వేటూరి సుందరరామ్మూర్తి
| వేటూరి సుందరరామ్మూర్తి | |
![]() వేటూరి |
|
| జన్మ నామం | వేటూరి సుందరరామ్మూర్తి |
|---|---|
| జననం | జనవరి 29, 1936 కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లి |
| మరణం | మే 22, 2010 హైదరాబాదు |
| నివాసం | హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ |
| ఇతర పేర్లు | వేటూరి |
| వృత్తి | సినీ గీత రచయిత పాత్రికేయుడు (పూర్వం) |
| మతం | బ్రాహ్మణ హిందూ |
| భార్య/భర్త | సీతామహాలక్ష్మి |
| సంతానం | ముగ్గురు కుమారులు |
వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (1936, జనవరి 29 - 2010, మే 22) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద,[1] శిష్యరికం చేశాడు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. తర్వాత కొన్ని వేల పాటలను రాశాడు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నాడు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.[2] మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన చాలా సినిమాలకి గుర్తుండిపోయే పాటలను రాశాడు. 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటు తో మరణించాడు.[3]
విషయ సూచిక |
[మార్చు] జీవిత విశేషాలు
వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు..[4] మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశాడు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నాడు.[5]
[మార్చు] సినీ ప్రస్థానం
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురష్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్ మరియు ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తను రాసిన పాటలలో తాను గొప్పగా భావించే పాటలు సాగర సంగమంలో తకిట తదిమి తకిట తదిమి తందాన..., నాదవినోదము....
[మార్చు] పుస్తకాలు, ప్రచురణలు
| పుస్తకం ముఖ చిత్రం | ఇతర వివరాలు |
|---|---|
వేటూరి రేడియో కోసం రాసిన సంగీత నాటిక ఇది. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ. కథా స్థలం కృష్ణా నదీ తీరాన ఆంధ్ర విష్ణు క్షేత్రంగా ప్రసిద్దికెక్కినశ్రీకాకుళం. |
|
|
[మార్చు] పురస్కారాలు
| సంవత్సరం | పురస్కారం | పాట | భాష | సినిమా | ఇతర వివరాలు |
|---|---|---|---|---|---|
| 1994 | జాతీయ పురస్కారం | రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే... | తెలుగు | మాతృదేవోభవ |
కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా |
[మార్చు] బయటి లింకులు
- వేటూరి పై అభిమానులు నడుపుతున్న ప్రత్యేక వెబ్సైట్ http://veturi.in
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వేటూరి సుందరరామ్మూర్తి పేజీ
[మార్చు] మూలాలు
- ↑ ఈమాట ఆన్ లైన్ సాహిత్య పత్రిక వెబ్ సైట్ నుండి తెలుగు సినిమా పాటఇలపావులూరి విశ్లేషనాత్మక వ్యాసం: తెలుగు సినిమా పాట గురించి... వేటూరి...జూన్ 21,2008న సేకరించబడినది.
- ↑ ప్రజాశక్తి దినపత్రిక, తేది 23-05-2010
- ↑ http://www.hindu.com/2010/05/23/stories/2010052362320500.htm
- ↑ వార్త దినపత్రిక, తేది 23-05-2010
- ↑ ఈనాడు దినపత్రిక తేది 23-05-2010
- ↑ 6.0 6.1 ఏ.వి.కె.ఎఫ్.ఫౌండేషన్ వారి అధికారిక వెబ్సైట్ నుండి వేటూరి సుందరరామ్మూర్తివారి రచనల పుస్తకాల వివరాలుజూన్ 21,2008న సేకరించబడినది.


