శంఖము
| శంఖాలు | |
|---|---|
| An adult Queen Conch shell, Strombus gigas | |
| Scientific classification | |
| Kingdom: | ఏనిమేలియా |
| Phylum: | మొలస్కా |
| Class: | గాస్ట్రోపోడా |
| Subclass: | Orthogastropoda |
| Superorder: | Caenogastropoda |
| Order: | Sorbeoconcha |
| Suborder: | Hypsogastropoda |
| Infraorder: | Littorinimorpha |
| Superfamily: | Stromboidea |
| Family: | స్ట్రాంబిడే |
| Genus: | స్ట్రాంబస్ |
| జాతులు | |
|
Strombus gigas |
|
శంఖము (ఆంగ్లం Conch) (pronounced as "konk" or "konch", మూస:IPAEng or /ˈkɒntʃ/)[1] ఒకరకమైన మొలస్కా జాతికి చెందిన జీవి. ఇవి వివిధ జాతులకు చెందిన మధ్యమ పరిమాణంలోని ఉప్పునీటి నత్తలు లేదా వాటి కర్పరాలు.
"శంఖము" అనే పదాన్ని ఇంగ్లీషు మాట్లాడే దేశాలలో విస్తృతంగా చాలా రకాల సర్పిలాకారంగా, రెండు వైపులా మొనదేలి ఉండే పెద్ద కర్పరాలకు ఉపయోగిస్తున్నారు. ఇందులో కిరీటపు శంఖాలైన మెలాంగినా జాతులు, గుర్రపు శంఖాలైన (Pleuroploca gigantea) మరియు పవిత్రమైన శంఖాలు (Turbinella pyrum) కూడా ఉన్నాయి. ఇవన్నీ నిజమైన శంఖాలు కావు.
నిజమైన శంఖాలు సముద్రంలో నివసించే గాస్ట్రోపోడా తరగతికి చెందిన స్ట్రాంబిడే (Strombidae) కుటుంబంలోని స్ట్రాంబస్ (Strombus) ప్రజాతికి చెందిన జీవులు. ఇవి చాలా చిన్నవాటినుండి చాలా పెద్దవాటి వరకు వివిధ పరిమాణాలలో ఉంటాయి. వీటిలో చాలా జాతులు వాణిజ్యపరంగా ఆహార పదార్ధాలుగా ముఖ్యమైనవి. Strombus gigas శంఖువుల నుండి ఖరీదైన ముత్యాలు తయారౌతాయి. సుమారు 65 జాతుల శంఖులు అంతరించిపోయాయి. జీవించియున్న జాతులు ఎక్కువగా హిందూ మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రంలో నివసిస్తున్నాయి. ఆరు జాతులు కారీబియన్ ప్రాంతంలో నివసిస్తున్నాయి. చాలా శంఖు జాతులు ఇసుకమేట వేసిన సముద్రగర్భంలో ఉష్ణప్రాంతాలలో జీవిస్తాయి.
Strombus gigas UNEP యొక్క అంతరించిపోయిన జాతులు జాబితాలో చేర్చబడ్డాయి. వీటి వ్యాపారం అంతర్జాతీయంగా నియంత్రించబడినది.[2]
విషయ సూచిక |
మానవులకు ఉపయోగాలు [మార్చు]
ఆహార పదార్ధాలు [మార్చు]
- శంఖాలలోని అన్ని భాగాలు మాంసాహారంగా తింటారు. తూర్పు ఆసియా దేశాలలో వీటిని పలుచగా కోసి వేపుడు చేసుకుంటారు.
సంగీత పరికరాలు [మార్చు]
శంఖు కర్పరాలు ట్రంపెట్ మాదిరిగా గాలితో ఊదే సంగీత పరికరాలు. శంఖము నుండి వెడలే నాదాన్ని శంఖారావం అంటారు.
శంఖాలు ఫిజీ వంటి దక్షిణ పసిఫిక్ దేశాలలో చారిత్రాత్మకంగా ఉపయోగంలో ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని హోటళ్ళలో యాత్రికులకు స్వాగతం ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
అమెరికన్ జాజ్ సంగీతకారుడు స్టీవ్ టర్రే (Steve Turre) శంఖాలను కూడా తన ఆర్కెస్ట్రాలో ఉపయోగిస్తాడు.[3]
A partially echoplexed Indian conch was featured prominently as the primary instrument depicting the extraterrestrial environment of the derelict spaceship in Jerry Goldsmith's score for the film Alien. Director Ridley Scott was so impressed by the eerie effect that he requested its use throughout the rest of the score, including the Main Title.[4]
Composer John Cage has used partially water-filled conch shells, which, when tilted slowly, create gurgling sounds beyond the player's control, which are then amplified. This sound effect was used by James Horner in the film Troy and by Annea Lockwood in her compositions.[ఆధారం కోరబడినది]
పురాణములలో [మార్చు]
- శ్రీకృష్ణుడు ఉపయోగించిన శంఖము - పాంచజన్యము.
మూలాలు [మార్చు]
- ↑ § 51. conch. 7. Pronunciation Challenges. The American Heritage Book of English Usage. 1996
- ↑ [1]
- ↑ Steve Turre's Sanctified Shells Band, from allaboutjazz.com, 2003-04-10
- ↑ Mike Matessino, CD-booklet Alien: Complete Original Motion Picture Soundtrack, Intrada (MAF 7102), 2007
