Pakistan at Mohali, 1 Apr 1999
- ↑ 1st ODI: India v Australia at Bangalore, 25 Mar 2001
- ↑ Cricinfo - Injured Tendulkar ruled out for Sri Lanka tri-series
- ↑ 9th Match: India v New Zealand at Colombo, 2 Aug 2001
- ↑ 4th ODI: India v England at Kanpur, 28 Jan 2002
- ↑ Cricinfo - Pushing Tendulkar and Dravid around
- ↑ England v India at Colombo (RPS), 22 Sep 2002
- ↑ India v South Africa at Colombo (RPS), 25 Sep 2002
- ↑ 3rd ODI: India v West Indies at Rajkot, 12 Nov 2002
- ↑ http://www.cricinfo.com/db/ARCHIVE/2002-03/IND_IN_NZ/SCORECARDS/IND_NZ_ODI2_29DEC2002.html
- ↑ 6th ODI: New Zealand v India at Auckland, 11 Jan 2003
- ↑ Final: Australia v India at Johannesburg, 23 Mar 2003
- ↑ 9th Match: India v New Zealand at Hyderabad, 15 Nov 2003
- ↑ http://in.telugu.yahoo.com/News/Sports/0803/28/1080328032_1.htm
- ↑ ఈనాడు దినపత్రిక, ఛాంపియన్ పేజీ, తేది 13.03.2009
- ↑ http://content-www.cricinfo.com/india/content/story/125215.html
- ↑ http://stats.cricinfo.com/statsguru/engine/stats/index.html?class=1;filter=advanced;opposition=7;orderby=runs;runsmin1=200;runsval1=runs;template=results;type=batting