శివ్ కుమార్ బటాల్వి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Shiv Kumar 'Batalvi'
దస్త్రం:Shiv-Kumar-Batalvi.jpg
జననం: {{{birth_date}}}
వృత్తి: poet, author, playwright
జాతీయత: Indian
రచనా కాలము: 1960-1973
శైలి: poetry, prose, play
Subjects: pathos, passion, separation
Literary movement: romanticism
వెబ్‌సైటు: http://www.batalvi.org/

శివ్ కుమార్ 'బటాల్వి ' (పంజాబీ: ਸ਼ਿਵ ਕੁਮਾਰ ਬਟਾਲਵੀ) (1936 –1973) ఒక ప్రసిద్ధ పంజాబీ భాషా కవి, ఇతడు శృంగార కవిత్వానికి ప్రసిద్ధి గాంచాడు, అనురాగం, విషాదం, ఎడబాటు, ప్రేమికుల మనోవేదన[1] వంటి అంశాలను ఇతడి కవిత్వం మారుపేరుగా నిలిచింది.

1967లో సాహిత్య అకాడమీ అవార్డ్ పొందిన అత్యంత యువ స్వీకర్త అయాడు, ప్రాచీన పురాణ గాథ అయిన పూరణ్ భగత్ ఆధారంగా రాసిన ఇతడి మహా పద్యకావ్యం, లూనా (1965)[2]కు సాహిత్య అకాడెమీ (భారత జాతీయ విద్వత్ సంస్థ) ఈ అవార్డునిచ్చింది, ఆధునిక పంజాబీ సాహిత్యంలో మహాకావ్యంగా పరిగణించబడుతోంది.[3] మరియు ఇది ఆధునిక పంజాబీ కిస్సా యొక్క నూతన శైలిని కూడా సృష్టించింది [4]. ఈ రోజు, ఇతడి కవిత్వం మోహన్ సింగ్ మరియు అమృతా ప్రీతమ్ [5] వంటి ఆధునిక పంజాబీ కవిత్వ దిగ్దంతుల మధ్య ఇతడికి సరిసమాన స్థాయిని కట్టబెట్టింది, వీరు భారత-పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా పేరు పొందారు[6].

జీవితచరిత్ర[మార్చు]

శివ్ కుమార్ 1936 జూలై 23న షకర్‌ఘర్ తెహసిల్‌ లోని బారా పిండ్ లోహితన్ గ్రామంలో జన్మించాడు, (ఇప్పుడు ఇది పంజాబ్ ప్రాంతం, పాకిస్తాన్‌లో ఉంది) [7] ఆదాయ శాఖలో గ్రామ తహసిల్దార్ పండిట్ క్రిషన్ గోపాల్ మరియు శాంతి దేవిలకు పుట్టాడు. ఈమె గృహిణి. ఇండియా విభజన తర్వాత ఇతడి కుటుంబం బటాలా గుర్దాస్‌పూర్ జిల్లాకు తరలి వెళ్లింది, ఇక్కడే ఇతడి తండ్రి పట్వారీగా పని కొనసాగించాడు, యువ శివ్ తన ప్రాధమిక విద్యను పూర్తి చేశాడు [8].

