వృక్షాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వృక్షాలు భూమిపై మానవునికన్నా లక్షల ఏళ్ల ముందునుండి వున్నాయి.మానవుని జీవితం పూర్తిగా వృక్షాలపైనే ఆధారపడివుంది.

చింతచెట్టు[మార్చు]

కాయలతో చింతచెట్టు.

లాటిన్ పేరు-టామరిండస్ ఇండికా. కుటుంబం-లెగ్యుమినేసీ(ఫాబేసీ). దీన్ని డేట్ ఆఫ్ ఇండియా అని అంటారు.సంస్కృతంలో చించ అంటారు.

ఇది ఎత్తుగా పెరిగే వృక్షం, లావైన కాండం, నల్లటి బెరడు కలిగివుంటుంది. చిన్న చిన్న ఆకులు గుత్తులుగా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు రెక్కలతో పసుపు రంగులో పూలు పూస్తాయి.దీనికాయలు పొడవుగా ,మందంగా, గోధుమ రంగులో వుంటాయి,రుచి పుల్లగా వుంటుంది, పచ్చడి గాను ,కూరల్లోను దీన్ని ఉపయోగిస్తారు.దీని చెక్క వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగిస్తారు.అద్దకాలలో పసుపురంగుకోసం దీని ఆకులు వినియోగిస్తారు.

మామిడి చెట్టు[మార్చు]

లాటిన్ పేరు-మాంగిఫెరా ఇండికా . కుటుంబం-అనకార్డియేసీ.సంస్కృతంలో ఆమ్ర అంటారు. ఇది దక్షిణాసియా, దక్షిణప్రాచ్య ఆసియా ప్రాంతానికి చెందినది. మామిడి చాలా ప్రసిద్ధి చెందిన రుచికరమైన ఫలము.మామిడి చాలా రకాలుగా దొరుకుతుంది,చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కూడా.

వేప చెట్టు[మార్చు]

లాటిన్ పేరు-అజాడిరక్టా ఇండికా.కుటుంబం-మీలియేసీ.సంస్కృతంలో నింబ అంటారు. ఇది దక్షిణ ఆసియా దేశాలైన ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మియన్మార్ ప్రాంతాలలో కనిపిస్తుంది. వేప చాలా ఔషధ విలువలు కలిగిన చెట్టు. దీని విత్తనాలు, ఆకులు, కాండము, వేర్లు,బెరడు మొదలైన భాగాలన్నీఔషధాలుగా ఉపయోపడుతాయి. చాలా రకాలయిన వ్యాధులను వేప ఆకులను లేదా విత్తనాలను ఉపయోగించి నయం చేయవచ్చును. ఇవి అన్నీ చేదు రుచిని కలిగి ఉంటాయి.

రావి చెట్టు[మార్చు]

లాటిన్ పేరు-ఫైకస్ రెలిజియోసా.కుటుంబం-మోరేసీ.సంస్కృతంలో అశ్వత్థ అంటారు.


మర్రి చెట్టు[మార్చు]

మర్రిచెట్టు-ఊడలతో.

లాటిన్ పేరు-ఫైకస్ బెంగలెన్సిస్.కుటుంబం-మోరేసీ.సంస్కృతంలో వట అంటారు.

కొబ్బరి చెట్టు[మార్చు]

కొబ్బరి చెట్టు లాటిన్ పేరు కోకస్ న్యుసిఫెరా. తెలుగులో నారికేళం, టెంకాయ, కొబ్బరి అంటారు. కొబ్బరి చెట్టు కాండం గుండ్రంగా పొడవుగా పెరుగుతుంది కాండానికి పెద్ద ఆకులు మధ్యలో ఈనె కలిగి ముదురాకు పచ్చ రంగు లో ఉంటాయి. పూలు ఎరుపు, పసుపు రంగు కలిగి కాండానికి పూస్తాయి.

కాయలు పెద్దవిగా మూడుముఖాలతో ఉంటాయి, మొదట ఆకుపచ్చ రంగులో ఉండి క్రమంగా పసుపు బూడిద రంగు లోకి మారతాయి. కాయ లోపల గట్టి టెంక దాని చుట్టూ పీచు ఉంటుంది, టెంక లోపల తెల్లటి కొబ్బరి,నీళ్ళూ ఉంటాయి. కొబ్బరి కాయ లోని నీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, సల్ఫర్, క్లోరిన్, ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి. కొబ్బరి మంచి పౌష్టికాహారం ప్రొటీన్లను కలిగిఉంటుంది.

