వైరస్ వ్యాధులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వైరస్లు (విషజీవాంశాలు) జీవకణాలలో వృద్ధిచెందే జీవం లేని అంశాలు. ఇవి జీవులకు విషం వలె అనారోగ్యము కలిగించగలవు. వీటిలో జీవరాశులలో వలె జీవనక్రియలు జరుగవు. ఇవి వీటంతట ఇవి మనజాలవు. వీటంతట ఇవి ప్రత్యుత్పత్తి చెందలేవు. ఇవి జీవులు కాకపోయినా జీవంతో ముడిపడిన భాగాలు. వైరస్ పదం లాటిన్ నుండి పుట్టినపదం, సంస్కృతపదం విషం (विषम्) తోను, అవేష్టి భాషలో ‘విషం’ తోను సంబంధం కలిగి విషం అనే అర్థం స్ఫురిస్తుంది[1]. ఇవి ప్రోటీన్ పూత లోపల రైబోజ్ న్యూక్లియక్ ఆమ్లము (ఆర్.ఎన్.ఏ) లేక డీఆక్సీ రైబోజ్ న్యూక్లియక్ ఆమ్లము (డి.ఎన్.ఏ) అను జన్యుపదార్ధాలతో తయారు చేయబడతాయి. సాధారణ జలుబు, ఫ్లూ, మొటిమలు వంటి అంటు వ్యాధులకు వైరస్లు కారణమవుతాయి. హె .చ్ .వి / ఏయిడ్స్ , ఎబోలా, కోవిడ్ -19 వంటివి ప్రాణాంతక వైరస్ వ్యాధులు . వైరస్ లు మనుషుల కణాలపై ప్రభావం పడి , వారిని అనారోగ్యానికి గురి చేస్తాయి. వీటిలో కొన్ని మనుషుల కాలేయం , శ్వాశ కోస వ్యవస్థను దెబ్బ తీస్తాయి . జీవులలో ఉన్న రక్షణవ్యవస్థకు కొంత వరకు ఈ విషజీవాంశాలను తట్టుకొనే శక్తి ఉంటుంది . వైరస్ వ్యాధులకు యాంటిబయోటిక్స్ పనిచేయవు. కొన్ని వైరస్ వ్యాధులకు యాంటీవైరల్ మందులు ఉన్నాయి. టీకాలు వైరల్ వ్యాధులు రాకుండ చేయగలవు [2] .

కరోనా వైరస్ స్వరూపం

చరిత్ర[మార్చు]

వైరస్లు భూమిపై దాదాపు ప్రతిచోటా ఉండే సూక్ష్మ జీవాంశాలు. ఇవి జంతువులు, మొక్కలు, శిలీంధ్రాలు,బ్యాక్టీరియాకు కూడా సోకుతాయి.కొన్నిసార్లు ఒక వైరస్ ఒక వ్యాధిని ప్రాణాంతకానికి గురి చేస్తుంది.ఒక వైరస్ ఒక రకమైన జీవిపై కూడా ఒక ప్రభావాన్ని కలిగి ఉంటుంది, కానీ మరొకదానిపై వేరే ప్రభావాన్ని చూపుతుంది. వైరస్లు సంక్లిష్టతతో మారుతూ ఉంటాయి. అవి జన్యు పదార్ధం, ఆర్‌ఎన్‌ఏ లేదా డిఎన్‌ఎను కలిగి ఉంటాయి, వీటి చుట్టూ ప్రోటీన్, లిపిడ్ (కొవ్వు) లేదా గ్లైకోప్రొటీన్ ఉన్నాయి. వైరస్ వ్యాధులకు చికిత్స లేదు, కానీ టీకాలు వేయడం వలన వాటిని వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. వైరస్ వ్యాప్తి గర్భధారణ సమయంలో, ప్రసవ సమయంలో వైరస్లు వ్యక్తి నుండి వ్యక్తికి ,తల్లి నుండి బిడ్డకు వ్యాప్తి చెందుతాయి. దగ్గుల ద్వారా , తుమ్ముల ద్వారా, మనుషులను తాకడం వల్ల , కలుషితమైన ఆహారం, నీరు ద్వారా , క్రిమికీటకముల ద్వారా , వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది . కొన్ని వైరస్ లు కొంత కాలం ఒక వస్తువు ఫై జీవించ గలవు . వైరస్ పునరుత్పత్తి చేయడానికి మాత్రమే ఉంది. ఇది పునరుత్పత్తి చేసినప్పుడు, దాని సంతానం కొత్త కణాలు వ్యాపిస్తుంది [3]

ఇటీవలి దశాబ్దాలలో, అనేక వైరస్లు జంతువుల నుండి మానవులకు గణనీయమైన వ్యాప్తికి కారణమయ్యాయి, దీనితో ప్రపంచములో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఆఫ్రికాలో 2014-2016 ఎబోలా వ్యాప్తికి కారణమైన వైరల్ జాతి అది సోకిన 90% మంది మరణించారు . ఇది ఎబోలా కుటుంబంలో అత్యంత ప్రాణాంతక గా మారుతుంది. అతి ప్రమాదకరమైన 12 వైరస్ వ్యాధులను గుర్తించి , వారిలో అవి ఒకరికి సోకినట్లయితే వారి నుంచి మరో వ్యక్తి చనిపోయే అవకాశం ముప్పు అనే దాని ఆధారంగా పేర్కొన్న వ్యాధులు మార్బబ ర్గ్ వైరస్, ఎబోలా వైరస్, రాబిస్, హెచ్ఐవి, మశూచి, హంటావైరస్, ఇన్ఫ్లుఎంజా, డెంగ్యూ,రోటవైరస్,సార్స్ -కోవ్ 1,2 లు , మెర్స్ -కోవ్ లాంటివి [4]

చికిత్స[మార్చు]

వైరస్ వ్యాధుల చికిత్స ఉపయోగించే అనేక యాంటీవైరల్ మందులు గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధి చేయబడ్డాయి.చాలా వరకు హెచ్‌ఐవికి వ్యతిరేకంగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఇవి హెచ్‌ఐవి సంక్రమణను నయం చేయవు కాని వైరస్ వ్యాప్తి కి నిరోధకముగా పనిచేస్తున్నావి .హెపటైటిస్ సి కి రిబావారిన్ లాంటివి వచ్చివున్నవి, శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నా అయినా వైరస్ వ్యాధులు నియంత్రణలో లేవు [5]

కరోనావైరస్[మార్చు]

కరోనావైరస్ వ్యాధి (COVID-19) అనేది కొత్తగా కనుగొన్న కరోనావైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి. COVID-19 వైరస్ సోకిన చాలా మంది ప్రజలు తేలికపాటి నుండి మితమైన శ్వాసకోశ అనారోగ్యం ప్రత్యేక చికిత్స అవసరం లేకుండా కోలుకుంటారు. వృద్ధులు, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, క్యాన్సర్ వంటి వైద్య సమస్యలు ఉన్నవారికి తీవ్రమైన అనారోగ్యం వచ్చే అవకాశం , ప్రాణములు పోయే అవకాశం ఎక్కువ. COVID-19 వైరస్, ఎలా వ్యాపిస్తుంది అనే దాని గురించి బాగా తెలుసుకోవాలి. చేతులు కడుక్కోవడం, శానిటైజెర్లు ( ఆల్కహాల్ ఆధారిత )ను తరచుగా వాడటం , ముఖాన్ని తాకకుండా ఉండడం, లాంటి రక్షణ చర్యలు ప్రపంచము మొత్తం తీసుకుంటున్నా , ఈ వ్యాధి తో ప్రజలు చని పోతున్నారు [6]

 


మూలాలు[మార్చు]

  1. "virus | Search Online Etymology Dictionary". www.etymonline.com. Retrieved 2024-03-26.
  2. "Viral Infections". medlineplus.gov. Retrieved 2020-11-22.
  3. "Viruses: What are they and what do they do?". www.medicalnewstoday.com (in ఇంగ్లీష్). 2017-05-30. Retrieved 2020-11-22.
  4. Writer, Anne Harding-Contributing; March 2020, Nicoletta Lanese-Staff Writer 04. "The 9 Deadliest Viruses on Earth". livescience.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Human Diseases Caused by Viruses". News-Medical.net (in ఇంగ్లీష్). 2010-01-09. Retrieved 2020-11-22.
  6. "Coronavirus". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2020-11-22.


మూలాలు[మార్చు]