ఇతడు పంజాబ్ యూనివర్శిటీ

 1. REDIRECT Template:Disambiguation needed
 • This is a redirect from a shortcut page name in any namespace to a page in template namespace. For more information follow the category link.
  • If target page is not a template, then use {{R from shortcut}} instead. Template shortcuts are wikilinked on community pages, talk pages and edit summaries, but not in mainspace articles.
  • Note: Template talk pages are in a talk namespace; they are not in the template namespace. All shortcuts to talk pages should be tagged with {{R from shortcut}}.Script error: No such module "Redirect template".లో తన మెట్రిక్యులేషన్‌ను 1953లో పూర్తి చేసి, బటాలాలోని బేరింగ్ యూనియన్ క్రిస్టియన్ కాలేజీలో F.Sc. ప్రోగ్రాంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. డిగ్రీ పూర్తి చేయకముందే ఇతడు ఎస్.ఎన్ కాలేజీ క్వడియన్‌కు వెళ్లిపోయాడు, తన అభిరుచి మేరకు ఇక్కడి ఆర్ట్స్ ప్రోగ్రాంలో చేరాడు కానీ, రెండో సంవత్సరంలోనే దాన్నుంచి కూడా బయటపడ్డాడు. తర్వాత ఇతడు సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేయడం కోసం, బైదినాథ్, హిమాచల్ ప్రదేశ్‌లోని స్కూల్‌లో చేరాడు, ఇక్కడ కూడా మధ్యలోనే చదువు వదిలివేశాడు [9]. ప్రభుత్వ రిపుడమన్ కాలేజ్, నభాలో ఇతడు కొంత కాలంపాటు చదివాడు.ఇక్కడ ఇతడు సుప్రసిద్ధ పంజాబీ రచయిత గురుబక్ష్ సింగ్ ప్రీత్లారి కుమార్తె ప్రేమలో పడ్డాడు, కాని ఇద్దరి మధ్య కుల వ్యత్యాసాల కారణంగా ఆమె UK పౌరుడిని పెళ్లాడింది.ప్రేమ విషయంలో అతడు దురదృష్టవంతుడిగానే మిగిలిపోయాడు, ప్రేమను కో్ల్పోవడం ద్వారా అతడిలో కలిగిన వియోగం అతడి కవిత్వంలో తీవ్రాతితీవ్రంగా ఫ్రతిఫలించింది.

తర్వాతి జీవితంలో, తన తండ్రి క్వడియన్‌లో పట్వారీగా ఉద్యోగం పొందాడు, ఈ కాలంలోనే ఇతడు తన రచనలలో అత్యుత్తమమైన వాటిలో కొన్నింటిని రాశాడు. అతడి మొట్టమొదటి పద్యాల సంకలనం 1960లో ప్రచురించబడింది, పిరన్ దా పరఘా (విషాదాల పూలదండ) శీర్షికతో వచ్చిన ఈ సంకలనం అద్వితీయ విజయాన్ని సాధించింది. 1965లో, ఇతడు సాహిత్య అకాడమీ అవార్డును అతి తక్కువ వయస్సులో గ్రహించిన వాడయ్యాడు. ఇతడు రచించిన అద్భుతమైన , ఒక పద్య కావ్యం లూనా (1965)[10]కి గాను 1967లో ఈ అవార్డు వచ్చింది. ఇతడి కవిత్వ సంకలనాలు, స్వంతంగా తన పద్యాలను తానే పాడుకోవడం వల్ల ప్రజారాసులలో అతడికి, అతడి రచనలకు విపరీత ఆదరణ దొరికింది.

1967 మొదట్లో, ఇతడు పెళ్లాడాడు, 1968లో ఇతడు చండీఘర్‌కు మారాడు, ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PROగా చేరాడు. తరువాతి సంవత్సరాలలో అనారోగ్యం అతడిపై దాడి చేసింది, అయినప్పటికీ అతడు రాయడాన్ని విశేషంగా కొనసాగించాడు. అతడి రచనలు ఎల్లప్పుడూ అతడు ప్రకటిస్తూ ఉండే మృత్యు కాంక్ష [11]ను వ్యక్తీకరిస్తూ ఉండేవి. సుదర్ఘకాలంగా ఆల్కహాల్ తాగుతూ వచ్చిన ఫలితంగా లివర్ దెబ్బతినడంతో 36 ఏళ్ల వయస్సులోనే ఇతడు తన మామగారి నివాసం కిర్రి మంగ్యాల్, పఠాన్‌కోట్‌లో 1973 మే 7న ఇతడు కన్నుమూశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

1967 ఫిబ్రవరి 5న ఇతడు కిర్రీ మంగ్యాల్ గురుదాస్‌పూర్ జిల్లా గ్రామానికి చెందిన బ్రాహ్మణ అమ్మాయి అరుణ [12]ను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు మెహర్బాన్ (1968) మరియు పూజా (1969) పుట్టారు.

