వెంకటగిరి

వికీపీడియా నుండి
  ?వెంకటగిరి మండలం
నెల్లూరు • ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లా పటములో వెంకటగిరి మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో వెంకటగిరి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము వెంకటగిరి
జిల్లా(లు) నెల్లూరు
గ్రామాలు 58
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
75,236 (2001)
• 38319
• 36917
• 62.48
• 72.91
• 51.71


వెంకటగిరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక చారిత్రక పట్టణము మరియు అదే పేరుగల మండలము. వెంకటగిరి పట్టుచీర లకు చాలా ప్రసిద్ధి చెందినది. జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ. వెంకటగిరి భౌగోళికాంశాలు, అక్షాంశ రేఖాంశాలు 13.9667° N 79.5833° E[1]. ఈ పట్టణమునకు దగ్గరలో రేణిగుంట వద్ధ తిరుపతి కి అంతర్జాతీయ విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.అంతేకాక ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.

వెంకటగిరి పట్టణము నేత చీరలకు మరియు పోలేరమ్మ జాతరకు చాలా ప్రసిద్ధి. ఈ ముఖ్య పట్టణము లోని ప్రజలు ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర చాలా భక్తి శ్రద్ధలతో వైభావం గా జరుపుకుందురు. ఈ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం మరియు గురువారం న జరుపుకుంటారు.


విషయ సూచిక

[మార్చు] చరిత్ర

వెంకటగిరి చరిత్ర కలిగిన ముఖ్య పట్టణము. మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. కుటుంబ రికార్డుల ప్రకారం, చెవిరెడ్డి అనే జమీందారు, తన పొలం దున్నుతుండగా 9లక్షల ఖజానా దొరికింది. ఈ ధనంతో, వరంగల్ రాజు యొద్దకు మార్గము సుగమమం చేసుకుని అతనిని ప్రసన్నం చేసుకొని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు. ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగొందుతూ వచ్చారు. 1802 లో లార్డ్ క్లైవు కాలం లో 'సనద్' ను పొందారు. తమ వంశం జమీందార్లు 'రాజా' అనే బిరుదును వాడుతూ వచ్చారు.

వెంకటగిరి రాజ వంశం

మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. అతని వారసులు :

  • వెలుగోటి నిర్వాణ రాయప్ప (పెద్ద రాయుడు), 15వ రాజు (వెంకటగిరి), చికాకోల్ నవాబు షేర్ ముహమ్మద్ ఖాన్ 1652 లో రాజాం ఎస్టేటును వెలుగోటి నిర్వాణ రాయప్పకు బహూకరించి, చికాకోల్ కు ఇతని గౌరవార్థం 'బెబ్బులి' గా పేరు మార్చాడు. (తరువాత బొబ్బిలి గా రూపాంతరం చెందింది) 'రాజా' మరియు 'బహాదుర్' బిరుదులను ప్రదానం చేశాడు.
  • వెలుగోటి కుమార యాచమ నాయుడు (1777/1804) (జననం 23 ఫిబ్రవరి 1762)(మరణం 18 మార్చి 1804)
  • వెలుగోటి బంగారు యాచమ నాయుడు (1804/1847) (మరణం 25 డిసెంబరు 1847)
  • వెలుగోటి కుమార యాచమ నాయుడు (1848/1878) (జననం 3 జనవరి 1832, మరణం 1892.)
  • రాజగోపాల కృష్ణ యాచేంద్ర (qv)
  • రామకృష్ణ యాచేంద్ర, తరువాత శ్రీ రాజా రావు వెంకట సూర్య మహీపతి రామకృష్ణారావు బహదూర్ గా పేరుగాంచాడు. (పిఠాపురం 'రాజా' చే దత్తత తీసుకోబడ్డాడు).
  • రంగమన్నార్‌ కృష్ణ యాచేంద్ర, తరువాత మహారాజా వెంకట శ్వేతా చలపతి రంగా రావు గా పేరు గడించాడు, (బొబ్బిలి 'రాణి' చే దత్తత తీసుకోబడ్డాడు).
  • రాజా వేణుగోపాల్ బహదూర్, (జననం 12 ఫిబ్రవరి 1873) (జెట్టిప్రోలు కుటుంబంచే దత్తత తీసుకోబడ్డాడు).
  • రాజగోపాల కృష్ణ యాచేంద్ర (1878, జననం 1857)
    • ఇతర సభ్యులు :
  • వెలుగోటి గోవింద కృష్ణ యాచేంద్ర (1922)

[మార్చు] శాసనసభ నియోజకవర్గం

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • వెంకటగిరి

[మార్చు] గ్రామాలు

[మార్చు] చూడండి

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=వెంకటగిరి&oldid=729724" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు