విశాఖపట్నం

వికీపీడియా నుండి
(వైజాగ్ నుండి దారిమార్పు చెందింది)
  ?విశాఖపట్టణం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of విశాఖపట్టణం, India
అక్షాంశరేఖాంశాలు: 17°43′N 83°17′E / 17.7221, 83.2902
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము విశాఖపట్నం
ప్రాంతం కోస్తా


విశాఖపట్నం (విశాఖ , విశాఖపట్టణం , వైజాగ్‌) భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ నగరం. విశాఖపట్నం (పట్టణ), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము.

విషయ సూచిక

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • విశాఖపట్నం (m corpI.+og) (part)
  • విశాఖపట్నం (m corpI.)

ఆంధ్రప్రదేశ్‌లో గ్రేటర్ సిటి హోదా పొందిన తొలి నగరం (హైదరాబాదు కంటే ముందే). బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ- "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. డాల్ఫిన్స్‌నోస్‌ అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్‌వాటర్స్‌గా పని చేస్తుంది.

[మార్చు] చరిత్ర

శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లు గా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. ఇక్కడికి 40 కి మీల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల ఆయుధాలను (రాతి)చూడవచ్చు.


స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీకి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై, తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు - ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.


గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంధాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను కలదు.


ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దం లో కళింగులు, 8 వ శతాబ్దంలో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, చోళులు, గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహిలు, మొగలులు, హైదరాబాదు నవాబులు.


18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్రలోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. మద్రాసు ప్రెసిడెన్సీ లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు. 15 ఆగష్టు 1950 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా ఏర్పడింది

[మార్చు] ఘటనలు

  • 260 బి.సి- అశోక చక్రవర్తీ కళింగ యుద్ధంలో కళింగ దేశాన్ని జయించాడు. విశాఖపట్టణం అప్పుడు, కళింగ దేశంలో ఒక భాగంగా ఉండేది.
  • 13 ఎ.డి - సింహాచలం దేవస్థానం నిర్మాణం జరిగింది.
  • 208 ఎ.డి - చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖప్రాంతాన్ని పాలింఛిన రాజు.
  • 1515ఎ.డి - ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. ఆయన పాలనా కాలంలో, సింహాచలాన్ని పలు మార్లు దర్శించి, పచ్చల పతకాన్ని, మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ పచ్చల పతకాన్ని గజ్జెల ప్రసాద్ అనే స్టూవర్టుపురం గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
  • 1515లో రాయలు కొండవీడును ముట్టడించినాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు.

[మార్చు] కొండవీడు నుండి కటకం వరకు

కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.

  • 17వ శతాబ్దం మధ్య కాలంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడికి దగ్గరలో ఉన్న విజయనగరంలో ఒక కర్మాగారం నిర్మించారు.
  • 1689 - ఈ కర్మాగారాన్ని మొఘల్ చక్రవర్తి జౌరంగజీబు సైన్యం ఆక్రమించింది.
  • 1804 సెప్టెంబర్ - విశాఖపట్టణం జిల్లా మొట్టమొదటగా ఏర్పడింది. (1803 అని కూడా అంటారు). 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి, భారత దేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా విశాఖపట్టణం జిల్లా. అందుకే ఈ పెద్ద జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాలుగా విడదీసారు.
  • 1847 సెయింట్ అలోసియస్ అంగ్లో ఇండియన్ హైస్కూలు, విశాఖపట్టణం జిల్లాలోనే, అత్యంత ప్రాచీనమైన పాఠశాల. అంతేకాదు, దేశంలోని అత్యంత ప్రాచీనమైన పాఠశాల. విశాఖపట్టణంలోని పాత నగరం (ఒన్ టౌన్ ప్రాంతం)లో ఉంది. ఇండియన్ కౌన్సిల్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐ.సి.ఎస్.ఇ)కి అనుబంధమైన పాఠశాల.
  • 1902 - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్ధులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు .
  • 1904 - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.
  • 1907 - బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్త , అలెగ్జాండర్ రీ, 2000 సంవత్సరాల నాటి బౌద్ధుల కాలంనాటి శిధిలాలను, విశాఖపట్టణానికి 40 కి.మీ దూరంలో ఉన్న శంకరం గురించి వెల్లడించాడు. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతాన్ని బొజ్జన్నకొండ అంటారు.
  • 7 అక్టోబరు 1933 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.
  • 6 ఏప్రిల్ 1941 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కధలుగా చెప్పుతారు.
  • 1947 - నేటి తూర్పు నౌకాదళానికి పునాదిగా , 1947లో ఇంగ్లీషు వారు (రాయల్ నేవీ), ఆ నాడు బర్మాలో జరుగుతున్న యుద్ధానికి (రెండవ ప్రపంచ యుద్ధం) సహాయంగా, సరుకులు ఆయుదాలు, రవాణా చేయటానికి ఇక్కడ ఒక 'బేస్' ని స్థాపించారు. దాని పేరే హెచ్.ఎమ్.ఐ.ఎస్. సర్కార్స్ (హెర్ మెజెస్టీ ఇండియన్ షిప్ సర్కార్స్). నేడది ఐ.ఎన్.ఎస్. సర్కార్స్ (ఇండియన్ నేవల్ షిప్)గా పేరు మార్చుకుంది. ఆ నాడు ఇంగ్లీషు వారు వేసిన విత్తనం, నేడు తూర్పు తీరాన్ని అంతా రక్షించే 'తూర్పు నౌకా దళం' అనే వట వృక్షంగా ఎదిగింది.
  • 1957 - డాల్ఫిన్స్ నోస్ పైన ఉన్న లైట్ హౌస్ (దీపస్థంభం)ని తిరిగి నిర్మిచారు.
  • 1957 - కాల్ట్రెక్స్ (అమెరికాలోని 'కాలిఫోర్నియా'లోని మొదటి కాల్, 'టెక్సాస్' రాష్ట్రంలో 'టెక్స్' కల్లిప్ 'కాల్టెక్స్'గా పేరు పెట్టారు. ఈ కాల్టెక్స్‌ని నిర్మీంచటానికి, అక్కడ ఉండే మల్కాపురం అనే గ్రామాన్ని ఖాళీ చేయించి, నేటి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎదురుగా, రోడ్డు దాటిన తరువాత ప్రాంతంలో పునరావాసం కల్పించింది.
  • 4 డిశంబరు 1971 - భారత నౌకాదళం కరాచీ నౌకాశ్రయం మీద బాంబుల దాడి జరిపి తుత్తునియలుగా చేసింది. ఈ సంఘటనకు 'ఆపరేషన్ ట్రైడెంట్' అని 'రహస్య నామం' పెట్టారు. అప్పటినుంచి, డిశంబరు 4న నేవీ డే (నౌకాదళ దినోత్సవం)గా జరుపుకుంటున్నారు.
  • 1976 - కాల్టెక్స్‌ని భారత ప్రభుత్వం జాతీయ కరణ చేసింది.
  • 1976 - ఇంటర్నేషనల్ సైన్స్ కాంగ్రెస్ (ఐ.ఎస్.సి)కి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆతిధ్యం 1976లో ఒకసారి, 2008లో ఒకసారి ఇచ్చింది.
  • 1978 - కాల్టెక్స్‌ని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో కలిపి వేసారు.
  • 1979 - విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషనుగా ఎదిగింది.
  • 1981 - విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం తన ఉత్పత్తిని ప్రారంభించింది.
  • 1985 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మొదటిసారి విస్తరణ.
  • 14 సెప్టెంబరు 1997 హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో పేలుడు జరిగి భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఒక విచారకరమైన సంఘటన.
  • 1999 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రెండవసారి విస్తరణ.
  • 2008 - ఇంటర్నేషనల్ సైన్స్ కాంగ్రెస్ (ఐ.ఎస్.సి)కి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆతిధ్యం 1976లో ఒకసారి, 2008లో ఒకసారి ఇచ్చింది.
  • 2010 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మూడవసారి విస్తరణ.
  • 26 డిశంబర్ 2004 డిసెంబరు నాటి సునామీ దుర్ఘటన సందర్భంగా తీరప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎండబెట్టిన చేపలు కొట్టుకొని పోవడం తప్పించి, విశాఖపట్నం ఏమంత దెబ్బ తినలేదు.
  • ప్రతి సంవత్సరం సంక్రాంతి (జనవరిలో) సందర్భంగా విశాఖ ఉత్సవ్‌ జరుగుతుంది.

[మార్చు] విశాఖపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయం

ముఖ్య వ్యాసం: విశాఖపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయం

[మార్చు] మహా విశాఖ (గ్రేటర్ విశాఖ) లో కలిసిన గ్రామాలు

  • జాతీయ పట్టణ అభివృద్ధి పధకం ద్వార విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, విశాఖ పట్నం పురపాలక సంఘాన్ని, మహా విశాఖ పట్నం పురపాలక సంఘంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, విశాఖపట్నం చుట్టుపక్కల వున్న 32 గ్రామాలను (గ్రామాల పేర్లు కింద చూడు), గాజువాక పురపాలక సంఘాన్ని, మహా విశాఖ పురపాలక సంఘంలో గవర్నమెంటు ఆర్డరు G.O. Ms.No.938 MA & UD (Elec.II) Dept.తేది 21 నవంబరు 2005 ఇచ్చిన అధికారంతో విలీనం చేసారు. 9.82 లక్షల జనాభా వున్న విశాఖ, ఈ 32 గ్రామాలు, గాజువాక పురపాలక సంఘం కలిసి పోయిన తరువాత 14.25 లక్షల జనాభాకి పెరిగింది. ఈ విలీనం వల్ల 111 చదరపు కిలోమీటర్లు (చ.కీ.మీ.) పరిధిలో విస్తరించిన విశాఖ, 534 చ.కీ.మీ. విస్తీర్ణానికి పెరుగుతుంది.

[మార్చు] మహా విశాఖ నగరపాలక సంస్థ పరిపాలనా విధానం

  • మహా విశాఖ నగర పాలక సంస్థ ను 11 విబాగాలుగా విడదీసి, పరిపాలన చేస్తున్నారు.
  • 1. రెవెన్యూ డిపార్ట్‌మెంటు (రెవెన్యూ శాఖ)
  • 2. అక్కౌంట్సు (పద్దులు) శాఖ.
  • 3. సాధారణ పరిపాలన.
  • 4. బట్వాడా శాఖ (సంస్థలోని మిగతా శాఖలు రాసిన ఉత్తరాలు, నోటీసులు పంపించటం).
  • 5. ఇంజినీరింగ్ శాఖ
  • 6. ప్రజారోగ్య శాఖ (ప్రజల ఆరోగ్యం, వీధులు, మురికి కాలువలు శుభ్రం చేయటం, ఆసుపత్రులు )
  • 7. టౌన్ ప్లానింగ్ శాఖ.
  • 8. అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (నగర్ అభివృద్ధి సంస్థ).
  • 9. విద్యా శాఖ (ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంటు).
  • 10. ఆడిట్ శాఖ (అక్కౌంట్సు శాఖ రాసిన జమా ఖర్చులు సరిగా ఉన్నాయా లెవ అని పరిశీలించి, తప్పులను, అనవరంగా చేసిన ఖర్చులను వెదికి అభ్యంతరాలను నమోదు చేస్తుంది).
  • 11. లీగల్ సెల్ (మహా విశాఖ నగరపాలక సంస్థ మీద ఎవరైనా దావాలు వేసిన వాటికి సమాధానలు ఇవ్వటం, కొన్ని న్యాయసంబంధమైన సలహాలు సంస్థకు ఇవ్వటం, వంటి పనులు చేస్తుంది).
  • ఈ 11 శాఖలకు అధిపతులు ఉంటారు. ఈ 11మంది అధిపతులు, మహా విశాఖ నగర పాలక సంస్థ అధిపతి అయిన కమిషనరు (ఐ.ఏ.ఎస్ అధికారి) ఆధ్వర్యంలో పనిచేస్తారు.

[మార్చు] జనాభా పెరుగుదల

  • జనాభా పెరుగుదల కారణంగా 1981లో 180 మురికి వాడలున్న విశాఖపట్నంలో, 2011 సంవత్సరానికి 650 పైగా మురికి వాడలు వున్నాయి. వీరికి ఉండటానికి చోటు లేక, సిండియా నుంచి గాజువాక వరకూ వున్న పారిశ్రామిక ప్రాంతంలోని కొండల మీద నివాసం ఉంటున్నారు. అలాగే కప్పరాడ, మధురవాడ ప్రాంతాలలోని కొండల మీద నివాసాలు పెరిగాయి. వీరంతా వలస వచ్చిన వారే. ఫలితంగా వర్యావరణ సమస్యలు, కొండల మీద పచ్చదనం అంతరించి పోవటం జరుగు తుంది. విశాఖపట్నంలో జనాభా పెరిగిన తీరు. క్రింద ఇచ్చిన టేబుల్ చూడు.
  • విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ జనాభా (2001 జనాభా లెక్కల ఆధారంగా)........... 9,82,910
  • 32 గ్రామ పంచాయతీల జనాభా (ఇవి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో కలిసినవి).. 1,95,489.
  • గాజువాక పురపాలక సంఘము (ఇది మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో కలిసినది)... 2,48,953.
  • మొత్తం జనాభా.................................................................................. 14,27,352.
సంవత్సరం జనాభా పెరుగుదల శాతం
1901 40,892
1931 57,303 28.16%
1951 1,08,042 53.81%
1961 2,11,190 95.47%
1971 3,63,504 66.91%
1981 5,65,321 60.37%
1991 10,57,118 86.99%
2001 13,45,938 25.76%
2011 20 లక్షల వరకూ పెరగ వచ్చును (అంచనా మాత్రమే)
  • 28 ఫిబ్రవరి 2011 నాటికి జనాభా అంచనా

జనాభా 2001 నుంచి 2011 వరకు (గత పదేళ్ళలో) నాలుగు లక్షల వరకు పెరిగి ఉంటుందని జనాభా అధికారులు అంచనా వేస్తున్నారు. 9 ఫిబ్రవరి 2011 నుంచి 28 ఫిబ్రవరి 2011 వరకు రెండో విడత జనాభా లెక్కల సేకరణ జరిగింది. 2001 లో నగర జనాబా 13.5 లక్షలు.ఇంతవరకూ, సేకరించిన జనాభా లెక్కల ఆధారంగా, 17.5 లక్షలవరకు నగర జనాభా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రాధమిక అంచనా. పూర్తిగా జనాభా లెక్కలు సేకరించిన తరువాత ఈ లెక్కలు మరింత పెరగ వచ్చును. గ్రామీణ ప్రాంతంలో పెరుగుదల 11 శాతం అంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండ వచ్చును. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 24.50 లక్షల మంది ఉండగా, ఆ అంకె 27.50 లక్షలకు చేరవచ్చని అంచనా. విశాఖ నగరంతో కలిపి విశాఖపట్నం జిల్ల జనాబా 2001 లో 38 లక్షలు. అదే 2011 నాటికి ఈ అంకెలు 45 లక్షలకు చేరవచ్ఛని అంచనా.

[మార్చు] లేబర్ మార్కెట్లు (కూలీలు దొరికే ప్రాంతాలు)

చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి వలస వచ్చి విశాఖపట్నంలో నివాసం వుంటున్న బీదవారు (ఆడ, మగ, వృద్ధులు, బాల కార్మికులు) ఉదయాన్నే అన్నం డబ్బాలు పట్టుకుని కూలి పనుల కోసం కురుపాం మార్కెట్టు, గాజువాక, ఎన్.ఏ.డి, సీతంపేట, ఇసుకతోట, గుల్లల పాలెం, పెందుర్తి కూడళ్లలో ఎదురు చూస్తూ వుంటారు. ఎవరికైనా కూలివారు కావాలంటే ఈ ప్రాంతాల నుంచి కూలివారిని తీసుకు వెళతారు. ఇందులో ఎన్.ఏ.డి నుంచి దొరికే కూలిపనివారు బహుళ అంతస్తుల నిర్మాణంలో నైపుణ్యం వున్నవారు.

[మార్చు] విశాఖపట్నం న్యాయవాదుల సంఘం (విశాఖపట్నం బార్ అసోసియేషన్)

  • బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఉన్న విశాఖపట్నం బార్ అసోసియేషన్ లో రమారమి 2000 నుంచి 3000 వరకూ న్యాయవాదులు (లాయర్లు) సభ్యులుగా ఉన్నారు. కోర్టులలో ప్రాక్టీసు చేయటానికి, బార్ అసోసియేన్‌లో సభ్యత్వం ముఖ్యం. ఈ సంఘానికి ఎన్నికల ద్వారా అద్యక్ష, ఉపాద్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవితో పాటు 9 మంది కార్యవర్గ సభ్యులను (ఎగ్జిక్యూటివ్ మెంబర్లు) ఎన్నుకుంటారు.

11 ఆగస్టు 2010 నాడు 2010-11 సంవత్సరం ఎన్నికలు జరిగాయి. 12 ఆగష్టు 2011 నాడు 2011-12 (శుక్రవారం) సంవత్సరం ఎన్నికలు జరిగాయి. విశాఖపట్నం బార్ అసోసియేషన్ లో 2788 వోటర్లు (లాయర్లు) ఉన్నారు. 1791 మంది ఓట్లు వేయగా (64.24 శాతం), 997 మంది ఓటు వేయలేదు (35.76 శాతం). 71 ఓట్ల తేడాతో (931 - 860) అద్యక్శ్హుడు గెలిచాడు. సీనియర్ న్యాయవాదులు లంకా జగన్నాధం, ఎం.ఎస్.మాధవ్ ఎన్నికల అధికారులుగా ఎన్నికలు జరిపించారు.ఎన్నికైన వారు.

  • అద్యక్షుడు  : మొహమ్మద్ హబిబుల్లా.
  • ఉపాద్యక్షుడు  : ఎన్.కాళిదాస రెడ్డి
  • కార్యదర్శి  : వి. పార్ధసారధి.
  • సంయుక్త కార్యదర్శి : ఆర్. రుద్ర హరి ప్రసాద్
  • కోశాధికారి  : ఎస్.ఎస్. రాజు

[మార్చు] విశాఖపట్నంలో ఉన్న కోర్టులు

  • ప్రతీ జిల్లా ముఖ్య కేంద్రంలోను జిల్లా కోర్టు ఉంటుంది. అలాగే విశాఖపట్నంలో, విశాఖపట్నం జిల్లా కోర్టు ఉంది.

[మార్చు] అభయహస్తం

  • 'అభయ హస్తం' ప్రభుత్వం పేదప్రజలకు (ముఖ్యంగా వృధ్హులకు, మహిళలకు) ప్రకటించిన ఒక సంక్షేమ పథకం. ఈ పథకం కింద ప్రతినెలా లబ్దిదారులకు రూ.500 చొప్పున పింఛన్లు ఇవ్వాలి. కానీ అధికారులు రూ.200 , రూ.300 మాత్రమే ఇచ్చారు. ఏడాదిగా లక్షన్నర మంది మహిళలకు ఈ పద్ధతిలోనే పింఛన్లు ఇచ్చారు. ఈ విషయం పట్టణ ఇందిరా క్రాంతి పథం (ఐ.కే.పి) సమీక్షలో బయటపడింది. 'అభయహస్తం పథకం'ద్వారా ఇవ్వ వలసిన రూ.500ను ప్రభుత్వాధికారులు తమ దగ్గర ఉంచుకొని, సామాజిక పింఛన్లు పథకం కింద నెలకు రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. దీనితో, ఒక్కొక్క లబ్దిదారు, ప్రతినెలా రూ.300 వరకు నష్టపోయారు. ఎంతమందికి ఈ పద్ధతిలో తక్కువ పింఛను చెల్లించారో తెలియ చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కోరింది. 'అభయహస్తం' లబ్దిదారులకు డిసెంబరు 2010, జనవరి 2011 పింఛన్లు కలిపి ఇచ్చే అవకాశముందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. పింఛను నవీకరణ (మార్పు) కోసం రూ.365 చొప్పున వసూలు చేశారు. ప్రభుత్వం ఈ పథకం కింద జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి)కి చెల్లించాల్సిన వాటా సకాలంలొ విడుదల చేయలేదు. దీనితో, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇది తెలిసిన ప్రభుత్వం, వెంటనే తన వాటా రు.70 కోట్లు బడ్జెట్టు చెల్లించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ సొమ్ము ఎల్.ఐ.సీ. కి చేరడానికి నాలుగైదు రోజులు పడుతుంది. దీనితో, పింఛన్లు ఆలస్యం అవుతాయి. అభయహస్తం పథకం కింద పింఛన్లు చెల్లించడానికి నెల నెలా లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళి పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. లబ్దిదారులు అందరూ పింఛను తీసుకుంటున్న ప్రాంతాలలో నివాసం ఉంటున్నారా, లేదా, ఇతర ప్రాంతాలకు వెళ్ళారా, చనిపోయారా, వంటి వివరాలు నెల నెలా నమోదు చేసి ప్రధాన కార్యాలయాలకు పంపాలని సూచన చేసారు. ఈ వివరాల ప్రకారమే, పింఛన్లు చెల్లింపు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రతినెలా లబ్దిదారుల జాబితా సక్రమంగా ఉందని అనుకుంటేనే, పింఛన్లు విడుదల చేయాలని అనుకున్నారు. చనిపోయిన వారి వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

