శివలింగపుష్పం

వికీపీడియా నుండి
శివలింగపుష్పాల చెట్టు
శివలింగపుష్పం.
శివలింగపుష్పం.
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియాప్సిడా
వర్గము: ఎరికేలిస్
కుటుంబము: లెసిథిడేసి
ప్రజాతి: కౌరోపిటా
జాతి: సి. గయానెన్సిస్
ద్వినామము
కౌరోపిటా గయానెన్సిస్
Aubl.

శివలింగపుష్పం శివునికి చాలా ప్రీతి. ఇది దక్షిణ అమెరికా ఖండానికి చెందినది.

[మార్చు] లక్షణాలు

శివలింగపుష్పాలు మరియు పండ్లు.

శివలింగ వృక్షం శివుడి జఠాఝూఠ ఆకృతిలో, వెంట్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి జడలకు పూస్తాయి. పైభాగాన నాగ పడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. శివలింగపుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు. ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి.

శివలింగపుష్పం

[మార్చు] హిందూమతం

హిందువులు శివలింగపుష్ప రూపంలో, వృక్షరూపంలో శివుడు కొలువై ఉన్నాడని బావిస్తారు. శివలింగపుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తునికి నిజంగా ఒక వరం. శివలింగపుష్పాలతో శివపూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది, అంత్యమున కైవల్యం పొందునని శివపురాణంలో ఉన్నది. ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు, తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కందాలలో మాత్రమే అలంకరించాలి. పాదాలదగ్గర వేయరాదు. పార్వతికి మాంగల్యంలో అలంకరించాలి.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు