వేదాద్రి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వేదాద్రి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం జగ్గయ్యపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వేదాద్రి, కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలానికి చెందిన గ్రామము.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఇది విజయవాడ-హైదరాబాదు జాతీయ రహదారి నెం.9లో చిలకల్లుకు 10 కి.మీ. దూరంలో ఉంది.

  • వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. ఇక ఎర్రా ప్రగడ . నారాయణ తీర్థులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు తెలుస్తోంది.

పేరువెనుక చరిత్ర[మార్చు]

సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో, నరసింహవతారంలో హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు. తనని అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాట పడుతుందనీ, అందువలన తాను వచ్చేంత వరకూ ఆ నదిలో సాలగ్రామ శిలలుగా వుండమంటూ అనుగ్రహించాడు. ఆ తరువాత హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.

ఆలయాలు[మార్చు]

ఇక్కడ కృష్ణానదీ తీరంలో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీనరసింహస్వామి మందిరం ఉన్నది. ఇక్కడ పంచ నారసింహ ప్రతిమలు ఉన్నాయి. అవి వీర, యోగ, జ్వాల, సాలగ్రామ, లక్ష్మీ నృసింహస్వామి. ముఖ్య దేవాలయములో యోగానంద మరియు లక్ష్మీ నృసింహస్వామి, కొండపైన జ్వాలా నృసింహస్వామి (నిజానికి కొండ గర్భములో దేదీప్యమానమైన వెలుగులతో అనగా జ్వాలలతో ఉన్నాడని ఆ కొండకు గల బిలము ద్వారా లోనికి వెళ్ళిన వారు అంటారు), కృష్ణానది గర్భములో స్నాన ఘట్టమునకు సమీపములో బయటకు కనిపించే రూపం సాలగ్రామము, వేదాద్రికి సమీపములోని గరుడాచల కొండ పై వీర నృసింహస్వామి ఉన్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. యోగానంద నృసింహస్వామి వారి మూల రూపము ఈ ప్రపంచములో ఎక్కడా లేనంత సుందరముగా సాలిగ్రామ శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడినది. 'విశ్వేశ్వరుడు' క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. విశేషమైనటు వంటి పర్వదినాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.


"http://te.wikipedia.org/w/index.php?title=వేదాద్రి&oldid=1216606" నుండి వెలికితీశారు