[మార్చు] వృద్ధాప్య పింఛనులు

  • మహా విశాఖ నగర పాలక సంస్థ (మ.వి.న.సం) (జీ.వి.ఎం.సీ) ద్వారా, విశాఖపట్నం నగరంలో, వృద్ధాప్య పింఛనులు పంచుతున్నా, ఆ డబ్బు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. మ.వి.న.సం. లోని 72 వార్డులలో 28,861 మంది ముసలి వారు నెల నెలా రూ.200 పింఛను పొందుతున్నారు. 28 ఫిబ్రవరి 2011 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో, పించను పొందటానికి పయస్సు పరిమితిని 65 ఏళ్లనుంచి, 60 ఏళ్లకు తగ్గించటంతో, నాలుగు- ఐదు వేల మంది వృద్ధులకు సహాయం అందుతుంది (అంటే రమారమి 32,861 నుంచి 33,861 వరకూ లబ్దిదారులు ఉంటారు). 80ఏళ్ళు దాటిన ముసలి వారికి రూ.200 బదులు రూ.500 చొప్పున పించను ఇస్తీ విశాఖ నగరంలో అంచనాగా 3 వేలమంది అతి వృద్ధులు లాభం పొందుతారు. అంత వాసి అంచనా వేసిన 32,861 నుంచి 33,861 (60 సంవత్సరాలు దాటిన ముసలివారు) నుంచి 80 సంవత్సరాలు దాటిన అతి వృద్ధులను (3 వేల మందిని) తీసి వేస్తే, 29,861 నుంచి 30,861 గా (60 సంవత్సరాలు దాటిన ముసలివారు) ఉంటారని అంచనా.
వయసు దాటినవారు సంఖ్య డబ్బు రూ. మొత్తం రూ.
60 సంవత్సరాలు ((60 సంవత్సరాలు దాటిన వారు 32,861 నుంచి 33,861 వరకు)- (80 సంవత్సరాలు దాటిన వారు 3,000 మంది)) మిగిలిన వారు(అంటే 60 ఏళ్ళు దాటి 80 ఏళ్ళు లోపు ముసలి వారు 29,861 నుంచి 30,861 వరకు 29,861 నుంచి 30,861 వరకు 200 59,72,200 నుంచి 61,72,200
80 సంవత్సరాలు 3,000 500 15,00,000
మొత్తం ఖర్చు 74,72,200 నుంచి 76,72,200 వరకు.

[మార్చు] చౌక దుకాణాలు (రేషన్ డిపోలు)

విశాఖపట్నంలో పెరిగిన చౌకదుకాణాలు. నగర సరిహద్దుల్లో ఉన్న కొన్ని చౌకదుకాణాలు మార్పులు చేర్పులు జరిగాయి. ఇంతవరకు గ్రామీణ జిల్లా పరిధిలో ఉన్న 37 డిపోలను నగర పరిధిలోకి తెచ్చారు. పెందుర్తి మండలంలో ఏడింటిని గ్రామీణ పరిధిలోకి తెచ్చారు. తాజా మార్పుచేర్పులతో నగరంలో 354 దుకాణాల నుంచి 384 చౌక దుకాణాలకు చేరింది. ఒకటో సర్కిలు పరిధిలో 152, రెండవ సర్కిలు పరిధిలో 125, మూడవ సర్కిలు పరిధిలో 107 దుకాణాఅలున్నాయి. విశాఖ గ్రామీణ మండలం పరిధిలోని పరదేశిపాలెం, కొమ్మాది, మధురవాడ సెంటరు, మదురవాడ, (స్వత్రంత్రనగర్), చంద్రంపాలెం, నగరంపాలెం, బక్కన్న పాలెం, పాత పోతిన మల్లయ్య (పి.ఎమ్) పాలెమ్, కొత్త పోతిన మల్లయ్య (పి.ఎమ్) పాలెం, వాంబేకాలనీ, ఋషికొండ, ఎండాడ, సాగర్‌నగర్, మద్దివానిపాలెం, అప్పికొండ, ఇస్లాంపేట, పెద్దపాలెం, దేవాడ, పాలవలస, పిట్టవానిపాలెం, కొండయ్యవలస, అగనంపూడి, అగనంపూడి శివాలయం వీఢి, పెదమడక, పిన మడక, దేవాడ, దేశపాత్రునిపాలెం, దానబోయినపాలెం, దువ్వాడ గ్రామాలు నగరపరిధిలో కలిసాయి. పెందుర్తి మండలంలోని వేపగుంట, అప్పన్నపాలెం, చినముషిడివాడ, పాత పెందుర్తి, పెందుర్తి (ప్రభుత్వ ఆసుపత్రి), పెందుర్తి మెయిన్ రోడ్డు, పెందుర్తి తహశీల్దారు ఆఫీసు వద్ద ఉన్న డిపోలను గ్రామీణ పరిధిలోకి మార్చారు.

[మార్చు] రేషన్ వివరాలు

  • ప్రతీ నెలలోను విడుదల చేసే రేషన్ వివరాలు పౌరసరఫరాల సంస్థ లేదంటే జిల్లా పౌర సరఫరా అధికారి, పత్రికాముఖంగా తెలియ చేస్తారు.
నెల బియ్యం (మెట్రిక్ టన్నులు) గోధుమలు (మె.టన్నులు) పామోలిన్ (కి.లీటర్లు) పంచదార (మె. టన్నులు) కందిపప్పు (మె. టన్నులు) కిరసనాయిలు (కి.లీటర్లు) గులాబీ కార్డుకి కె.జి రూ.6.80 (మె. టన్నులు)
సెప్టెంబరు 1995 1164 400 850 1120
మార్చి 2011 6 లక్షలు 480 362 2646 (2768 కి.లీటర్లు కావాలి నెలకు)*
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని అంచనా (సెప్టెంబరు 1995 నాటికి).
  • గులాబీ కార్డులపై పండగలకు, పర్వదినాలకు పంచదార అదనంగా ఇస్తారు.
  • * కిరసనాయిలు ప్రతీనెల విశాఖ జిల్లాకి 2768 కిలో లీటర్లు అవసరం. ఈ మొత్తం విడుదల అయితే విశాఖ నగర పరిధిలో 6 లీటర్లు, దీపం పథకం వార్కి 2 లీటర్లు. గ్రామీణ ప్రాంతంలో 2 లీటర్లు, దీపం పథకం వారికి 2 లీటర్లు ఇస్తారు. కానీ మార్చి 2011 కోటా కింద విశాఖ జిల్లాకు 2628 క్.లీ (140 కి.లీ తక్కువ) విడుదల చేసారు. జిల్లా పౌరసరఫరా శాఖకు 18 కి.లీటర్లు అందుబాటులో ఉండటంతో (2628 + 18 = 2646 కి.లీ) 122 కి.లీటర్లు తక్కువ వచ్చింది. అందుచేత జి.వి.ఎమ్.సి. పరిధిలోని రేషన్ కార్డు దారులకు మార్చినెలలో 1 లీటరు తగ్గించి, 5 లీటర్లు ఇస్తున్నారు. ఈ తగ్గింపు మార్చి2011 నెలకి మాత్రమే పరిమితం.

[మార్చు] ప్రభుత్వ/ స్వచ్చంద వైద్య సౌకర్యాలు

కింగ్ జార్జి ఆసుపత్రి.
ఆసుపత్రి పేరు టెలిఫోన్ నెంబరు ప్రాంతం ప్రత్యేకత
కింగ్ జార్జి ఆసుపత్రి 2564891 పాత విశాఖపట్నం అన్ని వైద్య సేవలు
లయన్స్ కేన్సర్‌ ఆసుపత్రి కేన్సర్
సెవెన్ హిల్ల్స్ ఆసుపత్రి 2563081, 2563082 రాం నగర్ అన్ని వైద్య సేవలు
విక్టోరియా స్త్రీల ఆసుపత్రి, 2562637 పాత విశాఖపట్నం (ఒనె టౌన్ ప్రాంతం) స్త్రీల కోసం
క్వీన్స్ ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రి అన్ని వైద్య సేవలు
అపొలో ఆసుపత్రి రాం నగర్ అన్ని వైద్య సేవలు
లాజరస్ ఆసుపత్రి రాం నగర్ అన్ని వైద్య సేవలు
ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్. హనుమంత వాక కంటి ఆసుపత్రి
విశాఖ ప్రాంతీయ (రీజినల్) కంటి ఆసుపత్రి 2552544 కంటి ఆసుపత్రి
శంకర పౌండేషన్ (కంటి ఆసుపత్రి కంటి ఆసుపత్రి
విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రి (మెంటల్ ఆసుపత్రి) 2552525 మానసిక ఆరోగ్య చికిత్సా కేంద్రం
ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఆసుపత్రి) 2577195 మల్కాపురం అన్ని వైద్య సేవలు
ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఆసుపత్రి) 2558209 ఇండస్ట్రీయల్ ఎస్టేట్ అన్ని వైద్య సేవలు
ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఆసుపత్రి) 2553780 ఇసుకతోట అన్ని వైద్య సేవలు
క్షయ, అంటువ్యాధుల అసుపత్రి (టి.బి. అండ్ ఐడీ ఆసుపత్రి) 2552525 అంటు వ్యాధులు
రాణి చంద్రమతీ దేవి (ఆర్.సి.డి) ఆసుపత్రి 2755278
ఐ.ఎన్.హెచ్.ఎస్.(ఇండియన్ నేవల్ హాస్పిటల్ షిప్) కళ్యాణి (నేవల్ హాస్పిటలు మల్కాపురం రక్షణ శాఖ ఉద్యోగులకు
పశువుల ఆసుపత్రి (వెటర్నరీ హాస్పిటలు) 2706679 పశువులకు
సింహగిరి హాస్పిటలు గాజువాక అన్ని వైద్య సేవలు

[మార్చు] డయాగ్నోస్టిక్ సెంటర్లు (వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాలు)

  • విజయ మెడికల్ సెంటరు.
  • డాల్పిన్స్ డయాగ్నోస్టిక్స్ సెంటరు
  • విశాఖ డయగ్నోస్టిక్స్ సెంటరు

[మార్చు] 24 గంటల మందుల షాపులు

  • లలిత మెడికల్ షాపు  : 2571726
  • అపొల్లో ఫార్మసీ  : 2529618, 2529619
  • నిజామ్స్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, కె.జి.హెచ్ దగ్గర : 2569465, 6523465
  • అపొల్లో ఫార్మసీ  : 2792159, 2565640
  • డే అండ్ నైట్ మెడికల్ స్టోర్స్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530001 : 2562635, 2568346

[మార్చు] కంటి బేంకు (ఐ బేంకు)