దీని కాండం లో చిన్న పాటి పడవడలు తయారుచేస్తారు, ఆకులు ఇంటి పైకప్పుగా వేయడానికి ఉపయోగిస్తారు. ఆకు ఈనెలతో చీపుళ్ళు తయారు చేస్తారు. కొబ్బరి పీచు తో తాళ్ళు, తివాచీలు తయారు చేస్తారు. టెంకను వంట చెరకుగా ఉపయోగిస్తారు. టెంక లోపలి కొబ్బరి తో నూనె తయారు చేస్తారు,పచ్చి కొబ్బరితో కూరలూ, పచ్చళ్ళు చేసుకుంటారు.

తాటి చెట్టు-కాయలతో

తాటి చెట్టు[మార్చు]

జామ చెట్టు[మార్చు]

జామ మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. జామకాయలో ఉండే పీచు పదార్ధం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం . అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. పోషక విలువలు ప్రతి వంద గ్రాములకు నీరు: 81.7 గ్రా: కొవ్వు. 0.3 గ్రా. ప్రోటీన్ 0.9 గ్రా పీచు పదార్తాలు: 5.2 గ్రా. సి.విటమిన్ 212 మి.గ్రా. పాస్పరస్. 28 మి.గ్రా సోడియం 5.5 మి.గ్రా పొటాసియం: 91 మి.గ్రా. కాల్సియం: 10 మి.గ్రా ఇనుము; 0.27 మి.గ్రా. శక్తి: 51 కిలో కాలరిలు. http://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AE

రేగు చెట్టు[మార్చు]

రేగు చెట్టు లాటిన్ పేరు జిజిఫస్ జుజూబా. చిన్న పొదలు గానూ పెద్ద వృక్షం గానూ ఉంటుంది. మెట్ట ప్రాంతం లోనూ బంజరు భూములలోనూ పెరుగుతుంది. ఇది నిత్య హరిత వృక్షము దీని బెరడు బూడిద రంగులో పగుళ్ళతో బీటలు బారి మందంగా ఉంటుంది, కొమ్మలు అన్ని వైపులకూ విస్తరించి పెరుగుతాయి. ఆకు మొదలు లో ముళ్ళు కలిగి ఉంటుంది, ఆకులు గుండ్రంగా క్రిందవైపు నూగు కలిగి ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి. రేగు పూలు గుత్తులుగా ఆకుపచ్చ మరియూ పసుపుపచ్చ రంగులుగా చిన్న నక్షత్రాల వలె ఉంటాయి. పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చరంగులోను క్రమంగా పసుపురంగులోకి మారి పండుగా మారినపుడు ఎరుపు రంగులో ఉంటాయి. పండు తొక్క మందంగా ఉంటుంది లోపల గుజ్జు కలిగి మధ్యలో గట్టి గింజ కలిగి ఉంటుంది, పులుపుగానూ తియ్యగానూ ఉంటాయి. దీని కలపను వంటచెరకు గా ఉపయోగిస్తారు. పండ్లు తినడానికి, వడియాలు, పచ్చళ్ళు పెట్టడానికీ ఉపయోగిస్తారు.

పనస చెట్టు[మార్చు]

నిమ్మ చెట్టు[మార్చు]

లాటిన్ పేరు-సిట్రస్ లిమోన్.కుటుంబం-రూటేసీ.సంస్కృతంలో నింబుఫల అంటారు.

దానిమ్మ చెట్టు[మార్చు]

లాటిన్ పేరు-ప్యూనికా గ్రానాటమ్.కుటుంబం-ప్యూనికేసీ.సంస్కృతంలో దాడిమ అంటారు.దీన్ని చెట్టుకంటే పొద అనదమే సరియైనది.ఎర్రటి అందమైన పుష్పాలు కలిగిడ్రటి కాయలు గుండ్రంగా ఉంటాయి.కాయ మందమైన తోలు కలిగి దంతములవంటి లేతగులాబి రంగు విత్తనాలు ఉంటాయి.పండ్లను, తోలును,వేర్ల తోలును ఔషధాల్లో వాడతారు.

టేకు చెట్టు[మార్చు]

నల్లమద్ది చెట్టు[మార్చు]

ఓక్ చెట్టు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=వృక్షాలు&oldid=864838" నుండి వెలికితీశారు