శివ శంకర్ మీనన్
| Shivshankar Menon | |
Shivshankar Menon (right) shaking hands with David Mulford |
|
|
|
|
| పదవీ కాలము January 17, 2010- Incumbent |
|
| ముందు | M K Narayanan |
|---|---|
|
|
|
| పదవీ కాలము September 1, 2006-July 31, 2009 |
|
| ముందు | Shyam Saran |
| తరువాత | Nirupama Rao |
|
|
|
| జననం | జూలై 5 1949 |
| జాతీయత | Indian |
| నివాసము | New Delhi, India |
| వృత్తి | Diplomat, National Security Adviser |
శివ శంకర్ మీనన్ లేదా శివశంకర మీనన్ ({{మళయాళం|ശിവശങ്കര് മേനോന്}}) భారత ప్రధానికి ప్రస్తుత[1] జాతీయ భద్రతా సలహాదారు (NSA). అంతకు ముందు అతను విదేశీ కార్యదర్శిగాను, పాకిస్తాన్ లో భారత హై కమీషనర్ గాను మరియు చైనా మరియు ఇజ్రాయిల్ లో రాయబారి మరియు దూతగా తన సేవలను అందించాడు.[2][3]
విషయ సూచిక |
బాల్యం మరియు విద్యాభ్యాసం [మార్చు]
మీనన్ కేరళ యందలిపాలక్కాడ్ జిల్లాలోని ఒట్టపళంకు చెందిన వాడు. అతని తండ్రి పరప్పిల్ నారాయణ మీనన్ కూడా వృత్తి రీత్యా ఒక దూత మరియు అతని చివర రోజులలో యుగోస్లేవియాకి రాయబారిగా పనిచేసాడు. అతని తాత K P S మీనన్ (సీనియర్) భారతదేశానికి మొదటి విదేశీ కార్యదర్శి కాగా, చైనాకి మొదటి రాయబారి అయిన K P S మీనన్ (జూనియర్) అతని మామయ్య.[3]
మీనన్ గ్వాలియర్ నందలి సింధియా స్కూల్ లో తన ప్రాధమిక విద్యను పూర్తిచేశాడు, మరియు తరువాత అతను ఢిల్లీ యూనివర్సిటీ నుండి చరిత్రలో MA చేశాడు.
వృత్తి జీవితం [మార్చు]
ఇండియన్ ఫారిన్ సర్వీసు 1972 బ్యాచ్ తో మీనన్ తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాడు.[2]
అటామిక్ ఎనర్జీ కమిషన్ కు సలహాదారుగా డిపార్టుమెంటు ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. వియెన్నాలో ఉద్యోగం వచ్చేంత వరకు ఈ పనిలో కొనసాగాడు. తర్వాత అతను బీజింగ్ కు బదిలీ చేయబడినాడు, చైనాలో అతను పనిచేసిన మూడు ఉద్యోగాలలో ఇది మొదటిది. చైనాలో చివరిగా అతను పనిచేసిన రాయబారి పదవికి కూడా గొప్ప గుర్తింపు లభించింది, ఈ సమయంలోనే చీని-భారత సంబంధాలలో గణనీయమైన ప్రగతి కనబడింది, అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయి చైనాను సందర్శించటం అందులో అతి ముఖ్యమైనది. గత దశాబ్దంలో మీనన్ ఇజ్రాయిల్ కు రాయబారిగా మరియు శ్రీలంక మరియు పాకిస్తాన్ లకు హైకమిషనర్ గా సేవలు అందించాడు. అతను విదేశీ కార్యదర్శిగా 2006లో నియమింపబడ్డాడు, మరియు ప్రస్తుతము ప్రధాన మంత్రికి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నాడు.
భారత- అమెరికా అణు ఒప్పందము, అతని వృత్తి జీవితంలో మరొక మైలురాయి, దీనికోసం NSG దేశాలను ఒప్పించి అణు ఇంధనాలను భారతదేశానికి సరఫరా చేయించుటకు ఎంతో కష్టపడ్డాడు.
వ్యక్తిగత జీవితం [మార్చు]
అతను మోహిని మీనన్ ను వివాహము చేసుకున్నాడు మరియు అతనికి ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు కలరు. అతని మాతృభాష మలయాళం మరియు అతను చైనీస్ మరియు జర్మన్ భాషలను కూడా మాట్లాడగలడు.[2]
భారత విదేశీ వ్యవహారాలలో తీరికలేకుండా ఉంటున్నప్పటికీ, అతను శాస్త్రీయ సంగీతము మరియు హిమాలయాలపై తన అభిరుచిని కాపాడుకుంటూ వచ్చాడు. 2000 సంవత్సరానికి గాను పూర్వ విద్యార్ధులలో ఉత్తమునికి ఇచ్చే "మాధవ్ అవార్డు" కు శివ శంకర్ మీనన్ ను సింధియా స్కూల్ ఎంపిక చేసింది.[4]
సూచనలు [మార్చు]
- ↑ "Shiv Shankar Menon is new National Security Advisor". rediff.com.
- ↑ 2.0 2.1 2.2 "Profile of Foreign Secretary Mr. Shivshankar Menon". Embassy of India, Washington DC.
- ↑ 3.0 3.1 "Menon is next NSA", The Hindu, January 21, 2010.
- ↑ మాధవ్ అవార్దీస్: శివ శంకర్ మీనన్, 2000 సింధియా స్కూల్ వెబ్ సైట్.
| ముందు M. K. Narayanan |
National Security Advisor (NSA) January, 2010 – present |
తరువాత ' |