రచనలు[మార్చు]

 • పిరాన్ డా పరాగా (ది స్కార్ఫ్ ఆఫ్ సారోస్) (1960)
 • మైను విడ కరో (నాకు వీడ్కోలు పలకండి) (1963)
 • గజ్లాన్ టె గీత్
 • అర్తీ (ప్రేయర్) (1971)
 • లజ్వంతి (టచ్ మి నాట్) (1961)
 • అట్టే డియాన్ చిర్రాన్ (ది స్పారోస్ ఆఫ్ ఫ్లోర్) (1962).
 • లూనా (1965)
 • మైన్ టె మైన్ (ఐ అండ్ మి) (1970)
 • డర్డ్‌మండన్ డియాన్ అహిన్
 • సాగ్
 • ఆల్విదా (వీడ్కోలు) (1974)
 • శివ్ కుమార్: సంపురన్ కావ్ సంగ్రేహ్ (కంప్లీట్ వర్క్స్); లాహోర్ బుక్ షాప్, లూధియానా.
 • బిర్హా డా సుల్తాన్ [13], (ఎ సెలెక్షన్ ఫ్రమ్ శివ్ కుమార్ బెటాల్వీస్ పోయెమ్స్), సెలెక్టెడ్ బై అమృతా ప్రీతమ్, సాహిత్య అకాడెమీ, 1993. ISBN 81-7156-059-8.
 • లూనా (ఇంగ్లీష్), tr. రచన B.M. భట్టా, సాహిత్య అకాడెమీ, 2005, ISBN 81-260-1873-9.

వారసత్వం[మార్చు]

ఇతడి సంకలనాలలో ఒకటైన అల్విదా (వీడ్కోలు) ఇతడి మరణానంతరం 1974లో గురునానక్ దేవ్ యూనివర్శిటీ, అమృత్‌సర్‌చే ప్రచురించబడింది ఉత్తర రచయితకు గాను ప్రతి సంవత్సరం "శివ్ కుమార్ బటాల్వి అవార్డ్"ను ఇస్తున్నారు [14][15].

వార్తలలో[మార్చు]

ఇతడి కవితలలో చాలావాటిని దీదార్ సింగ్ పర్దేశి పాడారు. జగ్జీత్ సింగ్- చిత్రా సింగ్ మరియు సురీందర్ కౌర్ కూడా ఇతడి కవితలలో చాలా వాటిని పాడారు [16]. ఇతడి కవిత "మేయే ని మేయే"కి నస్రుత్ పతేహ్ ఆలీ ఖాన్ చేసిన అనువాదం దాని పరిపూర్ణ ఆత్మకు, మనశ్చిత్రణకు పేరెన్నిక గన్నది. రబ్బీ షేర్‌గిల్ రూపొందించిన ఇటీవలి ఆల్బమ్ రబ్బీ (2004), ఇతడి కవిత "ఇస్తిహార్"ని ప్రదర్సించింది. పంజాబీ జానపద గాయకుడు, హన్స్ రాజ్ హన్స్ కూడా శివ్ కుమార్ కవిత్వంపై 'ఘామ్' అనే పాపులర్ ఆల్బమ్‌ని రూపొందించారు. 2005లో, ఏక్ కుడి జిడా నా మొహబ్బత్... శీర్షికతో కూడిన సంకలిత ఆల్బమ్ విడుదలయింది.'శివ్ కుమార్ బటాల్వి , రచించిన పలు పాటలను మహేంద్ర కపూర్, జగ్జిత్ సింగ్ మరియు ఆశా సింగ్ మస్తానా [17]లు పాడారు.

2004లో, శివ్ కుమార్ జీవితం ఆధారంగా తీసిన డర్డాన్ డా డార్య పంజాబీ నాటకం చండీఘర్‌లోని 'పంజాబ్ కళా భవన్'లో ప్రదర్శించబడింది [18].

సంగ్రహణలు[మార్చు]

మైను విడ కరో (నాకు వీడ్కోలు పలకండి)

యవ్వన కాలంలో నేను చావడానికి పోవడం లేదు,
నా విషయాలను ఖాళీ చేయకుండానే నేను విడిపోతున్నాను,
నీనుంచి విడిపోయిన వలయాన్ని పూర్తి చేసిన తర్వాత.[9]

మరింత చదవటానికి[మార్చు]

 • భారతీయ సాహత్య నిర్మాతలు: శివ్ కుమార్ బటల్వి , రచన ప్రొఫెసర్. S.సోజ్, ప్రచురణ, సాహిత్య అకాడమీ, 2001. ISBN 0262081504
 • శివ్ కుమార్ బటాల్వి : జీవన్ ఆటే రచ్‌నా
 • శివ్ బటాల్వి: ఎ సాలిటరీ అండ్ పాసినేట్ సింగర్ , రచన ఓం ప్రకాష్ శర్మ, 1979, స్టెర్లింగ్ పబ్లిషర్స్, న్యూ ఢిల్లీ LCCN: 79-905007.
 • శివ్ కుమార్ బటాల్వి, జీవన్ తె రచ్‌నా , రచన జీత్ సింగ్ సిటోలా. LCCN: 83-900413
 • శివ్ కుమార్ ద కవి జగత్ , రచన ధరమ్ పాల్ సింగోలా. LCCN: 79-900386
 • శివ్ కుమార్, రచ్‌నా సంసార్ , రచన ఆమ్రిక్ సింధ్ పున్ని. LCCN: 90-902390
 • శివ్ కుమార్, కవి విచ్ బిరాహ్, ; రచ్‌నా సుర్జీత్‌సింగ్ కన్వాల్. LCCN: 88-901976

సూచికలు[మార్చు]

 1. హ్యాండ్‌బుక్ ఆఫ్ ట్వంటియత్ సెంచుపీ లిటరేచర్స్ ఆఫ్ ఇండియా , రచన నళినీ నటరాజన్, ఎమాన్యువల్ సంపత్ నెల్సన్. గ్రీన్‌ఉడ్ ప్రెస్, 1996. ISBN 0262081504 పేజీ 258
 2. పంజాబీ భాషా అవార్డీల జాబితా సాహిత్య అకాడమీ అవార్డ్ అధికారిక జాబితాలు.
 3. వరల్డ్ ఫెర్మార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్: విదేశీ కళాకారులచే ముగ్దులైన ఆర్ట్స్ విద్యార్థులు డైలీ టైమ్స్ (పాకిస్తాన్) , 16 నవంబర్ 2006.
 4. శివ కుమార్ ది ట్రిబ్యూన్ , 4 మే 2003.
 5. ఆదునిక పంజాబీ ప్రేమ కవిత్వ పధగాములు ది ట్రిబ్యూన్ , 11 జనవరి 2004.
 6. ది బటాలా పినామినా డైలీ టైమ్స్ (పాకిస్తాన్) , 19 మే 2004.
 7. శిప్ కుమార్ బటాల్వి గ్రామం బారాపిండ్, అతడు పుట్టిన వూరు - బారాపిండ్ వెబ్‌సైట్
 8. శివ్ కుమార్ బటాల్వి ది ట్రిబ్యూన్ , 30 ఏప్రిల్ 2000.
 9. 9.0 9.1 శివ్ కుమార్ బటాల్వి sikh-heritage.co.uk .
 10. సాహిత్య అకాడమీ అవార్డ్ – పంజాబీ 1957-2007 సాహిత్య అకాడమీ అవార్డ్ అధికారిక జాబితాలు.
 11. బటాలీ బ్రాట్ ఎలైవ్ ఆన్ డెత్ యానివర్సరీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ , 6 మే 2003.
 12. బటాల్వీస్ బెటర్ హాఫ్ కమ్స్ కాలింగ్ ది ట్రిబ్యూన్ , 8 మే 2003.
 13. “బిర్హా డా సుల్తాన్ ”. ది ట్రిబ్యూన్ , 7 మే 2005. అమృతా ప్రీతమ్ స్వయంగా పెట్టిన పేరు.
 14. 7 పంజాబ్ రచయితలు, జానపద గాయకులకు సత్కారం ట్రిబ్యూన్ , 21 అక్టోబర్ 2003.
 15. శిప్ కుమార్ బలావి అవార్డ్ ట్రిబ్యూన్ , 16 ఏప్రిల్ 2002.
 16. శివ్ కుమార్ బటాల్వి
 17. ఎక్ కుడి జిదా నా మొహబ్బత్... Amazon.com
 18. ఇన్ ది డీప్ సీ ఆఫ్ పవర్, అండ్ పోయిట్రీ ఆఫ్ పెయిన్, పాథోస్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ , 1 జూన్ 2004.

బాహ్య లింకులు[మార్చు]

వీడియో లింకులు