Jump to content

శ్రీకాకుళం

అక్షాంశ రేఖాంశాలు: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9
వికీపీడియా నుండి
(శ్రీకాకుళం (పట్టణం) నుండి దారిమార్పు చెందింది)
శ్రీకాకుళం
కళింగపట్నం శ్రీకాకుళం
నగరం
శ్రీకాకుళం
ఏడురోడ్ల కూడలి
ఏడురోడ్ల కూడలి
Nickname(s): 
చికాకోల్, శిక్కోలు
శ్రీకాకుళం is located in ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం
శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
Coordinates: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
పట్టణంగా గుర్తింపు1856
Founded byబలరామ
వార్డులు36
Government
 • TypeMayor–Council
 • Bodyశ్రీకాకుళం నగరపాలక సంస్థ
 • MLAధర్మాన ప్రసాదరావు
 • MPకింజరాపు రామ్మోహన నాయుడు
విస్తీర్ణం
 • నగరం20.89 కి.మీ2 (8.07 చ. మై)
జనాభా
 (2011)[2]
 • నగరం2,28,025
 • Metro1,65,735
అక్షరాస్యత వివరాలు
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
PIN
532001
ప్రాంతీయ ఫోన్ కోడ్+91–8942
వాహనాల నమోదుAP–39 ( 2019 జనవరి 30 నుండి)[4]
AP-30 (2019 జనవరి 30కు ముందు)

శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రం.[6]ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.[7]

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

బ్రిటిషు వారు శ్రీకాకుళం పేరును పలకలేక "చికాకోల్" అనేవారు. చికాకోల్ కు సంబంధించిన మరో కథనం ప్రకారం ఈ ప్రాంతం నైజాం ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊళ్లోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్ట వలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్నచిన్న గుడ్డసంచులలో పోసి, మూటకట్టి, ఆమూటను తీసికొనివచ్చి ఖుద్దున సమర్పించేవారు. ఆ మూట లోని సొమ్ము సరిగా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఉంటున్నందువలన, ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి "శిఖా ఖోల్" అనేవారు. అంటే "మూతికట్టువిప్పు" అని అర్థం. ఈమాట క్రమంగా "చికా కోల్", సిక్కోలు అయి, శ్రీకాకుళంగా స్థిరపడింది అని అంటారు.[7]

భౌగోళికం

[మార్చు]

శ్రీకాకుళం నగర విస్తీర్ణం 20.89 చ.కి.మీ.[5] రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్య దిశలో 463 కి.మీ దూరంలో వుంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కలు ప్రకారం, ఈ నగర జనాభా 1,49,592. ఇందులో 74,546 మగవారు,75,046 ఆడవారు ఉన్నారు.[8] 11,001 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులో 5,686 అబ్బాయిలు, 5,315 అమ్మయిలు. ఈ నగరంలో 84.62% అక్షరాస్యతతొ 96,744 మంది అక్షరాస్యులు ఉన్నారు.[9]

పరిపాలన

[మార్చు]

శ్రీకాకుళం నగరపాలక సంస్థ నగర పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా

[మార్చు]
శ్రీకాకుళం బస్ స్టాండు

జాతీయ రహదారి 16 నగరానికి సమీపంగా పోతుంది.[10] 13 కి.మీ దూరంలో శ్రీకాకుళం రోడ్ అనే పేరుతో ఆమదాలవలసలో ఉంది. 2006 లో రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ మాత్రం శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆఫీసు ఆవరణలో పెట్టారు. సమీప విమానాశ్రయం 106 కి.మీ. దూరంలో గల విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.

విద్య

[మార్చు]

ఒక మెడికల్ కాలేజి (రిమ్స్), దంత వైద్యకళాశాల ("చాపురం" గ్రామ సమీపాన), ఒక హోమియో వైద్యశాల, ఒక ఆయుర్వేద వైద్యశాల, ఒక న్యాయ కళాశాల ఉన్నాయి. ప్రైవేటు రంగంలో రాగోలు వద్ద జెమ్స్ వైద్య కళాశాల ఉంది.

వైద్యం

[మార్చు]

400 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రి తో పాటు, కిమ్స్ ఆసుపత్రి ఉంది.

న్యాయ స్థానాలు

[మార్చు]

నగరంలో 1. జిల్లాకోర్టు, 2. మున్సిపల్ బెంచికోర్టు ఉన్నాయి.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
అరసవల్లి దేవాలయ ప్రధాన ద్వారం, శ్రీకాకుళం
బాపూజీ పార్కు, శ్రీకాకుళం

ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 8 ఆగస్టు 2016. Retrieved 23 June 2016.
  2. "Statistical Abstract of Andhra Pradesh, 2015" (PDF). Directorate of Economics & Statistics. Government of Andhra Pradesh. p. 44. Archived from the original (PDF) on 14 జూలై 2019. Retrieved 27 April 2019.
  3. "Andhra Pradesh (India): State, Major Agglomerations & Cities – Population Statistics in Maps and Charts". citypopulation.de.
  4. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
  5. 5.0 5.1 "District Census Hand Book : Vizianagaram (Part B)" (PDF). Census of India. Directorate of Census Operations, Andhra Pradesh. 2011. pp. 16, 48. Retrieved 10 June 2019.
  6. "District Census Handbook – Srikakulam" (PDF). Census of India. p. 27. Retrieved 18 January 2015.
  7. 7.0 7.1 "Srikakulam Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration and Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 2 December 2014. Retrieved 16 February 2015.
  8. "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
  9. "Srikakulam City Population Census 2011 - Andhra Pradesh". Archived from the original on 2016-04-05. Retrieved 2016-07-02.
  10. "National Highways Development Project Map". National Highways Authority of India. Archived from the original on 22 ఏప్రిల్ 2017. Retrieved 21 ఏప్రిల్ 2017.

బయటి లింకులు

[మార్చు]