వృద్దాప్యము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
వృద్దాప్యము లేదా ముసలితనము (ఆంగ్లం: Old age) మానవ జన్మలో చివరి దశ. దీనిని నిర్వచించడానికి వయోపరిమితి లేనప్పటికి, మనిషి శరీరము రోగనిరోధక శక్తిని క్రమక్రమముగా కోల్పోయి చివరకు మరణించే స్థితికి చేరే దశను వృద్దాప్యముగా చెప్పవచ్చు. ఈ జీవిత భాగంలో జరిగే శారీరక మార్పులను మరియు వ్యాధులను పరిశోధించే విభాగాన్ని జీరియాట్రిక్స్ (Geriatrics) అంటారు.
విషయ సూచిక |
[మార్చు] జీవన విధానము
ఈ వయసులో వీరు సంతోష ప్రధాన జీవితము కోరుకొంటారు. ఒంటరితనం వీరిని ఎక్కువగా బాధిస్తుంది.
[మార్చు] మానసిక స్థితి
చాలామంది ఈ వయస్సులో మానసిక సమతుల్యతను కోల్పోతారు. వీరిని పసిపాపలవలె చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది.
[మార్చు] శారీరక మార్పులు
ఇంగ్లాండు కు చెందిన ఒక వృద్దురాలు.
వృద్దాప్యంలో అనేక సమస్యలు బాధిస్తాయి. వీటిలో కొన్ని...
- చర్మం ముడతలు పడిపోతుంది
- జుట్టు నలుపు రంగు మారి తెల్లగా మారుతుంది.
- కొందరికి బట్టతల వస్తుంది
- చెవుల వినికిడి తగ్గుతుంది.
- కంటిచూపు తగ్గుతుంది.
- వ్యక్తి కదలికలు నెమ్మదిస్తాయి.
- స్పష్టమైన ఆలోచన తగ్గుతుంది.
- జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
- రతికార్యం మీద ఆసక్తి తగ్గి అంగస్తంభన లో పటుత్వం తగ్గుతుంది.
- కొన్ని వ్యాధులు తొందరగా వస్తాయి.