  • మొహ్‌సిన్ ఐ బేంకు :
  • లేండ్‌లైన్ : 0891-2714000
  • మొబైల్  : 9246624000, 9440821919

‍* టోల్ ఫ్రీ  : 1053

[మార్చు] 24 గంటల పెట్రోల్ బంకులు

  • శ్రీనివాస ఆటో ఆసీలుమెట్ట జంక్షన్ : 2554757

[మార్చు] రక్త నిధులు (బ్లడ్ బ్యాంకులు)

  • ఈ ఫోను నెంబర్లకి ముందు విశాఖపట్నం ఎస్.టి.డి కోడ్ 0891 చేర్చాలి.
పేరు ఫోను నెంబరు వివరాలు
కె.జి.హెచ్ బ్లడ్ బ్యాంక్ 2564891, 2543342
ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు 2703953
చిరంజీవి వాలంటరీ బ్లడ్‌బ్యాంకు 2754787
లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంక్
అర్.సి.బోత్రా వాలంటరీ బ్లడ్‌ బ్యాంకు 6615336
విశాఖ వాలంటరీ బ్లడ్‌బ్యాంకు 6619444
ఎ.ఎస్. రాజా బ్లడ్ బ్యాంక్ 2543436, 666333
సి.డి.ఆర్ 2554754
లైఫ్ మెడికల్ సెంటర్ 2569532
అపొలో ఆసుపత్రి 2788651
సిటీ హాస్పిటల్ 2755461, 2754380
పల్లవి నర్సింగ్ హోం 2567735 నుంచి 2567739
రోటరీ బ్లడ్ బాంక్ 6534635 , 2506678
సెవెన్ హిల్స్ ఆసుపత్రి 2708090
రాజ్యలక్షి వలంటరీ బ్లడ్ బాంక్ 2568618
సీతారామ వలంటరీ బ్లడ్ బాంక్ 2706025 , 2539321

[మార్చు] అత్యవసర సేవలు (ఎమర్జెన్సీ సర్వీసులు)

  • అత్యవసర సేవలు (ఎమర్జెన్సీ సర్వీసులు)
ప్రభుత్వశాఖ టెలిఫోను నెంబరు
పోలీసు కంట్రోల్ రూమ్. 100, 2565454
పోలీసు క్రైమ్ స్టాపర్ (నేర నిరోధక విబాగం) 1090, 1091
ఫైర్ (అగ్నిమాపక కేంద్రం) 101, 2787818
ట్రాఫిక్ సహాయం 1073
విద్యుత్తు ఫిర్యాదులు 1912
మంచినీటి సరఫరా 1913
రైతులకు సహాయం (హెల్ప్ లైన్) 1916
విమానాశ్రయం విచారణ 2572020
రైల్వే విఛారణ (ఎంక్వైరీ - రైళ్ళవేళలకోసం) తెలుగు 131
రైల్వే విచారణ (రిజర్వేషన్లు) 136, 137, 138
ఆర్.టి.సి. ద్వారకా బస్ స్టేషన్ విచారణ 2746400
కలెక్టరేట్ కంట్రోలు రూం 1077
ఎల్.పి.జి. ఎమర్జెన్సీ 1915 ఇంట్లో వాడే గాస్ లీకు అవుతున్నప్పుడు ఈ పోన్‌కి చేయాలి.
  • (నగరంలో 2552668, నగరం బయట గ్రామీణ ప్రాంతాలు 2517905, 2516655
  • ఈ టెలిఫోన్ నెంబర్లు కూడా వా డవచ్చును).
గుండెపోటు 1061
అటవీ శాఖ టోల్‌ఫ్రీ నెంబరు 155364 లేదా 1800 4255 364
పాముల కిరణ్ (పాములను పట్టుకుంటాడు - స్టీల్ ప్లాంట్ లో నివాసం) 9849140500 మరియు 0891-6666666
పాముల ఆనంద్ (పాములను పట్టుకుంటాడు - సింధియాలో నివాసం) 9849023527

[మార్చు] అంబులెన్స్ సేవలు (అంబులెన్స్ సర్వీసులు)

అంబులెన్స్ / ఆసుపత్రి ఫోన్ నెంబరు విశేషాలు
అంబులెన్స్ 108
కింగ్‌జార్జి ఆసుపత్రి 2564891
అపొలో ఆసుపత్రి 2727272
అపూర్వ ఆసుపత్రి 2701258
రైల్వే ఆసుపత్రి 2746277
విక్టోరియా ఆసుపత్రి(గోషా ఆసుపత్రి) 2562637
మానసిక ఆరోగ్య చికిత్సా కేంద్రం 2754918
సెవెన్‌హిల్ల్స్ ఆసుపత్రి 2708090
సి.డి.ఆర్. ఆసుపత్రి 2554754, 2555415
సిటీ ఆసుపత్రి 2555461
శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్ట్ 2550641
వెటర్నరీ (పశువుల) ఆసుపత్రి 2706679
ఐ.ఎన్.హెస్.ఎస్. కళ్యాణి ఆసుపత్రి (నేవల్ ఆసుపత్రి)

[మార్చు] ఆటస్థలములు (స్టేడియంలు)

పేరు టెలిఫోన్ నెంబరు ఇతర వివరాలు
స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం 2732410
నెహ్రూ ప్లేస్ - పోర్టు స్టేడియం 2549289
ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్ స్టేడియం 2561412
డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఇండోర్ స్టేడి 2705392 (జిల్లా క్రీడాభివృద్ధి ఇండోర్ స్టేడియం)
విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, మునిసిపల్ స్టేడియం, వెలంపేట 2502344
వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసిఏ-వీడీసీఏ స్టేడియం, పోతిన మల్లయ్య (పీ.ఎం.) పాలెం 2781112

[మార్చు] తపాలా కార్యాలయాల వివరాలు (పోస్టు ఆఫీసుల వివరాలు)

కార్యాలయం ఉన్న ప్ర్రాంతం పిన్ కోడ్ టెలిఫోన్ నెంబరు
అక్కయ్య పాలెం 530016
ఆంధ్ర యూనివెర్సిటీ 530003
బి.హెచ్.పి.వి (భారత హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ ) . 530012
డాబా గార్డెన్స్ 530020
గాజువాక 530026
గీతమ్ ఇంజినీరింగ్ కళాశాల 530045
గోపాల పట్నం 530027
గవర్నమెంట్ డైరీ ఫారం 530040
హెచ్. బి. కాలనీ (హౌసింగ్ బోర్డు కాలనీ) 530022
గాంధీ గ్రామ్ 530005
ఇండస్ట్రియల్ ఎస్టేట్ 530007
కంచర పాలెం 530008
ఎల్. బి. కాలనీ . 530017
మహారాణి పేట 530002
మల్కాపురం 530011
మర్రి పాలెం 530018
పి ‍అండ్ టి కాలనీ (పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ కాలనీ) 530013
పి.ఎమ్. పాలెం(పోతిన మల్లయ్య పాలం) 530041
సాలిగ్రామ పురం 530024
సింహాచలం 530028
నేవల్ బేస్ 530014 2577761

[మార్చు] ఇ-సేవా కేంద్రాలు

ఇ-సేవా కేంద్రం ప్రాంతం టెలిఫోన్ నెంబరు
మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆసీలుమెట్ట 3299576
కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్, బృందావనం ఎల్.బి.కాలనీ 2547363
రామకృష్ణ మిషన్ లైబ్రరీ వెనుక రామకృష్ణ బీచ్ 2739833
పాత మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్, అల్లూరి సీతారామ రాజు విగ్రహం దగ్గర సీతమ్మధార 2720510
సౌకర్యం సెంటర్, రెండవ అంతస్తు, ఎస్.బి.హెచ్ దగ్గర, ఛిత్రాలయ సినిమాహాల్ వెనుక సూర్యాబాగ్ 2523020
సౌకర్యం సెంటర్, గుల్లలపాలెం ఆసుపత్రి దగ్గర,(కోరమాండల్ గేటు దగ్గర) మల్కాపురం 2747764
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా, చెట్టివాని పాలెం,ఆటోనగర్ గాజువాక 2761939
ఆర్.కె.హాస్పిటల్ ఎదురుగా,ఛినగంట్యాడ గాజువాక 2759508
రైతు బజారు వెనుక, ఛినగంట్యాడ గాజువాక 2759508
ఎన్.టి.ఆర్ స్టేడియం దగ్గర, గవరపాలెం అనకాపల్లి 230356
జి.వి.ఎల్. హాస్పిటల్ దగ్గర,గవరపాలెం అనకాపల్లి 226081
గృహమిత్ర, కంచరపాలెం సిగ్నల్స్ దగ్గర ఎన్.హెచ్ 5 3299584
ఆర్ అండ్ బి ఆఫీసు వెనుక మాధవధార 3299585

[మార్చు] ఎ.పి.టూరిజం కార్పొరేషన్ డిపార్టుమెంటు

  • విచారణ, విషయ సేకరణ కోసం: 2754716
  • బుకింగ్ ‍‍‍మరియు రిజర్వేషన్లు : 2713135

[మార్చు] ఫైర్ స్టేషనులు (అగ్నిమాపక దళములు)

[మార్చు] ఎలెక్ట్రికల్ సబ్ స్టేషనులు

[మార్చు] అటవీ శాఖ టోల్‌ఫ్రీ నెంబరు 155374 లేదా 1800 4255 364

  • అటవీశాఖకు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇవ్వాలి అనుకుంటే, టోల్‌ఫ్రీ నెంబర్లు 155364 లేదా 1800 4255 364 కు చేయవచ్చని ముఖ్య అటవీ సంరక్షణాధికారి చెపారు. 1 మార్చి 2011 నుంచి హైదరాబాద్‌లోని ప్రధాన ముఖ్య అటవీసంరక్షణాధికారి కార్యాలయంలో ఈ టోల్‌ఫ్రీ నెంబరు పనిచేస్తుంది. ఎటువంటి డబ్బు చెల్లించ వలసిన పనిలేకుండా ఈ సేవలు వాడుకోవచ్చును.

