వేప నూనె
వేప గింజల నుండి నూనెను తీయుదురు. యిది శాక తైలం (vegetable oil). వంటనూనె కాదు.పారీశ్రామికంగా వినియోగిస్తారు.
విషయ సూచిక |
[మార్చు] వేపపండ్లు
ఎదిగిన చెట్టు నుండి ఎడాదికి 50-60 కీ.జి.ల వేపపండ్లు లభించును. 3-4 సంవత్సరాలకే పుష్పించడం మొదలైనప్పటికి, పళ్ల దిగుబడి 7 సం.ల నుండే ప్రారంభమగును. పండులో విత్తన శాతం 4:1 నిష్పత్తిలో వుండును. ఎండిన పండు (dry fruit) లో పిక్క 23-25%, పిక్కలో నూనె శాతం 45% వుండును. పండు పైపొర (epicarp) లో 4.5%, గుజ్జు (mesocarp) 45%, గింజపెంకు (husk) 25% నూనె వుండును. వేపనూనెలో 'అజారిడిరక్టిన్' (Azadirachtin) అను ట్రిటెరిపెంటెన్ 0.03-0.25% (32-2500 ppm) వుండును. పళ్ళు 1-2 సెం.మీ. పోడవులో ధీర్ఘాండాకరంగా వుండును. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో వుండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి వుండును.
[మార్చు] గింజలనుండి నూనెను తీయువిధానము
నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనె తీయు యంత్రాల ద్వారా, సాల్వెంట్ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరుల ద్వారా కోల్ద్‌ప్రెస్సింగ్ (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా వున్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె వుండి పోవును. సాల్వెంట్ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేపపళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె వుండును. పళ్లను నేరుగా క్రష్ చేసిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును, ఆయిల్‌కేకులో 6-8% వరకు నూనె వుండిపోవును. ఇలావుండిన నూనెను సాల్వెంట్ ప్లాంట్ ద్వారా తీయుదురు. పిక్కలో అయినచో 45% వరకు నూనె వుండి,35-37% వరకు నూనెను పొందవచ్చును.
[మార్చు] నూనె
విత్తనంల నుండి తీసిన నూనె ముదురు ఎరుపుగా లేదా పచ్చని ఛాయ వున్నబ్రౌనురంగులో కాని వుండి, ఘాటైన వాసన కల్గివుండును. వేపనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలైన మిరిస్టిక్, పామిటిక్, స్టియరిక్ ఆసిడులు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలైన ఒలిక్, లినొలిక్ ఆసిడులున్నాయి. నూనెలో వున్న అజాడిరిక్తిన్ కారణంగా వంటనూనెగా ఉపయుక్తం కాదు.
'వేపనూనెలోని కొవ్వుఆమ్లాలపట్టిక'
| కొవ్వు ఆమ్లం పేరు | శాతం |
|---|---|
| మిరిస్టిక్ ఆమ్లం | 2.6% |
| పామిటిక్ ఆమ్లం | 1 6-18% |
| స్టియరిక్ ఆమ్లం | 1 4-19% |
| ఒలిక్ ఆమ్లము | 45-58% |
| లినొలిక్ ఆమ్లము | 7-15% |
'వేపనూనె భౌతిక ధర్మాల పట్టిక'
| భౌతికధర్మం | మితి |
|---|---|
| తేమ,మలినాలు | 1% వరకు |
| వక్రీభవన గుణకం | 1.4615-1.4705/400C |
| సాంద్రత | 0.908-0.934/300C |
| ఐయోడిను విలువ | 65-80 |
| సపొనిఫికెసను విలువ | 175-205 |
| అన్‌సపొనిఫియబుల్ పధార్ధం | 2%గరిష్టంగా |
| టైటరు | 35.80C |
వేపనూనెలో ఇంకను స్టెరొలులు (sterols), టెర్పొనొయిడులు (terpenoids), అల్కలైడు (alkalniods)లు, ఫ్లవొనొయిడులు (flavonoids) మరియు గ్లైకొసిడులు (glycosids) వున్నాయి.
- ఐయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన(గ్రహింపబడిన)ఐయోడిన్ గ్రాముల సంఖ్య.ప్రయోగసమయంలో నూనెలోని,ఫ్యాటి ఆమ్లంల ద్విబంధంవున్న కార్బనులతో ఐయోడిన్ సంయోగం చెంది,ద్విబంధాలను తొలగించును.ఐయోడిన్‌విలువ నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల వునికిని తెలుపును.నూనె ఐయోడిన్‌విలువ పెరుగు కొలది,నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల శాతం పెరుగును.
- సపొనిఫికెసన్‌విలువ:ఒక గ్రాము నూనెలో వున్న కొవ్వుఆమ్లాలన్నింటిని సబ్బుగా(సపొనిఫికెసను)మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు,మి.గ్రాములలో.
- అన్‌సపొనిఫియబుల్ మేటరు: నూనెలో వుండియు,పోటాషియంహైడ్రాక్సైడ్‌తో చర్యచెందని పదార్థములు.ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు,స్టెరొలులు(sterols),వర్ణకారకములు(pigments),హైడ్రోకార్బనులు,మరియు రెసినస్(resinous)పదార్థములు.
[మార్చు] నూనె ఉపయోగాలు
- వేపనూనెకున్న ఓషదగుణం కారణంగా, సబ్బుల తయారిలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బునురుగ ఎక్కువగా ఇచ్చును.
- వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నీవారిణిగా పిచికారి చేసి వాడెదరు.
- ఆయుర్వేద, యునాని మందుల తయారిలో ఉపయోగిస్తారు.
- కీళ్ళనొప్పుల నివారణకు మర్ధననూనెగా వాడెదరు.
- రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి వుదయం వరకు వుంచిన తలలోని పేలు చనిపోవును.
- వేప నూనెను ప్రస్తుతం ఎక్కువగా క్రిమి సంహారికగా వాడుతున్నారు. రైతులు తమ పంటలపై చీడ పీడల నివారణకు వేప నూనె ఆదారిత మందులను వాడు తున్నారు. దీనిని ప్రభుత్వంకూడ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. దీనివలన పర్వావరణానికి ముప్పు వుండదు. భూమి, జల వనరులు కలుషితం కావు. ఇటు వంటి మందులు వాడిన ఆహార పంటల వలన ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని వుండదు.
- నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలలకు,వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
- నూనె తీసిన వేపచెక్క (oil cake) ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లెదరు. నూనె తీసిన చెక్కలో5.2-5.6 వరకు నత్రజని వున్నది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% వున్నది.