వెక్కిళ్ళు
వికీపీడియా నుండి
వెక్కిళ్ళు (Hiccough) అప్పుడప్పుడు అందరికీ అనుభవమైనవి. ఇవి ఉదరవితానం హఠాత్తుగా సంకోచించడం వల్ల ఏర్పడతాయి. ఇలాంటి సంకోచం వలన గాలి ఉఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తూ స్వరతంత్రులను దగ్గరచేస్తుంది. దీని మూలంగా 'హిక్' అనే ధ్వని పుడుతుంది. ఈ శబ్దాన్ని ఆధారం చేసుకొనే ఆయుర్వేదంలో వెక్కిళ్ళను 'హిక్క' అని, ఆంగ్లంలో 'హిక్కప్' అని అంటారు
వెక్కుళ్ళు వస్తున్నప్పుడు రకరకాల చిట్కాలను ఉపయోగిస్తాము. ఊపిరిని బిగబట్టి ఉంచడం, చల్లని నీరు తాగడం మొదలైనవి. వెక్కిళ్ళు చాలవరకు కొద్ది నిమిషాలలో సర్దుకుంటాయి. అలా తగ్గకుండా ఎక్కువకాలం రావడం ఒక వ్యాధి లక్షణంగా భావించాలి.
[మార్చు] కారణాలు
- ఉదరవితానం చుట్టుపక్కల వాపు : న్యూమోనియా, ప్లూరసీ వంటివి, పచ్చకామెర్లు, పేగులలో అల్సర్ లు మూలంగా ఎక్కువగా వెక్కిళ్ళు వస్తాయి.
- మూత్రపిండాల వ్యాధులు : యురీమియా అనే వ్యాధిలో మూత్రం తక్కువగా పోవడం వల్ల శరీరమంతా ఉబ్బినట్లు కనిపించదం, వాంతులు, తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైన చిహ్నాలు కనిపిస్తాయి. శ్వాస ఒక ప్రత్యేకమైన వాసన కలిగివుంటుంది.
- మెదడుకు సంబంధించిన వ్యాధులు : పక్షవాతం, మెదడులో కంతుల పెరుగుదల వల్ల కూడా వెక్కిళ్ళు వస్తాయి.
- మానసిన రుగ్మతలు : న్యూరోసిస్ లోను, హిస్టీరియా వంటి మానసిక ఉద్రిక్తలలో ఇవి కనిపిస్తాయి.