[మార్చు] విశాఖపట్నం చరిత్ర గతి

  • క్రీ.పూ.260: అశోకుడు కళింగ రాజ్యాన్ని జయించాడు.
  • క్రీ.పూ.208: చంద్ర శ్రీ శాతకర్ణి ఏలుబడి.
  • క్రీ.శ.14 వ శతాబ్దం: సింహాచలం దేవాలయ నిర్మాణం.
  • 1515: శ్రీ కృష్ణదేవ రాయల ఏలుబడి
  • క్రీ.శ.17వ శతాబ్ది మధ్య భాగం: బ్రిటిషు వారి ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారిచే కర్మాగార స్థాపన.
  • 1689: ఔరంగజేబు సేనలచే ఈ కర్మాగార ఆక్రమణ.
  • 1735: డచ్చి వారిచే స్థావర నిర్మాణం.
  • 1765: బ్రిటిషు వారి ఏలుబడిలోకి ఉత్తర సర్కారులు. తదనంతరం వారు తమ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు.
  • 1904: మద్రాసు నుండి విశాఖపట్నం ద్వారా కలకత్తా కు రైలు మార్గం ప్రారంభం.
  • 1926: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన.
  • 1933: విశాఖపట్నం నౌకాశ్రయం స్థాపన.
  • 1942: రెండవ ప్రపంచ యుద్ధం - జపాను యుద్ధ విమానాల దాడి.
  • 1947: తూర్పు నావికా దళ స్థాపన. 1947 కు పూర్వం రాయల్‌ నేవీ కి హఈశ్‌ సర్కార్స్‌ రూపంలో స్థావరం ఉండేది.
  • 1949: సింథియా నౌకా నిర్మాణ కేంద్ర స్థాపన. జాతియం చేసిన తరువాత అది హిందుస్థాన్‌ షిప్‌యార్డు గా మారింది.
  •  : ఆంధ్ర యూనివర్సిటీ స్థాపన.
  • 1957: కాల్టెక్స్‌ చమురు శుద్ధి కర్మాగార స్థాపన.
  •  : కోరమండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ స్థాపన.
  •  : భారత్ హెవీ ప్లేట్స అండ్ వెస్సెల్స్ లిమిటెడ్ స్థాపన.
  •  : హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్థాపన.
  • 1981: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం స్థాపన.
  • 1971: 1971 ఇండో-పాక్ యుద్ధం, భారత నౌకా దళాల దాడి లో పి.ఎన్.ఎస్. ఘాజీ మునక.
  • 1998: యువభారతి అనే సంస్థ స్థాపించబడింది.
  •  : విశాఖపట్నానికి మునిసిపాలిటీ హోదా.
  •  : విశాఖపట్నానికి కార్పొరేషన్ హోదా.
  •  : విశాఖపట్నానికి 'గ్రేటర్ విశాఖపట్నం (మహా విశాఖపట్నం)' హోదా.
  •  : విమానాశ్రయం ప్రారంబం.
  •  : కైలాసగిరి ప్రారంభం.
  •  : ఇందిరాగాంధి జంతు ప్రదర్శన శాల ప్రారంభం.
  •  : వాల్తేరు రైల్వే స్టేషన్ ప్ర్రారంభం
  •  : జిల్లా కలెక్టర్ ఆఫీసు భవనం నిర్మాణం.
  •  : మిసెస్ ఎ.వి.ఎన్. కళాశాల ప్రారంభం.
  •  : గవర్నర్ బంగళా ప్రారంభం (గవర్నర్ వేసవి విడిది).
  •  : ఆంధ్రా తాజ్ మహల్ బీస్ ఒడ్డున నిర్మాణం.
  •  : టర్నర్ ఛౌట్రీ నిర్మాణం.
  •  : కింగ్ జార్జీ ఆసుపత్రి (కె.జి.హెచ్) ప్రారంభం.
  •  : విక్టోరియా ఆసుపత్రి (స్త్రీల కొరకు) ప్రారంభం.
  •  : జియొలాజికల్ సర్వీ ఆఫ్ ఇండియా స్థాపన
  •  : నేవల్ ఆర్మమెంట్ డిపొ స్థాపన
  •  : నేవల్ డాక్ యార్డ్ స్థాపన
  •  : మెటీరియల్ ఆర్గనైజేషన్ స్థాపన (
  •  : నేవల్ డ్రైడాక్ స్థాపన
  •  : నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబరేటరీస్ స్థాపన
  •  : కేంద్రీయ విద్యాలయం స్థాపన
  •  : డాల్ఫిన్స్ నోస్ మీద లైట్ హౌస్ స్థాపన
  •  : డాల్ఫిన్స్ నోస్ మీద వాతావరణాన్ని పసిగట్టే రాడార్ యంత్రం స్థాపన
  •  : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ స్థాపన.
  •  : గిరిజన్ కార్పొరేషన్ లిమిటెడ్
  •  : ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలమ్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ .
  •  : పోలీస్ కమిషనర్ ఆఫీసు స్థాపన
  •  : పోలీస్ బేరక్స్ స్థాపన
  •  : ఓర్ హేండ్లింగ్ ప్లాంట్ స్థాపన
  •  : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్థాపన
  •  : సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ ఆఫీసు స్థాపన
  •  : ఎ.కె. కార్పొరేషన్ లిమిటెద్ స్థాపన
  •  : రెయిన్ కాల్సైనింగ్ లిమిటెడ్ స్థాపన
  •  : సెయింట్ జోసెఫ్ వుమన్స్ కాలేజి స్థాపన
  •  : గవర్నమెంట్ వుమన్స్ కాలేజి స్థాపన .
  •  : ఫిషింగ్ హార్బరు స్థాపన.
  •  : ఇన్ కం టాక్స్ కమిషనర్ ఆఫీసు స్థాపన
  •  : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్. ఎన్. ఎల్) స్థాపన
  •  : ప్రధాన తపాలా కార్యాలయం (హెడ్ పోస్ట్ ఆఫీసు) స్థాపన
  •  : డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం స్థాపన
  •  : విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్థాపన
  •  : డెయిరీ ఫామ్ స్థాపన
  •  : గీతం డీమ్డ్ యూనివర్సిటీ స్థాపన
  •  : నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపన (ఎన్. ఎమ్. డి.సి)
  •  : మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెద్ స్థాపన (ఎమ్. ఎమ్. టి.సి)
  •  : నేషనల్ షిప్ డిజైన్ రీసెర్చ్ సెంటర్ (ఎన్. ఎస్. డి. ఆర్. సి)
  •  : ఆంధ్రప్రదేశ్ రోడ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (ఎ. పి. ఎస్. ఆర్. టి. సి)
  •  : కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
  •  : ఆంధ్ర వైద్య కళాశాల స్థాపన.
  •  : గురజాద కళా క్షేత్రం స్థాపన.
  •  : ఇందిరాగాంధి క్రికెట్ స్టేడియం స్థాపన.
  •  : మునిసిపల్ క్రికెట్ స్టేడియం స్థాపన.
  •  : కళాభారతి ఆడిటోరియం స్థాపన.

[మార్చు] పరిశ్రమలు

విశాఖ ప్రముఖ పారిశ్రామిక కేంద్రం. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. వాటిలో కొన్ని:

ఉక్కునగరంలోని విశాఖ ఉక్కు కర్మాగారం 6.3 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి విస్తరిస్తున్న తరుణంలో భవిష్యత్తులో ముడిసరుకు కొరత తలెత్తకుండాఅ ఉండేందుకు ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం) ఐరన్ ఓర్ యార్డు నిర్మాణాన్ని సంస్థ చేపడుతోంది సుమారు రూ.418 కోట్లతో నిర్మించనున్న ఐరన్ ఓర్ యార్డు నిర్మాణానికి 21 జూలై 2010 బుధవారం శంకుస్థాపన జరిగింది. ఐరన్ ఓర్ యాఅర్డు నిర్మాణం పూర్తయితే సుమారు ఆరు లక్షల టన్నుల ముడి ఇనుప ఖనిజాన్ని నిల్వ చేయవచ్చు. యార్డు నిర్మాణంలో 65 వేల ఘనపు మీటర్ల కాంక్రీటు, 930 టన్నుల ఇనుము ఉపయోగించనున్నారు యార్డు నుంచి బ్లాస్ట్ ఫర్నేస్ విభాగానికి నేరుగా ఇనుప ఖనిజాన్ని చేరవేసేందుకు పది కి.మీ పొడవుగల కన్వేయరు బెల్టును నిర్మిస్తారు. ఐరన్ ఓర్ యార్డు నుంచి 3.4 కి.మీ పొడవుగల రైల్వే లైను ఏర్పాటు చేస్తున్నారు. అనుకోని పరిస్థితిలో (బందులు, లారీల సమ్మె, ఆందోళనలు, శాంతిభద్రతలకు భంగం జరిగిన సమయంలో, యుద్ధ వాతావరణంలో) రవాణా జాప్యమైతే కర్మాగారం ఇబ్బందుల్లో పడకుండా నిల్వ ఉంచిన ముడిసరుకును వినియోగించుకోవచ్చును. భవిష్యత్తులో గనుల నుంచి నేరుగా కర్మాగారానికి పైపుల ద్వారా ముడిసరుకు సరఫరా చేసేలా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.

IT/ITES రంగంలో శీఘ్రంగా పురోగమిస్తున్న నగరాలలో విశాఖ ఒకటి. ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్న ప్రముఖ సంస్థలు:

  • HSBC BPO
  • సైనెక్టిక్ ఇన్ఫోటెక్ ప్రైవేటు లిమిటెడ్వారు సిరిపురమ్ కుకలి నన్దు గల దుత్త్ ఐలాండ్ నుండి విశాఖ పరిసర మరియౌ దేస విదేసములలోని ఇంజనీరింగ్ సంస్థలకు తమ సేవలను అందిస్తున్నారు.
  • NuNet Technologies [1]
  • సత్యం కంప్యూటర్స్
  • IBM వారు విశాఖ నడి ఒడ్డున వున్న రాంనగర్ లో కార్యాలయం ఏర్పాటు చేసారు
  • పరిశ్రమల అభివృద్ధి కొరకు విశాఖపట్నంలో ఒక ప్రత్యేక ఆర్ధిక ప్రాంతం ను ప్రభుత్వం నెలకొల్పింది.

విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను ప్రారంభించే విషయమై వివిధ సంస్థలతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం సంప్రదిస్తూ ఉంది. భారత ప్రభుత్వపు భాభా అణు పరిశోధనా సంస్థ (BARC) వారు తమ పరిశోధనా కేంద్రాన్ని, ఒక అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నారు.

[మార్చు] భారత నౌకాదళం (ఇండియన్ నేవీ)

భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం కేంద్ర స్థానం.(ప్రధాన స్థావరం). ఇవి కొన్ని బారత నౌకా దళానికి చెందిన కార్యాలయాలు.

