వైతాళికులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వైతాళికులు అనేది ముద్దుకృష్ణ యొక్క కవితా సంకలనం.

ఆధునిక చైతన్యాన్ని ప్రతిబింబించే కవితా సంకలనాలలో మొదటగా చెప్పుకోవాలి.

కవులు ప్రపంచంలో నీతిని ప్రచ్చన్నం గా తీర్చి దిద్దే శాసనాధికారులు " అన్నాడు ఆంగ్లకవి షెల్లీ . ఏ కవి రచనలోనైనా తన దేశ, కాల,పరిస్థితులు ప్రతిబింబించక మానవు. నిజమైన కవి వీటిని రద్దుచేసుకొని జీవించనూ లేడు . తాను జీవించినకాలానికి, తనదేశానికి సన్నిహితం కాని ఏ రచన అయినా ఎక్కువ కాలం నిలువలేదు. వివిధ కవుల కవిత్వాన్ని సకలనం చేసే సాంప్రదాయం ప్రాచీన కాలం నుండి ఉంది. హాలుడి గాధాసప్తశతి మనకు దొరుకుతున్న అతి ప్రాచీన సంకలనం. తెలుగులో కూడా ప్రభందరత్నాకరం, ప్రభందమణిభూషణం, లాంటి కొన్ని సంకలనాలు ఉన్నట్టు తెలుస్తుంది వివేకానందుడు, అరవిందుడు, రవీంద్రుడు, శరత్, గురజాడ అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలగు కవులు వారి సందేశాలు కావ్యాలు ఒక దేశానికి, ఒక సంఘానికి కాక సర్వమానవ కుటుంబానికి అన్నట్లుగాఉంటాయి.

వైతాళికులు అనేకవితా సంకలనం పైన ఉదహరించిన కవులందరి కవితలు లేకపొయినా ఆకోవకు చెందినవారి కవితలు కొన్ని మనకు కనిపిస్తాయి. ఈ కవితా సంకలనంలోని కవులు, వారి వారి కావ్యాలు, కొన్ని ఉదాహరణలు

ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఏపీఠమెక్కినా, ఎవ్వరేమనినా

పొగడరా నీతల్లి భూమిభారతిని, నిలుపరా నీజాతినిండుగౌరవము

అవమానమేలరా, అనుమానమెల, భరతపుత్రుండనంచు భక్తి తొబలుక.

-రాయప్రొలు సుబ్బరావు

దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్

మతం వేరైతేను యేమొయి, మనసులొకటై మనుషులుంటే

జాత యన్నది లేచి పెరిగి లొకమున రాణించునొయి

-గురజాడ అప్పారావు

ఏపల్లవ నృపాలుడెత్తిన బావుటా, చాళుక్యనృపుల రాజ్జంబునందు

ఏ దేసికవిత పాలించిన కవిరాజు నన్నయ్య వ్యాకరణంబునందు

ఎన్నిజన్మమ్ములుగాగ నీతనువునన్ బ్రవహించునొ యాంద్రరక్తముల్

-విశ్వనాధ సత్యన్నారాయణ

సెనగ పూరైక దొడిగిన చిన్నదాన చిలుకయెక్కటివ్రాలె నామలుపునందు

మిరపలీ యేడు మీకు సమృద్ధి, వంగ చెట్టు లిప్పుడిప్పుడే పూతపట్టుచుండె

బంతిపూవులు మ్రుగ్గుల పండువునకు నక్కరకు వచ్చు

కొసి యుంచితి రమ్ము నికొరకు నేను సెనగ పూరైక దొడిగిన చిన్నదాన

పింగళి--కాటూరి

ఉన్మత్తకొకిల గానము సల్పెడినుద్యానవాటికి మధురముగాపొడవాటి లోద్దుగకొమ్మల నూగెడి

బున్నమచందురుడుయ్యెలలు ఆమని మత్తునచైతన్యలొకము ఆనందపరవశమైసొగియు

సరి చేయు మౌ సఖి భగ్నవిపంచికన్

దువ్వూరి రామిరెడ్డి

నా విరులతోటలో బెంచికొన్నాడ నొక్క పవడపు గులాబిమొక్క

నా ప్రణయ జీవనమ్ము వర్ష మ్ముగా నానయనమ్ము కురిసి

కొన్నినాళ్ళాయె సుకుమారకుసుమ మొకటి నవ్వె కలకలమని నావనమ్ము లోన

కృష్ణ శాస్త్రి

యెలుతురంతామేసి యేరునెమరేసింది కలవరపు నా బ్రతుకు కలతనిదురయ్యింది

యెన్నెలలసొగసంతా యేటిపాలేనటర ఒక్కతెను నాకేలవొపజాలని సుఖము

నండూరిసుబ్బారావు

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను

నేనుసైతం విశ్వవృష్టికి ఆశ్రు వొక్కటి ధార పొశాను

నేనుసైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రొ శాను -శ్రీ శ్రీ

  1. గురజాడ అప్పారావు
  2. రాయప్రోలు సుబ్బారావు
  3. నండూరి సుబ్బారావు
  4. చింతా దీక్షితులు
  5. విశ్వనాధ సత్యనారాయణ
  6. దేవులపల్లి కృష్ణశాస్త్రి
  7. శ్రీ శ్రీ
  8. ఓలేటి పార్వతీశము
  9. బాలాంత్రపు వెంకటరావు
  10. నోరి నరసింహశాస్త్రి
  11. బసవరాజు అప్పారావు
  12. అడవి బాపిరాజు
  13. మల్లవరపు విశ్వేశ్వరరావు
  14. దువ్వూరి రామిరెడ్డి
  15. కాటూరి వెంకటేశ్వరరావు

మొదలగు ఎందరో కవులగీతాలను సమీకరించి సంకలనపరచిన కావ్యమే ఈ వైతాళికులు.

ఈ వైతాళికులను పుస్తకరూపంలో తేవటానికి ఎంతో శ్రమించితేగాని ప్రచురణకు నోచుకోదు. ఈ పుస్తకం పది సారులకు పైగా ప్రచురించారు.