వెదురు

వికీపీడియా నుండి
వెదురు
Bamboo forest in Kyoto, Japan
Bamboo forest in Kyoto, Japan
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Liliopsida
వర్గము: Poales
కుటుంబము: పోయేసి
ఉపకుటుంబము: Bambusoideae
Supertribe: Bambusodae
Tribe: Bambuseae
Kunth ex Dumort.
Diversity
Around 91 genera and 1,000 species
Subtribes
See the full Taxonomy of the Bambuseae.

వెదురు (Bamboo) లేదా గడ అనే మొక్కలు మానవ గృహ అవసరాలు, నిర్మాణాలకు అత్యధికంగా వినియోగించు వృక్షజాతి. వెదురు ఆసియా దేశాలలో ఉష్ణ ప్రదేశాలలో నిటారుగా పెరిగే గడ్డి జాతికి చెందినది. దీనికాండము గుల్లబారి ఒక్కొక్కప్పుడు కర్రను పోలి ఉంటుంది. వెదురులో 75 జాతులు, వెయ్యికి పైగా రకలు కలవు. పెద్ద రాకాసిరకం వెదురు ముప్పై ఐదు మీటర్ల నుండి పద్దెనిమిది సెంటీమీటర్ల వరకూ లావుగా పెరుగుతుంది. శీతల ప్రదేశములలో పెరిగే వెదురు త్వరగా దట్టమై చిక్కటి అడవిలా మారుతాయి. వెద్రుకు భూమిలో తేమ అవసరం. నీరు లేని చోట్ల వెదురు పెరగదు.

విషయ సూచిక

[మార్చు] భాషా విశేషాలు

వెదురు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] వెదురు [ veduru ] veduru. [Tel.] n. The bamboo. పోతు వెదురు the male bamboo. పెంటి వెదురు the female bamboo. కాకి వెదురు a kind of reed. బొంగు వెదురు bongu-veduru. n. The Spring Bamboo of Central, South, and West India. Bambusu arundinacea. (Watts.) వెదరుకంపజిట్ట veduru-kampa-jiṭṭa. n. The bird called the Grass Warbler, or Meadow Wren Warbler, Cisticola cursitans. వెదురు పిచ్చిక veduru-pichchika. n. The bird called the Rose Finch, Loxia totta. వెదరుప్పు, or వెదరు పాలు vedur-uppu. n. A medicinal salt exuded from the bamboo called Bamboo manna (watts.) Tabaschir. (Ainslie.) వెదురు బియ్యము veduru-biyyamu. n. The bamboo seed, freed from the husk. వెదురు బియ్యము. వెదురు మిడుత veduru-miḍuta. n. A sort of insect said to bore the bamboo. క్రిమి విశేషము. వెదురు విల్లు veduru-villu. n. A bow made of the bamboo.

[మార్చు] ఉపయోగాలు

వెదురు మానవులకు అనేకరకాలుగా ఉపయోగపడుతుంది. ఇళ్ళు కట్టుకొనడానికి, నిచ్చెనలు-బల్లలు-కుర్చీలు-బుట్టలు-తట్టలు-చేటలు మొదలగు ఉపకరణాలకు విశేషంగా వినియోగిస్తున్నారు. కాగితము తయారీలో గుజ్జును తయారు చేయడానికి వెదురు వాడతారు. కొన్ని అడవి జాతులు వెదురు చిగుళ్ళను ఊరగాయ పెట్టుకొంటారు. అటవీ తెగలు వెదురు గింజలతో కల్లు, సారాయిలను తయారు చేస్తారు. ఒక్క రంగు మినహా గోదుమలను పోలిఉండే వెదురు గింజలను దంచి పై పొట్టు తీసి రొట్టెలు తయారు చేస్తారు.

వైద్యాలలో వెదురు.

వైద్య సంభంద కార్యక్రమాలకు వెదురు చాలా బాగా ఉపయోగపడుతుంది. వెదురు చిగుళ్ళ కషాయం చలువ చేస్తుంది. కఫం, రక్తదోషం, మూలవ్యాది, మదుమేహం లాంటి వ్యాదులకు పనికి వస్తుంది. స్త్రీలకు గర్భకోశమును శుబ్రము చేయుటకు, ఆకలి పుట్టుటకు దీని కషాయాన్ని ఇస్తారు.

[మార్చు] విశేషాలు

  • ప్రపంచంలో ఏమూలనయినా ఒకేరకానికి చెందిన వెదురు ఒకేసారి పూతకు వస్తుంది.
  • వెదురు పూత ఒకేసారి వెన్ను విరిసి ధాన్యం దిగుతుంది. దీని వలన ఎలకల వంటి జీవుల జననాలు విపరీతంగా పెరుగుతాయి.
  • గడ్డి జాతికి చెందిన కొన్ని రకాలు 90 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి.
  • మొలాకా అనే ఎదురు 24 గంటల కాలంలో రెండు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.
  • ముళ్ళరకం బంబూసా అరుండానేషియా అనే రకం వెదురు 50 లేక 60 సంవత్సరాలకాలంలో ఒకే సారి పూస్తుంది. ఇలాంటి వెదురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నల్లమల అడవులలో విస్తారంగా పెరుగుతుంది. 1935 నుండి 1938 ల మద్య పూసిన ఈ వెదురు మళ్ళీ ఇప్పుడు పూస్తున్నది. ఈ విత్తనాలను శాస్త్రజ్ఞులు సేకరించి జాగ్రత్త పరచారు.

[మార్చు] మూలాలు

సమాచార సేకరణ-వండర్ వరల్డ్ నుండి.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు