వోయెజర్ 2
వోయెజర్ అంతరిక్ష నౌక నమూనా చిత్రం |
|
| సంస్థ | NASA |
|---|---|
| మిషన్ టైపు | Flyby |
| Flyby of | బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ |
| లాంచ్ తేదీ | ఆగస్టు 20, 1977 |
| లాంచ్ వాహనం | Titan III-E Centaur rocket |
| NSSDC ID | 1977-076A |
| హోమ్ పేజి | NASA Voyager website |
| మాస్ (ద్రవరాశి) | 721.9 kg |
| పవర్ | 420 W |
వోయెజర్ 2' 'Voyager 2 ఒక మానవరహిత అంతర్ గ్రహ అంతరిక్ష నౌక. దీనిని NASA అమెరికా వారు, 1977 ఆగస్టు 20 న ప్రవేశపెట్టారు. దీని సోదర ప్రాజెక్టు అయిన వోయెజర్ 1 తరువాత రంగంలోకి తెచ్చారు. ఇది సౌరమండలము లో విహరించి గ్రహాలను పరిశీలించి శోధించి, వాటి చిత్రాలను భూమి పైకి పంపింది. బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ లను వాటి ఉపగ్రహాలను శోధించడానికి సంధించారు.[1]
విషయ సూచిక |
[మార్చు] వోయెజర్ మిషన్
వోయెజర్ 2 వాస్తవంతా మరైనర్ ప్రోగ్రాం యొక్క భాగము. కానీ దీనిని టైటాన్ 3ఇ సెంటార్ రాకెట్ ద్వారా కేప్ కానవెరల్, ఫ్లోరిడా నుండి సంధించారు.
[మార్చు] బృహస్పతి
ఇది బృహస్పతి గ్రహానికి 5,70,000 కి.మీ. దగ్గరగా 1979, జూలై 9 న వచ్చింది. బృహస్పతి గ్రహాన్నీ, దీని చంద్రులనూ, చుట్టూ వున్న రింగులనూ శోధించింది. రెండు చిన్న ఉపగ్రహాలైన అడ్రస్తియా, మరియు మెటిస్ లు, దీని రింగులకు అతిదగ్గరగా సంచరించడాన్ని గమనించింది. ఓ మూడవ క్రొత్త ఉపగ్రహం థేబి ను కనుగొనింది.
[మార్చు] శని
శని గ్రహానికి దగ్గరగా ఆగస్టు 25, 1981 న సంచరించింది. ఆ తరువాత దీనిలో సాంకేతిక ఇబ్బందులు రావడం, శాస్త్రజ్ఞులు వాటిని సరిచేయడం, తదనంతరం యురేనస్ మరియు నెప్ట్యూన్ కొరకు యాత్ర సుగమమైంది.
-
వోయెజర్ 2 తీసిన శని గ్రహ చిత్రం.
[మార్చు] యురేనస్
- ప్రధాన వ్యాసం: Exploration of Uranus
ఇది యురేనస్ కు 81,500 కి.మీ. దగ్గరగా జనవరి 24, 1986 న చేరింది. ఇంతకు మునుపు తెలియని 10 చంద్రుళ్ళను కనుగొనింది.
[మార్చు] నెప్ట్యూన్
- ప్రధాన వ్యాసం: Exploration of Neptune
ఇది నెప్ట్యూన్ కు దగ్గరగా ఆగస్టు 25, 1989 న చేరింది.
2006 నుండి అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య ప్లూటో ను గ్రహంగా పరిగణించడం మాని మరుగుజ్జు గ్రహంగా పరిగణిస్తుండడం వల్ల వోయెజర్ 2, సౌరమండలములోని ప్రతి గ్రహాన్ని సందర్శించిన అంతరిక్ష నౌకగా ప్రసిద్ధికెక్కింది.
-
వోయెజర్ 2 తీసిన నెప్ట్యూన్ చిత్రం
-
వోయెజర్ 2 తీసిన ట్రిటాన్ చిత్రం.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
[మార్చు] నోట్స్
- ↑ Planetary Voyage NASA Jet Propulsion Laboratory - California Institute of Technology. 23 March 2004. Retrieved 8 April 2007.
- Saturn Science Results. Voyager Science Results at Saturn. తీసుకొన్న తేదీ: February 8, 2005.
- Uranus Science Results. Voyager Science Results at Uranus. తీసుకొన్న తేదీ: February 8, 2005.
[మార్చు] బయటి లింకులు
- NASA Voyager website
- Voyager Spacecraft Lifetime
- Voyager 2 Mission Profile by NASA's Solar System Exploration
- Voyager 2 (NSSDC Master Catalog)
- Spacecraft Escaping the Solar System - current positions and diagrams
- Mission state
- VOYAGER RECENT 6-HOUR HISTORY
- Voyager 2 Detects Odd Shape of Solar System's Edge 23 May 2006