  •  : ఇండియన్ నేవల్ షిప్ సర్కార్స్ స్థాపన (బ్రిటిష్ వారి హయాంలో హెచ్.ఎమ్.ఎన్.ఎస్. సర్కార్స్ గా పిలిచే వారు).
  •  : ఇండియన్ నేవల్ షిప్ వీరబాహు స్థాపన.
  •  : ఇండియన్ నేవల్ షిప్ సాతవాహన స్థాపన.
  •  : ఇండియన్ నేవల్ షిప్ ఏకశిల స్థాపన.
  •  : ఇండియన్ నేవల్ హాస్పిటల్ షిప్ కళ్యాణి స్థాపన (హాస్పిటల్).
  •  : ఇండియన్ నేవల్ షిప్ వీరబాహు స్థాపన.
  •  : ఇండియన్ నేవల్ షిప్ డేగ (విమానాశ్రయం దగ్గర వున్నది)స్థాపన.
  •  : ఇండియన్ నేవల్ షిప్ కళింగ (భీముని పట్నం దగ్గర వున్నది)స్థాపన.
  •  : నేవల్ ఆర్మమెంట్ డిపొ స్థాపన
  •  : నేవల్ డాక్ యార్డ్ స్థాపన
  •  : మెటీరియల్ ఆర్గనైజేషన్ స్థాపన (
  •  : నేవల్ డ్రైడాక్ స్థాపన
  •  : నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబరేటరీస్ స్థాపన
  •  : మిలిటరీ ఇంజనీరింగ్ సెర్వీసెస్ స్థాపన
  •  : డిపెన్స్ సెర్వీసెస్ కోర్ప్స్ యూనిట్ స్తాపన.
  •  : ఛీఫ్ ఇంజనీర్ (నేవీ) స్థాపన
  •  : డైరెక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్ స్థాపన.
  •  : షిప్ బిల్డింగ్ సెంటర్స్థాపన. .
  •  : నేవల్ కోస్ట్ బేటరీ (బీచ్ ఒడ్దున వున్నది)స్థాపన.
  •  : అంజారి పార్క్, నేవల్ పార్కు (నావికా దళానికి చెందిన అధికార్ల నివా సాలు)స్థాపన.
  •  : నౌ సేనా బాగ్ (నావికా దళానికి చెందిన నావికుల (అధికారుల స్థాయి కన్న తక్కువ) నివాసాలు)స్థాపన.

[మార్చు] జలవనరులు (రిజర్వాయర్లు )

సంఖ్య జలవనరు పేరు (రిజర్వాయరు) నీటి నిలవ సామర్ద్యము (ఎక్కువ) నీటి నిలవ సామర్ద్యము (తక్కువ) ప్రస్తుతం నిలవ ఉన్న నీరు ......తేదీ నాటికి...
1 తాటిపూడి 297 251 296 3 మార్చి 2011
2 ముడసర లోవ 169 148 169 3 మార్చి 2011
3 గంభీరం గెడ్డ 126 107 123 3 మార్చి 2011
4 రైవాడ 114 99 113 3 మార్చి 2011
5 మేఘాద్రి గెడ్డ 61 44 56 3 మార్చి 2011
6 గోస్తని నది 36 22 30 3 మార్చి 2011
7 కణితి బేలన్సింగ్ రెజర్వాయరు (కె.బి.ఆర్) 3 మార్చి 2011


  • వైశాఖి జల ఉద్యానవనం (జలాశయము మాత్రమే). నీటి సరఫరాకి కాదు.
  • జలవనరుల పరిస్థితి రోజువారీ తెలియ జేసే మహా విశాఖ నగర పాలక సంస్థ వెబ్ సైటు [2]
జలవనరులను నియంత్రించే విభాగాలు పోన్ నెంబరు
హెల్ప్ లైన్ 1913
సర్క్యూట్ హౌస్ ప్రాంతం 2562246
ముడసరలోవ 2712319
టర్నర్స్ ఛౌట్రీ (సూపర్ బజార్ దగ్గర) 2561397
టి.ఎస్.ఆర్. కాంప్లెక్స్ (ఆర్.టి.సి. కాంప్లెక్స్ దగ్గర) 2746672
నాతయ్యపాలెం, బి.హెచ్.పి.వి. దగ్గర 2517261
24 గంటల కాల్ సెంటర్ 2746313

[మార్చు] విశాఖపట్టణం నగరం లో చూడదగిన ప్రదేశాలు

విశాఖపట్నం, కైలాసగిరి పైని దృశ్యం
  • సింహాచలం - శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.
  • డాల్ఫిన్స్ నోస్ (డాల్ఫిన్ చేప ముక్కులాగ వుంటుందని, ఈ కొండకు , ఆ పేరు పెట్టారు). 174 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టాఆనికి 358 మీటర్ల ఎత్తులో వున్నది. ఈ కొండమీద ఉన్న లైట్ హౌస్, సముద్రంలో ప్రయాణిస్తున్న నావికులకు, దారి చూపుతుంది. యాత్రికులు ఈ లైట్ హౌస్ ని చూడవచ్ఛును. ఈ కొండ మీద నౌకాదళ సిబ్బందికి బహుళ్ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ కొండ దిగితే, యారాడ అనే గ్రామం కనిపిస్తుంది. అరటి, కొబ్బరి పంట పొలాలతో పచ్ఛని పొలాలతో ఈ పల్లె కనిపిస్తుంది. కనకాంబరాలు కూడా ఇక్కడ పండిస్తారు.
  • రామకృష్ణ బీచ్ - విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్. చాలా సుందరమైనది. సముద్రపు కోత వలన, బీచ్ విశాలత తగ్గింది. ఈ ప్రాంతంలో, దేశ నాయకుల విగ్రహాలు, ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు. ఈ తీరానికి దగ్గరలోనే, కాళికాలయం, రామకృష్ణా మిషన్, హవా మహల్, జలాంతర్గామి (కల్వారి) మ్యూజియం (భారత దేశంలో ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు) ఉన్నాయి.
  • కాళికా దేవి ఆలయం
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విద్యా కళా పరిషత్)
  • కైలాసగిరి- శంఖం, ఛక్రం, నామాలు రాతిపూట కైలాసగిరి కొండ మీదనుంచి రాత్రివేళ మెరుస్తూ కనిపిస్తాయి. శివ పార్వతుల విగ్రహాలు కనువిందు చేస్తాయి కొండమీద.
  • వైజాగ్ స్టీలు ప్లాంటు
  • రిషికొంద బీచ్ - నగరానికి 8కి.మీ దూరంలో వున్నది. ఇక్కడ పర్యాటక శాఖ, పున్నమి రెసార్టులను వర్యాటకులకు అద్దెకు ఇస్తుంది. ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చొటు.
  • జగదాంబా సెంటరు - జగదాంబ సినీమా హాలు కట్టక ముందు, ఈ ప్రాంతాన్ని, ఎల్లమ్మ తోట గా పిలిచే వారు. నాగుల చవితి నాడు, ఇక్కడి చుట్టుపక్కల వున్న ప్రజలు పుట్టలో పాలు పోసేవారు. అన్ని పాము పుట్టలు వుండేవి. చిన్న అడవి లాగ వుండేది. ఇప్పటికీ, ఇక్కడ ఎల్లమ్మ గుడి వుంది. ఇక్కడి భూములు న్నీ 'దసపల్లా' రాజులకు చెందినవి. అందుకు గుర్తుగా ఇక్కడ కట్టిన సినిమా హాలు పేరు 'దసపల్లా ఛిత్రాలయ'. హోటల్ వేరు 'దసపల్ల హోటల్'. జగదాంబ 70 ఎమ్. ఎమ్. థియేటర్ కట్టిన తరువాత, ఈ ప్రాంతం అంతా వ్యాపార పరంగా అభివృద్ధి చెంది, విశాఖపట్నం అంటే, జగదాంబ సెంటరు ఆందరికీ గుర్తు వస్తుంది. అర్.టి.సి. కాంప్లెక్స్ కట్టేవరకు, విశాఖపట్నం , జగదాంబ సెంటర్ వరకే వుండేది.
  • విశాఖపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయం
  • ఆంధ్ర వైద్య కళాశాల
  • విశాఖ నౌకాశ్రయము
  • విశాఖపట్నం చేపలరేవు
  • ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల
  • అరకు: వేసవి విడిది. ఇక్కడికి 112 కి.మీ దూరం. అరకు లోయ 3100 అడుగుల ఎత్తులో వుంది. విశాఖ నుంచి అరకు లోయ కు, రైలు ప్రయాణం ఒక మధురానుభూతి. పచ్ఛని లోయలు, హోటళ్ళు, విశ్రాంతి మందిరాలు వునాయి. పద్మాపురం గార్డెన్స్, బొర్రా గుహలు కూడా చూడదగినవి. బొర్రా గుహలు (90 కి.మీ దూరం) 10లక్షల సంవత్స్రరాల క్రితం ఏర్వడినవి. పర్యాటక శాఖ ఈ గుహలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
  • జంగిల్ బెల్స్, తైడా విశాఖకి 75 కి.మీ దూరంలో వున్న తైడా ఒక గిరిజన గ్రామం
  • ముడసర్లోవ
  • బీమిలి బీచ్
  • ఆంధ్రా తాజ్ మహల్ (కురుపాం రాజులది)
  • ఇసుక కొండ మీద వెలిసిన సత్యనారాయణ స్వామి.
  • నీలమ్మ వేపచెట్టు.
  • కరక చెట్టు పోలమాంబ.
  • కనక మహా లక్ష్మి అమ్మ వారు.
  • పోర్టు వెంకటేశ్వర స్వామి. (ఇక్కడ మూడు కొందలు వున్నాయి.ఒక్ కొండపై వెంకటేశ్వర స్వామి, ఒక కొండప్ ముస్లిములకు పవిత్రమైన దర్గా, మరొక కొండపై (రాస్ కొండ) క్రైస్తవులకు పవిత్రమైన ఛర్చి వున్నాయి. విశాఖపట్నంలోని ఈమూడు మతాల పవిత్ర ప్రదేశాలు చూడటం ఒక మధురానుభూతి. భారత దేశ మతాతీత రాజ్యాంగానికి చక్కని ఉదాహరణ.
  • కణితి బేలన్సింగ్ రిజర్వాయరు (స్టీల్ సిటీ లో ఉన్నది).
  • అయ్యప్ప గుడి (షీలా నగర్ దగ్గర).
  • వైశాఖి జల ఉద్యానవనం
తెన్నేటి ఉద్యానవనం వద్ద అందమైన సూర్యోదయం.
  • వుడా పార్క్
  • బావనా ఋషి కోవెల (బురుజు పేట దగ్గర వున్న కనక మహాలక్ష్మి గుడికి దగ్గర)
  • ఇస్కాన్ టెంపుల్
  • శారదా పీఠం. (చిన ముషిడివాడ దగ్గర)
  • కాళికాలయం. మూడు కాళికాలయాలు ఉన్నాయి. ఒకటి రామకృష్ణ బీచ్ దగ్గర, రెండవది ఉక్కు నగరంలో, మూడవది రైల్వే స్టేషన్ దగ్గర.
  • సాగర దుర్గాదేవి (డాల్ఫిన్స్ నోస్ కొండ క్రింద - కోరమాండల్ బీచ్ )

