శివ పంచాక్షరీ మంత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓం నమః శివాయ, శివ విగ్రహం

ఓం నమః శివాయ లేదా ఓం నమశ్శివాయ శివ పంచాక్షరీ మంత్రము శైవంలో భక్తులు ధ్యానించే దివ్య మంత్రం. ఈ సృష్టిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకన్నా అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు ఆయనే శివ శంభు. ఓం నమః శివాయ అనే మంత్రం ఆ మహా శివుడికి చాలా ప్రత్యేకమైనది. ఈ మంత్ర స్మరణ యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు. ఈ మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు అగ్ని, గాలి, ఆకాశాన్ని సూచిస్తుంది.[1]

వ్యత్పత్తి[మార్చు]

శివుడి ఐదు ముఖాలపు పంచ బ్రహ్మలుగా పండితులు చెబుతారు. వాటి పేర్లు 'సద్యో జాత, వామ దేవ, అఘెరా, తత్పురష, ఈశాన'. ఈ ఐదు ముఖాల్లోంచే 'న, మ, శి, వా, య' అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది. ‘న, మ, శి, వా, య‘ అనే ఐదు ముఖాలకు చైతన్యం ఇచ్చేది సాక్షాత్తు పరమేశ్వరుడు. అందుకే ఈ దేవుడిని ప్రపంచ నాయకుడిగా కొలుస్తారు.

విశేషం[మార్చు]

శైవంలోని స్వార్ధంలేనితనం, శివునిలోని భోలాతనం కలగలిపిన నిరాడంబరత, నిస్వార్థం అవలంబించటంతో జీవి పరిపూర్ణ స్థితిలో భక్తిలో మామేకమై శరీరధర్మాల నుండి ఆ సర్వేశ్వరుని పాదాల చెంతచేరి ముక్తిని ప్రసాదించమని వేడుకోవటం ఈ మంత్రంలోని విశేషం.

వశిష్ట మహర్షి తన శిష్యబృందం చేత పలక మీద మొదటగా వ్రాయించేది ఈ శివ పంచాక్షరీ మంత్రమని పురాణాలు చెబుతున్నాయి. పంచాక్షరి అనగా ఆదిశక్తి, ఆదిదేవుడు, ఓంకారం, బిందువు, శివశక్తిల కలయికయే నాథబిందు కళోపాసన.

స్మరణ[మార్చు]

ఓం నమ శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు. ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. తెల్లవారు జామునే స్నానం చేసి, నిటారుగా కూర్చోవాలి. కళ్లు మూసుకుని, జప మాల తీసుకుని ‘ఓం నమ: శివాయ‘ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాలి.

మూలాలు[మార్చు]

  1. "శివ పంచాక్షరీ మంత్రం.. మానసిక ప్రశాంతతకు మూలం!". Samayam Telugu. Retrieved 2020-08-31.

బాహ్య లంకెలు[మార్చు]