శివలాల్ యాదవ్
వికీపీడియా నుండి
శివలాల్ యాదవ్ (Nandlal Shivlal Yadav ) ఆంద్రప్రదేశ్ లోని హైదరాబాదు లో జన్మించి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిద్యం వహించిన క్రీడాకారుడు. ఇతడు 1957 జనవరి 26 న జనించాడు. భారత జట్టు తరఫున 1979 మరియు 1987 మధ్యకాలంలో 35 టెస్టులు, 7 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.
1979 లో ఆస్ట్రేలియా పై తన తొలి టెస్ట్ మొదలుపెట్టి, ఆ సీరీస్ లోని 5 టెస్టులలో మొత్తం 24 వికెట్లను సాధించాడు. దీంతో వెంకట రాఘవన్ ను పక్కనపెట్టాల్సి వచ్చింది. భారత జట్టులో రవిశాస్త్రి, దిలీప్ దోషి లు ప్రవేశించేవరకు ఇతను రెగ్యులర్ గా భారత జట్టులో స్థానం సంపాదించాడు.