[మార్చు] స్టార్ హోటళ్ళు

[మార్చు] విద్యుత్ శక్తి

  • విశాఖపట్నానికి, 2011 వేసవి కారణంగా, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో, 'ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్'(ఈపీడీసీఎల్) కు, ప్రతిరోజు 12 మిలియన్ యూనిట్ల వరకు వినియోగించుకునేందుకు అవకాశం 6 మే 2011 నుంచి ఇచ్చింది. ఈపీడీసీఎల్ సంస్థ పరిధిలో విశాఖపట్నం జిల్లాలోనే విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుంది. భారీ పరిశ్రమలు, వాణిజ్య, గృహావసరాలకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఈ సంస్థ సరఫరా చేయాలి. ప్రతి ఏడాది రోజువారీ పరిమితి (కోటా) 8 మిలియన్ యూనిట్ల నుంచి పది మిలియన్ యూనిట్ల వరకు ఉండేది. 2011 సంవత్స్రానికి ఈ పరిమితి 11 మిలియన్ యూనిట్లకు పెరిగింది. 3 మే 2011 నుంచి పగటి వేడి 37 డిగ్రీలకు పెరగడంతో, నగరంలో ఏ.సి.ల వాడాకం విపరీతంగానే ఉంది. పరిశ్రమలు, సినిమాహాళ్ళు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వరంగ సంస్థల వినియోగం ఒక్కసారిగా పెరిగింది. అందుచేత, పట్టణ అవసరాల్కు అనుగుణంగా, కోతల్లేని సరఫరా చేయటానికి సహకరించాలని, ఈపీడీసీఎల్ ఏపి ట్రాన్స్‌కో కు విన్నవించుకుంది. వెంటనే 'ఏపిట్రాన్స్‌కో' రోజువారీ వాడకానికి తగ్గట్లుగా పరిమితిని 12 మిలియన్ యూనిట్లకు పెంచింది. మే 2011 వరకూ ఈ పరిమితి ఉంటే ఛాలు అనుకుంటుంది ఈపీడీసీఎల్. కానీ, గ్రామాలలో విద్యుత్ కోత మామూలుగానే ఉంటుంది. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్తును ఇవ్వాలని నిర్ణయించింది.నగరంలోని పరిశ్రమలకు 'హేపీ డే' అమలు కారణంగా, పారిశ్రామికులు ఆనందిస్తున్నారు. వాణిజ్య విద్యుత్ సరఫరాకు ఎటువంతి అంతరాయాలు కలగటంలేదు.

చూడు : విద్యుత్తు వాడకం (వినియోగం) [3]

[మార్చు] రవాణా సౌకర్యం - బస్సులు

  • నగరంలోని బస్సులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఎ.పి.ఎస్.ఆర్.టి.సి) వారి అజమాయిషీలో నడుపుతున్నారు. ఈ బస్సులు ఆరు రూట్లలో నడుపుతున్నారు. రూట్ నెంబర్లు 1 నుంచి 9ఇ 9జి నుంచి 25 , 28 నుంచి 38 , 38 నుంచి 55 , 56 నుంచి 338 , 400 ఎమ్ నుంచి 777.
  • ఈ స్టేషన్ నుంచి ఇతర రాష్ట్రాలకి, ఇతర నగరలాకి, ఇతర జిల్లాలకి బస్సులు ఉన్నాయి. బస్సు ప్లాట్ పారంలు కూడా ఎక్కువగానే వున్నాయి. సిటీ బస్సుల ప్లాట్ పారంలు వేరుగాను, రూట్ బస్సుల ప్లాట్ పారం లు వేరుగాను ఉన్నాయి.

రమారమి గా 40 రూటు సర్వీసులను ఇక్కడ నుంచి నడుపుతున్నారు.

  • ఆర్.టి.సి బస్సుల మీద రాసే ఈ దిగువ అక్షరాలకి అర్ధం ఇలా వుంటుంది. ఆ యా బస్సు డిపొల పేర్లు క్లుప్తంగా ఇలా వుంటాయి.
  • సి.బి.ఎస్ అంటే సెంట్రల్ బుస్ స్టేషన్ (ద్వారకా బుస్ స్టేషన్) కానీ ప్రజల వాడుకలో ఇది ఆర్.టి.సి. కాంప్లెక్స్.
  • ఎమ్.డి.పి. అంటే మద్దిలపాలెం డిపొ.
  • ఎమ్.వి.పి. అంటే మువ్వలవాని పాలెం డిపొ.
  • ఎస్.ఎమ్.ఎల్ అంటే సింహాఛలం.
  • జి.డబల్యు.కె అంటే గాజువాక.
  • ఓ.హెచ్.పి.ఓ అంటే ఓల్డ్ హెడ్ పోస్టు ఆఫీసు (పాత పోస్టు ఆవీసు అని వాడుక).
  • జెడ్.పి అంటే జిల్లా పరిషత్ ఆఫీసు. (కలెక్టరు ఆఫీసు దగ్గర).

[మార్చు] రైళ్ళు

  • విశాఖ పట్నం రైల్వేస్టేషన్ వుంది. మర్రిపాలెమ్ రైల్వేస్టేషన్, గోపాల పట్నం రైల్వేస్టేషన్,సింహాఛలం రైల్వీస్టేషన్ కూడా వున్నాయి. దువ్వాడ దగ్గర ఒక రైల్వే స్టేషన్ వుంది. క్రమం గా విశాఖ పట్నం రైల్వేస్టేషన్ పై వొత్తిడి తగ్గించుటకు రైళ్ళను దువ్వాడ మీదుగా మళ్ల్లించుట జరుగుతొంది.

[మార్చు] విమానాలు

  • విమానాశ్రయం వుంది. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాదు, బొంబాయి, ఢిల్లీ, చెన్నై, భువనేశ్వర్ నగరాలకు విమానాలు తిరుగుతాయి. ఇక్కడ రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి పౌరులకు. రెండవది నౌకాదళఅనికి చెందిన విమానాశ్రయం (దీని పేరు ఐ.ఎన్.ఎస్. డేగ అంటారు). ఇక్కడ నౌకాదళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణిస్తుంటాయి. ఇది పౌరులకు నిషిద్ధ ప్రాంతం.

[మార్చు] టాక్సీలు / లగ్జరీ బస్సులు / లారీలు /మినీ వేన్ లు

  • ప్రజలకు, పర్యాటకులకు కావలసిన అద్దె కార్లు (టాక్సీలు), లగ్జరీ బస్సులు, సరుకు రవాణా కు కావలసిన్ లారీలు సరఫరా చేయటానికి నగరంలో చాలా ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. అన్థర్జతియ విమనస్రయమ్

[మార్చు] మార్కెట్లు / బజార్లు

పూర్ణా మార్కెట్ (సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్)

కురుపాం మార్కెట్ మొదటి నుంచి ఈ ప్రాంతం బంగారం, వెండి వ్యాపారానికి ప్రసిద్ధి. విశాఖపట్నం లో మొట్ట మొదటి బంగారం, వెండి వ్యాపార కేంద్రం. కురౌపాం రాజులు ,వారి పాలనా కాలంలో ఈ మార్కెట్టును కట్టించారు. ఇప్పటికీ , కురుపాం మార్కెట్టు లోనికి వెళ్ళే ద్వారం మీద వారి పేరు వుంటుంది. ఈ ప్రాంతంలో దొరకని ఆయుర్వేద మూలిక వుండదు. అలగే, యజ్ఞాలు చేసే సమయంలో వేసే పూర్ణాహుతి సామాన్లు కోసం, పెళ్ళి చేసుకునే సమయంలో వేసే కర్పూరం దండలు వగైరా సామాన్లు కోసం కురుపాం మార్కెట్ కి రాక తప్పదు. కాన్వెంట్ జంక్షన్ అని పిలిచే చావుల మదుం దగ్గరకి తెల్లవారు ఝామునే, లారీల మీద దేవరాపల్లి, మాడుగుల వంటి అటవీ (ఏజెన్సీ) ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల కూరగాయలు పండించే రైతులు, ఇక్కడికి తెచ్చి వేలంపాట ద్వారా కూరగాయలు అమ్ముతారు. విశాఖపట్నంలోని కూరగాయల వ్యాపారులు, హోటళ్ళ వారు వీటిని పెద్ద మొత్తంలో కొనుక్కుని వెళతారు. వీరు, విశాఖ నివాసులకి స్థానికంగా వున్న బజారులలో అమ్ముకుంటారు.

గాజువాక : గాజువాక మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే, పళ్ళ మార్కెట్ వుంది.ఆరటి పళ్ళ గెలలు, కాలాన్ని బట్టి పండే, మామిడి, పుచ్చకాయలు వంటివి ఇక్కడ వేలంపాట ద్వారా అమ్ముతారు. ఆ పక్కనే, కణితి గ్రామానికి వెళ్ళే దారిలో, గాజువాక చుట్టుప్రక్కల గ్రామాల వారికి కావలసిన కిరాణా సరుకులు, కూరగాయలు, మాంసాహారం, చేపలు వగైరా అమ్ముతారు. ఇది ఈ చుట్టు ప్రక్కల చాలా పెద్ద మార్కెట్టు. రెండు, మూడు సార్లు పెద్ద అగ్నిప్రమాదాల పాలై , కోలుకున్న మార్కెట్టు ఇది. అక్కడికి దగ్గరలోనే వెండి, బంగారం దుకాణాలు ఎక్కువగానే వున్నాయి.

[మార్చు] స్వచ్ఛంద సంస్థలు

[మార్చు] లైన్స్ క్లబ్ (లయన్స్ క్లబ్)

[మార్చు] రోటరీ క్లబ్

[మార్చు] ఇన్నర్ వీల్ క్లబ్

[మార్చు] సావిత్రిబాయి ఫూలే ట్రస్టు, గోపాల పట్నం.

[మార్చు] ప్రతిజ్ఞ ఛారిటబుల్ ట్రస్టు, ఆర్.పి.పేట, మర్రిపాలెం.

[మార్చు] ప్రేమ సమాజం - చూడు

అది ఛాల బగున్ది

[మార్చు] సాహితీ సంస్థలు

విశాఖ సాహితి

[మార్చు] సాంస్కృతిక సంస్థలు

[మార్చు] కళాభారతి

  • విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి 3 మార్చి 1991 న స్థాపించారు. వ్యవస్థాపక దినోత్సవము ప్రతీ సంవత్సరము 3 మార్చి న జరుగుతుంది. సంగీత విద్వన్మణి సుసర్ల శంకర శాస్త్రి కలలకు ప్రతీకగా పుట్టిన ఈ ఆడిటోరియాన్ని 11 మే 1991 తేదీన పిఠాపురం కాలనీలో ప్రారంభించారు. ఇక్కడ నిత్యం, వివిధ సంగీత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు (సంప్రదాయ, జానపద), నాటకాలు జరుగుతూ, ఆంధ్ర దేశపు ఔన్న్తత్యాన్ని తెలియ జేస్తుంటాయి. ఆగష్టు 2011 లో రజతోత్సవాలు జరుగుతాయి.

