వేరు
వికీపీడియా నుండి
వేరు (ఆంగ్లం: Root) వృక్ష దేహంలో భూగర్భంగా పెరిగే ప్రధానాక్షం. పిండాక్షంలోని ప్రధమ మూలం భూమిలోకి వేరుగా పెరుగుతుంది. ఇవి మొక్కని భూమిలో పాతుకునేలా చేసి స్థిరత్వాన్ని కలిగిస్తాయి. నేలనుండి నీటిని, ఖనిజ లవణాలను శోషించి, ప్రకాండ వ్యవస్థ అంతటికీ సరఫరా చేస్తాయి.
విషయ సూచిక |
[మార్చు] వేరు వ్యవస్థలు
ఆవృతబీజాలలో రెండు రకాల వేరువ్యవస్థలు ఉంటాయి.
- 1. తల్లి వేరు వ్యవస్థ (Tap root system) ద్విదళజీజ మొక్కలలో కనిపిస్తుంది.
- 2. అబ్బురపు వేరు వ్యవస్థ (Adventitious root system) ఏకదళబీజ మొక్కలలో ఉంటుంది.
[మార్చు] వేరు అంతర్నిర్మాణం
[మార్చు] ద్విదళ బీజ వేరు
ద్విదళ బీజ వేరులో మూడు ముఖ్యమైన మండలాలు ఉంటాయి:
- బాహ్యచర్మం: ఇవి సజీవకణాలతో ఏర్పడిన పొర. ఇది లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. ఏకకణయుత మూలకేశాలతో ఉండటంవల్ల బాహ్యచర్మాన్ని కేశధారి స్తరం అని కూడా అంటారు.
- వల్కలం: ఇందులో కణాలు అనేక వరుసలలో అమరివుంటాయి. దీనిలోని పొరలను అధశ్చర్మం, సామాన్య వల్కలం మరియు అంతశ్చర్మం గా విభజించారు.
- అధశ్చర్మం 2-3 వరుసలలో మందమైన కణాలతో ఉండి కాండానికి తన్యతా బలాన్నిస్తుంది. బాహ్యచర్మం నశించినప్పుడు రక్షణ కవచంగా పనిచేస్తుంది.
- సామాన్య వల్కలం ఆహారాన్ని నిలువ చేస్తుంది. గుండ్రటి మృదుకణాలు అనేక వరుసల్లో, పలుచని కణకవచాలతో, కణాల మధ్య ఖాళీలను ఏర్పరుస్తూ అమరివుంటాయి. నీటిని, లవణాలను ప్రసరణ కణజాలానికి చేర్చడానికి సహకరిస్తుంది.
- అంతశ్చర్మంలో ఒకే వరుసలో పీపా ఆకార కణాలు, వ్యాసార్ధ గోడలపైన కాస్పేరియన్ మందాలు ఉంటాయి. వీటిలో నీటిని ప్రసరింపజేసేవి వాహక కణాలు.
- ప్రసరణ స్తంభం: ఇది పరిచక్రం, నాళికాపుంజాలు, దవ్వ అనే భాగాలతో వేరు మధ్యభాగంలో ఉంటుంది.
- పరిచక్రం దీర్ఘ చతురస్రాకార మృదుకణాలతో ఏర్పడుతుంది. కణాలు విభజన చెందగలిగి ప్రక్క వేర్లను ఉత్పత్తి చేయగలవు.
- నాళికాపుంజాలు వేర్వేరు వ్యాసార్ధ రేఖలపై ప్రాథమిక దారువు, పోషక కణజాల పుంజాలు సమాన సంఖ్యలో ఏర్పడతాయి. పరిచక్రం వైపు ప్రథమ దారువు, దవ్వ వైపు అంత్యదారువు ఉంటాయి. ఆహారాన్ని దాచివుంచే సజీవ కణాలు దారువు పోషక కణజాలాల మధ్య అమరివుంటాయి. వీటిని సంశ్లేషక కణజాలం అని పిలుస్తారు.
- దవ్వ ఏర్పడదు లేదా చాలా తక్కువ పరిమాణంలో ఉండి నీటిని, ఆహారాన్ని నిలువచేయడానికి తోడ్పడుతుంది.
[మార్చు] ఏకదళ బీజ వేరు
ద్విదళ బీజవేరుతో సారూప్యం కనిపిస్తుంది. నాళికాపుంజాలవద్ద కొన్ని మర్పులు ఉంటాయి. దారువు, పోషక కణజాల పుంజాలు వేర్వేరు వ్యాసార్ధాల రేఖలపై ఆరుకంటే ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. దవ్వ అధికభాగాన్ని ఆక్రమించి ఆహారాన్ని నిలువచేయడానికి, యాంత్రికబలాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది.
[మార్చు] వేరు రూపాంతరాలు
కాంతి, నీరు, ఖనిజ లవణాలు, గాలి వంటి వాతావరణ కారకాలు తగినంతగా లేకపోతే మొక్కలు జీవించలేవు. మనుగడ కోసం జరిగే పోరాటంలో మొక్కలు వివిధ ఆవాసాల్లో జీవించవలసి ఉంటుంది. ఇటువంటి కొన్ని పరిసరాల్లో మొక్కలు జీవించాలంటే వాటిలోని వివిధ అంగాలు వాటి సామాన్య విధులతో పాటుగా కొన్ని ప్రత్యేక విధులు కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. ఇలా ఏర్పడే నిర్మాణాత్మకమైన శాశ్వత మార్పులను 'వేరు రూపాంతరాలు' అంటారు.
[మార్చు] దుంప వేళ్ళు
- ప్రధాన వ్యాసం: దుంప
[మార్చు] వృక్షోపజీవ వేళ్ళు
[మార్చు] కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేళ్ళు
[మార్చు] శ్వాసించే వేళ్ళు
[మార్చు] పరాన్నజీవి వేళ్ళు
|
||||||||||||||||||||||||||