వేణీ సంహారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేణీ సంహారము సంస్కృత సాహిత్యంలో ప్రసిద్ధమైన నాటకము.

సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధమైన వేణీ సంహారము నాటక రచించినది సంస్కృత నాటకకర్త అయిన భట్టనారాయణుడు. భట్టనారాయణుడు సా.శ. 6, 7 శతాబ్ధాల కాలంవాడు. బెంగాల్ లో ఆదిసూరుని ఆస్థానంలో ఉన్నాడు. వేణీ సంహారము భరతుని నాటక లక్షణాలు కలిగిన ఇతివృత్తం. దీనిని తెలుగులో వడ్డాది సుబ్బారాయుడు 1883లో అనువదించగా, 1886లో ప్రచురణ జరిగింది

ఇతివృత్తం[మార్చు]

మహాభారతంలో భీముడు, దుశ్శాసన దుర్యోధనులను వధించి తన ప్రతిజ్ఞను తీర్చుకునే వృత్తాంతాన్ని తీసుకొని వేణిసంహారం రచించాడు. ఇందులోని వస్తువును చక్కని నాటకీయతతో ప్రసు్తతీకరించాడు. భీముడు ధీరోద్ధత నాయకుడు దుశ్శాసన రక్తసిక్తమైన చేతులతో ద్రౌపది వేణిని ముడవడమే ఈ నాటక ఇతివృత్తం. ఇది ఆరు అంకాల నాటకం. ఈ నాటకంలో ద్రౌపది కేశపాశాన్ని ముడవడమే ప్రధాన ఇతివృత్తం కాబట్టి వేణిసంహారమన్న పేరు సార్థకంగా ఉంది.

అయితే నాటక లక్షణాలను శాస్త్రోక్తంగా అనుసరించాలనే కవి కోరిక వల్ల నాటకంలో కొంత కృత్రిమత ప్రవేశించిందని కొందరి అభిప్రాయము. సంఘటనలు ఇంకా వేగంగా జరిగితే నాటకం రక్తికట్టేదని మరికొందరి అభిప్రాయం.

మూలాలు[మార్చు]