[మార్చు] విశాఖ మ్యూజిక్ డాన్స్ అకాడమీ

  • ఈ సంస్థ విశాఖపట్నంలోని సంగీత (కర్ణాటక, హిందుస్థానీ), నృత్య కార్యక్రమాలకు కేంద్ర స్థానం గా ఉంది. సంగీత, నృత్య ప్రదర్శనల కార్యక్రమాలను, త్యాగరాజు ఆరాధనోత్సవాలు, మొదలైన కార్యక్రమాలు జరిస్తుంది. విశాఖపట్నంలోని సంగీతం, నృత్యం అంటే అభిమానం ఉన్నవారికి, ఈ సంస్థ వారిని నిత్యం ఆనందింపచేస్తుంది.

[మార్చు] కళ్యాణ మండపాలు

  • తి.తి.దే. కళ్యాణమండపం. ఇది ఎం.వి.పీ. (మువ్వల వాని పాలెం) కాలనీలో ఉంది.

[మార్చు] పత్రికా సంస్థలు

ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి వార్త ఆంధ్ర భూమి ఆంధ్ర ప్రభ ఇండియన్ ఎక్స్ ప్రెస్ హిందూ (విజయ నగరం నుంచి ముద్రితం అవుతుంది)

[మార్చు] సినిమా థియేటర్లు

జగదాంబ , శారద , దసపల్లా ఛిత్రాలయ, కన్య, శ్రీకన్య , , లీలామహల్, గీత్, సంగీత్, జ్యోతి , శ్రీ వెంకటేశ్వర ఎ.సి (డి.టి.ఎస్) , కామేశ్వరి ఏ.సి (డి.టి.ఎస్), గోకుల్, రమాదేవి, శారద, మెలోడి, []],[ వ్-మక్ష్ వెంకటేశ్వర, లీలామహల్, జ్యోతి , శ్రీకన్య (టౌన్), శ్రీకాంతి, పూర్ణ, సంగం, శరత్, శ్రీరామ, కిన్నెర ఎ.సి (డి.టి.ఎస్) మద్దిలపాలెం, శ్రీ పరమేశ్వరి, ఊర్వశి, మిని వెంకటేశ్వర

[మార్చు] పోలీసు స్టేషన్లు

  • విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ని 1 జూలై 2005 నాడు ఈ విధంగా పునర్వవస్థీకరించారని పత్రికలు ప్రకటించాయి.

[మార్చు] అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఉత్తరం -సబ్ డివిజన్) : 9440796008 ఆఫీసు: 0891-2569987

[మార్చు] అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (దక్షిణం -సబ్ డివిజన్)

[మార్చు] అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు -సబ్ డివిజన్)

ఈ సబ్ డివిజన్ ని 1 జూలై 2005 నాడు కొత్తగా ఏర్పాటు చేసారు. ఇందులో

  • అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు.
  • సెంట్రల్ క్రైమ్ స్క్వాడ్
  • సిటీ క్రైమ్ రికార్డ్ బ్యూరో.
  • ఫోను నెంబర్లు
  • కంట్రోలు రూం ....................... 100/2787817
  • క్రైం స్టాపర్ (సిటీ) .................... 1090/2565454
  • క్రైం స్టాపర్ (గ్రామీణం/రూరల్)............. 1091
  • పోలీసు కమిషనరు .................... 2562709 (ఆఫీసు) 2525500 (ఇల్లు)
  • డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ .... 2558850
  • డీసీపీ (క్రైం - నేర విభాగం) .............. 2560223
  • డీసీపీ (ట్రాఫిక్ )...................... 2730203
    • నార్త్ ఏసీపీ (ఉత్తరం)...................2569985
  • అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)........2569861
  • సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - రూరల్(గ్రామీణం)..2551104 ఆఫీసు 2754431 (ఇల్లు)
  • డీఎస్పీ ఇంటెలిజెన్స్.....................253587*0
  • విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్‌మెంట్...............255070*6
  • సిటీ స్పెషల్ బ్రాంచ్......................2704465
  • ఏసీబీ (డిఎస్‌పీ)అవినీతి నిరోధక శాఖ..........2552894
  • రూరల్ స్పెషల్‌ బ్రాంచి....................2549749
  • సిబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ )........
  • ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐ.బి)................

[మార్చు] విశాఖపట్నం వార్డులు

  • మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ లో ఉన్న 72 వార్డుల వివరాలు (జనాభా, వార్డు హద్దులు, వార్డులో ఉన్న గ్రామాలు, ప్రాంతాల వివరాలు, సౌకర్యాలు, పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైనవి)కోసం ఇక్కడ నొక్కండి విశాఖపట్నం వార్డులు.

[మార్చు] నియోజక వర్గాలు

[మార్చు] స్మశాన వాటిక - చావుల మదుం

  • కాన్వెంటు జంక్షను దగ్గర ఉంది దీనినే చావుల మదుం అంటారు. ఇది స్మశాన వాటిక. ఇక్కడ శవాలను సమాధి చేసిన తరువాత, ప్రక్కనే ఉన్న చెరువులో స్నానం చేసీవారు. నేడు ఆ చెరువును పూర్తిగా కప్పివేసారు చెత్త చెదారం వేసి. ఇప్పుడు అక్కడ చెరువు ఉండేది అంటే నమ్మటం కష్టం. విశాఖపట్నం కుగ్రామంగా ఉన్నప్పటి నుంచీ, ఇదే శ్మశాన వాటిక. ఇవాళ ఉన్న రామకృష్ణ సినిమాహాలు , కర్రలదొడ్డి, కొబ్బరితోట ప్రాంతాలలో, బరువైన పాడెను ఓకసారి దించి, ఆయాసం తీర్చుకుని మరలా బయలు దేరే పద్ధతి ఉంది. అందరూ అదే పద్ధతిని పాటిస్తారు. చావుల మదుం దగ్గర ఉన్న హిందూ స్మశాన వాటిక ప్రక్కనే, క్రైస్తవుల స్మశానవాటిక ఉంది. విద్యుత్తు దహన వాటిక కూడా ఉంది ఇక్కడ. ఈ ప్రక్కనే సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల ఉంది. ఈ చావుల మదుం (కాన్వెంటు జంక్షను) విశాఖ పట్నానికి ఒక ముఖ్యమైన కూడలి. ఈ కూడలి నుంచే, పాత నగరానికి వెళ్ళటానికి ఒక దారి. గాజువాకకు వెళ్ళటానికి ఓక దారి. మర్రిపాలెం, ఎన్.ఏ.డి జంక్షనుకి వెళ్ళటానికి ఒక దారి. రైల్వే స్టేషనుకి , దొండపర్తి, ద్వారకానగర్, ఆర్.టీ.సీ. కాంప్లెక్సుకి వెళ్లటానికి ఓక దారి.ఈ నాలుగు దార్లు కలిసిన కూడలి ఇది.

[మార్చు] లోవ తోట (లోవ గార్డెన్స్ )

  • లోవతోట ను లోవ గార్డెన్స్ అని పిలవటం మొదలు పెట్టారు.నిజంగా రెండు కొండల మధ్య ఉండే లోయ. ప్రకృతి అందానికి కాణాచి గా ఉండేది. విశాఖపట్నం ఓడరేవులోకి వెళ్ళటానికి ఒక కాలువ తవ్వారు. దానిని పోర్టు ఛానెల్ అంటారు. అది దాటితే, లోవ తోట. విశాఖ నగర వాసులు, ఆ తోటకు ఆదివారాల సమయంలో , ఆ కాలువ ను పడవ సహాయంతో దాటి (అప్పట్లో ఒక పడవ నడిపీవారు.దానికి కొద్ది మొత్తం తీసుకునేవాడు) పిక్‌నిక్‌కి వెళ్ళిన అనుభూతి పొందేవారు. అక్కడికి దగ్గరలోనే దుర్గాదేవి గుడి ఉంది. సముద్రానికి దగ్గరలోనే . విశాఖ పట్నం సముద్ర తీరం, కోతకు (కోరేయటం అంటారు ఇక్కడి వారు) గురి అయ్యి, ఇక్కడి రోడ్డుకు, భవనాలకు ముప్పు వాటిల్లింది. అప్పుడు సముద్రతీరంలో, పెద్ద పెద్ద సెమెంటు రాళ్ళు, కొండరాళ్ళు, ఆ కోత కోసే సముద్ర తీర ప్రాంతంలో వేసి, సముద్రం యొక్క అలల ఉధృతిని , వేగాన్ని తగ్గించారు. ఆ సిమెంటు రాళ్ళు ఇప్పుడు మీరు కూడా చూడవచ్చును. అప్పట్లో 'కాంటినెంటల్ కన్‌స్ట్రక్షన్' అనే కంపెనీ, నిర్విరామంగా , రాత్రి , పగలు ఈ లోవ తోటలో మకామువేసి, సిమెంటు దిమ్మలు, లారీల మీద వేసుకుని వచ్చి, ఇవతలి వైపున్న సముద్ర తీరంలో వదిలేవారు. వారు నడిపిన లారీల వేగానికి, ఆ లారీల ప్రవాహానికి, ఆ చుట్టుప్రక్కల వారికి నిద్ర ఉండేది కాదు. బలహీనంగా ఉన్న ఇళ్ళు కొద్దిగా అదెరేవి. ఆ అదురు ఇళ్ళలోని వారికి తెలెసేది. అప్పటికి విశాఖపట్నంలోకి 'బహుళ అంతస్తుల సంస్కృతి ' ప్రవేశించలేదు. ఆ సమయంలో, ఆ లోవ తోటలోని వృక్షాలను నరికేసారు. పచ్చదనం పోయి, బోసిపోయింది లోవ తోట. ఇప్పుడు విశాఖపట్నం పోర్టువారు ఆ స్థలాన్ని ఉపయోగించుకుంటున్నారు.

[మార్చు] చిత్రమాలిక

రామకృష్ణ బీచ్
విశాఖపట్నం స్టేడియంలో క్రికెట్ మాచ్
విశాఖపట్నం ఓడరేవు దృశ్యం
విశాఖపట్నం నగరంలో భవనాలు
విశాఖపట్నం ఓడరేవు సంపూర్ణ దృశ్యం
విశాఖపట్నంలో మత్స్యకారులు

[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

అంధ్రప్రదేశ్ టూరిజం

[మార్చు] మూలాలు


Visakhapatnam.jpg

విశాఖపట్నం జిల్లా మండలాలు

ముంచింగి‌పుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం

"http://te.wikipedia.org/w/index.php?title=విశాఖపట్నం&oldid=729810" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు